Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 34


    "నువ్వెలా బుట్టలో వేసావో నాకు తెలీదు కదా- అందుకే నాకు కండిషన్లు ఏమీ పెట్టలేదు. కానీ ఈ విషయం మన ముగ్గురుమధ్య ఉండాలన్నారు..." చెప్పాడు అవినాష్.

 

    "అయితే నువ్వు నాకు ఇప్పుడు నిజంగా...ఉడ్... బీ-వే నన్నమాట" అవినాష్ మీసాలమీద ముద్దు పెడుతూ అంది.

 

    అవినాష్ నవ్వేశాడు.

 

    "ఎక్కడకు బయలుదేరావ్... కాలేజీకా... డ్రాప్ చేస్తాను పద" రోష్ణి స్టీరింగ్ ముందు కూర్చుంటూ అంది.

 

    "అసలు... నీకు ఫోన్ చెయ్యడానికే బయల్దేరుతున్నాను-తెల్సా-" అవినాష్ ఆమె పక్కనే కూర్చుంటూ అన్నాడు.

 

    "ఎనీథింగ్ స్పెషల్..." ఓరకంట చూస్తూ ఇగ్లీషన్ కీ తిప్పింది.

 

    "ఎస్... టుడే యువర్ ఉడ్ బీస్ బర్త్ డే" అప్పటికప్పుడు ఓ అబద్ధాన్ని చెప్పాడు.

 

    "నీ బర్త్ డేని నేను సెలబ్రేట్ చేస్తాను-ఎలాగూ డాడీ ఊళ్ళోలేరు కదా-ఇంట్లో ఆంటీకి చెప్పొచ్చేస్తాను- మధ్యాహ్నం మనం భీమునిపట్నం వెళ్ళిపోదాం- రాత్రికి తిరిగొచ్చేద్దాం- అలాగేనా-"

 

    అవినాష్ ఆలోచిస్తున్నాడు.

 

    "ఇవాళ భీముని పట్నం వెళ్ళొద్దు- ఇవాళ నేను కాలేజీకి తప్పనిసరిగా వెళ్ళాలి. ఈరోజు ఒక్కరోజు వెళ్తే- మరో నెల్రోజులు లీవ్ పెట్టొచ్చు. అంచేత- సాయంత్రం అయిదు గంటలకల్లా నువ్వొచ్చేస్తే- మనం ఫస్ట్ షోకి సిన్మాకెళ్దాం-"

 

    "ఫస్ట్ షోకి నాకు కుదరదు-"

 

    "మరి-"

 

    "మ్యాట్నీ కెళ్దాం-" ప్రపోజ్ చేసింది రోష్ణి.

 

    "అలాగే-"

 

    అవినాష్ ని అతని కాలేజీముందు డ్రాప్ చేసి, సరిగ్గా మూడుగంటల కొస్తాను- రెడీగా ఉండు. అని చెప్పేసి వెళ్ళిపోయింది రోష్ణి.


                            *    *    *    *


    కాలేజీకి నెలరోజులు సెలవు పెట్టేశాడు అవినాష్.

 

    ఆ విషయం కార్లో చెప్పాడు రోష్ణీకి.

 

    "మధ్యలో సెలవెందుకు- ఉద్యోగం మానేయొచ్చుకదా-"

 

    "ఏం-"

 

    "మన పెళ్ళయిపోతుంది కదా-"

 

    "అయితే-"

 

    "మా దగ్గర కావల్సినంత డబ్బుంది..." చెప్పింది రోష్ణి.

 

    "మీ నాన్న డబ్బు నా డబ్బు అవుతుందా..."

 

    "నేను నీ దానినైతే, నా డబ్బు నీదవదా - పిచ్చివాడివి - నీకేం తెలీదు-" పెద్ద ప్రవక్తలా అంది రోష్ణీ.

 

    కారు లీలామహల్ కాంపౌండ్ లోకి నడిచింది.

 

    గోడపక్క పార్కుచేసి ఇద్దరూ కారులోంచి దిగారు.

 

    గోడమీదున్న పెద్ద పోస్టరుని చూసి తుళ్ళిపడింది రోష్ణీ.

 

    ఆ పోస్టరుమీద రకరకాల భంగిమల్లో అరడజను మంది విదేశీ అమ్మాయిలు దాదాపు నగ్నంగా ఉన్నారు. పైన 'ఎవెంజింగ్ ఏంజల్' అని చిన్న అక్షరాల్తో సిన్మా పేరుంది.

 

    "ఇదేదో బూతు సిన్మాలా ఉంది- నేన్రాను..." చికాగ్గా మొహం పెడుతూ అంది రోష్ణీ.

 

    "కాదులే-ఏదైనా వస్తే... కళ్ళు మూసుకొందూగానీలే-" అవినాష్ కౌంటర్ దగ్గరకెళ్ళి టిక్కెట్లు పట్టుకొని వచ్చాడు.

 

    లోనికి నడుస్తూ అంది రోష్ణీ.

 

    "ఇవాళ నాకు గంటన్నరసేపు కళ్ళు మూసుకోవడం తప్పదు-"

 

    ఆ మాటకు నవ్వొచ్చింది.

 

    డ్రెస్ సర్కిల్లో ఎక్కువమంది జనం లేరు... సీట్ నెంబరింగ్ కూడా లేదు-

 

    ఫస్ట్ రోలో అసలెవరూలేరు... ఆ రోలో మధ్యన కూర్చున్నారిద్దరూ.

 

    అప్పటికింకా సినిమా బిగిన్ కాలేదు.

 

    రాబోయే ఇంగ్లీషు సినిమాల 'ప్రీవ్యూ'ల్ని చూబెడుతున్నాడు.

 

    అయిదు నిముషాల తర్వాత, ఇండియన్ న్యూస్ రీల్ రెండురీళ్ళు చూపించాడు.

 

    భారతదేశంలో ఎంతమంది ప్రజలున్నారో, వాళ్ళేం చేస్తుంటారో అవన్నీ సాగదీసి, సాగదీసి చెప్పి ఆ ప్రజల్లో మన ప్రధాని చాలా గొప్పవాడని, వారి మార్గంలో మనం నడవాలని ఉద్భోదించారు.

 

    ఆ న్యూస్ రీల్ అయినంత సేపూ... రోష్ణి తలపట్టుకుని కూర్చుంది.

 

    ఆ తర్వాత-

 

    సిన్మా ప్రారంభం అయింది.

 

    అంతవరకూ "డిమ్"గా ఉన్న లైట్లు పూర్తిగా ఆరిపోయాయి.

 

    సిన్మా చూస్తున్న అవినాష్, ఒక్కసారి తల పక్కకు తిప్పి చూశాడు.

 

    తదేక దీక్షతో సిన్మా చూస్తోంది రోష్ణి.

 

    చీకట్లో రోష్ణి ముక్కుపుడక అందంగా మెరిసింది. ఆ అమ్మాయి వంటిమీంచి వస్తున్న సెంటు పరిమళం ఇంకా బావుంది.

 

    హేండిల్ మీదున్న రోష్ణి కుడిచేతి మీద నెమ్మదిగా తన చేయివేసి నిమిరాడు.

 

    ఆ సమయంలో బంగారుగాజులు చిన్నగా సవ్వడిచేశాయి.

 

    "ఏమిటీ" అన్నట్టు చూసింది రోష్ణి.

 

    మళ్ళీ తల తిప్పేసుకుని సిన్మా చూస్తోంది.

 

    అవినాష్ సినిమా చూడడం లేదు.

 

    తన చేతిని కొంచెం పైకి జరిపాడు. మెత్తని భుజాలు, అక్కడ నుంచి కొంచెం పక్కకు జరిపాడు.

 

    రోష్ణి మెత్తని ప్రదేశం కోసం వెతుకుతున్నాడు.

 

    "ష్..." నెమ్మదిగా విసుక్కుంది రోష్ణి.

 

    "ఏమిటీ-"

 

    "ఏమీకాదులే- సిన్మా చూడు-" తమకం నిండిన కళ్ళతో అన్నాడు.

 

    అవినాష్ చెయ్యి ఆమె ఎదమీద ఉంది.

 

    ఆ చేతిలోని నరాలు ఉద్రేకంతో ఊగిపోతున్నాయి. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS