Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 35


    "అబ్బా - ఇదిగో - అక్కడేదో- నీక్కావల్సిన సీనొచ్చింది చూడు-" తన మీదున్న అవినాష్ చేతిని నెమ్మదిగా తీసేస్తూ అంది రోష్ణి.

 

    ఎదురుగా తెరమీద...

 

    ఓ నలుగురబ్బాయిలు, ఓ అమ్మాయిని భుజాలమీద వేసుకుని మోసుకెళ్తున్నారు, ఓ పదంతస్తుల భవనం పైకి తీసికెళ్ళారు. ఇద్దరు ఆ అమ్మాయి కదలకుండా పట్టుకున్నారు.

 

    ఆ అమ్మాయి కెవ్ - కెవ్- కెవ్ న అరుస్తోంది.

 

    "చెప్పాను కదా- ఇలాంటి సీన్లకోసమే- ఈ సినిమాకి నువ్వు నన్ను తీసుకొచ్చావ్- అవునా-"

 

    తల పక్కకు తిప్పేసుకుని, అవినాష్ కళ్ళవేపు సూటిగా చూస్తూ అంది రోష్ణి.

 

    "కాదు-" చెవిలో గొణిగాడు అవినాష్.

 

    "మరి-" అదే స్థాయిలో గొణుగుతూ, వెక్కిరింతగా అంది రోష్ణి.

 

    "నువ్వంటే - ఎంత ప్రేమో తెల్సా- రోష్ణి - ఇదిగో ఇటు చూడు-చీకట్లో అయినా-నా కనుగుడ్లలోకి చూడు-నీ రూపమే కన్పిస్తుంది. నా గుండెలమీద చెయేసి చూడు - ఆ లోన నరాలన్నీ నీ పేరునే జపిస్తున్నాయి. నేను కాలేజీకెందుకు సెలవు పెట్టేసానో తెల్సా-నీకు దూరంగా ఆ కొన్ని గంటలు కూడా నేను బతకలేను-" ఆమె చేతుల్ని పట్టుకొని అన్నాడు అవినాష్.

 

    రోష్ణి జవాబేం చెప్పలేదు. ఆమె మౌనహృదయం లోపల అవినాష్ మాట ఒక్కటొక్కటీ ముద్రపడిపోతున్నాయి. అవినాష్ కి కావల్సింది అదే.

 

    అటూ ఇటూ చూశాడు అవినాష్. అందరూ సినిమావేపే చూస్తున్నారు.

 

    అదే సమయంలో-

 

    తన రెండు చేతుల్నీ ఆమె భుజమ్మీద వేసి తనవేపు ఆమె తలని తిప్పుకుని-

 

    ఆమె పెదాలమీద గట్టిగా - ముద్దుపెట్టుకున్నాడు.

 

    "ఛీ- వదులబ్బా-" రోష్ణి మెల్లగా గొణిగింది.

 

    ఆ పెదాలను ఇంకా వదల్లేదు అవినాష్.

 

    గట్టిగా- ఇంకా కొరికేస్తున్నట్టుగా-

 

    రోష్ణి బాధతో మూలుగుతోంది.

 

    రెండు నిమిషాల తర్వాత ఆ పెదాల్ని వదిలాడు అవినాష్.

 

    గాఢంగా ఓ నిశ్వాస వదిలి-

 

    మళ్ళీ సినిమావేపు చూస్తోంది రోష్ణి.

 

    తన పెదవులకు అంటిన లిప్ స్టిక్ ను తుడుచుకుంటూ-

 

    "లిప్ స్టిక్ అంత మందంగా రాయకపోతే- ఏం" విసుక్కున్నాడు.
    


    ఆ మాటకు మెల్లగా నవ్వింది రోష్ణి.

 

    సరిగ్గా కూర్చుని తెరవేపు చూశాడు అవినాష్.

 

    విశాలమైన సముద్రతీరం, సముద్రం ఒడ్డున జలకాలాడుతున్న ట్రైబెల్ లేడీ-

 

    నగ్నంగా స్నానం చేస్తోందామె.

 

    ఆమె నీళ్ళలో మునిగి పైకి లేస్తున్నపుడు ఆమె ఎద ఎగసి, ఎగసి పడుతోంది- ఆమెవేపే కోరికతో ఆబగా ప్రేక్షకులు చూస్తున్నారు.

 

    అంతలో దూరంగా కొండమీద గుర్రమ్మీంచి ఒక వ్యక్తి.

 

    బైనాక్లస్ అమర్చిన తుపాకీ లోంచి ఆమెను చూస్తూ- ఆమెను చంపడానికి 'ఎయిమ్' చేస్తున్నాడు.

 

    ఆ గిరిజన అమ్మాయి నీళ్ళలోంచి లేచి ఒడ్డుకి వచ్చింది.

 

    మొఖం సముద్రం వేపు పెట్టి నిలబడింది.

 

    అదే సమయంలో-

 

    అవినాష్ చెయ్యి రోష్ణి మీద పడింది. అక్కడ అతనికి రోష్ణి కట్టుకున్న సిల్కుచీర మెత్తగా తగిలింది.

 

    "అబ్బా-వద్దు-" అంది రోష్ణి గోముగా.

 

    అవినాష్ ఊరుకోలేదు- తన చేతి వేళ్ళను ఒకింత ముందుకి జరిపాడు.

 

    "ఛీ-" అంటూ ఆ చేతిని తీసేసి "ఇలా-నాటీ పనులు చేస్తే- నే వెళ్ళిపోతాను-"

 

    బెదిరించింది.

 

    మళ్ళీ బుద్ధిమంతుడై పోయాడు. తెరమీద చూపు మరల్చాడు.

 

    తెరమీద ఉన్న ఆ అమ్మాయికి అప్పటికప్పుడు పిస్టల్ ఎక్కడ దొరికిందో తెలీదు.

 

    కొండమీద ఆ వ్యక్తిని చూసిన ఆ అమ్మాయి గబుక్కున నీళ్ళలోకి దూకేస్తూ-

 

    అక్కడ నుంచి ఒకే ఒక క్షణంలో కొండమీదున్న వ్యక్తిని కాల్చేసింది.

 

    ఆ వ్యక్తి పెద్ద కేక పెట్టుకుంటూ కిందపడిపోయాడు.

 

    అప్పుడా అమ్మాయి చిరునవ్వు నవ్వుతూ, నీళ్ళలోంచి మళ్ళీ నడుచుకుంటూ-

 

    ఒడ్డు కొచ్చింది.

 

    అండర్ వేర్, బ్రాసరీ వేసుకుని, గౌను వేసుకుంది. అంతవరకూ ఆ అమ్మాయి తలమీదున్న విగ్ తీసేసింది.

 

    ఆ గిరిజన యువతి హీరోయిన్... మారువేషం వేసిందన్న మాట...

 

    ఆ అమ్మాయి విగ్ తీసేయగానే, హీరోయిన్ ఆ అమ్మాయి అని తెల్వగానే ప్రేక్షకులందరూ సంబరపడి చప్పట్లు కొట్టేశారు.

 

    అవినాష్ కూడా చప్పట్లు కొడుతూ, ఆ చెయ్యిని పక్కకు జరిపి, గబుక్కున తన తల తెరవేపు తిప్పేసుకున్నాడు.

 

    రోష్ణి కోపంగా చెయ్యి ఎత్తింది. అవినాష్ చెంపమీద కొట్టడానికి.

 

    కానీ అదే సమయంలో హాల్లో ఒక్కసారి లైట్లు వెలిగాయి...

 

    గాభరాగా చెయ్యి వెనక్కి తీసేసింది.

 

    అయిదు నిమిషాల ఇంటర్ వెల్, ఆ తర్వాత మళ్ళీ సినిమా.

 

    ఖాళీ కూల్ డ్రింక్ సీసాను పక్కకు పెడుతూ-

 

    "ఇంకా నీక్కావల్సిన సీన్లు...ఎన్నుంటాయి." అంది రోష్ణి.

 

    "నాక్కావల్సినవి ఒక్కటి కూడా ఇందులో లేదు..." చెప్పాడు.

 

    "ఎందుకుంటాయి... పక్కన కూర్చున్న నన్ను చంపేస్తున్నావ్ కదా... మళ్ళీ సిన్మాలో సీన్లెందుకు... నీకు..."

 

    మరో అరగంట తర్వాత ఇద్దరూ సినిమా హాల్లోంచి బయటికొచ్చారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS