Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 23

అతనికి నచ్చినా, నచ్చకపోయినా తను చెప్పదలుచుకుంది చెప్పింది.
నచ్చితే 'హైటెక్ లవ్'! ప్రేమల్లో కూడా హైటెక్ ప్రేమ, మైక్రో టెక్ ప్రేమ, నానో టెక్ ప్రేమ వుంటాయని తనను నమ్మించి ఏదో గారడీ చేయాలి. ఉత్త చిలిపి డాక్టర్!
పావని సాజిత్ మాటల్ని, రూపాన్నీ తలుచుకుని మురిసిపోయింది.
మనసులు కలిసిందే ప్రేమ!
హృదయాలు స్పందించేదే ప్రేమ.
అంతేకాని- దానిక్కూడా టెక్నికల్ వాల్యూస్ ఎలా అప్లయ్ చేస్తాడు. ఎంత హైటెక్ మెడికల్ లాబ్ లో వుంటే మాత్రం?! మరెంత హైటెక్ సిటీలో వుంటే మాత్రం?!
పావని మరోసారి అనుకుంది.
అదిగో సరీగ్గా అప్పుడు ఆమె పెదాలమీద ఏదో తీయటి వత్తిడి తగిలింది. సాజిత్ పెదాలు తన పెదాలకు ఆనినట్టూ, అవి గట్టిగా తన పెదాల్ని వత్తినట్టూ ఏదో తడి తన పెదాలకంతా అయినట్టూ విచిత్రమైన పరిస్థితి!
తన పెదాలమీద తనకర్ధం కానిదేదో జరిగి, వాటిలో వున్న కండరాలు కుంచించుకుని, క్రిందకు పోయి, లోపలున్న లాలాజలం పెదాలమీది కొచ్చి, అది మరో రకమయిన అనుభూతిగా మారిందా?! లేకుంటే తన పెదాలమీద ముద్దేమిటి?
తరువతః పావనికి మరో ఆలోచన వచ్చింది.
"ఇన్ విజువల్ మాన్" ఎవడూ హెచ్.జి. వెల్స్ నవల్లోలా తన గదిలోకి ప్రవేశించలేదు కదా?!
పావనికి శరీరం కంపించింది.
ఆమె అలాగే అయోమయంగా చూస్తున్నప్పుడు మరో విచిత్రం జరిగింది. ఆమె నడుం మీద ఎవరో చేయివేసి వత్తినట్టు మరో పులకరింత. శరీరం మొత్తంలో ఒక తీయటి ప్రకంపన! సాజిత్ కూడా అనేకసార్లు తన నడుంమీద చేయి వేసి వత్తాడు. అప్పుడింతగా శరీరం తీయటి అనుభూతికి గురికాలేదు.
వత్తిడి తగిలిన దగ్గరనుండీ ఒక తీయటి తరంగం సెకనులో అనేక సార్లు శరీరమంతా పాకి, మెదడుకు సోకి ఒక తీయటి మత్తు మనసును ఆవహిస్తోంది.
ఏమవుతుంది తనకు?
కళ్ళు తేలిపోతున్నాయి.
ఆమె తిరిగి తన బెడ్ మీద కూర్చుంది.
సాజిత్ రూపం తన చుట్టూ వున్నట్టు ఒక విచిత్రానుభూతి. తన హైటెక్ ప్రాసెస్ లో.
సాజిత్ నిజంగానే అదృశ్య మానవుడిగా మారి తనను ఆటపట్టించటం లేదుకదా?!
పావనికి అలాంటి ఆలోచన రావటంతో ఒక్కసారిగా లేచి చేతుల్ని జాపి గదిలో వున్న శూన్యాన్ని తడిమింది. ఎక్కడా ఎలాంటి మనిషి జాడా తగల్లేదు. అదే నిజమయితే సాజిత్ కు తను కనపడాలి. తనను తప్పుకొనే అవకాశం కూడా వుంటుంది.
సో! అదీ నిజం కాదు. రష్యన్ శాస్త్రవేత్త అన్నట్టు ఇన్ విజుబుల్ మాన్ అసాధ్యం. కళ్ళు కూడా పారదర్శకాలయితే అతనికి ఎదుటి మనిషి కనపడడు.
పావని అనుకుని మెల్లిగా ఫోన్ దగ్గరకెళ్ళింది. సాజిత్ కు డయల్ చేసింది.
అవతలి నుండి సాజిత్ కంఠం.
"హాయ్ డియర్! ఏమిటి సంగతి?" ఆమె తిరిగి ఎం చెప్పకుండానే మరో ఆశ్చర్యం! ఫోన్ అలాగే చేతిలో వుంది. తన ఎదపొంగులమీద ఎవరో చేతి వ్రేళ్ళనుంచి సుతారంగా మీటి మెత్తటి ప్రెస్ చేసినట్టు మరో స్వీట్ షాక్.
కానీ....ఇలాంటి ప్రకంపనలు తను ఇంతకు ముందెరగదు.
"సాజిత్!"
"వాట్ డియర్! మత్తుగా ధ్వనిస్తున్నావ్?"
"నా శరీరంలో ఏవో గమ్మత్తులు జరుగుతున్నాయి."
"శరీరంలో మార్పులేమిటి?"
"ఏవో విచిత్రమయిన గిలిగింతలు."
"ఎలాంటివి?"
"సాజిత్! ఒక తీయటి ప్రకంపనాల్ని వంటిలో ప్రవేశపెట్టినట్టు అదోలా అయిపోతున్నాను.
వేల మైక్రో రోబట్స్- స్వీట్ సొల్యూషన్ను తీసుకుని శరీరం అణువణువులోకి దూరి అద్దుతున్నట్టు అదోరకం హాయిగా వుంటుంది. ఆ హాయి కూడా భరించరానిదిగా వుంటుంది.
సాజిత్! నాకు నీ దగ్గరకు పరుగేట్టుకురావాలనిపిస్తోంది."
"డార్లింగ్! అదేదో చిత్రంగానే వుందే. ఇప్పుడు ఇంటిలో ఎవరున్నారు?"
"ప్రస్తుతం నేనే!"
"అదేమిటి? వేయిమంది సాజిత్ లు చుట్టూచేరి మైక్రో రోబట్స్ కి స్వీట్స్ సొల్యూషనిచ్చి,శరీరం అణువణువులోకి వాటిని పంపి- దాన్ని అడ్డుతుంటే, అమరసుఖాన్ని అందుకుంటున్నానన్నావు కదా?"
"సాజిత్! నేను చెప్పింది అనుభూతి. దయచేసి నేనొక్కర్తనే వున్నాను. నాకు మరోరకం భయంగా కూడా వుంది."
"తీయటి అనుభూతుల్లో భయమా? నో డియర్! అలాంటి అనుభూతి ఈ భూగోళంలో మొదటిసారిగా పొందుతుంది నీవే అయివుంటావు. నాకే అలాంటి పరిస్థితి ఎదురైతే- తలుపులు మొత్తం బిగించి హాయిగా బెడ్ మీద పడుకొని ఆనందించేవాడిని.
చూడు డియర్! అలాంటి తీయటి ఆహ్లాదకరమైన అనుభూతులు అందరికీ రావు- కనుక తలుపులు బిగించి, పరుపుమీద పడుకో- ఫోన్ దగ్గరకు లాక్కో...ఎలా ఆ గిలిగింతల్ని ఎంజాయ్ చేస్తున్నావో కాస్త వివరంగా చెప్తుండు."
"అదేమైనా జబ్బేమో సాజిత్! శరీరమంతా నరాలమయం కదా. అవి కుచించుకుంటుంటే....వాటి కనెక్టెడ్ కండరాలు క్రిందకు లాగబడి-ఏదో జరుగుతుంటే....నేను మరేదో భావిస్తూ- చివరికి....శాస్వతానందానికి బ్రహ్మానందానికీలోనై.....బ్రహ్మలోకం చేరుకుంటానేమో."
"అయితే నీకు తోడుగా నేనూవస్తాను."
"బ్రహ్మలోకానికా?"
"అవును! అమర ప్రేమికులం కదా మనం. హైటెక్ లవ్. అదే అనుకుని, ఇరువురం ఈ లోకంలోకి 'ఎంట్రన్స్' నీ 'ఎగ్జిట్' నీ సమానంగా పంచుకోవాలికదా" సాజిత్ చిన్నగా నవ్వుతూ అన్నాడు.
"హైటెక్ లవ్ అదే అనుకొని....."సాజిత్ మాటలు పావనికి తిరిగి తీయటి షాక్ లా అయ్యాయి.
"సాజిత్! హైటెక్ లవ్ అంటే.....నేనిక్కడా- నువ్వక్కడా ఎలా సాగుతుంది?"
"ఏమో పావనీ! ఏది ఎలా జరుగుతుందో అప్పుడే మనం ఎం వ్యాఖ్యానించగలం? టెలిఫోన్ లా, టెలివిజన్ లా టెలీస్కూల్ లో టీవీ లవ్వేమో, నేనిక్కడున్నా.....నువ్వక్కడ నా పరమైన అనుభూతుల్ని పొందుతూ ఆనందిస్తున్నావేమో?"
సాజిత్ ఫోన్ లో అలా అంటున్నప్పుడు తిరిగి ఎవరో గట్టిగా పెదాల్ని అదిమి ముద్దెట్టుకున్న అనుభూతికి ఆమె మరోసారి గురయింది.
చిలిపిగా ఎవరో బుగ్గ గిల్లినట్టు కూడా అక్కడ చురుక్కుమంది. అందుకు పావని తనకు తెలీకుండానే "అబ్బా!" అంటూ అరిచింది.
"వాట్ హాపెండ్ పావనీ!" అవతలినుండి సాజిత్ పలకరింపు.
"సాజిత్! నేను నీ గదికి వస్తున్నాను."
"ఏమయింది?"
"ఏదో అదృశ్యశక్తి నన్ను ఆటాడిస్తుంది. మరి కాస్సేపుంటే నన్ను బెడ్ మీదకులాగి, నాకు కనిపించకుండానే ప్రేమ ఊసుల్ని వినిపిస్తూ తీయటి అనుభూతుల్ని తినిపిస్తూ మరేదో జరుగుతుందని అనిపిస్తూ...."
అవతలనుండి సాజిత్ పెద్దగా నవ్వాడు.
"ఎందుకు నవ్వుతావ్?"
"ఈ హైటెక్ యుగంలో నీవు అదృష్టశక్తుల్ని గురించి మాట్లాడటం వింతగా వుంది."
"అక్కడ కూర్చున్న నీకు వింతగానే వుంటుంది."
"ఇంతకూ ఏమంటావ్. బయలుదేరి వస్తానంటావా?"
"ఆ....వస్తాను."
"పావనీ!"
"కనిపించకుండా వినిపించే లవ్ లో ఏమేం వినిపిస్తాయో ఒకసారి పరిశీలించరాదూ.
ఎవరో రచయిత అన్నట్టు అలాంటి ప్రేమలో వెన్నెల కిరణాలు మెత్తగా లాగిన సంద్రం ఎగిసిపడే టైడల్ తీయటి హోరు శరీరమంతా నిండిపోతుంది.
నదీతీరం అంచుల్లో నిటారుగా నిలబడిన ఎత్తయిన సర్విచెట్ల లేతఎర్రని చిగురాకుల్ని చిలిపిగాలి విలాసంగా రాసుకుంటూ గిలిగింతలు పెట్టేప్పుడు....జున్నులా తియ్యగా వుంటే జుమ్ మనే నాదం వినిపిస్తుంది.
ఆకాశంలో వర్షించదానికి సిద్దంగా వున్న నీలిమేఘాల్ని చూసి ఆర్తిగా, ప్రేమగా, ప్రణయంగా భూమాత ఆవులించిన మధురమైన చప్పుడు మైమరపుగా వినిపిస్తుంది.
ఆ తీయటి అలజడి గదిలో వుంటేనే నీకు లభిస్తుంది. అది నీ మనసుకు మాత్రమే వినిపిస్తుంది."
అతని మాటలు పూర్తికాకుండానే పావని శరీరం మరింత మత్తుగా, తీయటి ప్రకంపనలకు లోనై.....మెత్తగా అక్కడే జారిపోయింది. ఆమెకు తనకేం జరుగుతుందో కూడా తెలీనంతగా అంతకుముందు సాజిత్ చెప్పిన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది.
అలాంటి శబ్దాలే ఆమె శరీరమంతా చుట్టుకుపోయినట్టు వింత అనుభూతి. ఆమెకు తెలీకుండానే ఫోన్ క్రిందపెట్టేసి గదిలోని బెడ్ మీదికి ఎవరో నడిపించుకు వెళుతున్నట్టు మెల్లగా నడిచి వెళ్ళింది.
ఎవరో ఆమెను జంటిల్ గా బెడ్ మీద పడుకోబెడుతున్నట్టు కొమ్మలా వరిగిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS