Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 31


    లేదన్నట్టు అడ్డంగా తలూపాడు కృష్ణమూర్తి.

 

    అతని సమాధానానికి పద్మ కించిత్తు బెంగపడింది.

 

    "ముహూర్తాలు పెట్టుకోడానికి మీ పెద్దవాళ్ళను తెస్తానన్నావుగా" అన్నది హీనస్వరంతో.

 

    "కథ అడ్డం తిరిగింది పద్మా" అన్నాడతను నీరసంగా.

 

    ఇప్పుడు పద్మ పూర్తిగా కలతపడింది.

 

    "అసలేం జరిగింది?" ఆందోళనగా అడిగింది.

 

    "అదంతా ఒక పెద్దకథ" అన్నాడతను సింపుల్ గా.

 

    "ప్లీజ్ కృష్ణా! కనీసం ఇప్పుడయినా నీ ధోరణి మార్చుకుని జరిగిందంతా చెప్పు?"

 

    కృష్ణమూర్తి నిట్టూర్చి అన్నాడు...

 

    "డిసెంబరు 31లోగా నిన్ను నేను పెళ్ళాడాలి, అది మా నాన్న పెట్టిన షరతు."

 

    "షరతా, షరతేమిటి?"

 

    "అదంతా ఒక పెద్దకథ."

 

    "అబ్బా! ఇందాక ఒక తడవ అదే మాటన్నావు."

 

    "అంతకంటే ఇంకోమాట అదనంగా నేను అనలేను. డిసెంబరు 31 లోగా మన పెళ్ళి కాకపోతే ఇక ఈ జన్మకింతే! నువ్వెవరో నేనెవరో!"

 

    పద్మ అసహనంగా అనేసింది.

 

    "డిసెంబరు 31లోగా మన పెళ్ళి జరగాలి. అంతేగా?"

 

    "అవును,అంతే!"

 

    "మరేం ఫర్లేదు. వచ్చినవాడివి ఎట్లాగూ వచ్చావు, మా నాన్నతో మాట్లాడు."

 

    "ఆయన లేరటగా?" నేను అనలేను. డిసెంబరు 31 లోగా మన పెళ్ళి కాకపోతే ఇక ఈ జన్మకింతే! నువ్వెవరో నేనెవరో!"

 

    పద్మ అసహనంగా అనేసింది.

 

    "డిసెంబరు 31లోగా మన పెళ్ళి జరగాలి. అంతేగా?"

 

    "అవును,అంతే!"

 

    "మరేం ఫర్లేదు. వచ్చినవాడివి ఎట్లాగూ వచ్చావు, మా నాన్నతో మాట్లాడు."

 

    "ఆయన లేరటగా?"

 

    "రేపో మాపో వస్తారు. ఆయన అంగీకరించాడా సరేసరి. లేకపోతే మనపెళ్ళి మనమే చేసుకుందాము."

 

    "అది కుదరదు" ఉలిక్కిపడి అన్నాడు.

 

    "ఎందుక్కుదరదు?" అనుమానంగా అడిగింది.

 

    "మనపెళ్ళి మీ నాన్నగారి అంగీకారంతోనే జరగాలి."

 

    "ఆయన అంగీకరించకపొతే?"

 

    "అంతే సంగతులు. మనపెళ్ళి జరగదు."

 

    పద్మకి కోపం వచ్చింది.

 

    "మధ్య మా నాన్నతో సంబంధమేమిటసలు? మనపెళ్ళి మనయిష్టం"

 

    "నిజానికి నువ్వు చెప్పిందే కరెక్టు. కానీ- మీ నాన్న అంగీకారంతోనే మనపెళ్ళి జరగాలని మా నాన్న రెండోషరతు పెట్టాడు."

 

    వళ్ళు మండిపోగా అడిగింది పద్మ...

 

    "ఆ విధంగా మొత్తం ఎన్ని షరతులు పెట్టారేమిటి?"

 

    "ఆ వివరాలు చెప్పేందుకు ఓపికలేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో! మీ నాన్న అంగీకారంతోనే డిసెంబరు 31లోగా నిన్ను నేను పెళ్ళాడుతాను, ఓ.కే.?"

 

    పద్మ చాలా నెమ్మదిగా అన్నది...

 

    "నేను చాలా పెద్ద పొరపాటు చేశాను కృష్ణా."

 

    "ఏమిటది?"

 

    "నిన్ను ప్రేమించటం!"

 

    "పద్మా!"

 

    "లేకపోతే ఏమిటిది చెప్పు? ఎవరో పెద్దవాళ్ళు ఏవో తిక్క షరతులు పెడితే, వాటిని మనమెందుకు లెక్కచేయాలి?"

 

    "నన్ను నిందించి ప్రయోజనంలేదు. ముందు ముందు ఏం చేయాలో, ఏం చేస్తే బావుంటుందో ఆలోచించాలి."

 

    పద్మ నిరాశగా అనేసింది...

 

    "అదేదో నువ్వే ఆలోచించి చెప్పు."

 

    "ముందు మీ ఇంటిలో నాకు కొంచెం చోటివ్వాలి."

 

    "ఇస్తే?"

 

    "మీ నాన్నగారిని మంచిచేసుకునే పధకం ప్రారంభిస్తాను."

 

    "మా నాన్న ఇతరులను అంత త్వరగా నమ్మడు" అన్నదామె కటువుగా.

 

    "నా అదృష్టం బావుంటే నన్ను నమ్మవచ్చుకదా" అన్నాడతను ఆశగా.

 

    "సో- ఆయన్ను మెప్పించి నువ్వు ఈ ఇంటి అల్లుడవ్వాలి అంతేనా?"

 

    "కరెక్టు!"

 

    "అదంతా డిసెంబరు 31 లోగ పూర్తి కావాలి."

 

    "ఎక్జాక్ ట్లీ."

 

    "అంతే తప్ప- మన ప్రేమగురించి ఆయనతో ధైర్యంగా చెప్పి తాడోపేడో తేల్చుకునే పధ్ధతి నీకిష్టంలేదు, అంతేగా?"

 

    "మరొకటి-ఎట్టి పరిస్థితుల్లోనూ మన పూర్వ పరిచయాలు ఆయనకు తెలీకుండా నువ్వుకూడా జాగ్రత్త తీసుకోవాలి."

 

    "ఇది కూడా మీ నాన్నగారు పెట్టిన షరతేనా?"

 

    "కాదు! నా అభ్యర్ధన."

 

    పద్మ ఖర్మ ఖర్మ అనుకుంటూ తల బాదుకోబోయింది. కృష్ణమూర్తి యధాప్రకారంగా వద్దొద్దొద్దంటూ అడ్డంపడ్డాడు.

 

    వచ్చే కోపాన్ని కన్నీటిని దిగమింగుకుని ఆమె గిరుక్కున వెనక్కి తిరిగి ఇంటిలోకి వెళ్ళిపోయింది.

 

    కృష్ణమూర్తి నిట్టూర్చేడు.

 

    "క్షమించాలి" అంటూ ఒక గొంతు వినిపించింది.

 

    కృష్ణమూర్తి వెనక్కు తిరిగిచూసేడు! శాస్త్రి ముక్కు గోక్కుంటున్నాడు. శాస్త్రిని చూస్తూ అడిగాడు అతను.

 

    "ఇంతసేపూ ఎక్కడున్నావు?"

 

    "ఇక్కడే వున్నాను. అందుకే క్షమించాలన్నాను!"

 

    "మేము మాట్లాడుకున్నదంతా విన్నావా?" ఖంగారుగా అడిగాడు.

 

    "విన్నాను. అందుకే క్షమించాలన్నాను."

 

    "ఆల్ రైట్! విన్నదంతా మరిచిపో!"

 

    "నావల్ల కాదేమో?"

 

    "అంటే?"

 

    "దేవుడు కరుణామయుడు సర్! వెదకబోయే తీగల్ని ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తుంటాడు. ఇప్పుడు మీరే నాకు తీగ! మర్యాదగానే చెప్పినట్టు అద్దెకు దిగుతారా! లేదా?"

 

    "ఊ? లేకపోతే?"

 

    "మీరు మాటాడుకొన్న మేటరు యావత్తూ అయ్యగారి చెవినేస్తాను. ఆ దరిమిలా మీరు ఈ ఇంట్లో అడుగుపెట్టే హక్కు పూర్తిగా పోగొట్టుకుంటారు. అంచేత ఏదో ఒకటి అర్జంటుగా తేల్చిపారేయండి!" అన్నాడు శాస్త్రి గంభీరంగా.

 

    కృష్ణమూర్తి శాస్త్రి చేతులు గబుక్కున పుచ్చుకున్నాడు.

    
                                         19


    శాస్త్రి చూపించిన ఇల్లు సౌకర్యంగానే వుంది.

 

    కృష్ణమూర్తి కిటికీ ఎక్కి కూచున్నాడు. సుబ్బారావు పిల్లలు ముగ్గురూ బిక్కుబిక్కుమంటూ ఆ వాటాలోకి వచ్చారు.

 

    కిటికీ ఎక్కి కూచున్న కృష్ణమూర్తిని చూస్తూ-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS