Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 39


    
    కాలగమనంలో సిద్దేశ్వర్ కమీషనర్ కావటం జరిగింది.
    
    కమీషనర్ గా తనకు లభించిన అధికారాలతో, ఆర్ధిక వనరులతో దేశంలోకెల్లా బొంబాయి పోలీసుశాఖకి చెందిన ఫోరెన్ సిక్ లాబ్ ని అత్యుత్తమంగా తీర్చిదిద్దటం జరిగింది.
    
    ఇద్దరూ వెళ్ళి హెడ్ రూమ్ లో కూర్చున్నారు.
    
    "ఏమయినా తెలిసిందా?" సిద్దేశ్వర్ పైప్ వెలిగించుకుంటూ అడిగాడు.
    
    "తెలిసాయి మిస్టర్ పి.సి."
    
    "ఫైర్ ఆర్మ్స్ ఎక్స్ పర్టు ఒపీనియన్ ఏమిటి?"
    
    "ఒన్ మినిట్ సార్" అని హెడ్ ఇంటర్ కమ్ నొక్కి "ఫెయిర్ ఆర్మ్స్ ఎక్స్ పర్టుని ఒకసారి పంపించండి." అని తన పి.ఏకి చెప్పి ఇంటర్ కమ్ పెట్టేసాడు హెడ్.
    
    కొద్దిక్షణాలు మౌనంగా గడిచాయి వారిద్దరి మధ్య.
    
    "ఫైర్ ఆర్మ్స్ ఎక్స్ పర్టు వచ్చాడు.
    
    "వివరాలేమన్నా చెప్పగలరా?" సిద్దేశ్వర్ అడిగాడు.
    
    "ఎస్....సర్....మీకు వేదానంద్ ఇంటి మలుపులో దొరకిన బుల్లెట్ ని లేట్ లో టెస్టు చేశాను సార్."
    
    "వివరాలు పూర్తిగా, లాజిగ్గా చెప్పండి."
    
    ఎక్స్ పర్టు చెప్పటం ప్రారంభించాడు.
    
    "బుల్లెట్ పాయింట్ త్రీ ఎయిట్ విల్ కిన్ సన్ కంపెనీ తయారుచేసిన రైఫిల్ బుల్లెట్ అది. దాన్ని ఉపయోగించిన రైఫిల్ థాంప్సన్ సబ్ మెషిన్ గన్."
    
    "ఒక్క నిమిషం.... ఆ బుల్లెట్ ఉపయోగించిన గన్ థాంప్సన్ సబ్ మెషిన్ గన్ అని ఎలా చెప్పగలుగుతున్నారు?" సిద్దేశ్వర్ తన ఇన్ వెస్టిగేషన్ ద్వారా ఖచ్చితమయిన ఫలితాలు పొందటానికి కారణం ఆయనకున్న సూక్ష్మదృష్టే కారణం.
    
    "హింసాత్మక సంఘటనలకు ఉపయోగించే ఫైర్ ఆర్మ్స్ రెండు రకాలు. స్మూత్ బోర్ వెపన్సు, రైఫిల్డు వెపన్సు స్మూత్ బోర్ క్లాస్ కి చెందే హాట్ గన్ వెపన్సుగన్ బ్యారెల్ లోపలి భాగం మృదువుగా ఉంటుంది. స్మూత్ బోర్ గన్ ని ఫైర్ చేసాక ఆ బుల్లెట్ ని పరీక్షిస్తే దాని పైభాగాన ఎలాంటి స్క్రేచస్ ఉండవు. ఈ గన్ చేసే బుల్లెట్, గన్ నుంచి రిలీజయిన కొద్దిక్షణాలకే దానిలోని లెడ్ పేలెట్సు స్పెడ్ అయిపోతాయి. ఇవి కేవలం 50 గజాల దూరంలో ఉండే లక్ష్యాలనే కరెక్టుగా ఛేదించగలవు. మీరేమి అనుకోకపోతే చిన్న అనుమానం."
    
    "అడగండి" అన్నాడు సిద్దేశ్వర్ ఆసక్తిగా.
    
    "ట్రిగ్గర్ మెన్ సెటిలయిన స్థలానికి.... ఐ మీన్ మామిడిచెట్టు కొమ్మకు రోడ్ మీద వెళ్ళే వెహికల్ కి మధ్య సుమారు ఎంత దూరం ఉంటుంది" ఎక్స్ పర్టు తన వాదనలోని నిజాన్ని రుజువు చేసుకొనే ప్రయత్నంలో భాగంగా అడిగాడు.
    
    "సుమారు ఎనభై గజాలుంటుంది."
    
    "ప్రొఫెషనల్ ట్రిగ్గర్ మెన్ ఎప్పుడూ ఒక వ్యక్తిని హత్య చేసేందుకు తను సెటిల్ అయ్యే స్థలానికి, లక్ష్యం ఎంత దూరంలో ఉంటుందనేది ఖచ్చితంగా మెజర్ చేసుకుంటాడు. సో... యాభై గజాలకు మించిన దూరములో ఉండే లక్ష్యానికి స్మూత్ బోర్ క్లాసుకి చెందే షాట్ గన్ ని ఉపయోగించే ప్రసక్తి లేదు. ఇకపోతే ఎంత గొప్ప షూటర్ అయినా ఒకవేళ తన గురి తప్పితే ఏమిటి పరిస్థితి అని ఆలోచిస్తాడు. అందుకు తగిన విధంగా సిద్దపడతాడు. ఒకవేళ గురితప్పినా దాన్నివెంటనే గ్రహించి మరోసారి ఫైర్ చేస్తాడు. అలా కొద్దిక్షణాల తేడాతో చాలాసార్లు ఫైర్ చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని నిర్మూలించే తీరతాడు. ఈ ప్రాసెస్ లో లక్ష్యం చుట్టూ పహారా ఉండే వ్యక్తులు కాని భద్రతా దళాలుగాని ట్రిగ్గర్ మెన్ వారికా అవకాశం ఇవ్వలేదు. స్మూత్ బోర్ గన్స్ ఒకటిగాని రెండు కాని పొడవైన బ్యారెల్స్ కలిగి వుంటాయి. ఒక రౌండ్ ఫెయిర్ చేశాక తిరిగి చేత్తోనే కాట్రిడ్జ్ ని (తూటా) లోడ్ చేసుకోవాలి. టూ బ్యారెల్ గన్ అయినా రెండు క్యాట్రిడ్జ్స్ ని మాత్రమే లోడ్ చేసే అవకాశం వుంటుంది. రెండో రౌండ్ ఫైర్ చేశాక తిరిగి చేత్తోనే లోడ్ చేసుకోవాలి. దానిమూలంగా ట్రిగ్గర్ మెన్ తన ప్రత్యర్ధికి అవకాశం ఇచ్చినట్లవుతుంది.
    
    కనుక ఏవిధంగా చూసినా అతను ఆటోమేటిక్ థాంప్సన్ సబ్ మెషిన్ గన్ నే ఉపయోగించి వుండాలి.
    
    స్మూత్ బోర్ గన్ ఫైర్ అయ్యాక దానినుండి దూసుకువచ్చే బుల్లెట్ ఒక క్షణానికి 1100 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. అలా మూడు అడుగుల వరకే వెళుతుంది. ఆపైన లెడ్ పేలట్స్ విడిపోయి లక్ష్యాన్ని ఒకచోటగాక చాలాచోట్ల గాయపరుస్తుంది.
    
    థాంప్సన్ సబ్ మెషిన్ గన్ ఉపయోగించాడనటానికి రీజన్స్ వివరిస్తాను.
    
    రైఫిల్ద్ వెపన్స్ స్పైరల్ గ్రూవింగ్ పద్దతిలో పనిచేస్తాయి. బ్యారెల్ లోపల రైఫిలింగ్ ప్రాసెస్ వుంటుంది. రైఫిల్ద్ వెపన్స్ బ్యారెల్స్ లోపల వలయాలుంటాయి. వీటిమూలంగా రైఫిల్ కి చెందిన ట్రిగ్గర్ ని లాగగానే బుల్లెట్ ని అత్యంత వేగంతో ముందుకునెట్టే హేమర్ (కాట్రిడ్జ్ సెంటర్) డిటోనేటర్ ఉండే ప్రాంతాన్ని బలంగా తాకుతుంది. దాంతో మెయిన్ ఎక్స్ పోజివ్ ని మండించే చర్య కూడా జరుగుతుంది. అప్పుడు బుల్లెట్ ఎక్స్ పోజ్ అవుతూ అత్యంత వేగంతో గన్ నుంచి రిలీజ్ అవుతుంది (సాధారణంగా ఏ గన్ అయినా ఇలాగే పనిచేస్తుంది) బ్యారల్ లో వలయాలుండటం మూలంగా బుల్లెట్ స్పిన్ అవుతూ స్థిరంగా, ఖచ్చితంగా లక్ష్యం కేసి దూసుకుపోతాయి. లక్ష్యాన్ని తాకేలోపు బుల్లెట్ స్ప్రెడ్ అవ్వదు.
        
    లాంగ్ బ్యారెల్ (రెండు నుంచి మూడు అడుగుల పొడవు బ్యారెల్స్ వుంటాయి) రైఫిల్స్  ఉపయోగిస్తే మూడువేల గజాల దూరంలో వున్న లక్ష్యాన్ని సయితం తేలిగ్గా, ఖచ్చితంగా నాశనం చేయగలవు.
    
    పైగా క్షణానికి వెయ్యి నుండి నాలుగువేల అడుగుల వేగంతో బుల్లెట్ రిలీజ్ చేసే శక్తి రైఫిల్ కే ఉంటుంది.
    
    రైఫిల్ద్ వెపన్స్ లో వాడే తూటా ప్రత్యేకంగా వుంటుంది.
    
    సీసంతో తయారుచేసిన తూటాలో ఎక్స్ పోజివ్ పౌడర్ నిండి వుంటుంది. దాని ముందుభాగంలో ఎలాంటి బలమైన లక్ష్యానైనా ఛేదించుకొని వెళ్ళేందుకుగాను బలమైన లోహంతో చేసిన బుల్లెట్ ఉంటుంది. (సాధారణంగా దీన్ని మొత్తాన్ని కలిపి బుల్లెట్ అని పిలవడం జరుగుతుంటుంది) ఈ బుల్లెట్ ని బలమైన సీసం లోహంతోగాని కార్బోనికెల్ కోటెడ్ సీల్డ్ తో కవర్ చేసే సీసంతోగాని తయారుచేయబడతాయి. (తూటాలో ఉండే ఎక్స్ పోజివ్ పౌడర్ ని లక్ష్యం అంతర్భాగంలోకి ప్రవేశపెట్టడానికి తూటా ముందుభాగంలో ఉండే బుల్లెట్ రహదారిని ఏర్పరుస్తుంది.)


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS