Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 25


    "వీడిని అక్కడ వదిలేసి వాడిని తీసుకు రమ్మంటారా సార్" అని కానిస్టేబుల్ అడిగాడు.


    వెంటనే ఆ కానిస్టేబుల్ మీద ఇంతెత్తున ఎగిరి "ఈ స్టేషన్ లో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ నువ్వా? నేనా? ఇంటరాగేషన్ ఎవర్ని చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో నేను చెబుతాను. అప్పుడు నువ్వు చేద్దువుగాని, మైండిట్" అంటూ అరిచాడు. ఆ దెబ్బతో ఆ కానిస్టేబుల్ మహాశయుడు నోరు మూసుకుని నన్నిక్కడ వదిలి వెళ్ళాడు.


    "ఇదీ భాయ్ జరిగింది" అంటూ రామ్ సింగు జరిగినదంతా చెప్పాడు.


    "తెలివిగల పనిచేశావ్ బ్రదర్! నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తున్నది" అంటూ రామ్ సింగ్ ని భుజంతట్టి అభినందించాను.


    పావుగంట తరువాత,


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఇంటికి కాబోలు వెళ్ళాడు. కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటూ వుంటే ఈ విషయం తెలుసుకోగలిగాను. నేనూ, రామ్ సింగూ నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉండగా చెవిటి కానిస్టేబుల్ కనకలింగం మా సెల్ దగ్గరికి వచ్చాడు. వాడు కుడి చెవి మా వేపుపెట్టి మాతో హస్కు వేసుకున్నాడు. కనకలింగం మాటలని బట్టి ఏమీ తోచక కాలక్షేపానికి మాతో మాటాడుతున్నట్లు గ్రహించాను.


    ఇదేసందు, అదే సందు అన్న సామెత నాకు బాగా గుర్తుంది. నెమ్మదిగా కనకలింగంని మాటలో పెట్టి ఉబ్బేసి_


    "మీ అందరి మీదకన్నా ఇన్ స్పెక్టర్ గారికి అహోబిలం గారంటే చాలా ఇష్టంలాగా వుంది. ఆయన ఈయనకి చుట్టమా?" అని అడిగాడు.


    "చుట్టమా పాడా. మా ఇన్ స్పెక్టర్ గారు అహోబిలం కలసి కొన్ని కేసుల్లో మారువేషాలు వేశారు. అలా మారువేషాలు వెయ్యటం వల్ల అసలు కేసేమోగాని కొసరి కేసులు చాలా తగిలాయి. వాటిని పట్టుకోవటం జరిగింది. మారువేషం వేద్దామనే ఐడియా ఒకానొకనాడు అహోబిలం ఇచ్చాడుట. అదేదో గొప్ప విషయం అయినట్లు అహోబిలమే అప్పుడప్పుడు చెప్పుకుంటూ వుంటాడు. ఇన్ స్పెక్టర్ గారు అడగాలేగాని ఇంతోటి ఐడియాలు సవాలక్ష నేనూ ఇవ్వగలను. వాళ్ళిద్దరూ చాలా ఏళ్లబట్టి కలిసి పనిచేశారు. మేము కొద్దికాలం క్రితం క్రొత్తగా వచ్చినవాళ్ళం..." అంటూ తన అక్కసునంతా వెళ్ళబోసుకున్నాడు కానిస్టేబుల్ కనకలింగం.


    దాంతో_


    నాకు ఒక ముఖ్య విషయం తెలిసింది. ఇన్ స్పెక్టర్ వర్ధనరావు కానిస్టేబుల్ అహోబిలం అవసరం వచ్చినపుడు మారువేషాలు వేసుకుని తిరుగుతారూ అని. ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది ఇదీ ఒకటనీ అప్పటికప్పుడే నేను నిర్థారణ చేసుకున్నాను.


    సానుభూతిగా మాటాడుతూ మరికొన్ని మాటలు రాబట్టాను కానిస్టేబుల్ నుంచి.


    మేము దొంగలమనే అభిప్రాయం అక్కడ ఎవరికీ పూర్తిగా లేనందువల్ల ఇలాంటి కొన్ని మంచి ఛాన్స్ లు నాకు తగులుతున్నాయి. ఉత్తరోత్రా ఇదే నాకు చాలా ఉపయోగపడొచ్చు. ఒకటి ప్రయోజనం ఆశించి, రెండు కాలక్షేపం గానూ కబుర్లు కొనసాగించాను.


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు తిరిగివచ్చినట్లున్నాడు. మరో కానిస్టేబుల్ ఏడేడు కొండలు వచ్చి హెచ్చరించి వెళ్ళిపోయాడు.


    కనకలింగం ఆదరా బాదరా అవతలకి వెళ్ళిపోయాడు.


    మహానుభావుడు ఏ మూడులో ఉన్నాడో నన్నిప్పుడు పిలిచి ఇంటరాగేషన్ చేస్తాడో లేక తరువాత చేస్తాడో, అనుకుంటూ వుండంగానే ఇన్ స్పెక్టర్ వర్ధనరావు దగ్గరనుంచీ నాకు పిలుపు వచ్చింది.


    నేను లేచి కానిస్టేబుల్ అహోబిలం వెంట బయలుదేరాను.


                                       12


    ఆ సమయంలో,


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ముఖం తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంవల్ల బిగుసుకుపోయినట్లుగా ఉంది. కావాలని ముఖం అలా పెట్టడం వల్ల నిక్క నీలుక్కు పోయినట్లు, బిర్ర బిగుసుకు పోయినట్లు, చాలా తమాషాగా చూడంగానే ముఖాన్నే నవ్వాలనిపించేటట్లు ఉంది.


    ఈ సమయంలో నేను నవ్వకూడదు. నవ్వటమంటూ జరిగితే చమ్లాలు వూడదీస్తాడు. అందుకని వస్తున్న నవ్వుని బలవంతాన ఆపుకొని ముఖంలో అమాయకత్వం తెచ్చిపెట్టుకుని భయం భయంగా చూస్తూ చాలా వినయంగా నమస్కారం పెట్టాను.


    "ఊఁ ఎలా వుంది?" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు గర్జించినట్లుగా అన్నాడు. కానీ అది గర్జించినట్లు లేకపోగా కుక్కపిల్ల కుయ్యో అన్నట్లుగా వినిపించింది.


    బహుశా ఆయన నన్ను అడిగింది పోలీసు భాషలో చెప్పాలంటే "వళ్ళెలావుందీ?" అని.


    "కానీ, నేను అదేమీ గ్రహించనట్లు_


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS