3. అగ్నికి వాయువు - తోడై రాగ
లంకాపురమున - మంటలెగయగ |
ఎల్ల రాక్షసుల - గృహములు కాలి
నేల గూలెను - బూడిదపాలై |
లంకావాసులు - భయపడిపోయిరి
దీనారవముల - పరుగిడసాగిరి |
చూచి రమ్మనిన - కాల్చివచ్చిన
ఘన విఖ్యాతి గ | డించె మారుతి .... ||శ్రీ||
4. పసి పాపలను - కరముల నీడుకొని
తల్లులు ఏడ్చుచు - పరుగిడసాగిరి |
మంటలు మండే - మేడల నుండి
క్రిందకు దుమికిరి - యువతులు తెగబడి |
అగ్నిహోత్రుడై - ఈ వానరుడని
అసురులందరు - ఆక్రందించిరి |
చూచి రమ్మనిన - కాల్చివచ్చిన
ఘన విఖ్యాతి గ | డించె మారుతి .... ||శ్రీ||
5. సర్వమంగళ - సంశోభితము
మందరగిరివలె - మహోన్నతము |
పతాకాంకిత - ధ్వజాకీర్ణము
చతురంగబల - పరివేష్టితము |
లంకేశ్వరుని - దివ్యభవనము
క్షణములో నాయె - జ్వాలామయము |
చూచి రమ్మనిన - కాల్చివచ్చిన
ఘన విఖ్యాతి గ | డించె మారుతి .... ||శ్రీ||
6. విమానములు - మంటలంటుకొని
నేల గూలెను | తునాతునకలై |
మణిమయ స్వర్ణ సౌ - ధములు కాలి
కరిగి పారెను - బూడిదపాలై |
సుందరమయిన - లంకాపురము
రూపు మాసెను - మంటలపాలై |
చూచి రమ్మనిన - కాల్చివచ్చిన
ఘన విఖ్యాతి గ | డించె మారుతి .... ||శ్రీ||
7. త్రిపురంబుల త్రి | నేత్రుడు కాల్చగ
ఎగసిన జ్వాలల - బోలిన మంటల |
రాక్షస మృత దే | హాలు ఆజ్యముగ
ధూమ రహితమై - మండిన మంటల |
ఫెళ ఫెళ ఫెళ మను - నిధ్వానమ్ముల
లంకాపురము - రగిలెను మంటల |
చూచి రమ్మనిన - కాల్చివచ్చిన
ఘన విఖ్యాతి గ | డించె మారుతి .... ||శ్రీ||
8. ఒకచో కుంకుమ - కుసుమ కాంతుల
ఒక ఎడ బూరుగు - పుష్పచ్చాయల |
ఒకచో మోదుగు - విరుల తేజముల
ఒక ఎడ కరగిన - లోహపు వెలుగుల |
కోటి సూర్య స | మాన కాంతుల
లంకాపురము - రగిలెను మంటల |
చూచి రమ్మనిన - కాల్చివచ్చిన
ఘన విఖ్యాతి గ | డించె మారుతి .... ||శ్రీ||
9. భూమ్యాకాశము | లు ఏక జ్వాలగ
లంకా దహనము - పూర్తికాగ |
ఇంతటి మారణ - హోమము జేసి
రాముని దలచును - మారుతి నిలువగ |
దేవ గంధర్వ - సిద్దచారణులు
పవన కుమారుని - పొగడిరి ఘనముగ |
చూచి రమ్మనిన - కాల్చివచ్చిన
ఘన విఖ్యాతి గ | డించె మారుతి .... ||శ్రీ||
__: 54 వ. స. సంపూర్ణము :__
55 వ. సర్గ
1. హనుమంతుడు స | ముద్ర జలాల
చల్లార్చుకొనే | లాంగుల జ్వాల |
తలచిన కార్యము - నెరవేర్చితినని
తేరిపార జూచె - వెనుకకు తిరిగి |
కనుపించెను ఘో | రాతి ఘోరము
జ్వాలా భీలము - లంకాపురము |
మారుతి వగచె తాను చేసిన పనిగని
తన కోపమె తన - శత్రువాయేనని .... ||శ్రీ||
2. "కోపిష్టులు తమ - బుద్ధి నశించగ
గురువులనైన - హింసించెదరు |
తగును తగదను - విచార మెరుగక
యోగ్యులనైన - తూలనాడుదురు |
పాప పుణ్యముల - లెక్క చేయక
ఎంతటి ఘోరము | లైన చేతు" రని |
మారుతి వగచె తా - చేసిన పని గని
తన కోపమె తన - శత్రువాయెనని .... ||శ్రీ||
