వసుంధరకు విషయం పూర్తిగా అర్ధమయింది. కానీ పరిష్కారమే అయోమయంగా వుంది.
కుమార్తెను ఓదార్చింది. ఇంతలో నాలుగేళ్ల వంశీ ఎగురుకుంటూ చచ్చాడు.
వచ్చేరాగానే__
"అక్కా నాకేం తెచ్చావ్?" అంటూ అడిగాడు.
తర్వాత అక్క ముఖంలోకి చూశాడు. అతని లేత మనసుకు అర్ధంకాని సారోఫుల్ మూడ్స్- తమ్ముడ్ని చూసి కన్నీరు తుడుచుకుంటూ తన బ్యాగ్ లోంచి తీసిన బిస్కట్ ప్యాకెట్...అన్నీ గమనించి తల్లివైపుకి తిరిగి-
"అమ్మా! ఎందుకే అక్క అలా వుంది? నాకు అక్క బిస్కత్తు విస్తది. తింటాను. నువ్వూ అక్కకు కావాల్సింది యివ్వమ్మా! అక్క ఏడుపు పోతుంది."
అతని మాటల్లో అతనికే అర్ధం తెలీకపోయినా ఏదో తమకిప్పటి వరకూ అర్ధంకాని పరిష్కారం మాత్రం ఒకటి లీలగా ధ్వనించింది.
'అక్కకు కావాల్సింది తనిస్తే....అక్క ఏడ్పు పోతుంది. అవును- ఆ ఏడ్పు నిజంగానే పోతుంది.
ఇప్పుడు తన కుమార్తెకు గర్భసంచి అరువిచ్చే స్త్రీ కావాలి. ఆ అరువు తనే ఎందుకివ్వగూడదు? తన గీతిక ఎవరినో ఎందుకు ప్రాధేయపడాలి? వారడిగినంత మనీ ఎందుకివ్వాలి.
తనింకా బిడ్డల్ని కనగలదు. నాలుగేళ్ళక్రితమే- తను గీతికకు వివాహం చేశాకే మరలా తనకు గర్భం వచ్చింది. తనకు గర్భధారణ- అంత గాప్ తరువాత రావడం తనకు ఓ రకమైన సిగ్గుకు దారితీసినా తన భర్త ప్రోత్సహించాడు.
వాడ్ని కన్న తర్వాతే తను ఆయన్ను పోగొట్టుకుంది. అదో దురదృష్టకర సంఘటన.
ప్రభుత్వం వారు ఫుడ్స్ స్టోర్ చేసే గోడౌన్స్ లో ఆయనకు ఉద్యోగము. ఒకరోజు హెవీ వెహికల్ కు సరకుఎత్తి- పైన మోకుతో ఎలా బిగించాలో అక్కడి వర్కర్స్ కి చెపుతూ పట్టుతప్పి క్రింద పడ్డాడు. అలా పడటంతో ఆయన వెన్నుపూస దెబ్బతింది. ఫలితంగా కాళ్ళూ-చేతులూ చచ్చుపడ్డాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ కూడా చేసేరు. ఫలితం కనపడలేదు. మూడు నెలలు బెడ్ మీదే వుండి చివరికి తమ దగ్గర శాశ్వత సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.
ప్రభుత్వం వెంటనే తనకు ఆయన పోయిన నష్టాన్ని ఆర్ధికంగా పూరించింది. అవే గోడౌన్స్ లో తనకు అటెండరు పోస్టు యిచ్చారు. ఆఫీసులో ఫైల్స్ అటూ, ఇటూ తిప్పటం తప్ప వేరే పనిలేదు.
ఇప్పుడు తానీ పనికి అంగీకరిస్తే....
ఆఫీసుకు సెలవు పెట్టాలి. ఏమని పెట్టాలి! ఇలా నా కుమార్తె తరపుగా ఆమెకోసం గర్భందాల్చి కంటున్నాననా? అందరూ తనవంక వింతగా చూస్తారు. ఏవేవో అర్ధంకాకుండా భావగర్భితంగా మాట్లాడతారు.
వెనుక మరోరకంగా చెప్పుకుంటారు. వీరికి విషయం తెలీకుండా జాగ్రత్తపడాలి.
అయినప్పుడు ఆఫీసుకు పూర్తిగా ఆరునెలలపాటు సెలవు! అదీ జీతనష్టం మీద. అనారోగ్యంతో అంటే తనకు ఏ డాక్టరూ పరిశీలించాకుండా సర్టిఫికేట్ ఇవ్వడు. కంపెనీలో అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ వుంటాయి.
వసుంధర బ్రెయిన్ తీవ్రంగా ఆలోచించటం మొదలెట్టింది.
ఆ సమయంలో తనీ పరిసరాల్లోనే వుండగూడదు. వుంటే చుట్టూ వున్న జనం సమస్య! భర్త లేకుండా ఈమెకు ఈ కడుపు బరువేమిటి? ఈమె చెప్పేకథలో నిజమెంత?
కనుక వేరేచోటుకి వెళ్ళాలి. మరి వంశీ! వాడికీ ఊహ తెలుస్తుంది. నాన్న లేకుండా గర్భం అనే విషయంలో అర్ధం ఇప్పుడు వాడికి తెలీక పోవచ్చు.
రేపు వాడు ఎదిగాక తండ్రి మరణానికీ, తల్లి గర్భానికీ గాప్ అర్ధమవుతుంది. అప్పుడు తననో రకంగా చూస్తాడు.
ప్రస్తుతం నో ప్రాబ్లమ్!
తను కన్న తర్వాత ఒక చెల్లి పుట్టిందనుకుంటాడు. లేదా ఓ తమ్ముడు. తరువతః ఆ బిడ్డ ఏదీ అంటూ అడుగుతాడు. తన కుమార్తెకిస్తుంది గనుక మెల్లిగా వాడికి ఆ బిడ్డ చనిపోయిందని చెప్పవచ్చు!
కనుక ఈ ఆరునెలలూ వాడిని దూరంగా వుంచితే?
తనెక్కడికి వెళ్ళాలి? వాడినెక్కడ వుంచాలి?
ఇప్పుడు తనంటున్న ఏరియానుండి ఏ సిటీలో మకాం మార్చాలి.
కుమార్తె కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? విషయం తను అంగీకరిస్తే, ఆ తరువాత ఏర్పాట్లన్నీ అల్లుడే చూసుకుంటాడు.
వసుంధర గట్టిగా అనుకుంది.
ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనుతిరగగూడదు. కుమార్తెకు ఆశలు కల్పించాక నలుగురూ ఏమయినా అనుకుంటారని అధైర్యపడగూడదు.
ఇందులో తప్పేం వుండదు.
కుమార్తె అండంతో అల్లుడి వీర్యకణాల్ని సంయోగం చేశాకే టెస్ట్ ట్యూబ్ లోంచి తీసి తన గర్భంలో వుంచుతారు. తను ఆ బుల్లి కణ సమ్మేళనానికి రక్తం యిస్తుంది. అది పెరిగి పెద్దదవుతుంది. డాక్టర్స్ జాగ్రత్తగా తీసి తన కుమార్తె చేతిలో పెడతారు.
ఒకటికి పదిసార్లు విషయాన్ని అన్నివైపులనుండీ వసుంధర బేరీజు వేసుకుంది.
కుమార్తె దగ్గరగా వచ్చి__
"గీతికా! ఎవరినో ఎందుకు మనం అడగాలి? నేను ఖాళీగానే వున్నానుకదా? నాకు పెద్దగా వయసుమీద పడలేదు గనుక....ఆ అవకాశాన్ని క్రియేట్ చేస్తే గర్భందాల్చే వయసే గనుక- దీనికి నేనంగీకరిస్తున్నాను. విషయం అల్లుడికిచెప్పి అన్ని ఏర్పాట్లు చేయి."
తల్లి నిర్ణయం విని గీతిక కొంచెం షాక్ తింది.
"అమ్మా! నీ నిర్ణయాన్ని నలుగురూ నాలుగు రకాలుగా చెప్పుకుంటారేమో..."
"చూడమ్మా! ఈ జనం అందరి చేతుల్లోనూ పూలు వుండవు. రాళ్ళు వున్నవాళ్ళే ఎక్కువ.
అభినందించి పూవును అందించటంకంటే, ఆటగా రాయిని విసరటానికే వీరు ఆరాటపడతారు.
పది రాళ్ళు పడనీ! అప్పుడు మాత్రమే ఒక పూవు చేతికొస్తుంది. అయినా ఇందులో తప్పేముంది? నీకు ఒక విషయం గుర్తుందో లేదో?
మనకు అప్పట్లో కోళ్ళు వుండేవి. ఒకటి నిత్యం గుడ్లను పెడుతుండేది. పొదుగుకు వచ్చేదికాదు. అది పెట్టిన గుడ్లను కూడా మనం వేరేకోడి పొడుు పెట్టింది.
గీతిక అందుకు అంగీకరించింది.
* * * *
మధుకి విషయం తెలిసి అత్తగారి నిర్ణయానికి కాస్త ఆశ్చర్యపోయినా, తనకీమధ్య పిల్లలమీద ఏర్పడే ఒక ఆసక్తికి అంగీకరించాడు.
ఆమె కోరిన విధంగానే వంశీని ఓ పబ్లిక్ స్కూల్లో జేర్పించాడు. హాస్టల్ వసతి వుంది.
వారం వారం వసుంధర కొన్నాళ్ళపాటు వెళ్ళి అతన్ని చూసి వస్తుండాలి. చివరిరోజుల్లో వంశీకి తామే కనిపిస్తూ ఆమె డెలివరీ అయ్యేవరకూ జాగ్రత్తపడాలి. అమ్మ ఏదని అడిగితే వస్తుందని కబుర్లు చెప్పాలి.
తమకు బిడ్డనిచ్చాక- అత్తగారు తిరిగి తన ఉద్యోగంలో చేరిపోతుంది. తనకెటు తిరిగీ ఉద్యోగమూ, నివాసానికి అపార్ట్ మెంటూ అన్నీ భాగ్యనగరంలోనే గనుక తాము ఆమెకు దూరంగా వుండిపోతారు.
ఎవరికీ ఏ విధమైన అనుమానమూ రాదు.
మధు తర్వాత చకచకా అన్ని ఏర్పాట్లూ చేయటం - వసుంధరకూ అల్లుడూ- కుమార్తెల జైగోట్'ను అమర్చటం...ఆమె గర్భం దాల్చటం- అందరూ ఆనందించటం- అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయింది.
అయితే మధుకి కోర్కె ప్రకారం మగపిల్లవాడు కలుగలేదు. అయినా అతనికి దిగుల్లేదు, తనకెవరయినా ఒకటే....బుల్లి అడుగుల్తో- బుల్లి బుల్లి మాటల్తో తనింటిలో తిరిగితే చాలు.
* * * *
అది జరిగి దగ్గర దగ్గరగా రెండు దశాబ్దాలకు పైనవుతుంది. వసుంధరకూ, అటు మధు, గీతికలకు గతం గుర్తుకువచ్చింది.
ఇప్పుడు తాము వూహించని పరిణామం తెలెత్తింది.
ఇదో సున్నితమయిన సమస్య.
వసుంధర మనసు గట్టిగా ఎదురుతిరిగింది.
ఈ ఇంటిలో ఒక అల్లుడ్ని మినహాయిస్తే తను ముగ్గుర్ని కంది.
కూతురినీ, కొడుకనీ తనే కంది.
కోడలుగా రాబోయే పిల్లనూ తనే కంది.
వంశీ పెరిగిన గర్భసంచిలోనే నళిని కూడా పెరిగింది. వంశీ పంచుకున్న రక్తాన్నే నళిని కూడా పంచుకుంది.
ఒక తల్లి రక్తాన్ని పంచుకున్న ఇరువురు- ఒక తల్లికన్న ఇరువురు- ఒక స్త్రీ మెట్రో నుండి ఉద్బవించిన ఇరువురు- ఇప్పుడు భర్తా, భార్య అయితే ఒక ఎథికల్ భావోద్వేగం తనను లాగి తన్నినట్టు, ఎక్కడో బాధ. అది ఒక తల్లి 'హిస్టరో' నరాలనుండి బ్రెయిన్ 'న్యూరాల్స్' వరకూ ఎవరో పట్టుకు పీకుతున్న బాధ!
మైగాడ్! ప్రపంచంలో ఏ స్త్రీ కూడా ఇలాంటి ఆవేదన అనుభవించి ఎరుగదు. తనే మొదటి స్త్రీ అవుతుందేమో!
దీన్ని ఎలా ఆమోదించటం! ఎలా భరించడం? ఇంతలో వంశీముందు కొచ్చి అన్నాడు.
"సరే....మీ అందరికీ ఎందుకు ఇష్టం లేదో....ఎందుకలా అయిపోయారో....మాకు అర్ధం కాదు. మాకు అర్ధమయింది ఒకటే- నళిని లేకుండా నేనూ, నేను లేకుండా నళిని బ్రతకలేమనే విషయం అర్ధమైంది" అనగానే నళిని ముందుకొచ్చి.
