Previous Page Next Page 
శ్రీమద్భగవద్గీత పేజి 15


     వాజసని పుత్రుడు యజ్ఞ్యవల్క్యుడు. కావున వాజసనేయి అయింది. మధ్యందిన మహర్షికి లభించినందున మధ్యందిన అయింది.
    మహీధరుడు కలియుగం వాడు. క్రీస్తు తదుపరి 8-10 శతాబ్దముల మధ్యవాడని అంటున్నారు.
    వ్యాసమహర్షి ద్వాపరాంతములో వేదాలను సంహితీకరించాడు. ఇవి నాలుగు అని భారతములో చెప్పబడినది. మహీధరుని భాష్యము ప్రకారము వ్యాసమహర్షి సంహితీకరించిన 'యజుర్వేదము' లుప్తమైనట్లు కనిపించుతున్నది. ప్రస్తుతము మనకు లభిస్తున్న యజుర్వేదాలు రెండు.
    1. వాజసనేయి మాధ్యందిన శుక్లయజుర్వేద సంహిత. దీనిని వాజసనేయ పుత్రుడు యాజ్ఞ్యవల్కి రచించాడు. ఋగ్వేదానికి రచయిత పేరు లేదు. కాబట్టి యిది వ్యాస సంహితకు విరుద్ధమే.
    2. మహీధరు చెప్పిన దాని ప్రకారము కలియుగాదిన చాలా కాలము యజుర్వేద సంహిత లోపించినట్లు కనిపిస్తున్నది.
    దీనికి కారణము జైన, బౌద్ధమతాలు కావుగదా? యాజ్ఞ్యవల్కి ఉపనిషత్తు కాలపువాడు. ఉపనిషత్తుల కాలము గూడా క్రీ.శ 7,8 గా పాశ్చ్యాత్తులు చెప్పుచున్నారు.
    ఉపనిషత్తుల విషయంలో రెండు అభిప్రాయాలువున్నవి.
    1. బౌద్ధులు, బుద్ధుని తర్వాత ఉపనిషత్తులు వచ్చాయని వాదిస్తారు.
    2. సనాతనులు ఉపనిషత్తు బుద్ధునికి పూర్వము నుంచే వున్నదని, బుద్ధుడు వానినుంచే జ్ఞానము గ్రహించాడని వాదిస్తారు. ఏది ఎట్లయినను "ఉపనిషత్తు" జ్ఞానభాండాగారము. యాజ్ఞ్యవల్కి రచించిన శుక్ల యజుర్వేదము వాస్తవముగా మంచి కవిత, మంచి సందేశము కల్గియున్నది. దీనిలో నలభై అధ్యాయాలు వున్నవి. చివరి అధ్యయము ఈశావాస్య ఉపనిషత్తుకు మూలంగా కనిపిస్తుంది. అందువల్లనే ఉపనిషత్తుకు వేదాంతము అను పేరు వచ్చింది.
    వేదాంతము వైరాగ్యము మాత్రము కాదు. యాజ్ఞ్యవల్కి గృహస్తు. అతనికి ఇద్దరు భార్యలు ఒకతె గృహిణి, ఒకతె బ్రహ్మవాదిని. యాజ్ఞ్యవల్కి యువకుడు, విద్వాంసుడు, తార్కికుడు, వక్త.
    సౌందర్య విషయములోను, కర్మకాండ విషయములోను, కవితా విషయములోను ఉత్తమ గ్రంథము అగును.
    ఇది వేదసంహిత అగునా?
    కృష్ణ యజుర్వేదము.
    కృష్ణయజుర్వేద తైత్తరీయ సంహిత అవసరము ఎందుకు ఏర్పడినట్లు? నేను గ్రహించిన దాని ప్రాకరము ఔత్తరాహులు యజుర్వేదాన్ని దాక్షిణాత్యులకు యివ్వలేదు. వారు వారి స్వంత యజుర్వేదాన్ని ఏర్పాటుచేసుకొన్నారు. ప్రస్తుతము సుమారు దాక్షిణాత్యులందరు కృష్ణయజుర్వేదులే. ఇది వేదసంహిత అగునా?
    అధర్వవేద సంహిత, అధర్వ, అంగిర రుషులకు బ్రహ్మ ప్రసాదించినది.
    ఇది వేదమగునా?
    ఇందును గురించి వేదవిదులు, విద్వాంసులు, తాత్వికులు చర్చించి ఒక నిర్ణయము తీసుకోవలసి వుంటుంది.
    వీటన్నింటిని దృష్టిలో వుంచుకొంటే వ్యాసుడు సంహితీకరించింది ఒక ఋగ్వేదమే అను విషయము స్పష్టమగుచున్నది. కావున 'యునెస్కో' వారు ఋగ్వేదాన్ని మాత్రమే జ్ఞాపికల రిజిష్టరులో చేర్చడము పాశ్చాత్యుల దోషముగా పరిగణించరాదు.
    ఇది భారతీయుల దోషము మాత్రమే అగును.
    వేదానికి ఇన్ని ముళ్ళు, సుళ్ళు, గుళ్ళు ఉంటాయని ఆలోచించి ఉండరు. ఇది ఆలోచన మాత్రమే! వాటని ప్రజ అంగీకరించారు. ఎంతటి వాడును ఏమీ చేయజాలడు.
    
                                            వేదం - పాశ్యాత్తులు
    
    The Veda has a two - fold interest: it belongs to the history of world and to the history of india.....As long as man continues to take an interest in the history of his race, and as long as we collect in libraries and museums the relics of former ages, the first place in that long row of books which contain the records of the Aryan branch of mankind, will belong for ever to the Rigveda.
    "వేదం కన్నా విసుగు కలిగించేది ఏది? అయినా ఇది ఆర్య మానవుని తొలి నోటిమాట అని తెలుసు కొన్నపుడు వేదానికన్నా ఆసక్తికరం అయింది మాత్రం ఏది?
    వేదానికి రెండు రకాల ఆసక్తి - ప్రయోజనం వుంది. వేదం భూగోళ చరిత్ర భారత చరిత్ర అగును. మానవుడు తన జాతి చరిత్రలో ఆసక్తుడైనంతకాలం అతడు గత కాలం కోసం గ్రంథాలయాలను ప్రదర్శనశాలలను, అవశేషాల కొరకూ అన్వేషిస్తూనే ఉంటాడు. అలాంటి అన్వేషణలో - గ్రంథ పరంపరలో - నిరంతరం దర్శనం ఇచ్చేది ఋగ్వేదం. మానవులలో ఆర్యులకు సంబంధించిన సమస్త వృత్తాంతం ఋగ్వేదంలో నిక్షిప్తం".
    జీన్ లీ మీ ఇలా వ్యక్తపరిచారు:    
    "Precious of durable materials -gold, silver, bronze, marble, onyx or granite - have been use by most ancient people in an attempt to immortaize their achievements. Not so, however, with the ancient Aryas. They turned to what may seem the most volatile insubstatial of all - the spoken word - and out of this bubble of air fashioned a monument which more than thirty, perhaps forty, centuries later stands untouched by time or the elements. For the pyramids have been eroded by the desert wind, the marble broken by earth quakes, and the gold stolen by robbers, while the Veda remains recited daily by an unbroken chain of generations, travelling like a great wave through the living substance of mind."
    'అత్యంత పురాతన నరుల్లో అనేకులు - తమ విజయాలను శాశ్వతపరచడానికి, విలువైన మన్నికగల బంగారం -వెండి - కంచు - పాలరాయి - నల్లరాతిని వాడారు. సనాతన ఆర్యులు మాత్రం భిన్నంగా వ్యవహరించారు. వారు త్వరగా చెరిగే, అస్థిర రూపం గల అక్షరాన్ని - శబ్దాన్ని ఎన్నుకున్నారు. ఆర్యులు ఈ గాలిబుడగతో తీర్చిదిద్దిన నిర్మాణం ముప్పది నలుబది శతాబ్దాల తరువాత కూడా కాల, ప్రాకృతిక ప్రభావాలకు అతీతంగా చెక్కుచెదరక నిలిచి ఉంది. పిరమిడ్లు ఎడారి గాలులకు తరిగిపోయాయి. పాలరాతి కట్టడాలు భూకంపాలకు కూలిపోయాయి. బంగారం దొంగలపాలైంది. వేదగానం మాత్రం నిత్యం నిరంతరం తరతరాలుగా వినిపిస్తున్నది. ఆ వేదస్వరం మేధస్సు యొక్క సజీవ పదార్ధంగా - అలలుగా, తరంగాలుగా పయనిస్తూనే వుంది'.
    ఇంతటి అక్షయ, అనంత అవినాశ్య అమృత వేదసంపద ఉన్నందుకు భారతీయులంగా మనం గర్వించాలి. పొంగిపోవాలి. గంతులు వేయాలి. మేమే మానవజాతికి మనుగడ కల్పించాం. అని కేకలు పెట్టి చాటిచెప్పాలి.
    కాని మనం చెప్పడం లేదు. పైగా సిగ్గుపడుతున్నాం. న్యూనత కనబరుస్తున్నాం. మనం ఎందుకు ఇంకా సాంస్కృతిక బానిసలంగా ప్రవర్తిస్తున్నాం? మనకు వాస్తవంగా ఉన్న గౌరవాన్ని ఎందుకు చాటుకోలేకపోతున్నాం? ఎందుకు పాశ్చాత్యుల పైపై మెరుగులకు పడిచస్తున్నాం. ఇందుకు కారణంబైన కథాక్రమం బెట్టిదనిన:
    విదేశీయులు ఏనాడూ తమ బలంతో భారతదేశాన్ని గెలువలేదు. భారతీయుల అనైక్యత, కొందరు చేసిన దేశద్రోహమే విదేశీయుల విజయానికి కారణం అయింది. ఇస్లాం భారతదేశాన్ని వేయేండ్లు పాలించింది. అదే కాలంలో ఇస్లాం గెలిచినా ఇతర దేశాల్లో ఇస్లాంను తప్ప దేన్నీ మిగులనీయలేదు. కాని మహోన్నత భారత తాత్వికత - సంస్కృతి భారతీయ ఇస్లాంను ప్రభావితం చేశాయి. రాజ్యాలు వదులుకుని ఉపనిషత్తులు అనువదించిన రాకుమారులు ఉన్నారు!
    "యూనానొమిస్రో రుమా, సబ్ మిట్ గయేజహాసే
    అబ్ తక్ మగర్ హై బాకీ నామో నిషా హమారా
    కుచ్ బాత్ హైకి హస్తీ మిట్టీనహీ హమారీ
    సదయోఁ రహాహై దుష్మన్, దొరే - జమాహమారా"అంటాడు ఇక్బాల్ మహాకవి.
    'గ్రీకు ఈజిప్టు రాములు చెరిగిపోయాయి. లోకంలో నిలిచి ఉన్నాయి ఇంకా మన పేరు ప్రఖ్యాతులు కాలగతి శతాబ్ధా శత్రువై నిలిచినా మన అస్తిత్వం నిలిపే మహత్వం ఏదో ఉంది'
    మహత్వం ఎంతటిదైనా నిలుపుకోవడం సమాజం మీద ఆధారపడి ఉంది. నాగరికత, సంస్కృతి, ఆలోచనా విధానం నిరంతరం ప్రవహించే నదిలాంటిది. వాటిలో కొత్తనీరు చేరుతుండాలి. అలా కాకుంటే నీరు మురికియై కుళ్ళి, మానవాళికి మేలుకు బదులు కీడు జరుగుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS