Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 22

తను ఒక్కర్తే ఇంట్లో చదువుకుంటూ వుండేది.
ఒకరోజు తనకు మరో గుండెపగిలే వార్త ఇంటికి వచ్చింది. ఎలా జరిగిందో - ఎందుకు జరిగిందో తెలీదు.
జయవర్ధన్ గారు బిల్డింగ్ లోపలికి ప్రవేశించారు. ఒకదారిని దాన్ని పడగొట్టడానికి పద్దతిగా ఒక వైపు నుండి ముక్కలు చేస్తున్నారు.
అనూహ్యంగా జయవర్ధన్ గారు నిలబడినచోట కప్పు కూలుతుండటం ఆయన చూడలేదు. ఆయనకు అంత దూరంలో వున్న తన తండ్రి చూశాడు. వెంటనే అరుచుకుంటూవచ్చి ఆయన్ని బయటికి పడదోశాడు.
క్షణంలో సగం!
జయవర్ధన్ గారు బయటపడటం- తన తండ్రి ఆ కూలిన కప్పుకింద పడటం జరిగింది.
అలా తన తండ్రి జయవర్ధన్ గారిని రక్షించటం అక్కడి వర్కర్స్ చాలామంది చూశారు.జయవర్ధన్ గారు ఆ సమయంలో తానెందుకు బ్రతకటం జరిగిందో తలుచుకొని, ఒక్కసారిగా కూలీలనందర్నీ వచ్చి కూలిన కప్పు క్రింద వున్న ముకుందరావుని తీయమని పెద్దగా ఏడుస్తూ అరిచాడు.
అప్పటికే సమయం మించిపోయింది.
అసలే బక్కప్రాణం. పడిన బరువు సామాన్యమయింది కాదు. గుండెల్ని గట్టిగా వత్తింది. నోటి వెంటా, చెవుల వెంటా రక్తం బయటికి వచ్చింది.
తన తండ్రిని వెంటనే జీపులో హాస్పిటల్ కి తరలిస్తుంటే- మధ్యలోనే జయవర్ధన్ గారికి ఒకమాట చెప్పి చనిపోయాడు. ఆయనన్న చివరి మాట-
"జయవర్ధన్ గారూ! నా కూతురు రుక్మిణి..."
తను పరుగెత్తుకుంటూ  హాస్పిటల్ కి వెళ్ళింది. తండ్రి శవాన్ని చూసి కన్నీరు-మున్నీరుగా ఏడ్చింది. జయవర్ధన్ గారు తనను ఓదార్చారు. విషయం తెలుసుకుని ఆయన భార్య జానకమ్మగారు కూడా తనని ఓదార్చింది.
తన తండ్రి అంత్యక్రియలన్నీ జయవర్ధన్ గారే స్వయంగా నిర్వహించారు. తనని తీసుకువెళ్ళి తన ఇంట్లో పెట్టి చదువుకోగలిగినంత చదువుకోమన్నారు.
తర్వాతః....వారి మంచి హృదయాలు తనని ఆ ఇంటి కోడల్ని చేశాయి.
అప్పటికే తన భర్త సిటీరాజకీయాల్లో చురుగ్గా తిరుగుతున్నాడు. ఎం.ఎల్. ఏ. సీటు రావటం ఖాయం అనుకుంటున్నారు. జయవర్ధన్ గారు కూడా కొడుక్కి ఎంత మనీ కావాలంటే అంత యిచ్చేవారు.
అంచెలంచెలుగా తన భర్త మంత్రిపదవి వరకూ ఎదిగాడు. మనీ కోట్లకు చేరుతుంది. మంత్రిపదవి కూడా ఈ దేశంలో ఒక వ్యాపారమని తనకిప్పుడిప్పుడే తెలుస్తోంది.
రాజకీయం ఒక పరిశ్రమనీ- అందులోని పరిశ్రమలు గ్రేడెడ్ గా వుంటాయనీ తెలుస్తోంది.
లోకల్ రాజకీయ నాయకుడిది లఘు పరిశ్రమ అయితే, ఎం.ఎల్.ఏ.ది మధ్యతరహా పరిశ్రమ అయితే- మంత్రిపదవి భారీ పరిశ్రమ.
పరిషత్ చైర్ మెన్లూ, సొసైటీల చైర్ మెన్లూ- మేయర్ పదవులూ అన్నీ పెద్దతరహా పరిశ్రమలే!
తను ఆర్ధికశాస్త్రంలో చదివింది.
విడిగా ఒక పరిశ్రమస్థాపించాలంటే భూమి, యంత్రపరికరాలూ, ముడిసరుకూ, సాంకేతిక పనివారూ, సామాన్యవర్కర్లూ, పెట్టుబడీ ఎన్నో కావాలి. ఇంతా ప్రయాసపడి వస్తూత్పత్తి జరిగితే, దానికి సమాజంలో డిమాండ్ వుండాలి. పోటీ పరిశ్రమలోని సరుకు నాణ్యతనీ, సవాళ్ళనూ జయించగలగాలి. ధర అందుబాటులో వుండాలి. సరుకు అమ్ముడయితేనే లాభాలు.
ఈ కొత్తరకం రాజకీయపరిశ్రమ అలాకాదు!
దీనికి మొదట ఓట్ల సరుకు కొనటానికి కొంత పెట్టుబడి అవసరం వుంటుంది. గెలిచి పైమెట్టు ఎక్కాక....ఇక అంతా రాబడే! ఏదో రకంగా అతనికి వచ్చిపడుతుంది. అనూహ్యంగా విస్తరిస్తాడు. ఇంటిమీద ఇల్లు కడతాడు. కారు వెంట కారు కొంటాడు. బంగారాన్ని బిస్కేట్లుగా మార్చుకుంటాడు.
తను ఆ వ్యాపారాన్ని స్వయంగా చూస్తోంది.
అందరూ అంతేనా...నూటికీ, కోటికీ అరా మిగిలి....ప్రజలూ, సేవా అనేవారు కూడా వుంటారు. వుంటే అలాంటి వారిని ఈ సమాజం పిచ్చివాళ్ళు అంటుంది.
రుక్మిణి మనసులో రకరకాల భావాలు!
తరువాత ఆమె మరోసారి బంగారు నగలున్న పెట్టెవంక చూసి వీరభద్రయ్యకు ఫోన్ చేసింది.

                       *    *    *    *
మంత్రి అంబరీషుడి ఆఫీసుకు ఆ రోజు ఫోన్ వచ్చింది.
మంత్రిగారు ఎత్తారు.
"....సీ మిస్టర్ మినిష్టర్! నీ కదలికలు ఎవరికీ తెలీదనుకోకు. ఎప్పటికప్పుడు నాకు చేరుతూనే వుంటాయి. నీ చుట్టూ వున్నవారంతా నీ వాళ్ళు కాదు. నన్నడిగితే నీలోనే నీవు లేవు. ఈ వాక్యం నీకు ఈ జన్మకు అర్ధంకాదు.
సరే...అర్ధాలు చెప్పుకుంటూ పోవటానికి, నీకు సంజాయిషీలు ఇవ్వటానికి నాకు తీరికలేదు.
నీవు ఒక అమ్మాయిని ఐమీన్ పావన్ని నీ గెస్ట్ హౌస్ కి బలవంతంగా తీసుకుపోయి, ఏదో చేస్తానన్నావు. అది నీ వల్ల కాదు.
నీతో మరింత ఎక్కువగా మాట్లాడటం కూడా నాకంత మంచిదికాదు అని "నేను ఎవరూ అని కదూ నీ అనుమానం. నీలో లేని నువ్వూ- నీలో వున్న నేను. తల పగలగొట్టుకున్నా నీకర్ధం కాదులే."
అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు.
అంబరీషుడికి మరింత ఆశ్చర్యం.
తరువాత అతనికి మరింత ఆగ్రహం కలిగింది.
తనకు పదవి వూడినా పరవాలేదు. సంపాదించిన కోట్లు పోయినా పరవాలేదు. నాలో నేనెందుకు లేనో, నాలో వీడెందుకున్నాడో తేలుస్తాను.
ఆ పావన్ని ఆరు నూరయినా ఇదే గెస్ట్ హౌస్ కి తెస్తాను. కసిదీరా ఒక రాత్రంతా దాన్ని పాశవికంగా రేప్ చేస్తాను. చుట్టూ నా ప్రైవేటు జనాన్ని అడుక్కొకడిని వుంచుతాను. వారి చేతుల్లో బాంబులూ, మెషిన్ గన్స్ వుంచుతాను. అప్పుడు దాన్నెవరు రక్షిస్తారో చూస్తాను.
ఆయన ఆగ్రహంగా మరోసారి మనసులో అనుకున్నాడు.
తరువాత ఆయనకు మరో అనుమానం వచ్చింది.
తన చుట్టూ వున్నవాళ్ళల్లో తనకు శత్రువులు ఎవరయినా వున్నారేమో అని. తను ఈ విషయం ఒక్క పి.ఏ. జనార్ధన్ తోటే అన్నాడు. ఇంతలో వీడికెలా తెలిసింది?
అంటే జనార్ధన్ తనను మోసం చేస్తున్నాడా?!
తనకు జనార్ధన్ పర్సనల్ అసిస్టెంటు. అంటే ఒక రకంగా నాలోని అంతర్భాగం...వాడు ఈ రహస్యాల్ని బయటపెడితే.....ఆ ఫోన్ లో వాడన్నట్టు నాలోనే నేను లేనట్టు. నాలో నేనున్నానని వాడంటున్నాడు.
నిజమే మరి! తన జనార్ధన్ వాడి మనిషయినపుడు వాడు నాలోనే వున్నట్టు.
అయితే ఇకముందు ఈ పావని విషయం తన పి.ఏ. గాడికి తెలీకుండా టాకిల్ చేయాలి.
అది తనకు వెరీ ఈజీ!
తన ప్రయివేటు మనుష్యులకు చెప్తే రాత్రికి రాత్రి దాన్ని లేపుకొచ్చినా నా గదిలో పడేస్తారు."
అంబరీషుడి మనసు మరింత కసిగా వుడికిపోయింది.
అతడలా కసిగా ఆలోచిస్తున్నప్పుడు....
అతనికి దూరంగా-
అదే సిటీలో.....

                   *    *    *    *
సాజిత్ మెడికల్ చాంబర్!
ఒక్కడే కంప్యూటర్ దగ్గర కూర్చుని పావని ఫీడ్ చేసినా కళ్యాణ్, రేఖ ప్రాబ్లెమ్ కు సొల్యూషన్ చదువుతున్నాడు.
పావనిలో క్రియేటివిటీ వుంది.
తను చెప్పిన కథను కంప్యూటర్ లో ఫీడ్ చేయటమేకాక...క్రింద తనదైన శైలిలో హ్యూమన్ వాల్యూస్ నీ, సైన్స్ నీ ఎనాలసిస్ చేస్తూ సుదీర్ఘమైన ఒక కామెంట్ ను రికార్డు చేసింది. అది మొత్తం చదివిన సాజిత్ కు ఆమె సమాధానం బాగా నచ్చింది. తన ఆసుపత్రి సీనియర్ మెడికల్ స్టాఫ్ ఏ విధంగా అభిప్రాయపడ్డారో అదే అభిప్రాయాన్ని పావని కూడా వ్యక్తంచేసింది.
సాజిత్ ఆమె తెలివితేటలకు ముచ్చటపడ్డాడు.
ఇప్పుడేం చేస్తుందో.....
సాజిత్ మెల్లగా లేచాడు. తన చాంబర్ లోనే ఒక దరినున్న మరో మైక్రో కంప్యూటర్ దగ్గర కూర్చున్నాడు. అతని తలకు హైటెక్ హెల్ మెట్ లాంటిది తగిలించుకున్నాడు.
కంప్యూటర్ కీ బోర్డుమీద తన సున్నితమయిన వ్రేళ్ళనుంచి మనసులో అనుకున్న దాని కనుగుణంగా ఓ కమాండ్ ను ప్రెస్ చేశాడు.
'పావని' అక్షరాలు ముచ్చటగా పడ్డాయి.
మరో కమాండ్ ను ప్రెస్ చేశాడు.
'ఎరోటికా' తిరిగి అక్షరాలు పడ్డాయి.
"ఎనీపార్టీ ఆఫ్ హెర్ బాడీ."
సాజిత్ మెల్లిగా నవ్వుకున్నాడు.
అతనికి ఆ సమయంలో దూరంగా-
పావని....
                   *    *    *    *
ఆమె ఇంటిలో__
తన బెడ్ మీద పడుకుంది.
ఆమె బ్రెయిన్ లో తను ఫీడ్ చేసిన కళ్యాణ్, రేఖ ప్రాబ్లెమ్ సమాధానం ఈ రాత్రి సాజిత్ చదువుతాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS