Previous Page Next Page 
శ్రీమద్భగవద్గీత పేజి 13


    3. కోటీ అరవై లక్షల మంది ప్రాణాలు బలిఅయినాయి.
    4.2 కోట్లమంది క్షతగాత్రులైనారు.
    5.30 లక్షల మంది యుద్ద ఖైదీలుగా పట్టుబడ్డారు.
    6.15 వేల కోట్ల డాలర్లు ఖర్చు అయినవి.
         ఇందులో ప్రజల పాట్లు చేరలేదు.
    1. నిత్యావసరాలు - మందులు దొరకని క్షోభ - చావులు
    2. నిరుద్యోగము, దొంగతనాలు, దోపిడీలు
    3. మానవ జీవితము అల్లకల్లోలము.
    ఇంతటి వినాశము. ఇంతటి క్షోభ, ఇంతటి అల్లకల్లోలము ఎవరికోసము? ఇదంతా కొందరి ఉన్మాదుల చర్యల పర్యవసానము మాత్రమే! వ్యాస భగవానుని నాటినుండి నేటివరకు విజ్ఞులు, మేధావులు, యుద్దము మాన్పించటానికి ప్రయత్నాలు చేస్తూనే యున్నారు.
    కాని దురాశా పిశాచము యుద్దాలను మాన్పించలేకున్నది. ప్రథమ మారణహోమము ముగిసింది. మరొకసారి శాంతి కపోతము ఎగసింది.
    లీగాఫ్ నేషన్స్ నానాజాతి సమితి ఏర్పడింది. ప్రపంచ ప్రజానీకము శాంతికోసం ఎదురుతెన్నులు చూసింది. అమెరికా పశుబలము నానాజాతి సమితిని నీట ముంచింది.
    
                                              ఓం శాంతిః శాంతిః
    
    రెండవ ప్రపంచ సంగ్రామము
    
    తొలి యుద్దములో హిట్లరుది పరోక్ష పాత్ర మాత్రమే. తర్వాత అతను బలపడ్డాడు. నిరంకుశ నియంత అయినాడు. జాతి ద్వేషపు సెగలు వెరిగాడు.
    విశ్వమంతా ఆదీకృతము చేస్తానని ప్రతినబూనాడు.
    "కృణ్వంతో విశ్వమార్యం"
    హిట్లరు ఫ్రాన్సు మీద దండయాత్ర చేశాడు. ఫ్రాన్సు దడుసుకొంది లొంగింది. కోట్లకొలది నష్టపరిహారము చెల్లించింది.
    హిట్లరు ఆ పరిహార బలంతో యుద్ద నౌకలను. జలాంతర్గాములను విపరీతముగా ఏర్పరచుకొన్నాడు.
    అతని బలము పెరుగుచున్నది. యూరప్ గజగజ లాడుతున్నది.
    యూరప్, ఫ్రాన్సు, అమెరికా తమ రక్షణకుగాను మిత్రమండలిగా ఏర్పడినవి.
    జర్మనీ, జపాను, ఇటలీలు త్రికూటమిగా ఏర్పడ్డవి. అనంతరం పెరల్ హార్బరు మీద బాంబుదాడి చేశాయి.    
    అది యుద్ద ఆరంభము
    యుద్దము ఐదు సంవత్సరాలపైన జరిగింది. హిట్లరు సామాన్యుడుగాడు. మిత్రమండలి ప్యాంట్లు తడిపాడు.
    మిత్రమండలి ఓటమి అంచుకు చేరింది. హిట్లరు వొకదాని తర్వాత ఒక దేశాన్ని ఆక్రమించక పోతున్నాడు. మిత్రమండలి దిక్కులేని దీనులై సహాయము కొరకు ఎదురుచూడసాగినారు. విధి విచిత్రమైనది. హిట్లరు తను ప్రపంచ అధినేత అయినానని అనుకొన్నాడు.
    అప్పటికి రష్యా యుద్దములో పాల్గొనుట లేదు. హిట్లరుకు వినాశకాలము వచ్చింది. విపరీత బుద్ధి పుట్టింది.

    రష్యామీద దండెత్తాడు.
    
    అది కమ్యూనిస్టు రష్యా. ప్రజ ఎర్రసైనికులతో భుజము కలిపి పోరాడారు. రష్యా ఒక మహాభూతముగా జర్మనీ మీద పడింది. రష్యా మిత్రమండలిలో చేరింది.
    జర్మనీ బలహీనపడింది.
    మిత్రమండలి బలపడింది. యుద్దము సాగుతూనే వుంది. కాని గెలుపు కనుచూపుమేరలో లేదు.
    6 ఆగస్టు 1945 మానవ వినాశ దినము. ఆ రోజే అమెరికా విమానాలు జపాను దేశపు హిరోషిమా నగరము మీద అణుబాంబు ప్రయోగించింది. అది ఎంత వినాశకారి అనగా హిరోషిమాలో సమస్త ప్రాణి జాలము మానవులు, పశుపక్ష్యాదులు, జంతువులు మాడి మసైనాయి. ఏదీ మిగులలేదు. అది జపాను రేడియో వార్త.
    అమెరికా లెక్కల ప్రకారం 1,40,000 మంది మానవులు వెంటనే హతులైనారు.
    అణుధార్మికశక్తి అతి ప్రమాదము. రానున్న తరాల మీద కూడా వుంటుంది. వ్యాధులు పీడిస్తూ వుంటాయి. 2012 సం||లో సహితము 1945 నాటి అణు పీడితులు యింకా ఉన్నారు.
    అమెరికన్ గణితము ప్రకారము పరోక్ష ప్రభావము వల్ల మృతుల సమాఖ్య రెండు లక్షలు కావచ్చును అని అంచనా.
    హిరోషిమా జపాను ప్రధాన నగరాలలో ఒకటి. వాణిజ్య కేంద్రము సైనిక శిబిరము. ఆయుధాగారాలు వున్నవి. మహా భవనాలు తలెత్తాయి.
    సమస్తము భస్మీపటలము. హిరోషిమా శ్మశానముగా మారింది.
    ఇంత వినాశము జరిగినా జపానుకు ప్రపంచ ఆధిపత్య దురాశ వదలలేదు.
    యుద్దము నుండి వెనుదిరగలేదు. లొంగిపోలేదు. అవి ప్రజా ప్రభుత్వాలండీ. రెండు లక్షల మంది అమాయక ప్రజల రక్తము చాలలేదు. మానవత్వము తలెత్తలేదు. పిసరంత బాధలేదు.
    అమెరికా పిశాచ కాంక్ష.
    జపానును లొంగదీయాలి.
    తే 9-8-1945న అమెరికా నాగసాకీ నగరము మీద మరో అణుబాంబు ప్రయోగించింది మరో లక్షమందిని మసిచేసింది.
    మనిషి రక్తము మరగిన పులికి మరో రక్తము రుచించదు. అప్పుడు జపాను మేల్కొన్నది. సమావేశాలు చర్చలు, ఉన్నత నిర్ణయాలు అన్నింటి తర్వాత జపాను ప్రభుత్వం లొంగిపోతున్నట్లుగా ప్రకటించింది.
    2-9-1945న రెండవ ప్రపంచ మారణహోమము ముగిసినట్లుగా ప్రకటన వెలువడింది.
    ఇవి ప్రపంచ వినాశపు లెక్కలు
    1. యుద్దము 1-9-1939న మొదలైంది.
    2. ముగింపు 2-9-1945పాల్గొన్న దేశాల సంఖ్య:
    మిత్రమండలి 23, జర్మన్ పక్షము 13, మృతుల సంఖ్య ఎనిమిది కోట్లు, జయాపజయాలు యుద్దభూమిలో తేల్చుకొనరాదా? ఆయుధ బలముతో అమాయకులను హతమార్చిటయా.
    ఆదిమానవుడు రాతితో కొట్టుకున్నాడు. నేటి రాచకీయాలు రాకెట్లతో వినాశము సృష్టిస్తున్నారు. ఇదీ మనం సాధించిన సంస్కారము.
    జర్మన్ నియంత ఆత్మహత్య చేసుకున్న విధానంబు ఎట్టిదనగా -
    దీపం పురుగు దీపాన్ని మింగబోతుంది. కాలిచస్తుంది! యుద్ధం ముగిసింది! హిట్లర్ ఆత్మహత్య చేసుకొన్నాడు.
    హిట్లర్... విభిన్నతకు చిహ్నం మాంసాహారమే ముట్టని ఈ జర్మనీ నియంత చరిత్రలో అతిపెద్ద సంఖ్యలో సామూహిక హత్యలకు కారణమైన వారిలో ఒకరు. ప్రపంచాన్ని వెనక్కు నడిపించి రెండో ప్రపంచయుద్దానికి నాంది పలికిన హిట్లర్ జంతు ప్రేమికుడు. ఒంట్లో రక్తాన్ని పరుగులు పెట్టించగల వక్త. నియంతృత్వ నిర్ణయాలు, విపరీతమైన రాజ్యాకాంక్ష అణువణువూ నిండిన నాజీ నాయకుడు. చివరి రోజుల్లో అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరోజు హాట్ న్యూస్.... ఈ రోజు చరిత్ర.
    1945 ఏప్రిల్, 30
    సమయం రాత్రి 9.30
    జర్మనీ ప్రజలంతా చెవులు రిక్కించి హాంబర్గ్ రేడియో వింటున్నారు. అంతలో ఓ ప్రకటన మీరు మరికొంతసేపట్లో అత్యంత ప్రధానమైన వార్తను వినబోతున్నారు.
    ఏమిటి? ఏమిటి? అంతటా ఉత్కంఠ. అయితే, అది హిట్లర్ కు సంబంధించినదని మాత్రం అప్పటికే అందరికీ తెలుసు. నిమిషాలు గడుస్తున్నాయి.
    సమయం రాత్రి 10.30
    'హాంబర్గ్ రేడియో శ్రోతలకు అతి ముఖ్యమైన వార్త మూడు నెలలుగా తన బంకర్ లోనే నివసిస్తున్న జర్మనీ చాన్స్ లర్ హిట్లర్ మరణించారు. ఆయన బలవన్మరణం పొందారు. జర్మనీ నాయకుడిగా, తన వారసుడిగా గ్రాండ్ ఆడ్మిరల్ డోనియెట్జ్ ను నియమించారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS