Previous Page Next Page 
ప్లే పేజి 22


    నాలుగు పెగ్గులు పూర్తయ్యాయి.
    
    అయిదో పెగ్గు తాగుతుండగా సూర్యవంశీకి సడన్ గా, ఓ ఐడియా వచ్చింది.
    
    కౌంటర్ వేపు నడిచి, ఫోన్ అందుకున్నాడు.
    
    టెలిఫోన్ ఎంక్వయిరీకి ఫోన్ చేసి, తనక్కావాల్సిన వివరాలు చెప్పాడు.
    
    మరో రెండు నిమిషాల తర్వాత అబిడ్స్ లోని రమేష్ చంద్ర అగర్వాల్ జ్యూయలరీ, షాపు ఓనర్ రమేష్ చంద్ర రెసిడెన్సీ నెంబర్ తెలిసింది.
    
    అగర్వాల్ రెసిడెన్సీకి ఫోన్ చేసాడు.
    
    షీలా కంపెనీలోని సల్మాతో రమేష్ చంద్ర కొడుకు సురేష్ చంద్ర వెళ్ళాడో లేదో తెలియాలి ముందు.
    
    రెండుక్షణాల తర్వాత వాయిస్ విన్పించింది.
    
    "అయామ్ మోహన్....సురేష్ ఫ్రెండ్ ని....ఒకసారి సురేష్ ని పిలుస్తారా...." హిందీలో అడిగాడు సూర్యవంశీ.
    
    "అరే భాయ్.... సురేష్ నహీహై.... బిజినెస్ టూర్ సే భువనేశ్వర్ గయా..."
    
    ఆ గొంతు ఎవరిదో ఊహించుకోగలిగాడు సూర్యవంశీ. అది సురేష్ తండ్రి రమేష్ చంద్రది.
    
    "థాంక్యూ..."
    
    చెప్పేసి వెనక్కొచ్చేశాడు సూర్యవంశీ.
    
    అంటే సురేష్ తన బిజినెస్ టూర్ కి కాల్ గర్ల్ తో వెళ్ళాడన్న మాట!
    
    అంటే కాల్ గర్ల్ సల్మాకి రమేష్ రెగ్యులర్ కస్టమర్ అనే విషయం సూర్యవంశీకి సులభంగానే అర్ధమైపోయింది.
    
    సల్మాతో తీరుబడిగా మాట్లాడాలంటే, భువనేశ్వర్ సరైన ప్రదేశం-
    
    వెంటనే గ్లాసులోని డ్రింక్ ని గడగడా తాగేసి, బిల్లు చెల్లించి బార్లోంచి బైటపడ్డాడు.
    
                                                     *    *    *    *    *
    
    చేతి వాచీవేపు చూసుకున్నాడు ఎ.సి.పి. నిరంజనరావు.
    
    1-20 నిమిషాలు.
    
    మరోసారి నాలుగు రోడ్లవేపు, సూర్యవంశీ ఫ్లాట్ వేపు చూసి జీప్ స్టార్ట్ చేశాడాయన.
    
    ఆ జీపు ఆ వీధి మలుపు తిరిగిన పదిహేను నిమిషాల తర్వాత ఆ మలుపులో ప్రత్యక్షమైంది సూర్యవంశీ హీరో హోండా!
    
                                                   *    *    *    *    *
    
    హీరో హోండాని పార్క్ చేసి, మెట్లెక్కి కీ తీసి రూమ్ లోకి అడుగు పెట్టాడు సూర్యవంశీ....లైటు వెయ్యగానే - కన్పించిన దృశ్యం చూసి విస్తుపోయాడతను.
    
    బ్లూ కలర్ కవర్స్ ఓ పది డోర్ మేట్ దగ్గర పడున్నాయి.
    
    సూర్యవంశీకి ఎప్పుడో తప్ప లెటర్స్ రావు. అతనిలాగే, అతని ఫ్రెండ్స్ కు కూడా బద్ధకం ఎక్కువ.
    
    అన్ని ఉత్తరాల్నీ చేతిలోకి తీసుకుని, పైనున్న ఎడ్రస్ వేపు చూసాడు.
    
    ఎడ్రస్ నీట్ గా టైప్ చేసి ఉంది.
    
    ఓపెన్ చేసాడు... అరఠావు సైజులో వైట్ ఎల్లోకలర్ పేపర్.
    
    ముడతలు విప్పాడు.
    
    అందమైన చేతివ్రాత.
    
    గబగబా చదవటం మొదలెట్టాడు సూర్యవంశీ.
    
    LOVE IS HAPPY
    IT IS AN INNER GLOW
    LOVE REMEMBERS
    AND WILL ALWAYS KNOW
    A CONSTENT BOND
    THAT OTHERS CANNOT SEE
    SEEMING FRAGILE
    BUT ABSOLUTE AND FREE
    
    మళ్ళీ మళ్ళీ చదివాడు సూర్యవంశీ తర్వాత అసలు ఉత్తరం ప్రారంభమైంది.
    
    డియర్ ఫ్రెండ్.... హౌ ఆర్యూ!
    
    మీకు కనీసం ప్రేమ గురించి ఆలోచించే తీరిక లేదనుకుంటాను కదూ...? అందుకే పైలైన్లు రాసాను. ప్రేమ గురించి ప్రాక్టికల్ గా తెలియకపోయినా అక్షరాల్లోనైనా ప్రేమ గురించి తెల్సుకొంటారని ఆశ.
    
    అది కాదండీ బాబూ-
    
    ఎప్పుడూ క్రైం వార్తలు, క్రైం ఇన్వెస్టిగేషన్లేనా చెప్పండి.....లైఫన్నాక, కొంచెం లవ్వు, మరికొంచెం కిస్సులు ఉండాలండి బాబూ.....అసలు మీరెప్పుడైనా, చక్కని అమ్మాయిని ముద్దుపెట్టుకున్నారా ఆలోచించండి.
    
    ఎందుకండీ వెధవ లైఫ్!
    
    ఓయ్, మైడియర్ ఫ్రెండ్.... పోనీ నన్నొక్కసారి ముద్దుపెట్టుకోగూడదూ....ముందు చాలా బాగుంటుందండీ బాబూ....యాపిల్ ముక్కల్ని, తేనెలో కలిపి తింటే ఎలా వుంటుందో ముద్దు అలా ఉంటుంది....
    
    ట్రై మీ వన్స్...
    
    ఇంతకీ నేనెవరో తెలుసా..... ఒక్కసారి ఆలోచించండి.... లేకపోతే ఏ రోజైనా.... మార్నింగ్ ఆరు, ఏడు గంటలమధ్య జింఖానా క్లబ్ లోని ఏరోబిక్స్ సెంటర్ కు రండి....
    
    నన్నూ.... నా అందాల్నీ చూడాలంటే రండి ఓ.కే...
    
    సీ యూ..... విత్... కిసెస్.... ఇంతకీ నా పేరు కనుక్కున్నారా? మనిషి ఆలోచనల వెనుక ఉండేది నేనే - అప్పటివరకు నేను పేరులేని ప్రేమికురాలినే.
    
                                                                                                            ఇట్లు
                                                                                                           అనామిక
    
    గబగబా కవర్లన్నింటినీ విప్పాడు సూర్యవంశీ. అన్నిట్లోనూ ఒకటే మేటర్...
    
    ఆశ్చర్యంగానూ, అద్భుతంగానూ ఉంది. చటుక్కున పోస్టాఫీసులోని అమ్మాయి గుర్తుకొచ్చింది. ఛ... కాదేమో! మరి!
    
    హౌస్ ఓనర్ పరబ్రహ్మం డాటర్స్ లో ఎవరైనా రాసారేమో.... ఏమో....
    
    ఎవరు రాసినా అలాంటి ఉత్తరం రావడం జీవితంలో అదే మొట్టమొదటి సారి సూర్యవంశీకి.
    
    ఆనందంగా నవ్వుకున్నాడతను.
    
    ఎదురుగా అందమైన అమ్మాయిని ఊహించుకున్నాడు.
    
    జలపాఠంలాంటి ప్రేమ గురించి ఆలోచించినపుదు మగవాడికైనా, ఆడపిల్లకైనా మొదట కలిగేది థ్రిల్లు.
    
    ఆ రియల్ థ్రిల్లుకి నాంది పలికింది ఆ ఉత్తరం.
    
    మరో అరగంట తర్వాత సూట్ కేసుతో, రూమ్ లోంచి బయటపడి ఆటో ఎక్కాడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS