Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 25


    మొట్టమొదటిసారి తనచేతులు గౌతమి నడుం చుట్టేస్తుంటే... పెళ్ళికాకుండా తొందర పడడం తప్పంటూ, భయంగా వద్దు... వద్దంటూ... తన కౌగిలిలో పువ్వులా వదిగిపోయి, గువ్వలా తేలిపోతున్న సమయంలో-

 

    "ఏంపర్వాలేదంటూ" అందమైన గౌతమి వంటిమీదున్న పువ్వుల చీరని నెమ్మదిగా పక్కకు తీసి పడేశాడు. తెల్లటి వెన్నెల్లో డాబామీద మెత్తని పరుపుమీద నిప్పు వేడికి నిలువునా సుడులు తిరిగిపోతున్న నాగుపాములా ఉంది గౌతమి.

 

    సిగ్గుతో చిదిగిపోతూ-

 

    బయట పడుతున్న తన నగ్న సౌందర్య సొగసులు దాచుకోడానికి ప్రయత్నం చేస్తూ-

 

    కానీ గౌతమి ప్రయత్నం ఫలించలేదు.

 

    అవినాష్ పిచ్చెత్తి పోతున్నాడు. తనను తాను దాచుకోడానికి శాయశక్తులా ప్రయత్నించి, కుదరక, ఓటమికి బానిస అయినట్లుగా తల వెనక్కి వాల్చేస్తూ-

 

    తన తలచుట్టూ ఉద్రేకంతో చేతులు బిగించి-

 

    తన హృదయమ్మీదకు తమకంగా లాక్కుంటూ-

 

    తన పెదాల మీద రేగుతున్న ప్రకంపనని ఆపుకోలేక, అరమూతలు పడిన కళ్ళతో, అవినాష్ వేపు చూస్తూ-

 

    ఉవ్వెత్తున లేచిన సముద్ర కెరటాల్లా ఉద్రేకం.

 

    విసురుగా లేచిన ప్రభంజనంలా ఉన్మత్తం.

 

    ఎట్టకేలకు-

 

    తన నడుంచుట్టూ చేతులు బిగించి, వేళ్ళలోంచి పైకివచ్చేస్తుందనుకున్న రక్త ప్రవాహం వెనక్కి మళ్ళిన వేళ-

 

    అలసి, అలసి సొమ్మసిల్లి పోయినట్లుగా మత్తుగా, తన పక్కన పడుకున్న గౌతమి.

 

    ఆ సమయంలో ఆమె చెమట వర్షంలో తడిసి, తడిసి, చిగురుటాకుల వెంబడి నీళ్ళు కారుస్తున్న సోయగాల మంచు వృక్షంలా ఉంది.


 
    మొదటిసారి-

 

    గౌతమితో తను పంచుకున్న అనుభవం, సన్నటి అలలా అవినాష్ మదిలో కదిలింది.

 

    ఆ అనుభవం, ఆ ప్రేమ, అలనాటి ఆ రేయిలో తన పరవశం ప్రస్తుతం జ్ఞాపకం రావడం అవినాష్ కిష్టంలేదు.

 

    ఈ సమయంలో-

 

    జ్ఞాపకం చేసుకోవడం మంచిది కాదు.

 

    ఎందుకంటే...

 

    జ్ఞాపకం వచ్చిన మరుక్షణం, గౌతమి తనమీద చూపించే పిచ్చి ప్రేమ, వెర్రి మమత గుర్తుకొస్తుంది. తనూ మనిషే. రక్తమాంసాలు, అనుభూతులు తనలోనూ ఉన్నాయి. కానీ తన ఆశయం వేరు.

 

    తన ఆశయానికి అడ్డుగా ఏ ఆడపిల్ల ప్రేమా నిల్వకూడదు. తానిప్పుడు గౌతమి మెత్తని మనసును జ్ఞాపకం చేసుకొంటే... వెన్నెల తుఫాను లాంటి ఆ ప్రేమానుభూతి తనని బలహీనుణ్ని చేస్తుంది.

 

    ఆ బలహీనత తనలో చొరబడిందంటే ఆమెను తను చంపడం కష్టం...

 

 

    చంపకపోతే...

 

    పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్ళి చేసుకున్న మరుక్షణం రోష్ణి దూరమౌతుంది. రోష్ణి దూరమైనా పర్వాలేదు. ఎందుకంటే - వాంఛమ్ కోరికల కోసం కాదు. తను ఆడపిల్లల్ని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నది. ఇవాళ గౌతమి, రేపు రోష్ణి, ఆ తర్వాత ఇంకో మాధవి, ఆ తర్వాత ఇంకో కళ్యాణి-

 

    తన అంతిమ విజయానికి, తన ఆశల సౌధానికి వీళ్ళందరూ తనకు మెట్లు.

 

    అంచేత ప్రస్తుతానికి-

 

    రోష్ణి తనకు కావాలి. రోష్ణి ఆస్తి తనకు కావాలి.

 

    రోష్ణి బ్యాంక్ బ్యాలన్స్ తనకు కావాలి. లక్షల ఆస్తి తనకు కావాలి.

 

    ఇదే అదునైన సమయం-

 

    గౌతమినిప్పుడు చంపకపోతే తనకు బంగారు భవిష్యత్తు లేదు.

 

    తనూ, తన చిరుద్యోగం-ఆ బతుకులో తను ఇమడలేడు. ఆ బతుకంటే తనకసహ్యం.

 

    నో-నో-నో-

 

    పురుగులా బతకలేడు తను. పురుగు బతుకు తనకిష్టం లేదు.

 

    తనో సాలెపురుగు.

 

    తనచేతికి చిక్కిన అమ్మాయిలు ఆవలలో గిలగిల కొట్టుకుంటుంటే తను స్వర్గసుఖాల్లో తేలుతుంటాడు. కుషన్ పరుపులమీద సుఖిస్తుంటాడు. కరెన్సీ కాగితాలను వెదజల్లుకుంటూ, కార్లల్లో, అందమైన అమ్మాయిల్తో తిరుగుతుంటాడు. తనకా బతుకు కావాలి.

 

    అందుకు... తనకు డబ్బు కావాలి.

 

    డబ్బు-డబ్బు-డబ్బు-

 

    ఆ డబ్బు రోష్ణి దగ్గరుంది- రోష్ణిని ఎలాగైనా పెళ్ళిచేసుకుంటే ఆ డబ్బు తనదవుతుంది.

 

    గౌతమి బతికుండగా, రోష్ణితో తనపెళ్లి జరగదు.

 

    ఈరాత్రే - గౌతమి అడ్డు తొలగించుకోవాలి.

 

    తన జీవితంలో ఆమె అధ్యాయం ఈ రాత్రితో సమాప్తం.

 

    అవినాష్ మెదడు నిండా ఆలోచనలు.

 

    "అవినాష్" అదే సమయంలో గౌతమి గొంతులోంచి మెత్తని పిలుపు విన్పించింది.


                            *    *    *    *


    ఉలిక్కిపడి, ఆలోచనలలోంచి బయటపడి ఆమెవేపు చూసాడు అవినాష్.

 

    తనని తప్పించుకొని ముందుకెళ్ళిపోయి, వెనక్కొచ్చి తన భుజాల మీద చేతులు వేసి, చెవిలో ఊదుతూ "ఏఁవిటి ఆలోచిస్తున్నావ్... మన పెళ్లి గురించా" కొంటెగా అంది గౌతమి.

 

    ఊహాల్లోంచి వాస్తవంలో కొచ్చిన అవినాష్ పెదవుల మీద చిరునవ్వుని పులుముకుని, ఆమె కళ్లవేపు సూటిగా చూస్తూ, నడుంచుట్టూ చేతులువేసి దగ్గరగా లాక్కుంటూ, గట్టిగా గుండెలకు అదుముకుంటూ ఆమె పెదాలకు తన పెదాలను ఒక్కసారి కలిపి, కదిపి-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS