Previous Page Next Page 
పావని పేజి 26


    "అట్లనే బాగున్నది అట్లనే బాగున్నది" అన్నారు చాలామంది కొందరు గొణిగారు.
    "తాతా! ఆ కాయిదాల్ల మన బూములున్నయంటివి, అయ్యిపోతే మన బూములు మనకొస్తయా?" మల్లమ్మ అడిగింది.
    "పిచ్చిదానా! కాయితా లెట్లపోతయే పోతే మనకే వస్తయి బూములు రాకే మయితయి?" ధర్మయ్య చేతులు ఊపుకుంటూ చెప్పాడు.
    "తాతా! నేనొక్కమాట చెప్పుత, ఇంటవా?" బ్రహ్మయ్య అడిగాడు.
    "గీ తాగుడే మనను అప్పులపాలు చేసే, ఇల్లు గుల్లాచేసే, వల్లు గుల్లాచేసే శివయ్యకేమో పైసనిండుతాండే తాగుడు బంద్ చేస్తే మంచిది కాదే - శివయ్య మీద ఇంకొక దెబ్బ పడ్తది"
    "బంద్! ఇగ తాగెడిది లేదు, మా అమ్మమీద వట్టు" పెంటయ్య అన్నాడు        "దొరమీద దెబ్బ పడ్తదంటే నేను సుత బంద్!" వెంకడు దీక్ష పూనాడు.
    "అట్లనే కానియిరి, ఎవరం తాగం" - అందరూ గునిశారు.
    శవం లేచింది మల్లి గొల్లుమంది పెంటయ్య నోట్లో గుడ్డపెట్టుకుని ముందు నడిచాడు కొమరయ్య, బ్రహ్మయ్య కూడా పాడె పట్టారు పావని వారి వెంట సాగింది డప్పులు లేవు, చప్పుళ్ళు లేవు, మౌనంగా ప్రశాంతంగా సాగిపోయింది శవయాత్ర.
    
                             15
    
    బావి దగ్గర బకెట్లో నీళ్ళుపెట్టింది మల్లమ్మ, పీటవేసింది, కచ్చికా, చెంబూ అక్కడ పెట్టింది మరో బకెట్టులోకి నీళ్ళుతోడి వాకిట్లోకి వెళ్ళింది, కళ్ళాపి చల్లడానికి.
    మల్లమ్మతల్లి చచ్చిపోయింది అయినా గూడెంలో ఉండలేదు ఆ రాత్రే శివయ్య ఇంటికి వచ్చేసింది ఆమె దొంగతనంగా వెళ్ళింది చెప్పివెళ్ళలేదు చెపితే పోనియ్యదు సుభద్రమ్మ ఆ మాట మల్లమ్మకు తెలుసు అందుకే చెప్పకుండా వెళ్ళింది అంతేకాదు, తల్లికి గంజికాచి పోద్దామని పిడికెడు నూకలు తీసుకుని బయల్దేరింది ఎంతకాదన్నా అది దొంగతనమే దొరసాన్ని అడిగి తీసికెళ్ళలేదు అడుగుతే దొరసాని పెట్టదు చచ్చేదానికి గంజెందుకు? గంజిపోస్తే బతుకుతుందా? అంటుంది దొరసాని అందుకే చెప్పకుండా తీసికెళ్ళింది నర్సిమ్మ పట్టుకున్నాడు నూకలు దక్కలేదు, నేలపాలయినాడు తల్లి దక్కలేదు, మట్టిపాలయింది.
    తల్లి పుల్లమ్మ కనీసం గంజినీళ్ళు లేక చచ్చింది తాను గంజి పోయలేకపోయింది తమ్ముడు పెంటడు తల్లికి బాగలేదని చావుబతుకుల్లో ఉందని పనికిరాలేదు పనికి రాకుంటే గింజలివ్వడు దొర దొర పనికి జీతం లేదు జీతం అనేది వడ్డీకింద పోతుంది పనికి ఇచ్చే గింజలు అప్పుకింద పెరుగుతుంటాయి మూడు రోజులనుంచి గింజల్లేవు ఉపాసాలతో చస్తున్నారు తల్లి గంజన్నా తాగి చస్తానంటూంది ఆ పరిస్థితిలో పిడికెడు నూకలు ఎత్తుకెళ్ళింది మల్లమ్మ మల్లమ్మ గింజలెత్తుకు పోయింది ఫలితం దక్కలేదు, పట్టుబడ్డది.
    మల్లమ్మ గుండెలో దుఃఖం దావానలంలా మండుతూంది ఆమెను కుంగ దీస్తూంది తల్లి చచ్చిపోయింది గంజిసైతం గొంతులో పడకుండా ప్రాణాలు వదిలింది తల్లి పోయిందనే దుఃఖం, గంజిసైతం పోయలేకపోయానే అనే బాధ దొంగగా పట్టుబడ్డానే అనె భయం - మల్లమ్మ గుండె గుబగుబలాడుతూందికాళ్ళూ చేతులూ కదలడంలేదు ఇలాంటి బతుకు ఎందుకు బతుకుతూందో అర్ధం కావడంలేదు కాచ్చినా సుఖమే చావు బానిసత్వం కంటే సుఖమైంది! మల్లమ్మ చచ్చిపోయేదే ఆమెకేదో మిణుకు మిణుకుమనే ఆశ ఉంది పట్నం పోయిన పరమయ్యా వస్తాడు తనను విడిపిస్తాడు అదీ ఆశ సీత కూడా అలాంటి ఆశతోనే బతికింది రావణుడు పెట్టిన చెరలన్నీ అనుభవించింది ఆశ ఆలంబనంగా జీవించింది సీత అదే ఆశ ఆలంబనంగా జీవిస్తూంది మల్లమ్మ ప్రేమకు అలాంటి బలం ఉంది అది బాధలను భరింపచేయగలదు త్యాగాలను చేయించగలదు.
    మల్లమ్మ నీరసంగా ఉంది భరించరాని దుఃఖంతో క్రుంగిపోతూంది, అయినా, ఆమె పని చేస్తూనే ఉంది చాకిరి చేస్తూనే ఉంది బకెట్టులోని నీళ్ళలో పేడ కలుపుతూంది బల్లెం పట్టుకున్న నర్సిమ్మ కనిపించాడు అతడు లోన అడుగుపెట్టాడు మల్లమ్మ చూచింది నర్సిమ్మ యమభటునిలా కనిపించాడు అతనిచేతిలో యమపాశం కనిపించింది. మల్లమ్మ ఆపాదమస్తకం గజగజలాడిపోయింది.
    నర్సిమ్మ మల్లమ్మను చూచాడు అతని చూపుల్లో మంటలున్నాయి కంట కాలున్నాయి కంటకాలు మల్లమ్మ వంటిని గుచ్చుకుంటున్నాయి మంటలు ఆమెను కాలుస్తున్నాయి ఇదివరకే ఆమె కాలుతూంది నర్సిమ్మ ఆమెను మంట పెడుతున్నాడు మల్లమ్మ గ్రహించింది రాగల పరిణామాలని ఊహించింది.
    "అన్నా! కాలుమొక్త బాంచనయిత, ఆ సంగతి చెప్పకు నీ కడుపునా పుడ్త అవ్వ చచ్చింది నన్నిడిచి పోయింది నన్ను పొట్టల పెట్టుకో ఇన్ననా?" మల్లమ్మ బ్రతిమాలింది ఆమె మాటలకు రాళ్ళు కరగాల్సింది నర్సిమ్మ రాయి కాదు, అతను కరగలేదు.
    నర్సిమ్మ వికటంగా నవ్వాడు కామం కన్నుకాననీయదు, మల్లమ్మకోసం చాల కాలంగా వల పన్నుతున్నాడు, మల్లమ్మ లొంగడం లేదు రాత్రి దొరికింది, జారిపోయింది, ఇప్పుడు ఇలా బతిమలడుతూంది, అతను కరగలేదు, లొంగదీసుకోవాలనుకున్నాడు.
    "నువ్వంటే చచ్చిపోతున్ననే, ఒక్క పాలి, రాత్రికొస్త కాదనకు, ఎరిక కానియ్య, ఇన్నవా?" అతని కళ్ళల్లో కామం బుసలు కొడ్తున్నది.
    మల్లమ్మ తలవంచుకుంది, నీళ్ళలో పెడ కలుపుతూంది.
    "అన్నా!" అన్నది ఇహ ఏమీ అనలేకపోయింది ఆమెలో దుఃఖం పొంగుతూంది, కన్నీరు టపటపరాలింది.
    "అంతేనంటావా? ఇగ తెల్లారెటార్కల్ల నువ్వు బతుకుతే చూస్త" అని చెరచెర నడిచిపోయాడు నర్సిమ్మ వెళ్ళిపోతున్న నర్సిమ్మను చూస్తుంటే సమీపిస్తున్న యమునిలా కనిపించాడు మల్లమ్మకు.
    మల్లమ్మ పరిణామాలు ఊహించుకుంది, వణికిపోయింది. ఏదో ఆలోచనలో మునిగిపోయింది, పరిణామాలకు లొంగి ఊరుకోవడం నిన్నటిస్థితి, అందుగురించి ఆలోచించడం ఈనాటి స్థితి ఆలోచించడం వస్తేచాలు, అదే మార్గాలు చూపిస్తూంది మల్లమ్మ ఆలోచిస్తూంది - ఆలోచిస్తూంది ఆమెకు ఏదో తట్టింది ఒక చిరునవ్వు నవ్వుకుంది ఆ చిరునవ్వు వెలుగుకు చీకట్లు పటాపంచలయినాయి ఆమె చెంబుతో నీళ్ళు తీసుకుని చల్లింది.
    నర్సిమ్మ దొడ్లోకి వెళ్ళాడు సుభద్రమ్మ కచ్సికతో పళ్ళుతోముతూంది పీటమీద కూర్చుంది ఠీవిగా ఉంది.
    "దండం పెడ్త, బాంచెను" - నర్సిమ్మ అన్నాడు.
    "ఏందిర నర్సిమ్మా! పొద్గాలనే వచ్చినావు"
    "దొర్సానీ! మీరు నిద్రపోతుండిరి ఇల్లంతా లూటీ అయితాంది ఎవరు చూస్తలేరు నా కండ్ల ముంగల ఇల్లు గుల్లయితాంటే ఎట్ల చూస్తుండమంటరు?"
    "ఏందిర, ఏమైందో చెప్పరాదు ఊరికే గునుగుతవు"
    "ఏం చెప్పమంటరు, బాంచెను గామల్లి మీ ఇల్లంతా దోచుకుంటాంది"
    "ఏంది, మల్లి దోచుకుంటుందా? ఇల్లంత దానికే వప్పచెప్పిన, లేకిముండ అనుకుంటనే ఉన్న మదం పట్టింది దానికి మిండనికి పెట్తాందా?"
    నర్సిమ్మకు మరో పాయింటు దొరికింది మల్లమ్మకు బ్రహ్మయ్యకు అంట కడ్దామనుకున్నాడు బ్రహ్మయ్య పెళ్ళాం జబ్బుగా ఉంది చక్కగా అతుకుతుంది అనుకున్నాడు కాని, తనకు దక్కాల్సిన మల్లమ్మను బ్రహ్మయ్యకు అంటగట్టడం ఎందుకో నచ్చలేదు నర్సిమ్మకు.
    "మిండడెవడో ఎరికలేదు బాంచను- గని కుండెడు బియ్యం పట్కపోతుంటే  చూచిన, పట్టుకున్న బియ్యం పారబోసింది పారిపోయింది, కాల్మొక్త ఇట్ల ఎన్ని తీస్కపోయిందో-ఇంకెన్ని తీస్కపోతదో - చూసుకోండి బాంచను, ఈ ఇంటి ఉప్పు తింటున్న"
    "ఏందిర! బియ్యం తీస్కపోయినాది -బాడ్కపు లంజముండ దాని పానం తీయిస్తచూడు" అని గబుక్కున లేచి ఉర్కింది కచ్చిక చేతిలోనే ఆమె విసురుకు నీళ్ళచెంబు పడి నీళ్ళు వలికిపోయాయి.
    "ఏమండీ, ఇన్నారా!" భర్తను కదిపి లేపింది బొగ్గు భుజానికి అంటుతూందని కూడా గమనించలేదు.
    "ఏందే! అట్ల లేపుతవు?"
    "అయ్యో, కొంప మునిగిపోతుంటే అట్ల నిద్రపోతున్నారేముండి?"
    "ఏమైందే? ఎందుకు మునుగుతాంది, రాత్రేమన్నా వాన బడ్డదా?"
    "వాన కాదు - వల్లకాడు కాదు మల్లి ఇల్లు దోచుకుపోయింది రాత్రి ఉన్నదో ఉరికిపోయిందో ఎరకలే ఇల్లంతా గుల్ల అయింది"
    "ఏదా లంజముండ - ఏం చేసింది?" ఇల్లు నిజంగానే గుల్ల అయినట్లు ఉలిక్కిపడి లేచాడు శివయ్య "యాడున్నది లంజముండ" అని, "మల్లీ" అని కేక పెట్టాడు.
    శివయ్య కేకకు ఇంట్లోని పిట్టలు భయపడి ఎగిరి, దారికానక పోట్లాడుకోసాగేయి  .


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS