Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 32

ఇక ఈ ముఖ్యమంత్రిగారి హైటెక్ కంప్యూటర్ ఆ పావన్ని తీసుకొచ్చి తను పాఠం చెప్పిన మూవ్ మెంట్స్ ఎలా నోట్ చేస్తుందో చూస్తాను.
అంబరీషుడికి మరింత ఆగ్రహం వచ్చింది.

                        *    *    *    *
సాజిత్ మెడికల్ చాంబర్!
పావని మరోసారి మధు-గీతిక ప్రాబ్లమ్ ని మనసులోకి తెచ్చుకుని కంప్యూటర్ లోకి చక్కని కథగా ఎక్కించి-తన సమాధానాన్ని దాని క్రింద ఫీడ్ చేసి వెళ్ళిపోయింది.
సాజిత్ ఆమె వెళ్ళిన తర్వాత మెల్లిగా అదే కంప్యూటర్ దగ్గర కూర్చుని ఆమె వ్రాసిన సమాధానం చదివాడు.
చాలా బ్యాలెన్సడ్ గా ఆలోచించింది. ఇలాంటి సున్నితమయిన విషయాల్లో ఏమతఃరం డీలియేట్ అయినా విషయం రాంగ్ ట్రాక్ కెక్కుతుంది.
తాము ఆలోచించిన రీతిలోనే ఆమె ఆలోచించింది.
బహుశా పావని ఇంటికి చేరి వుంటుంది.
సాజిత్ మనసులో తీయటి అలజడి....
వెంటనే లేచి తన గదిలోని మరో కంప్యూటర్ దగ్గర కూర్చున్నాడు. దాని స్క్రీన్ మీద 'పావని' అనే అక్షరాలు వచ్చేట్టు కీ బోర్డు మీద కమాండ్స్ ప్రెస్ చేశాడు.
తర్వాత మరిన్ని కమెండోలు నొక్కి, పావని బొమ్మ వచ్చేట్టు చేశాడు.
తర్వాత 'ప్రొవోకేటివ్స్' అనే అక్షరాలు పడ్డాయి. తను మొదటిసారి ప్లే చేసిన మాదిరిగానే స్క్రీన్ మీద పావని శరీరం క్రింద 'ఎనీపార్ట్ ఆఫ్ ది బాడీ' అనే ఇంగ్లీషు అక్షరాలు పడ్డాయి.
తర్వాత హైటెక్ హెల్ మెట్ లాంటి ఒక పరికరాన్ని సాజిత్ తగిలించుకున్నాడు. దాని నిండా ఏవో చిన్ని చిన్ని లైట్లూ__వైర్లూ అమర్చ  బడి వున్నాయి. కీ బోర్డ్ లోని మరో కమాండర్ ను ప్రెస్ చేశాడు. "చైనీస్ టైప్ ఆఫ్ హైటెక్ లవ్" అనే అక్షరాలు పడ్డాయి.
సాజిత్ మెల్లిగా నవ్వుకున్నాడు.
సరిగ్గా అదే సమయంలో...అతనికి దూరంగా పావని తన ఇంటిలో బెడ్ రూం లో పడుకుని సైన్స్-ఎథిక్స్ కీ తలెత్తిన కంట్రోవర్శిటీ ప్రస్థుతం జరుగుతున్న అజ్ఞాతమయిన, వికృతమయిన పిలుపుల్ని తలచుకుంటూ వుంది.
ఒక్కసారిగా ఆమె శరీరంలోకి ఎవరో 'కంపాక్ట్ డిస్క్ ప్లేయర్'ను అమర్చి తీయటి శబ్ద తరంగాల్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేసినట్టు ఒక వింత అనుభూతి కలిగింది.
"మరోసారి తనను హైటెక్ లవ్ లో....దూరంగా వుండి సాజిత్" ఆమె మరింత మధురంగా మూవ్ అయింది.
"ఓహ్! శరీరమంతా ఏదో శృంగార సంగీతం పలుకుతోంది, అనేకమంది సాజిత్ లు చెవి దగ్గర చేరి చిలిపి ఊసుల్ని కోరస్ గా పాడుతున్నట్టు...తీయటి తరంగాలు స్వచ్చంగా__ఎలాంటి అవరోధాలూ లేకుండా సాగి-సాగి తనను ఎక్కడో స్వర్గసీమల్లోని అంతరాల్లోకి మరింత లోతుగా తీసుకెళుతున్నట్టు ఓ మైమరపు.
తన శరీరమంతా కంపార్ట్ డిస్క్ ప్లేయర్ గా మారింది.
దానిలో అత్యంత సూక్ష్మంగా ఉండే కోటాను కోట్ల తరంగాల లోతుల్ని లక్షల సాజిత్ ళు లేసర్ కిరణాల్లా మారి....వాటిలో పయనిస్తూ అందులోని లవ్ సౌండ్స్ ని కదిలిస్తూ తనను 'మెరియానా ట్రంచ్' లాంటి ఆనందపు అఘాతాల్లోకి, ఎవరెస్ట్ శిఖరాల్లాంటి అనురాగం ఎత్తుల్లోకి తీసుకెళ్ళటం జరుగుతోంది.
హైటెక్ ప్రేమలోని నిమ్నోన్నతాల్ని అనుక్షణం తను అనుభూతి చెందుతోంది.
అదిగో సరిగ్గా అప్పుడే....
"డిస్ ప్లే స్క్రీన్" మీది అక్షరాలు మారినట్టు కీ బోర్డులోని కమాండ్స్ నొక్కబడినట్టు....తన శరీరంలో సంగీతం ఆగిపోయింది.
తనను సాజిత్ లంతా ఏకమై ఐదుసార్లు గట్టిగా హత్తుకుని....ఎనిమిదిసార్లు....అంటీ అంటనట్టు అధో రకంగా స్పర్శనాడుల్ని కదిపి...అదే పనిగా రిపిటీషన్స్ ఇవ్వటం...మరింత ఆనందంగా వుంది.
తనెక్కడో  చదివినట్టు గుర్తు....
అవి చైనీయుల అదృష్టానికి సంకేతాలనీ....వాటిని అన్ని రంగాల్లోనూ అప్లయ్ చేస్తారనీ....
అంటే సాజిత్ తనమీద 'చైనీస్ టైప్ ఆఫ్ హైటెక్ లవ్' ను డిస్ ప్లే చేస్తున్నాడా?!
వహ్! ఈ రకం ప్రేమకు అలవాటు పడితే....ప్రపంచంలోని ఏ మత్తూ దీనికి సాటిరాదు. ముందుగా తనే దీనికి గురవుతుంది. సాజిత్ కున్న నానోటెక్ నాలెడ్జి ఇప్పుడు లవ్ ఫీల్డ్ లోకి దిగి... "లవ్ టుడే"కి సరిక్రొత్త రూపం ఇస్తున్నాడు. అది "లవ్ టుడే" నే కాదు. "లవ్ టుమారో"కూడా అవుతుంది.
ఆమె అలా అనుకుంటున్న క్షణాలకు....
మరో మార్పు...అక్కడ చోటుచేసుకుంది.
చైనీస్ ప్రేమలో....చిన్ని చెట్టును "మంకీ" పట్టుకుని వూపినట్టు ప్రియుడు ప్రేయసిని పట్టుకుని మధురంగా ఊపుతాడు. ఆమె గిలిగింతలకు గురవుతుంది. గలగలా నవ్వుతుంది. ఆ నవ్వులోని ప్రేమోద్వేగ తరంగాల్ని ఆనందిస్తూ అతను మైమరచిపోతాడు.
అలాంటి అనుభూతి పావని శరీరం మీద కలిగించి- రిమోట్ పెన్సింగ్ లో ఆమె నవ్వులోని తీయటి గలగలల్ని వినటానికి సాజిత్ సమాయత్తమై కీ బోర్డులోని ఓ కమాండ్ ను ప్రెస్ చేశాడు. ఆ వెంటనే....పావని బొమ్మచుట్టూ ఏవో స్పార్క్స్ వెలిగాయి!
అక్కడ పావని తన గదిలో...ఎవరో తన నడుం చుట్టూ పులకింతల్ని, చక్కిలిగింతల వడ్డాణంగా చేసి తగిలించినట్టు మరింతగా మెలికలు తిరిగి...ఊరికే ఊగిపోవటం మొదలెట్టింది.
సరిగ్గా అదే సమయంలోనే సాజిత్ మెడికల్ చాంబర్ లోనికి వేగంగా తిరుమలరావు దూసుకువచ్చాడు. ఆయన్ను సాజిత్ చూడటం జరిగింది.
తన హైటెక్ అనుభూతుల హెల్మెట్ ను తీసి ప్రక్కన పెట్టి....
"రండి సార్" అన్నాడు.
ఆయన లోనికి వచ్చాడు!
సాజిత్ ఒక విషయాన్ని ఆ సమయంలో మర్చిపోయాడు. అది తన హైటెక్ డీలింగ్ ఆఫ్ లవ్ విత్ పావని..." కంప్యూటర్ లో డిస్ కనెక్టు చేయటం.
ఫలితంగా అక్కడ తన బెడ్ మీద పావని అదే పనిగా చక్కలిగింతలకు లోనై....ఊరికే  ఊగిపోతూ ...గలగలా నవ్వుతూ....తనను తానే మర్చిపోతోంది.
సాజిత్ గదిలో మాత్రం....
తిరుమలరావు....
"బాబూ సాజిత్! నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. కొద్దిసేపు అవకాశం ఇస్తావా?"
"విత్ ప్లెజర్."
"అదే పావని విషయం!"
'ఏమయింది?"
"అంబరీషుడి మీద దాని వ్యాసాలు చదివే వుంటావ్? వారి మీది వ్యాసాలంటే...అందులోనూ కరప్షన్ విషయంలో...కత్తి పదును మీద నడకలాంటిది!" ఆయన ఆ మాటను అనేకసార్లు వాడాడు.
"తెలుసు సర్!"
"తెలిసే ఊరుకుంటున్నావా బాబూ?"
"జర్నలిజం మీద నడక ఇప్పటి గూండాల యుగంలో ఒక ప్రమాదకర పరిణామమే! కానీ ఆమె అదే వృత్తిని ఎన్నుకుంది. అందులో ఒక విజయం సాధించింది. అందుకు నేను చాలా గర్వపడుతున్నా సర్!"
"అవును బాబూ! అంత సమాచారం ఒక్క ఆడపిల్లగా ఇది ఏ విధంగా సేకరించగలిగింది?"
ఇంకా ఈ యుగంలో ఆడపిల్ల-మగవాడేమిటి సర్?
ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ ముందుకు వస్తుంటే....ఒక మాస్టారుగా మీరలా అనటం నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. గ్రహాంతర రాకెట్లలో కూడా రేపు వారు ప్రయాణానికి సిద్దం అవుతున్నారు. నిద్రపుచ్చే వారి 'ఊయల రాగాలు' ఈ యుగంలో నిద్రిస్తున్న వారిని తట్టి లేపుతున్నాయి. పూలదండలు వ్రేలాడే వారి శరీరాల మీద బుల్లెట్ బెల్ట్ లు వ్రేలాడుతున్నాయి.
అలాంటి యుగంలో ఒక ఆడపిల్ల జర్నలిజం వృత్తిగా తీసుకుని....ఆ సమాచారం సేకరించటం పెద్ద వండర్ కాదు సర్!"
"ఒక తండ్రిగా ణా ఆవేదన అర్ధం చేసుకోవటం లేదు. ఒక మంత్రి సాగించిన కుంభకోణం బయటపెట్టటంవల్ల....ఇక్కడ కొంత ఉపయోగం జరిగితే జరగవచ్చు. కానీ...రేపు దాని ప్రాణానికి దీని వలన దెబ్బతిన్న విశానాగుల్లాంటి మంత్రిగారి ప్రయివేటు గూండాలు ముప్పుతేరంటావా?"
"తండ్రిగా మీరు పడుతున్న ఆవేదన అర్ధమయింది. ఆమెను చేపట్టబోయే ఒక ప్రియుడిగా ఆమెను కాపాడే దారుల్ని నేనూ వేదుకుతాను. మీరు నిశ్చింతగా వుండండి."
"....వారు నిన్ను మాత్రం...."
"ఆగిపోయారేం...? నన్నూ ఊరుకోరు. ఆమె వెనుక వున్నానని తెలిస్తే ణా మీదికీ దండెత్తుతారు. ఆ భయంతో నేను జీవించను. అలాగే పావని కూడా!"
తిరుమలరావుకు తానుగా మాట్లాడేందుకు ఇంకా ఏం మిగల్లేదని అనిపించింది.
ఇరువురూ గంభీరంగా ఒకరి నొకరు చూసుకుంటూ అకాగే వుండిపోయారు. అదిగో అప్పుడే....సాజిత్ కు పావని విషయం గుర్తుకు వచ్చింది.
సరిగ్గా అదే సమయానికి...వీరికి దూరంగా తన బెడ్ మీద హైటెక్ పులకింతలు 'చైనీస్ టైప్ ఆఫ్ లవ్ ప్రాసెస్' లో ఎక్కువయి- మనిషి అదే పనిగా మెలికలు తిరుగుతూ....మరింతగా మైమరపుకు లోనయింది.
తరువాత తిరుమలరావు సాజిత్ దగ్గరకొచ్చి....
"బాబూ! మీరు ప్రేమికులుగానే వుండిపోతారా?! లేక పెళ్ళివరకూ వెళతారా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS