3. |"మహాకాంతితో | వెలుగొందు నీవు
| మామూలు కోతివి - కానేకావు
కోతి రూపమున - కనిపించు నీవు
ఎవడవో కాని - కామరూపుడవు |
లంకేశ్వరుని - మందిర మందు
ఎందులకై ప్ర | వేశించినావు ?
నిజము బల్కుచో - బ్రతికిపోదు " వని
మంత్రి ప్రహస్తుడు - మారుతి నడిగెను ||శ్రీ||
మారుతి సమాధానము :
4. "యమ కుబేర ఇం | ద్రాదులెవ్వరికి
దూతను గాను - దాసుడ గాను |
సహజమైన వా | నరుడను నేను
ఆలకింపుము - నిజముబల్కేదను |
రాముని దూతగ - ఇటు వచ్చినాను
రావణుజూడగ - ఇటు జేసినాను | "
అని మారుపల్కే - మారుతి దిటవుగ
లంకేశ్వరుని - వినుమని సూటిగ ..... ||శ్రీ||
5. "అశోక వనము - ధ్వంసము చేసితి
రాక్షసవీరుల - సంహరించితి |
నాతో సమరము - చేయవచ్చిన
అసుర వీరులను - వరుసగ గూల్చితి |
ఈ వంకనైన - లంకేశునితో
సంవాదము ల | భించ నెంచితి |"
అని మారుపల్కే - మారుతి దిటవుగ
లంకేశ్వరుని - వినుమని సూటిగ ..... ||శ్రీ||"
__: 50 వ. స. సంపూర్ణము :__
51 వ. సర్గ
1. "దశరధ రాజ కు | మారుడు రాముడు
తండ్రిమాట జవ | దాటని వాడు |
అనుకూలవతి | సతీ సీతతో
ప్రియసోదరుడు - సౌమిత్రితో |
తండ్రిమాట నిలు | ప రాజ్యము వీడె
పడునాల్గెండ్లు - వనవాసమేగే |"
అని మారుపల్కే - మారుతి దిటవుగ
లంకేశ్వరుని - వినుమని సూటిగ ..... ||శ్రీ||
2. "| సీతాపహరణము - జరిగె వనమున
రామలక్ష్మణులు - లేచి సమయమున |
రామలక్ష్మణులు - సీతను వెదకుచు
ఋష్యమూకమున - మమ్ము కలిసిరి |
రామ సుగ్రీవులు - సన్నిహితులైరి
మిత్రులైరి ప్ర | తిజ్ఞల బూనిరి |"
అని మారుపల్కే - మారుతి దిటవుగ
లంకేశ్వరుని - వినుమని సూటిగ ..... ||శ్రీ||
3. "శ్రీరఘురాముడు - వాలిని గూల్చెను
సుగ్రీవుని కపి | రాజుగ జేసెను |
సీత జాడగన - కపివీరులను
నలుదిశలకు సు | గ్రీవుడంపెను |
శత యోజనముల - వారిధి దాటి
ఒంటిగ నేను - లంక జేరితి |"
అని మారుపల్కే - మారుతి దిటవుగ
లంకేశ్వరుని - వినుమని సూటిగ ..... ||శ్రీ||
4. "అడుగడుగున ఈ - లంక వెదకితి
నీ భవనముల - పరిశీలించితి |
నీ సంగతి నీ | వారల సంగతి
సంపూర్ణముగా గ్రహియించితి |
సీతను చివరకు - కాంచగలిగితి
రాముని దూతగ - కీర్తిబొందితి |"
అని మారుపల్కే - మారుతి దిటవుగ
లంకేశ్వరుని - వినుమని సూటిగ ..... ||శ్రీ||
5. "నన్ను మించిన - వానర వీరులు
వెదకుచున్నారు - ముల్లోకములు |
గరుడుని మించిన - కడు బలవంతులు
పవనుని మించిన - వేగవంతులు |
నా కబురందిన - మరు నిముసమున
రాగలరిటకు | రణోత్సాహమున |"
అని మారుపల్కే - మారుతి దిటవుగ
లంకేశ్వరుని - వినుమని సూటిగ ..... ||శ్రీ|
6. "ఓ అసురేంద్రా - విశ్వసింపుము
నీ క్షేమము నే - తెల్పెద వినుము |
బలవంతుడవు | తపోవంతుడవు
ముల్లోకముల మె | ప్పించినవాడవు |
ధర్మార్ధముల - ఎరిగిన వాడవు
పరకాంతల ఆ | సించగా తగదు |"
అని మారుపల్కే - మారుతి దిటవుగ
లంకేశ్వరుని - వినుమని సూటిగ ..... ||శ్రీ||
