Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 11


    యీ మధ్యకాలంలో మరికొన్ని తెలుసుకుంది. తనకి ముందు__వొకరి తరవాత వొకరు యిద్దరు స్త్రీలతో అతనికి కాస్త దగ్గరి సంబంధం వుండేదని, ఐతే యెవరికీ యింత ఆధిక్యత యివ్వలేదనీ, వాళ్ళిప్పుడు యెక్కడ వుంటున్నదీ తెలుసుకోలేకపోయింది. స్త్రీ లోలత్వం లేదు. దేనికదే. షోగ్గా వుండే సెక్రటరీ రోజీ, సెక్రటరీ మాత్రమే.
    తార మంచం మీద వుంది.
    అతను సోఫాలో వున్నాడు.
    తార కళ్ళలోకి చూస్తూ, "తారా" అన్నాడు. అతని కళ్ళలో కోర్కె.
    లేచి మంచం దగ్గిరికి వచ్చాడు. ఆస్తనాలు, పొట్ట, బొడ్డు__చూసి నిగ్రహించుకోలేక కంపించిపోతాడు.
    అతను చీర కుచ్చిళ్ళు లాగకముందే, బ్లౌజు హుక్కులు తప్పించక ముందే__తార తన వలువలు ఒక్కొక్కటే వొలుస్తూ వుంటుంది. వొకటి వొలిచి సోఫా మీదకి, మరొకటి కార్పెట్ మీదకి, మరొకటి పైకీ, మరొకటి అతని ముఖం మీదకీ విసురుతుంది.
    తన స్తనాలనూ పొట్టా బొడ్డూ పొత్తికడుపూ చూస్తూనే రెచ్చిపోయే అతనిని__తార, రకరకాల కవ్వింపు పనులతో పెదాలతో కళ్ళతో స్తనాలతో జబ్బలతో పొట్టతో బొడ్డుతో పొత్తి కడుపుతో తొడలతో_ విడివిడిగానూ సమిష్టిగానూ వెకిలి కదలికలతో రెచ్చగొట్టి వెర్రెత్తించి_ అతని కిందా అతని మీదా పడి పిచ్చెక్కిస్తుంది.
    కానీ ఆమె నిద్రాణ ప్రాణి. ఏనాడో కాలేజీలో చదివే రోజుల్లో తన పంచరంగుల కన్నెకలల భావనలు__నాడు పెళ్ళిచూపుల నాటితో అంతరించిపోయి_ఇంద్రారెడ్డితో కారులో షికారు తిరుగుతూ, గదిలో అతని కళ్ళలోకి చూస్తూ_అతని కళ్ళలో కనిపించిన ఆరాధన చూసినప్పుడు తిరిగి అస్పష్టంగా మెదిలినట్లనిపించిన ఆ సంస్పందన భావనలు_ సూర్యప్రకాశ్ తన మెడ నరంలో సూది గుచ్చి తనచేత నవ్వించిన క్షణాన శాశ్వితంగా అంతరించాయి.
    అప్పటికి వరసగా పదిమంది విటులు వొచ్చి వెళ్ళాక బాధగా హింసగా ఒళ్ళూ, మనసు హింసపడుతూండగా, పదకొండో విటుడు వస్తే_తన దాహం తీర్చమని ప్రాధేయపడుతున్నట్లుగా అతనిని నవ్వించి కవ్వించి రెచ్చగొట్టే వెకిలిచేష్టలన్నీ చేసే వేశ్యలో ఆ క్షణాన ఆ కోర్కె యెంత వుంటుందో; తారలో ఏ క్షణంలో అయినా అంతే కోర్కె వుంటుంది. తనలో యెంతా లేని ఆ కోర్కెని కొన్నివేల రెట్లలో మహా నేర్పుతో ప్రదర్శించటం నేర్చుకుంది.
    తారని చూడగానే__కొందరికి మల్లే సూర్యప్రకాశ్ కి వొళ్ళు వుద్రేకంతో బిగుసుకుపోతుంది. ఆమెని చూడగానే అతనికి మనసవదు; శరీరమవుతుంది. అలా అమాంతం వున్నపళంగా చేతుల్తో పళ్ళతో బిగించి వొత్తి గిచ్చి గుచ్చి పొంగు చల్లార్చుకోవాలనిపిస్తుంది. పశుకామం. పశుకామం అంటే ఫీలింగ్స్ లేని సెక్సొత్తిడి. గేదె యదయి__మీదకొచ్చిన దున్నపోతు కిర్రెక్కి__ఆ వొత్తిడి తక్షణం తీరిపోవాలి. ఆ వొత్తిడి గురించి అంతకు ముందుగానీ ఆ తరవాతగానీ యేమీ వుండదు. మనోస్పర్శ లేని శారీరకపు టవసరం. వొత్తిడిలోంచి, రాపిడిలోంచి, మాంస కండరాలను మండించి పొంగు చల్లార్చుకోవటం.

                                75

    హాస్టల్ హాలులో__
    "షేక్ అబ్డుల్లాని కాశ్మీర్ కి ముఖ్యమంత్రిని అవనిచ్చిందంటే __ దేశానికి ఇందిరమ్మ ముప్పు తెస్తున్నదనటానికి దాఖలా. వాడు, పశ్చిమ తూర్పు పాకిస్థాన్ లకి తోడు కాశ్మీర్ ని ఉత్తర పాకిస్థాన్ గా మార్చాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రి కాదట. ప్రధానమంత్రి అట. ప్రధాని పదవి దేశానికా, రాష్ట్రానికా? కాశ్మీర్ దేశంలోని రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కాదన్న మాట_" అని దయానంద భారతి హిందీలో చెప్పుకుపోతున్నాడు, కుర్చీలో కూచుని. అతని బుర్ర ముందున్న బల్లకి ఆనుతోంది.
    మధ్యలో అందుకుని, "తూర్పు పాకిస్థాన్ ని యెంత చాకచక్యంగా ఎగరగొట్టిందో మర్చిపోయావా!" అన్నాడు ఒకతను.
    "దేశంలో అన్నిచోట్లా నక్సలైట్లని కూడా అరెస్టు చేయిస్తోంది విచారణ లేకుండా. మొన్న కలకత్తాలో చంపించేసింది" అన్నాడు ఒకతను.
    "వాళ్ళని చెయ్యాల్సిందే_గూండాగాళ్ళు దొమ్మీగాళ్ళు హంతకులు. కానీ ప్రజాస్వామికంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వాళ్ళని మీసాకింద అరెస్టు చేయిస్తోంటే_"
    "మీసా కింద స్మగ్లర్ల నందర్నీ అరెస్టు చేయించి పారేస్తోంది."
    "అదంతా నాటకం. అరెస్టయిన వెంటనే బెయిల్ మీద విడుదలై వోబెరాయ్ రివాల్వింగ్ స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడుతుంటారు_ అరడజన మంది దసమొల లంజల్ని పక్కనేసుకుని, జయప్రకాష్ జీని బెదిరిస్తోంది, అరెస్టు చేస్తానని. చెయ్యనీ, తెలిసొస్తుంది. ప్రజావాహిని వువ్వెత్తున లేచి మీద విరుచుకుపడకపోతే చూడండి. నేను మొన్ననే వచ్చాను అటు బీహార్, యు.పీ. ప్రాంతాలు తిరిగి పరిశీలించి_"
    "దయానంద్ నిన్ను డి హాస్టల్ కి అర్జంటుగా రమ్మంటున్నారు. వెళ్ళు" అన్నాడు వేదపారాయణ హిందీలో, మెట్లమీది నుంచి దిగుతూ.
    దయానందభారతి చటుక్కున వెళ్ళిపోయాడు బయటికి.
    అసలు కారణం_ ఓ గదిలోంచి బయటికొచ్చి కారిడార్ లో నడిచి వస్తున్నాడు వెంకటేష్. వాళ్ళిద్దరూ, ప్రస్తుతం ముఖాముఖీ ఎదురుపడటం అంత మంచిది కాదని.
    వెంకటేష్ వచ్చాడు.
    కింది మెట్టుమీద నుంచుని వున్న వేదపారాయణ, "గుడ్ ఈవినింగ్ దోస్త్" అని మెట్లెక్కి వెళ్ళిపోయాడు.
    వెంకటేష్ మౌనంగా తల వూపి, బయటికి వెళ్ళిపోబోతూ, ఆగి బల్ల దగ్గిర నుంచుని పత్రికలు తిరగేస్తున్నాడు.
    "హలో వెంకటేష్ పత్రికలో శ్రద్ధగా చూస్తున్నావు యేంది? అంటూ వచ్చాడు నిరంజనరావు.
    "పొరపాటున ఏదైనా ఒక చిన్న నిజం కనిపిస్తుందేమోనని వెతుకుతున్నాను" అని ఇంగ్లీషులో అని గట్టిగా నవ్వాడు వెంకటేష్.
    "చాలావరకు జరిగిన విషయాలే రాస్తారుగా!" అన్నాడు. కొత్తగా చేరిన ఒకతను. అతను యూత్ కాంగ్రెస్.
    "ఈ పెట్టుబడిదారీ పత్రికలు వాస్తవాలు రాస్తయ్యా? అసంభవం. యెదురుకాల్పులలో మృతిచెందారని నిరపరాధుల్ని__యేదో మారుమూల పల్లెలో పనిచేస్తున్న ప్రైమరీ స్కూల్ టీచర్ నో గుమాస్తానో పోలీసు స్టేషన్ కి పట్టికెళ్ళి_వాణ్ని చంపి_వీళ్ళదగ్గిర స్టాకున్న నాటు తుపాకుల్లోంచి ఒక తుపాకీ, వీళ్ళు స్టోర్ చేసి వుంచిన ప్రజాపోరాట సాహిత్యంలోంచి కొన్ని పుస్తకాలు తీసి చూపెడతారు_ఇతరేతర కారణాలవల్ల. ఆ సంగతి పత్రికలకి తెలియదూ? తెలుసు. నిజంగా తెలియకపోతే వాళ్ళు అనర్హులు, చెప్పింది రాయటం కాదు పత్రికలంటే. నిజం శోధించి రాయాలి_" అన్నాడు ఇంగ్లీషులో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS