"మీ దగ్గర చాలా సత్యాలు నేర్చుకోవాలి." అంది రాజహంస చిలిపిగా.
ఈ వ్యాఖ్యానాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలీక చక్రపాణి గుటకలు మ్రింగుతున్నాడు.
"మరి పెళ్ళి కాని యువతి పెళ్ళయిన పరాయి మొగాడితో సంబంధం పెట్టుకోవటం తప్పు కాదా? అనడిగింది రాజహంస.
అతను కొంతవరకూ ధైర్యం తెచ్చుకుని భావయుక్తంగా నవ్వాడు.
'తప్పు"
"ఊ?"
"ఈ పదానికి వికృతంగా అనే అర్ధాలు, రూపాలు ఇవ్వబడింది గాని, ప్రపంచంలో అన్నిటికన్నా అత్యంత సహజమైనది .ఆదినుంఛీ మానవుడు అన్నీ తప్పించుకున్నాడు గాని, యీ తప్పు నుంచి తప్పించుకోలేకపోయాడు. కాబట్టి తప్పించుకోలేనివి తప్పు , ఎప్పటికీ తప్పించుకోలేనివి, అందరూ చేసేది కాబట్టి తప్పు కాదు అని అర్ధం చెప్పుకోవలసి వస్తుంది. అసలు దీర్ఘంగా ఆలోచిస్తే అందరూ చేసేది తప్పేలా అవుతుంది/ అయితే మనిషిలోని బలహీనత ఏమిటంటే తాను తప్పు చేస్తూనే తాను చేసిందాంట్లో పాయింట్ వుంది, అదే యితరులు చేస్తే నేరం అని ఘోరంగా వేలెత్తి చూపిస్తూ వుంటారు.
"మీ మాటలు వింటుంటే వాటిలో చాలా నిజాలున్నా యనిపిస్తుంది. కాని మీ మిసెస్ అలా చేసింది అనుకొండి , అలా అంటే యింకో పురుషుడ్ని ప్రేమించి , ప్రేమ వేరు, ఆకర్షణ వేరు కాబట్టి - అతన్తో శారీరక సంబంధం పెట్టుకుందనుకోండి అప్పుడు మీరేం చేస్తారు? సహృదయంతో అర్ధం చేసుకుంటారా? నేను మిమ్మల్ని వ్యాఖ్యానించడానికి అడగటం లేదు. అమాయకురాల్ని కాబట్టి తెలుసుకోవటం కోసమడుగుతున్నాను."
చక్రపాణి మొహం నల్లబడిపోయింది. కాని సాధ్యమైనంత వరకూ బయట పడకుండా సంబాళించుకుంటున్నాడు.
"జవాబు చెప్పరేం?"
"అలాంటి ....అలాంటి పరిస్థితి వొస్తే తప్పకుండా ...... అర్ధం చేసుకుంటాను."
'గుడ్ , మీ విశాల హృదయాన్ని , వున్నత భావాలకూ చూస్తోంటే నిజంగా ముచ్చటేస్తుంది. అలాగే ఇంకా కొన్ని సందేహాలున్నాయి. అడగవచ్చా?' రాజహంస నిజంగానే అమాయకంగా మొఖం పెట్టి అడిగింది.
"అడగండి" అన్నాడు చక్రపాణి ధీమాగా.
"సపోజ్! మనిద్దరం శారీరకంగా కలిశామనుకొండి. అలాంటప్పుడు ....అదే ....నాకేదయినా జరిగితే?
'అంటే?"
"అంటే.....ప్రేగ్నిస్న్ లాంటి దేమయినా వస్తే?"
"ఓహో అదా?" అది చాలా చిన్న సమస్య అయినట్టు ." ప్రేగ్నన్సీ రాకుండా చాలా మేధడ్స్ వున్నాయి నిరోద్, పిల్స్, సేప్టీ పీరియడ్ .....అవన్నీ నాకు కొట్టిన పిండి....
'అంటే చాలా మందితో మీకు...."
'ఛఛ అది కాదు పిల్లలు పుట్టకుండా యింట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా. అందుకని క్షుణ్ణంగా తెలుసు."
'అయితే మీరు పిల్లలు పుట్టకుండా యింట్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారన్న మాట."
'అదే అదే"
"ఒకవేళ .....పొరపాటునో గ్రహపాటునో ఆ మేధడ్స్ ఫెయిలయి నాకు ప్రేగ్నన్సీ వచ్చిందనుకొండి అప్పుడు."
"చాలా సింపుల్. ఎవరయినా దగ్గరకెళ్ళి ఎబార్షన్ చేయించేసుకోవచ్చు."
"డాక్టర్ దగ్గర కెళితే అక్కడ కొన్నాళ్ళు వుండవలసి వస్తే యింట్లో తెలియకుండా వుండటం కష్టం కదా" వాళ్ళకేం చెప్పాలి?"
"అబ్బే... ఎన్ని రోజుల్లోనా? మన అర్జేన్సీ ని బట్టి కొన్ని గంటలు వుంటే చాలు. కాలేజికి వెడుతున్నానో, సినిమాకో ఫ్రెండింటికో వెడుతున్నాననో .....బోలెడు ట్రిక్స్ లున్నాయి. అవన్నీ నేను చూసుకుంటాగా."
'అలాంటి పరిస్థితి వస్తే యిన్ని అబద్దాలు చెప్పాలన్న మాట."
"ఆధునిక సమాజ జీవితంలో అబద్దం ఓ బలమైన భాగం. అబద్దాన్ని ఆధారం చేసుకోకపోతే అడుగు ముందుకు వెయ్యలేం. దాన్ని చాలా సహజంగా తీసుకుని అలవాటు పడిపోవాలి. ఎంతో ప్రేమగా బయటకు కనిపించే భార్యా భర్తలే చిన్న విషయం దగ్గర్నుంచి పెద్ద సమస్యదాకా కొన్ని వందల సార్లు అబద్దం చెప్పుకుంటూ వుంటారు తెలుసా? పైగా అలా చెబుతున్నందుకు సిగ్గుపడరు. పడకూడదు కూడా.
"అబ్బా! అబద్ధానికి అంత ప్రాముఖ్యత వుందండీ?"
"మరేమిటనుకున్నావు" అంటూ తన మాటల ప్రభావం ఆమె మీద ఎంతవరకూ పడిందో పరీక్షించతానికన్నట్లు ముందుకు వంగి ఆమె భుజాల మీద చేతులు వెయ్యబోయాడు.
"ఆగండాగండి. మనిద్దరకూ యిలా దగ్గర దగ్గరగా రావటం అలవాటయితే .....కొన్నాళ్ళకు బంధంగా, ప్రేమగా మారిపోవచ్చు. నాకే ఎప్పుడు పడితే అప్పుడు మీ దగ్గరకు రావాలని మనసు పరుగులు తీస్తూ వుండవచ్చు. మీ,మమల్ని చూడకుండా నేను వుండ లేని స్థితికి రావచ్చు. అప్పుడు మీ ఆవిడ పుట్టింటికో, మరెక్కడికో వెళ్ళటం.....ఇలాంటి అవకాశాలోచ్చే దాకా వెయిట్ చేస్తూ ఉండాలి అంతేగా?"
'అంతేమరి" అని అనబోయి, తమాయించుకున్నాడు. ఆ మాట అంటే వచ్చే పరిణామాన్ని ఊహిస్తూ.
"దాందేముంది? మనం కలుసుకోవాలను కుంటే ఏదో హోటల్ లోనో, గెస్ట్ హౌస్ లోనో రూము తీసుకోవచ్చు . లేకపోతే నా స్నేహితులు కొంతమంది వున్నారు. వారిలో పెళ్ళికాని వారూ, పెళ్ళయి పెళ్ళాలకు దూరంగా వున్నవాళ్ళు వున్నారు. వాళ్ళ ఇళ్ళు ఉపయోగించుకోవచ్చు."
సపోజ్ కొన్నాళ్ళకు మీ ఆవిడకు తెలిసిందనుకోండి"
"ఎలా తెలుస్తుంది?"
"ఒకవేళ తెలిసిందనుకోండి"
