పదిరోజులు వెనక్కి...
1945 ఏప్రిల్, 20
యాభై ఎనిమిది అడుగుల లోతులో ఉన్న బెర్లిన్ లోని బంకర్ అది. అందరికీ చాక్లెట్లు పంచుతున్నారు. అక్కడ వాతావరణం ఆనందంగా ఉంది. అది కర్మణీ చాన్స్ లర్ పుట్టినరోజు. చాన్స్ లర్ చాక్లెట్లతో పుట్టినరోజు చేసుకోవడం అదే మొదటి సందర్భం. అదే చివరి సందర్భం కూడా.
అదే ప్రాంతంలో 58 అడుగుల పైన సైనిక కవాతు మోతతో బెర్లిన్ నగరం మారు మ్రోగుతోంది. రష్యా ఎర్రదండు, మిత్ర రాజ్యాల సైన్యం బెర్లిన్ ను చుట్టుముట్టాయి.
అప్పటికే తన రాజ్యం ఓటమి గురించి హిట్లర్ కు స్పష్టంగా తెలుసు. భవిష్యత్తు రేఖామాత్రంగా ఏం జరగబోతుందో కనిపిస్తోంది. హిట్లర్ ప్రకారం అప్పటికీ అతని చేతుల్లోనే జర్మనీ పగ్గాలు ఉన్నాయి!
1945 ఏప్రిల్, 28
నియంత కూడా మనిషే అని నిరూపించిన స్త్రీ ఎవాబ్రౌన్ కన్నీటితో మౌనంగా రోదిస్తోంది. మరోవైపు కాగితాలన్నీ సిద్దమవుతున్నాయి. వాటిమీద చాన్స్ లర్ హోదాలో హిట్లర్ సంతకాలు చేస్తున్నారు. బహుశా అప్పటికే హిట్లర్ ను బంధించి బెర్లిన్ వీధుల్లో ఎలా ఊరేగిస్తారో వివరిస్తూ రష్యా చేసిన ప్రకటన ఆయన చెవిన పడినట్టుంది. అంతకు మునుపే తన మిత్రుడు ముస్సోలినీ (ఇటలీ నియంత)ని 'కాల్చి చంపిన' సంఘటన కూడా ఆయన చెవిన పడింది.
సంతకాల అనంతరం....ఎంతో భవిష్యత్తును కాదనుకుని తనతోనే ఉన్న ఎవాబ్రౌన్ తో జీవితాన్ని పంచుకోవదానికి హిట్లర్ సిద్దమయ్యాడు. వారిద్దరూ పెళ్ళితో ఒక్కటయ్యారు.
హిట్లర్ - చాన్స్ లర్ గానే మరణిస్తాడు!
అతని ఆదేశాల మేరకు అనుచరులు కదిలారు. మరికొద్దిసేపట్లో సైనైడ్ చేతిలో ఉంది.
మరణించేముందు తానెంతో ప్రేమించిన షీప్ డాగ్ పై సైనైడ్ ను హిట్లర్ పరీక్షించాడు. అది విలవిల్లాడుతూ ప్రాణం విడిచింది.
హిట్లర్ ఎప్పుడూ అంటున్నట్లే ప్రకృతి క్రూరంగా వ్యవహరిస్తూ మరో రోజును మింగేసింది. 1945 ఏప్రిల్, 30 రానే వచ్చింది. హిట్లర్ తనకు ప్రేమను పంచిన ఎవాకు సైనైడ్ పంచాడు. అప్పటికే తన జీవితాన్ని అతని చేతిలో పెట్టేసిన ఎవా సైనైడ్ ను ఇష్టంగా తీసుకుంది. ఇద్దరూ చెరికొంచెం తినేశారు.
సైనైడ్ పనిచేయకపోతే.....? మదిలో ఈ ఆలోచన మెదిలిన వెంటనే బుల్లెట్ హిట్లర్ నోటి గుండా తలలోకి దూసుకెళ్ళింది.
హిట్లర్ తననుతాను తుపాకితో కాల్చుకున్నాడు. ఎవా సైనైడ్ ప్రభావంతో చనిపోయింది. ('సాక్షి' సౌజన్యంతో)
మనిషికి నేల ఎంత?
ఆరు అడుగులు!
దహన కర్మకు అదీ అక్కరలేదు.
శాంతి పతాకము
రెండవ ప్రపంచ యుద్దము ఎనిమిది కోట్ల మందిని మింగింది. అది సుమారు ఒక దేశపు జనాభా అవుతుంది.
హిట్లరు నికృతముగా ఆత్మహత్య చేసుకొన్నాడు కాని యింతకు కొద్దిసేపు ముందు ఒక యువతిని, కుక్కని ప్రేమించాడు. వారినీ తనతోనే తీసుకొని వెళ్ళినాడు.
సంగ్రామము ముగిసింది.
శాంతి పతాకము వెలసింది
అదే యు.ఎన్.ఒ సంయుక్త రాజ్య సమితి
ఇది మానవ జాతికి కొంతవరకు శాంతిని ప్రసాదించింది. అరవై ఏండ్లకు పైగా మహా యుద్దాలు రాకుండా నివారించింది.
అందుకోసము అంతే కాకుండా రంగంలో గూడా కొన్ని పనులు సాధించింది. ప్రత్యేకంగా యు.ఎన్.ఇ.యస్.సి.ఒ యునెస్కో అంతర్జాతీయ సాంస్కృతిక సమాఖ్యను ఏర్పాటు చేసింది. వారు మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిష్టర్. (ప్రపంచ జ్ఞాపిక రిజిష్టరు)ను ఏర్పాటు చేశారు. ఇది 1997లో చేపట్టిన బృహత్ప్రణాళిక.
ఆ ప్రణాళిక అంతర్గతంగా భారతదేశపు ఋగ్వేదాన్ని ప్రపంచ మానవ సంపదగా భద్రపరచబడినది.
ఋగ్వేదానికి ప్రపంచ ప్రఖ్యాతి లభించుట కొత్త గాదు. కాని ఇతర బృహత్ గ్రంథాల సరసన చేరడము గణనీయమే.
పూణేలోని భండార్కర్ సంస్కృత విద్యా సమితి నుండి ఋగ్వేద తాళపత్ర గ్రంథాలను యునెస్కోకు చేర్చింది.
ఈ సందర్భములో నేను ప్రఖ్యాత పత్రికలో వ్యాసము ప్రచురించాను. అప్పుడు ఆ సంతోషానికి అవధులు లేవు. ఋగ్వేదానికి అధికార ప్రపత్తి కలిగింది. ఇందుకు నేనెంతో గర్వించాను.

నా సంతోషము గర్వము క్రమక్రమముగా నీరుగారసాగింది. భారతీయులు పవిత్రముగా భావించేవి నాలుగు వేదాలు. వాటిలో ఒక దానిని గౌరవించడము, మిగతా వాటిని అగౌరపర్చడము కాదా? ఇది గూడా తెల్లజాతి భారతీయుల విషయంలో మరొక దారుణము అనిపించింది.
అప్పుడు ఆలోచనలో పడిపోయాను. ఈ విషయములో తపన సాగింది. తాత్పర్యము ఏమనగా విషయములో తపన సాగింది. తాత్పర్యము ఏమనగా
శుక్ల యజుర్వేద సంహిత
ఈ వేదపు పూర్తిపేరు శ్రీమద్వాజసనేయి మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత. దీనికి ఈ పేరు రావడాన్ని గురించి మహీధర భాష్యం వివరించింది.
"తత్రాదౌ బ్రహ్మ పరంపరయా ప్రాప్తం వేదం వేదవ్యాసో మన్దమతీన్మనుష్యాన్విచింత్య తత్కృపయా చతుర్థావ్యస్య ఋగ్యజుః సామాధర్వాభ్యాం శ్చతురోవేదాన్ పైల, వైశంపాయన, జైమిని, సుమన్తుభ్య క్రమాదుపదిదేశ తేచ స్వశిష్యేభ్యో| ఏవం పరంపరా సహస్ర శాఖో వేదో జాతః| తత్ర వ్యాస శిష్యో వైశంపాయనో యాజ్ఞ్యవల్క్యాధిభ్య స్వశిష్యేభ్యో యజుర్వేద మధ్యాపయత్! తత్రదైవాత్కేనాపి హేతునాకృద్దో వైశంపాయనో యాజ్ఞ్యవల్క్యం ప్రత్యువాచ మదధీతం త్యజేతి| సయోగసామర్థ్యామ్మార్తాం విద్యాం విధాయోద్వవామ| వాంతాని యజూంషి గృహ్ణేతీతి గురూక్తా అన్యే వైశంపాయన శిష్యాస్తిత్తరీయో భూత్వా యజూంష్యభక్షయన్ |తాని యజూంషి బుద్ధిమాలిన్యాత్కృష్ణాని జాతాని| తతో దుఃఖితో యాజ్ఞ్యవల్క్య సూర్యమారాధ్య అన్యాని శుక్లాని యజూంషి ప్రాప్తవాన్ | తానిచ జాబాలి బౌధేయ, కాణ్వ, మాధ్యందినాదిభ్యః పంచదశ శిష్యేభ్యః పారితవాన్!.....వాజసనిస్తదపత్యం వాజసనేయ తత్రమాధ్యందినేన మహర్షిణా లబ్ధొ యజుర్వేద శాఖా విశేషోః మాధ్యిందినః|
తొలుత వేదం బ్రహ్మ నుంచి పరంపరగా లభించింది. వ్యాసమహర్షి మనుష్యుల మందమతిత్వాన్ని గురించి ఆలోచించాడు. వేదాన్ని నాలుగుగా విభజించాడు. అవి ఋగ్యజుస్సామాథర్వణ వేదాలు. ఆ వేదాలను వేద వ్యాసుడు క్రమంగా పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఉపదేశించాడు. వారి వారి శిష్యులకు ఉపదేశించారు. ఆ విధంగా పరంపరంగా వేదం సహస్రశాఖలది అయింది. తదుపరి వ్యాస శిష్యుడగు వైశంపాయనుడు యాజ్ఞ్యవల్క్యాదులగు తన శిష్యులకు యజురేద్వం ఉపదేశించాడు. ఒకప్పుడు వైశంపాయనునికి దైవికంగా- ఏదో కారణంగా- కోపం వచ్చింది. అప్పుడు యాజ్ఞ్యవల్క్యుని తన శిష్యత్వం నుంచి బహిష్కరించాడు. యజ్ఞ్యవల్క్యుడుడు యోగబలం కలవాడు. అతడు తను నేర్పిన విద్యను వాంతి చేశాడు - కక్కాడు. గురువు ఆజ్ఞాపించాడు. వైశం పాయనుని ఇతర శిష్యులు తిత్తిరి పక్షులు అయినారు. యజ్ఞ్యవల్క్యుడు వంత చేసిన విద్యను భుజించారు. ఆ యజుస్సులో బుద్ధిమలినములు. అందువలన కృష్ణ యుజస్సులు అయినవి. అప్పుడు యజ్ఞ్యవల్క్యుడు బాధ పడ్డాడు. అతడు సూర్యుని ఆరాధించాడు. సూర్యుని నుండి శుక్ల యజుస్సులను అందుకున్నాడు. ఆ యజుస్సులను జాబాలి, బౌధేయ, కాణ్వ, మధ్యందినాది పదిహేను మంది శిష్యులకు బోధించాడు.
