Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 24

మొగ్గలాంటి ఆమె శరీరం ఆమెకు తెలీకుండానే లే వెచ్చని కిరణాలకు విచ్చుకున్న పూవులా అయిపోయింది.
తనకేం జరుగుతోంది....?
ఆమె అంతరంగం ప్రశ్నించే స్పృహ కూడా ఆ సమయంలో కోల్పోయింది.
ఆమె ఆ బెడ్ మీద శరీరంలో కదిలే తీయటి ప్రకంపనలకు పాములా కదులుతూ-
మధురంగా మూలుగుతూ....
అలా నిమిషాలు, గంటలవుతున్న సమయానికి__
ఆమెకు దూరంగా....
                    *    *    *    *
అంబరీషుడి గెస్ట్ హౌస్!
గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
అతనికి దగ్గరగా నిలబడి వున్నాడు జనార్ధన్.
అంతకుముందు ఆయన పావని సమాచారం మొత్తం తనకు తెలియచేయమన్నాడు.
జనార్ధన్ చాలా తెలివిగా అరుణకుమార్ పేరుతో తనెలా ఎంటరయిందీ, పావని సమాచారం ఎలా సేకరించిందీ మొత్తం చెప్పాడు.
"అయితే దీని బాక్ గ్రౌండ్ కి పెద్ద బేస్ లేదన్నమాట" అంబరీషుడు అన్నాడు.
"సర్!" జనార్ధన్ అన్నాడు.
"చెప్పు."
"ఇంత కాన్ఫిడెన్షియల్ సమాచారం ఆ గాళ్ కి అందుతుందంటే ....ఆమెకు కనెక్షన్ మన బృందంలో ఎవరితోనయినా వున్నాయేమోనని నా అనుమానం.
తమకు కుర్రవాళ్ళయిన సెక్యూరిటీ గార్డ్స్ వున్నారు వారి దగ్గర హైటెక్ పరికరాలున్నాయి. తమరి మూవ్ మెంట్సు మొత్తం వారి నిఘా కళ్ళకు ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి."
"ఒకసారి గార్డ్స్ ను మార్పించండి."
అంబరీషుడికి ఒక ఆశ్చర్యం!
తను జనార్ధన్ మీద ఈ క్షణం వరకూ అనుమానంగా వున్నాడు. అతడే ముందుగా ఈ విషయం అంటున్నాడంటే....ఒక రకంగా తనమీద 'ఫోకస్' అయ్యే అనుమానాన్ని డైవర్టు చేయటానికి తనే ముందుగా కదపటమన్నమాట!
దీనితో అంబరీషుడికి జనార్ధన్ మీద మరింత అనుమానం గట్టి పడిందసహజంగా ఇలాంటి విషయాల్లో నేరం చేసినవాడే తన విషయం ఎవరైనా కనిపెడతారేమోనని....దాన్ని రకరకాలుగా డైవర్టు చేయటానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా ఈ సమయంలో జనార్ధన్ చేసింది అదే! తన గార్ద్సు తనకు ఎప్పుడూ దూరంగానే వుంటారు.
ఇక వారి దగ్గరున్న రిమోట్ సెన్సింగ్ పరికరాలు తననెలా గార్డ్ చేయాలో....ముందు దారుల్లో నిలబడిన వారికి మెసేజ్ పంపటంవరకే వుపయోగపడతాయి. అంతేతప్ప తను గదిలో తన సహచరులతో, పి.ఏ. లతో, ఆఫీసర్లతో ఎం మాట్లాడిందీ వినటానికికాదు. ఆ సమయంలో వారు గదిలో ఎందుకుంటారు? గదికి దూరంగా నిలబడి వుంటారు. తను మాట్లాడేప్పుడు గదిలో ఎలాంటి టెక్నికల్ పరికరాలూ వుండవు. అవి వుంటేనే తను మాట్లాడింది వారు వినగలిగేది.
జనార్ధన్ ఎంత తెలివిగా విషయాన్ని ప్రక్కకు నేత్తతానికి ప్రయత్నిస్తున్నాడో అతని మాటలే చెపుతున్నాయి.
అంబరీషుడు మరింత ఆగ్రహంగా తిరుగుతూ...
"చూడు జనార్ధన్! గదిలో విషయాలు గార్ద్సుకెలా తెలుస్తాయి? మనం ప్లాన్ చేసుకున్నాయి నాకు తెలుస్తయ్! ఆ తర్వాత మీకుతెలుస్తుయ్.
ఆ పావని పెద్ద ముదురులా వుంది. దానికి సాజిత్ కాక నా అనుమానం మరో బోయ్ ఫ్రెండ్ వున్నాడు. ఆ బోయ్ ఫ్రెండ్ కి నీవన్నట్లు మనలో వున్నవాడెవడో మరింత ఫ్రెండయి వుంటారు.
వాడీమధ్య మాటిమాటికీ ఫోన్ చేసి నా మూవ్ మెంటు మొత్తం నాకే చెపుతున్నాడు.
అంటే నేను ఆ పావన్ని ఎం చేయలేనని వాడి ధీమా! అదే తేలుస్తాను. ఈ తీగను ఎక్కడో ఒకచోట తెంచకపోతే దీని వెనకున్న వాళ్ళెవరో తెలిసేట్టులేదు.
అయితే ఆ తీగను ఎక్కడ ఎలా తెంచుతానో ఎవరికీ చెప్పను. మాటల చాప్టరు అయిపోయింది. ఇక చేతుల్లో మాత్రమే దానికి సమాధానం యిస్తాను. ఆ పిల్లను గురించి కొంత సమాచారం నీ వంతుగా అందించినందుకు థాంక్స్! ఎవరిని తీసి ఎవర్ని వుంచాలో త్వరలో నీకు తెలియచేస్తాను. ఈ రోజుకు నీవు సెలవు తీసుకోవచ్చు" అంబరీషుడు కటువుగా అనడంలో జనార్ధన్ కు విషయం అర్ధమైంది.
ఈ మానవుడు తననే అనుమానిస్తున్నాడు. సందేహంలేదు. తను ఈ సమయంలోనే తప్పుకోవడం మంచిది. ఇప్పటికే ఈయనగారికి ఉచ్చు తయారవుతోంది. అది లోయన మెడకు త్వరలో బిగుస్తుంది. తను పర్సనల్ గా కొనసాగడమంటే కొంత నేరం తనకూ చుట్టుకుంటుంది. ఆ ఉచ్చులో తన మెడనెందుకు దూర్చాలి?
ఈరోజుకు సెలవు తీసుకో....అనటం అంటే తనకు తెలుసు. బహుశా రేపటి ఉదయమే ఫోన్ చేయవచ్చు.
"మిస్టర్ జనార్ధన్! నీ స్థానంలో మరొకర్ని అపాయింట్ చేసుకున్నాం. నీవు తప్పుకోవచ్చు."
అదే తనూ కోరుకుంటోంది.
జనార్ధన్ మెల్లిగా బయటికెళ్ళాడు.
అలా వెళుతున్న జనార్ధన్ వంక అంబరీషుడు మరింత ఆగ్రహంగా చూశాడు.
జనార్ధన్ కు గెస్ట్ హౌస్ మెట్లు దిగాక మరో ఆలోచన వచ్చింది. అంబరీషుడు సాగించిన కుంభకోణంలో తనూ ఒక ప్రత్యక్షసాక్షి. ముందు ముందు సి.బి.ఐ. అధికార్లు తనచుట్టూ కూడా వలవేసి-కస్టడీలోకి తీసుకుని కొన్ని నిజాల్ని రాబట్టేందుకు తనమీద వారి పద్దతులు కొన్నింటిని అప్లై చేయొచ్చు. తను తట్టుకోలేక కొన్ని నిజాల్ని వారిముందుంచవచ్చు.
అది అంబరీషుడికి మరింత నష్టమవుతుంది.
అలాంటి నష్టం తనపరంగా జరక్కుండా వుండాలంటే ముందుగా తనను ఉద్యోగంనుండి బయటకు పంపి....
ఆ తర్వాత....
ఈ లోకం నుండే బయటకు....
ఆలోచన రావటంతో జనార్ధన్ గుండె 'ఝుళ్'మంది. ఎవరో చరిచికొట్టినట్టయింది. మనిషిలో ఒకరకమైన షేకింగ్ మొదలయింది.
తన గుండె చప్పుడు తనకే వినపడటం మొదలయింది. శరీరం చెమటలుపట్టి వంటిమీద బట్టలు తడిసిపోయాయి.
ఆ సమయంలో అతని దగ్గర ఎవరూలేరు. ఎవరైనా వుండి వుంటే ఒక్కసారి పట్టుకుని.....
"వాట్ హాపెండ్ జనార్ధన్! ఎనీ సీరియస్ నెస్....." అంటూ అమాంతం ఒక వెహికల్ ని పిలిచి అందులోకి తనకు తీసుకుని నియరెస్ట్ ఆసుపత్రికి తరలించటం జరిగేది.
అడుగులు తడబడుతూ అలాగే ముందుకుపోయి-
ఓ సిటీబస్ వస్తుంటే దానిలోకి ఎక్కాడు.
తన గమ్యం....
ఇంటికి చేరడం....
కానీ జనార్ధన్ కి అప్పుడే ఇంటికి వెళ్ళడానికి భయం వేసింది.... తనకెందుకో ఎక్కడ దిగాలన్నా ఆ సమయంలో భయంగానే వుంది. బస్సులో కండక్టరు టిక్కెట్టు ప్లీజ్ అన్నప్పుడు....
అతని చేతిలో వందరూపాయలు పెట్టి-
"ఇది ఎక్కడివరకూపోతుందో అక్కడికివ్వు....ఆ తర్వాత ఎటుపోవాలో చెపుతాను" అన్నాడు.
కండక్టర్ జనార్ధన్ వంక విచిత్రంగా చూసి__
"భలేవారే సర్! స్టేజీ చెప్పండి."
"ప్రస్తుతం చెప్పే పరిస్థితిలేదు."
"పోనీ గుర్తుతెచ్చుకునే చెప్పండి" అంటూ అతడు నవ్వుతూ ముందుకుపోయాడు.
జనార్ధన్ కు ఎక్కడ దిగాలో తెలీక...ఏ బస్సెక్కటం జరిగిందో తెలీక...
ఆలోచల్నీ, భయాన్నీ కంట్రోల్ చేసుకుని-
ఒక నిర్ణయానికి వచ్చాడు.
వెంటనే ఇంటికి చేరి....
తన భార్యనూ, పిల్లల్ని పుట్టినింటికి పంపి తనుమాత్రం కొన్ని రోజులు ఒంటరిగా తన ఇంట్లోనే వుండాలి. రాబోయే విషపరిస్థితి ఏ సమయంలో ఎవరిమీధకు తన పంజా విసురుతుందో గమనిస్తూ వుండాలి.
అతడలా ఆలోచించుకుంటూ అదే బస్సులో అలాగే కూర్చుని ప్రయాణం చేస్తున్న సమయానికి...

                                                      *    *    *    *
హైటెక్  ప్రేమానుభూతుల మత్తునుండి పావని బయటపడి ఆలోచిస్తున్న సమయానికి ఆమె తండ్రి ఆమె గదిలోకి ఎంటరయ్యాడు. ఆయన ఆగ్రహంగా వున్నాడు. కుమార్తెకు తన భయాన్ని మొత్తం వివరించి....చెప్పదల్చుకుంది చెప్పడం మొదలెట్టాడు.
"పావనీ! పరుధులు దాటుతున్నావ్!
ఈ వ్యవస్థ విచిత్రమయింది. పులి ఎంత క్రూరమయిందో చెప్పడం వల్ల ఉపయోగం వుండదు. ఆ పులిని వేటాడే ప్రాజెక్టుకు చేపట్టినవాడు గొప్పవాడు. విజయం అతనిదే అవుతుంది.
ఈ జనారణ్యంలో 'మనీ' రుచి మరిగినవాడు-అతడు దేశాన్ని పాలించే మంత్రే కావచ్చు మహా ప్రమాదకారి. మనిషి రక్తం రుచి మరిగిన పులిలాంటివాడు.
అదెంత రక్తం త్రాగిందో, ఎక్కడ త్రాగిందో చెప్పినందువల్ల ఉపయోగం వుండదు. ఎందుకంటే అవకాశాలన్నీ డానికే వుంటాయి.
ఈ జనారణ్యంలో చట్టాలూ, రూల్స్ అన్నీ అతనికే అనుకూలంగా వుంటాయి. అతన్ని అరెస్ట్ చేసినా 'బెయి'లిచ్చే దారి వుంటుంది. అతనికి శిక్ష పడినా రద్దుచేసే హైకోర్టులుంటాయి తిరిగి అతనికి బ్రహ్మరధంపట్టే ప్రజలుంటారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS