Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 29

 

    చివరికి తోతుగా , వెనకగా పరిశీలిస్తే ఒకటే సంగతి తేలుతుంది ఎవరికైనా. మనుషుల మనసులో వుండే పోద్భాలాలన్నీ తరిచి చూడగా చూడగా అంతా sex పొద్భలమని తేలింది frwedకి, ఇంకా తరిస్తే యీ sex ప్రోద్భలమూ అసలు జీవనానికంతా మూలమాత్రమూ ఒక్కటేనని కనుక్కుంటారు. మనిషి మనసులకే కాదు యీ జంతువులు, ప్రాణులు చరాచరా లన్నింటికి కూడా.
    పశ్చిమ ఖండవాసులు యీ material భౌతిక మైన ప్లేన్ లో అన్వేషణ ప[ప్రారంభించి మొన్న మొన్ననే సైకాలజీని అందుకొన్నారు. హిందూదేశంలో డెకార్దువలె 'నేను' అనే మనోమాత్రతోప్రారంభించి బౌతికానికి దిగారు. Betranad Russel వ్రాశాడు.   యూరోపియన్ శాస్త్రజ్ఞులు physics తో గాక సైకాలజీతో వారి శాస్త్రవిజ్ఞానాన్ని ప్రారంభించినట్టయితే ఇంతకన్న చాలా ఎక్కువదూరం వెళ్ళగలిగి వుండేవారని. ఈస్ స్టిక్ రిలేటివిటీ సిద్దాంతాన్ని యింకా యెక్కువ అన్వయం చేసిన జర్మన్ శాస్త్రజ్ఞుడు platt యిప్పటికీ యీ అణువుల తత్వాన్ని మనుష్య ప్రోద్బలాలకి సమన్వయించాలని చూస్తున్నాడు. అణువు ప్రవర్తన నించి మనిషి ప్రవర్తనని నిర్ణయించాలని వాళ్ళూ, మనిషి ప్రవర్తననించి అణువు ప్రవర్తనని నిర్ణయించాలని వీళ్ళూ.
    మనిషిలో అతనికీ తెలియక అణిగి వుండే శత్రువుల సంగతి మాట్లాడుతో టీ బల్లదగ్గిర పెద్దమ్మాయిగారితో చెప్పాను కొల్లేరు మీది వేట సంగతి. ఏదయినా ఆమెతో చెప్పడం చాలా సరదా. ఆమె ఎంత శాంతంగా  మాట్లాడతారో అంత శాంతంగానూ వింటారు. అది ఆమె స్వభావం. చాలామందిలో అది Art(ఆర్టు) చక్కగా , తెలివిగా, ధైర్యంగా ఏ అభిప్రాయన్నైనా విని చర్చించి  'డైజేస్టు' చేసుకోడానికి ప్రయత్నించే సామర్ధ్యం గల కొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరు. నా మాటలు విని కొంచెం ఆలోచించేవారామె.
    "చూడండి. ఆ వేటవుత్సాహం ఆ చంపేదాహం నాలో వున్నదని ఎన్నడూ అనుకోలేదు. ఉన్నదని ఎవరన్నా అంటే మండి పడి వుంటాను -- నీళ్ళలో కొట్టుకుపొయ్యే చీమల్ని కష్టపడి పైకి తీసే నెను౧ కాని ఆనాడు తెలిసింది. మరి ఎన్ని పొరలకింది, ఎన్ని తరాల నించి, ఏ పురాతన పూర్వలనించి నా రక్తంలో అణిగి వున్నదో, నన్ను నేను controle కన్ ట్రోలు చేసుకోలేక పోయినాను. sex ఎంత inevitable ఇన్ విటబుల్  గా పోత్సహిస్తుందో అంత ప్రళయం మల్లనే నన్ను ఆడించేసింది ఆ వేట శక్తి. నాకు తెలుసు. నన్ను చూసి నేనే ఆశ్చర్యపడుతున్నాను. కాని ఆ కోర్కెని అణుచుకోలేకపోయినాను. ఆ రక్తదాహాన్ని!" అన్నాను.
    మల్లిక్ మామయ్య చిరతపులి పిల్లని పెంచుతున్నాడు. అంత సాధువుగా వుండే ఆ పులి పిల్ల రక్తాన్ని చూసిందా కొట్టే స్తుందిట పంజాలతో. మానవుడూ అంతే. అంతమాత్రం గట్టి ప్రోద్భలాలు instinots లేని మానవుడు శవమాత్రుడు.
    "నాకు కోపం లేదండి."
    "ఏదో నా సంగతి నాకే కాని...."
    "నేను ఏక పత్నీవ్రతున్ని"
    "నా కోర్కెల్ని నేను అణుచుకోగలను."
    "దెబ్బలాటంటే భయం."
    ఇట్లాంటివి గొప్ప బడాయిగా చెప్పుకొంటో వుంటారు. వెంటనే అంత చచ్చు పీనిగలా అనిపిస్తుంది. కులాలలో కులాల ఇంటర్ బ్రీడింగ్ inter breeding చేసి ఇట్లాంటి చచ్చు టైప్సుని సిద్దం చేసి పెట్టారు. మనదేశానికి --- అనుకుంటాను.
    కోపం, కామం వాంఛ (ambition)చురుకుతనం ఇవన్నీ వుండాలి. పాలించుకుని కట్టేసుకోగల శక్తి వుండాలి. శాపం యివ్వగల శక్తీ  దాన్నీ అనుగ్రహించగల శక్తీ వుండేది అంటారు. రుషులాకిం చచ్చుపీనిగల శుష్కవేదాంత బొర్రమొద్దులు కాదు వాళ్ళు.
    "రక్తం చూస్తె నా కళ్ళు తిరుగుతాయండి."
    "ఎవరన్నా ఏడిస్తే చూడలేను."
    'చాలా జాలిగుండె నాది."
    పోయి చావరాదూ?
    బలహీనత్వాలు, నెప్పులూ, రోగాలూ, చికాకులూ, దుఖాలూ అన్నీ గొప్ప సుగుణాల్లాగ యితరుల సానుభూతికి Exhibit  చేసి పైకి చూపుకోడం బడాయిగా అలవాటయింది యీ దేశం ప్రజలకి. సంతోషంగా వుత్సాహంగా ఉన్నవాణ్ణి , గట్టిగా నిర్లక్ష్యంగా నడిచేవాణ్ణి , ఎంత అయిష్టంగా వున్నపనినైనా చేసేసి దులుపుకు తిరిగేవాణ్ణి భరించలేరు ప్రజలు. నన్ను ద్వేషించి నామీద రిపోర్టులు చేసిన అధికారులు జ్ఞాపకం వొస్తున్నారు. ఎంత యేడిస్తే అంత ఇష్టం యీ లోకానికి.
    "ఎట్లా వున్నారు? అంతా క్షేమమా?" అని అడుగుతుంటారు ఒకరి నొకరు.
    ఎవరో వకరు గాని "అంతా క్షేమమే మీ దయవల్ల" అనరు. ఏదో ఒక రోదన పెడుతోనే వుంటారు.
    ఒకవేళ క్షేమంగా ఉన్నామంటే అర్ధమేమిటంటే బతికే వున్నామన్నమాట. కాని కంఠస్వరంమాత్రం "చచ్చామండి" అన్నట్టుంటుంది. భాష తెలీనివాడు వింటే , "నాశనమైనా మండి" అన్నట్టు వినపడుతుంది. రోడ్డు మీద పొయ్యే మొహాలు చూస్తోవుంటే అంతా నిర్జీవమే అంతా విచారమే, జడత్వమే. ఈ దేశమే యిట్లానా? ఈ నిరంతర రాజకీయ సాంఘిక ఆర్ధిక పొరతంత్రం యిట్లా చేసిందా మనుషుల్ని!
    "ఈ దయాపరులు , రక్తం చూస్తె భరించలేని బ్రాహ్మలు వీళ్ళందరిలోనూ, యెంతెంత క్రూరత్వం దాక్కుని వుందంటారు? ఆ వేటకోర్కిని తీర్చుకోక, దాచుకొని, ఉన్నదని కూడా తెలీక, పిట్టల మీద, మృగాల మీద చూపని ఆ క్రార్యాన్ని, మనుషుల మీదా, కోర్టులలో, ఆఫీసుల్లో, యిళ్ళలో తీర్చుకుంటారు కక్షలుకట్టి. మృగాల బదులు మనుషుల్ని, ధనాన్ని పదవుల్ని వేటాడుతున్నారు. పిల్లల మీద, భార్య మీద, నౌకర్ల మీద చూపుతారు. కసి, వీళ్ళందరూ శాకాహరులే , భూతదయాపరులే!" అన్నాను.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS