వేదము ఎంతటిది?
వేదము అంతటిది, ఇంతటిది అనుటకు ఉపమానాలు లేవు. వేదము ఆకాశ మంతటిది. వేదము భూమి అంతటిది. వేదము సాగరములంతటిది.
గగన గగనాకారం సాగర సాగరోపమః
కొన్ని సాదృశ్యములు ఉపమానములు లేనివి వుంటాయి. వాటిలో వేదము అత్యున్నతము! ప్రళయము వస్తుంది. సకలము జలమయమవుతుంది. భూమి అదృశ్యం గ్రహ నక్షత్రాదుల జాడ వుండదు. ఐనా వేదము వుంటుంది. ప్రక్షప్తముగా వుంటుంది. జ్ఞానానికి అంతము లేదు. వేదానికి ఆద్యంతములు లేవు. మహాఋషులే వేదాన్ని ఎరగలేక పోయినారు. ఎరగపర్చలేక పోయినారు.
నేను సామాన్యుడిని!
.jpg)
భారతీయులకు వేదము మీద అపార గౌరవము. భక్తి, శ్రద్ద. ఇది లక్షల సంవత్సరముల పూర్వపుది. మరికొన్ని లక్షల సంవత్సరములు కొనసాగునది. వేదము ఎవరికీ తెలియక పోవచ్చు. కొందరు వేదాన్ని తెలియనీక దాచినారు. ఐనను సామాన్య మానవుడు వేదమంటే ఆదరించకమానడు. గౌరవించకమానడు. శక్తి కొలది సమర్పించక మానడు.
వేదములో లేనిదే అగుగాక వేదమనగానే తల వంచక మానడు.
వేదము ఏమి చేసింది? అంటే వేదము ఏమి చేయలేదని ప్రశ్నించవలసి వస్తుంది. ఇంతటితో వేదప్రశస్తి నిలుపుదాం.
లోకమే కుటుంబము
రాచకీయులు నేలను చీల్చుకొని పాలిస్తున్నారు. వేదము భూమిని 'అ ఘండా'గా అన్నది. కాని రాచకీయులు నేలను పంచుకొన్నారు. కాని నీటిని, నీటి ప్రవాహాన్ని, పర్వతాలను పంచుకోలేకపోతున్నారు. నేల చెక్కకోసము, నీతి పాయకోసము యుద్దాలు సాగిస్తున్నారు. మారణ హోమాలు సృష్టిస్తున్నారు. శతసహస్ర మానవులను బలి యిస్తున్నారు. ఇలాంటి యుద్దాలు ఎన్ని జరిగినవో కాలానికి నాలుక యుంటేనే తెలుస్తుంది. మానవ జాతికి మొట్టమొదట తెలిసిన యుద్దము కురుక్షేత్ర సంగ్రామము. ఇందులో బలియైన ప్రాణులు పదునెనిమిది అక్షౌహిణులు.
ఒక అక్షౌహిణికి అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బది రథములు.
అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బది గజములు.
తురగములు అరువది ఐదువేల నాలుగు వందల పది. పదాతులు లక్షా తొమ్మిదివేల నాలుగువందల ఏబది మొత్తము ఏబది మూడు లక్షల, డెబ్బది నాలుగువేల ఎనిమిది వందలు.
ఇంతటి వినాశము సృష్టించిన కురుక్షేత్ర సంగ్రామమున సాధించినది ఎంత?
1. గెలిచిన ధర్మరాజునకు శాంతిలేకుండా పోయింది.
2. రాజ్యమున శాంతి కరవై ప్రజలు తల్లడిల్లారు.
3. భారతపు ఏడు శాంతి పర్వాలలోను అశాంతి చోటుచేసుకుంది.
భగవంతుని సృష్టి, ప్రకృతి వైచిత్రి యింతవరకు అర్ధము కాలేదు.
1. ఎంతటి బలిశాలియైనా తన శాసనము నెగ్గదు.
2. కొందరు మహా పురుషులు, మహానుభావులు మానవజాతి శాంతి సౌభాగ్యాల గురించి నిరంతరము తపిస్తుంటారు.
3. వారికి దేశకాలాదులతో నిమిత్తము లేదు. శాంతి సౌభాగ్యాలే వారి గమ్యం, వారి లక్ష్యం.
4. మహా వినాశనము తర్వాత ప్రశాంతి నాదం అవతరిస్తుంది.
5. కురుక్షేత్ర సంగ్రామము తర్వాత శాంతి వేదముగా భాగవతము అవతరించింది.
భాగవతము భగవద్భక్తి, శాంతిని, సామరస్యాన్ని ఉపదేశిస్తుంది. భాగవతము అధ్యయన మాత్రం చేత దుష్టశక్తులు దూరమవుతవి. సద్భావన కలుగుతుంది.
తెలుగుజాతి అదృష్టము మహాభాగవతులైన పోతన చేత బడటము.
నాకు పోతన మాత్రమే తెలుగు కవిగా దర్శనమిస్తాడు.
పోతన రససృష్టి ఒక్కొక్కచోట వ్యాసుని గూడ అధిగమించింది.
సీ|| మందార మకరంద మాధుర్యమునఁదేలు
మధుపంబుబోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూగు
రాయంచ సనునే తరంగిణులకు
లలితరసాలపల్లవ ఖాదియైచొక్కు
కోయిలసేరునే కుటజములకుఁ
బూర్ణేందు చంద్రికాస్ఫురిత
చకోరకమరగునే సాంద్రనీహరములకు
తే|| అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృతపాన విశేషమత్త
చిట్టామేరీతి నితరంబుఁ జేరనేర్చు
వినుతగుణశీల! మాటలు వేయునేల?
వందే శ్రీ మహాభాగవతము.
తొలి ప్రపంచ సంగ్రామము
అనగనగా ఒక రాజు. అతడు జర్మనీ దేశాన్ని పాలించాడు.
అతని కన్నులకు పొరలొచ్చాయి. ఒంట్లో మదం గూడుకట్టుకొన్నది.
అతని నామధేయము హిట్లర్
హిట్లర్ తన్ను ఆర్యుడు అనుకొంటాడు. అతడు శాకాహారి. అతని పతాకం స్వస్తికము. ఆర్యులకే పరిపాలించే హక్కున్నది. అది అతని నినాదము.
సం|| 1914లో హిట్లరు యూరప్ మీద దండెత్తాడు. అన్ని దేశాలను గజగజలాడించాడు. యూరప్ హిట్లరు పాదాక్రాంతము కావలసిందే. కాని అమెరికా యూరప్ ను ఆదుకొంది.
జర్మనీ దేశము చావుదెబ్బ తిన్నది.
ప్రథమ ప్రపంచ సంగ్రామం పేర జరిగిన మహా మారణకాండ 1914 నుండి 1919 వరకు జరిగింది. తర్వాత శాంతపడేప్పటికి 1927 అయింది.
అందుకు సంబంధించిన లెక్కలు వివరాలు:
యుద్దంలో బానిస దేశాల సైనికులు భారతదేశ సైనికుల సహితంగా యుద్దములో పాల్గొన్నారు. అప్పటి భారత సైనికులు వివరించిన దాని ప్రకారము నల్ల సైనికులను ముందువరుసలో నిలిపేవారు. నల్లవారు చచ్చిన తర్వాత తెల్లవారిమీద దాడి. ఇది నల్ల- తెల్ల సైనికుల ప్రాణాల విలువ.
ఈ యుద్దంలో
1. 24 రాజ్యాలు పాల్గొన్నాయి.
2. 6 కోట్ల మంది సైనికులు యుద్దము చేశారు.
