"అవునురా! మహారాజుకు మంత్రిగారంటే ఇలా వుండాలి. మంత్రి గారికి పి.ఏ. అంటే ఇలా వుండాలి. తలకు మెదడంటే ఇలా వుండాలి. ఉపాయాల చేపలకు వలంటే ఇలా వుండాలి."
"అయితే వీడ్ని గురించి వీడి పెళ్ళానికి కూడా జాగ్రత్త వుండాలి."
అనంత్ చెప్పగలిగిందంతా చెప్పి....
"సర్! తమ ప్రీవియస్ పి.ఏ. జనార్ధన్ కూడా పరారీకి పోతే.....కొంత నేరం అతని మీదికి నెట్టొచ్చు."
"మొదటి రకమా...రెండో రకమా?"
"రెండో రకమే....అందులో రాజీ ఎందుకు?"
సరే.....ఏం చేస్తావో, ఎలా చేస్తావో. విషయం పెనం మీదుంది. ముఖ్యమంత్రి సి.బి.ఐ. అనే నిప్పును ఇప్పుడే క్రింద రాజేశాడు. ప్రస్తుతం ఆ పెనంకు దగ్గరగా వుంది నేనే....అందరూ మొదటి రకం పరారీలో వున్నారు.
నువ్వు తలపెట్టిన ఈ రెండో రకం పరారీ వలన నేను పెనంమీది నుండి పొయ్యిలోకి జారేట్టు మాత్రం చేయకు."
అలా చేస్తే అతడు మొదటి రకం జనార్ధన్ సర్! నేను రెండోరకం అనంత్ ని.
"సర్! నా బ్రెయిన్ రైల్స్ మీద నా ఆలోచనల ట్రెయిన్ పరిగెడుతూ వుంటుంది. అది ఎక్కడా ఎవరూ ఎక్కి తొంగి చూడటానికి ఆగదు. ఎప్పుడూ గుండ్రంగా తిరుగుతూనే వుంటుంది. అందులో మనం తప్ప ఎవరూ వుండరు. మీరే చూస్తారు. అందుకు మందీ-మార్భలం కావాలి. మంది బలాన్ని 'మనీ బలం'గా మార్చి....నన్ను ఆపరేషన్ లోకి పంపండి.
ఇక ఆ పావని అంటారు.
ఆ పిల్ల విషయంలో మీరంత తొందరపడాల్సిన అవసరంలేదు. అది మన పాముల బుట్టను తెరిచింది. ఇప్పుడు మన పాములన్నీ పరారీలో వున్నాయి. బుట్ట తెరిచిన దానితో తగాదా ఆడుతూ కూర్చుంటే....పాములు ప్రత్యర్ధికి దొరుకుతాయి. అది జరక్కుండా....వారి చేతుల్లోకి మన కుంభకోణాల విషాన్ని వాటి కోరలనుండి కక్కకుండా మనం చూసుకోవాలి.
అందుకని....పాముల వేటకు బయలుదేరతాను."
అనంత్ అనటంతో...అంబరీషుడిక్కూడా అది నిజమే అనిపించింది.
సరే. నువ్వు కోరినంత మనీ....
"మొదలెట్టు" అన్నాడు.
అనంత్ మరికొన్ని ముచ్చట్లు చెప్పాక.....చివర్లో అన్నాడు.
"సర్! నేను సిటీలో లేనప్పుడు నా స్థానంలోకి మరో లేడీ పి.ఏ. వస్తుంది. ఆమె పేరు బసంతి. బంతి పూవులా శరీరమూ, మొగలిపూవులా మనసూ వుంటుంది. మంచి ఉపాయల్ని చెప్తుంది. ఆమె మనసు విప్పి మాట్లాడితే మొగలిపూవులాంటి ఆలోచనలు వస్తాయి. అవి వినటానికి ఆహ్లాదంగా, ఆనందంగా వుంటాయి.
ఇప్పటివ్ఫరకూ లేడీ మంత్రుల దగ్గరే పి.ఏ.గా చేసింది. మీరు అంగీకరిస్తే....ఆ బసంతిని తమ దగ్గర పెడతాను.
అమెరికా అధ్యక్షుడు క్లింటన్ గెలిచినప్పుడు ప్రజలకు ఒక వాగ్దానం చేశాడు. ఒకే ఓటుకు ఇరువురు ప్రెసిడెంట్సు అని. ఒక ప్రెసిడెంటు తనయితే...రెండో ప్రెసిడెంటు తన భార్య.
అలాగే తమరు జీతం ఒకటే ఇవ్వండి. కానీ పి.ఏ.లు ఇద్దరు తమకోసం పనిచేస్తారు."
అంబరీషుడు ఆ మాటలు వినటంతో బిగ్గరగా నవ్వాడు.
ఒక జీతం ఏమిటయ్యా! నీవన్నట్టు మనిషి ముద్దబంతిలానూ, మనసు మొగలిపూవులానూ వుండాలీగాని....పది జీతాలివ్వనూ..." అన్నాడు.
అనంత్ మంత్రిగారికి వినయపూర్వకంగా నమస్కరించాడు.
"అన్నట్టు ఆ బసంతి నీకేమవుతుంది?"
"ఏమీ కాదు సర్! శిష్యురాలు నచ్చితే ముందుముందు తమకే నాకంటే ఎక్కువతుంది."
అంబరీషుడు ఆ మాటలకు నవ్వుకున్నాడు.
* * * *
ఆ రాత్రే అనంత్ అంబరీషుడి గెస్ట్ హౌస్ కి బసంతిని తీసుకొచ్చాడు.
అనంత్ చెప్పినట్టు- బసంతి బంతిపూవులా పచ్చగా వుంది. ఆమె ముఖం మరింత ముద్దుగా వుంది. ఆమె నిండుగా ఖరీదయిన కాటన్ చీర కట్టింది. జడ వేయకుండా నాజూకయిన 'చిగనాన్' కొప్పు వేసుకుంది. ఆ కొప్పునుండి వెంట్రుకలు విడిపోకుండా బంగారు పిన్స్ పెట్టుకుంది. బంగారు పిన్స్ కు ఖరీదుగా వ్రేలాడే ముత్యాల రింగుల్ని అమర్చింది.
మనిషి ఎత్తుగా, మరింత మత్తుగా వుంది.
అంబరీషుడికి ఆమె చేతులు జోడించి నమస్కారం నమస్కారం చేయలేదు. చేతులు యిచ్చి షేకింగ్ యిచ్చింది.
అంబరీషుడికి ఆమె చేతుల్లో ఏదో విద్యుత్తు వున్నట్టు-అది తన చేతుల్లోకి పాకి, గుండెకు తగిలి...రక్తంలో కలిసి అవయవాలన్నింటికీ పాకినట్టు కదలిపోయాడు. ఈమె చేతి షేకింగే ఇంత షాకింగ్ గా వుంటే__అంబరీషుడి అనుమానం చివర ఒక బ్లాంక్ ఏర్పడి...అది 'ఫిల్' అయ్యేదెప్పుడో అనుకున్నారు. బ్లాంక్ ను పూరించటం ఇక తన చేతుల్లోనే వుంది. పేపరు చేతికొచ్చింది గనుక- బ్లాక్ పూరించటం తన చేతి పనే అనుకున్నాడు.
గతంలో తనకు కొందరమ్మాయిలు తెలుసు. కానీ బవంతిలా, ముద్దబంతిలా ముద్దు ముద్దుగా ఎవరూ తెలీదు. తింటే గారెలే తినాలి. వింటే వాత్సాయనుడి కామసూత్రాలే వినాలి. పెడితే ఇలాంటి పి.ఏ.నే పెట్టుకోవాలి.
'వారెవ్వా అనంతుడూ!
అందుకే నువ్వు సీనియర్ పి.ఏ.వి.రా.'
అంబరీషుడు మనసులో అనుకున్నాడు.
"ఏం చదువుకున్నావ్?"
"బి.ఏ. వరకూ."
"వరకూ అంటే చివరికెళ్ళిందా-మొదట్లోనే ఆగిందా?"
"లేదండీ మధ్యలో ఆగింది."
"అయ్యో...అది చాలా బాధాకారం కదా?"
"పరిస్థితులు....తప్పలేదు."
"ఇప్పుడు పూర్తిచేస్తావా?"
"తమరి దయ."
"అరెరె...అదెంత పని....మనిషిని చూస్తే డిగ్నిఫైడ్ గా వున్నావ్. డిగ్రీ కూడా వుంటే....బంతి పూవుకు సువాసన అబ్బినట్టు, బసంతికి నిండుగా వుంటుంది."
బసంతి కిలుక్కుమని నవ్వింది.
అంబరీషుడు కూడా అందుకు జత కలిపాడు.
అనంత్ సెలవు తీసుకుని బయటికి పోయాడు. గెస్ట్ హౌస్ బోయ్ ని అంబరీషుడు పిలిచి__
"ఏం తీసుకుంటారు?" అంటూ బసంతి ని అడిగాడు.
నేను ఈ క్షణంనుండి తమరి పి.ఏ.ను. నేనుగా ఏం తీసుకొనేది వుండదు. మీకు ఏదిష్టమైతే దాన్నే మేం కూడా తీసుకుంటాం.
మీ రుచుల కనుగుణంగా మా అభిరుచుల్ని మలుచుకుంటాం" బసంతి లవ్ లీగా అంది.
"అయితే బసంతీ! ఈ సమయంలో నేను ఒక అరకాయ విస్కీ త్రాగి...చికెన్ ముక్కల్ని నంజుకోవాలనిపిస్తోంది. అందులో ఒక పావుత్రాగి నాతో నంజుకుంటారా?"
"భలే కొంటెవారే" బసంతి చమత్కరించింది.
"ఏమిటి? ఆర్డర్ ఇవ్వమంటారా?"
"ముందు రోజే తప్పదంటే- తమరి అభిలాషకు అడ్డం చెప్పేదేం వుంటుంది."
"వెరీగుడ్! ఇన్ని రోజులూ ఏమయ్యావ్ బసంతీ?"
"కాలం కలిపే రోజు ఇప్పటికి వచ్చింది."
"వెరీగుడ్! అయితే ఈ రాత్రికి నేను ఇంటికి వెళ్ళను."
"అమ్మగారు ఎదురు చూడదా?"
"చూస్తుంది. అదోరకం. పూర్తిగా పాతకాలమూ కాదు- అలా అని మోడరన్ అంతకంటే కాదు. మధ్యస్థం! ఫోన్ చేస్తే తిని పడుకుంటుంది. ఫోన్ చేయకపోతే ఎదురుచూస్తుంది,"
"అయితే ఫోన్ చేయండి."
అంబరీషుడు ఆమె వంక చిలిపిగా చూసి- గెస్ట్ హౌస్ బోయ్ ని పిలిచాడు. ఖరీదయిన స్కాచ్ విస్కీ ఫలానా చోటులో దొరుకుతుందని చెప్పి- మూన్ మూన్ స్టార్ హొటల్లో చికెన్, ఫ్రాన్స్ ల్లో ఎన్ని రకాలున్నాయో అన్నీ తీసుకుని వైట్ రైస్ విత్ కార్డ్ కూడా తీసుకురమ్మన్నాడు.
అతడు మంత్రిగారి దగ్గర మనీ తీసుకుని బయటికి వెళ్ళాడు. రాత్రి తొమ్మిదిగంటలు దాటింది.
గెస్ట్ హౌస్ నుండి అయన మనుషులు అందరూ సర్దుకున్నారు. ఆయన ప్రయివేటు గూండాలు కూడా ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు. ప్రభుత్వం నియమించిన సెక్యూరిటీ విభాగం మాత్రం గేట్ హౌస్ లో అక్కడక్కడ సర్దుకున్నారు.
అంతపెద్ద హేస్ట్ హౌస్ లో ఇప్పుడు అంబరీషుడూ, బసంతీ తప్ప ఎవరూ లేరు.
అంబరీషుడు ఆ సమయంలో మనసులో అనుకున్నాడు.
అనంత్ తనను ఇరుక్కున్న కుంభకోణం నుండి బయటపడేయటం మాటలా వుంచితే....ఒక 'రంభకోణం'లో మాత్రం ఇరికించేశాడు.
పి,ఏ. అంటే అలా వుండాలి.
చేరినా మొదటి రోజే ఈ బసంతిని తనకు అప్పగించాడు. తను గతంలో ఎంజాయ్ చేసి వదలిన ఆడవాళ్ళేవరూ దీనికి పోటీ వచ్చేట్టులేరు. అందుకే తనకు పదవి వున్నా, లేకపోయినా ఈ బసంతిని మాత్రం వదలకూడదు.
ఈ మధ్య ముఖ్యమంత్రి ఒకటే నస!
