Previous Page Next Page 
రాజ హంస పేజి 6

 

    "ఒకదాంట్లో వ్యత్యసమున్నప్పుడు అదే మిగతా అంశాలలో కూడా విస్తరిస్తూ వుంటుంది అన్నది. అన్నాక తాను చాలా తెలివిగా మాట్లాడినట్లు తనకే తోచింది.
    "చాలా బాగా మాట్లాడావే" అన్నాడు అభినందనగా.
    రాజహంస నవ్వింది. అలా నవ్వినప్పుడు పెదవుల మధ్య వెలుగులతో బాటు కళ్ళలో మెరుపులు ప్రదర్శించటం ఆమెకు బాగా తెలుసు.
    "అలాగైతే అమెగార్ని ఎందుకు పెళ్ళి చేసుకున్నారు? కట్నానికి ఆశ పడా?"
    "నేను డబ్బు మనిషిని కాను. ఏదో .....కొన్ని కొన్ని బలవంతాలకు లొంగిపోవాల్సి వస్తుంది. కొన్ని కొన్ని తప్పిదాలు జరిగాక గాని, మొదట్లో బోధపడవు."
    రాజహంస సోఫాలో కొంచెం వెనక్కి వాలి మౌనంగా వూరుకుంది.
    వయసులో వున్న యువతీం యువకులూ మధ్య సంభాషణ ఎంత మధురంగా వుంటాయో , నిశ్శబ్దం కూడా అంతే తియ్యగా వుంటుంది.
    "అవును గాని చెప్పండి దేనికి రమ్మన్నారు? మళ్ళీ త్వరగా యింటికి వెళ్ళి పోవాలి."
    'అంత తొందరగా వెళ్ళి పోవాలా?"
    "మరి ఆలశ్యం చేస్తే ఇంట్లో కోప్పడరా?"
    "మీరూ....."
    అతని కళ్ళల్లోకి గ్రుచ్చి గ్రుచ్చి చూస్తోంది.
    "మీరంటే నాకు చాలా యిష్టం?"
    "ఈ మాట నాతొ చాలా మంది చెప్పారు."
    అతను కొంచెం చిన్నబుచ్చుకున్నట్లు మొహం పెట్టాడు.
    'అవును, కొంతమంది ముఖతః, మరికొందరు ప్రేమలేఖల ద్వారా.....
    "నా యిష్టమలాంటిది కాదు ఆరాధనతో కొడుకొన్నట్టిది. అతని మాటల్లోని నిజాయితీ నామే గ్రహించింది.
    "నన్ను ఎంతోమంది అమ్మాయిలూ ఆరాధించారు. ఉత్తరాలు రాశారు. స్నేహం కోసం ఆరాటపడ్డారు. కాని నేనెప్పుడూ చలించలేదు. కాని ఎందుకో .....మిమ్మల్ని చూశాక నాలో నిగ్రహం సడలిపోయింది."
    రాజహంస కన్నార్పకుండా అతని వంక అలాగే చూస్తోంది. నిజంగా అతను చాలా అందంగా వుంటాడు. ఆడవాళ్ళని నేక్కిరించే ఆకర్షణలూ మేసరిజమ్స్ అతన్లో పుష్కలంగా వున్నాయి.
    అతన్ని గురించి ఆమెలో కూడా చలనం లేకపోలేదు. కాని తాను స్త్రీ....జాగ్రత్తగా అలోచించి అడుగు వెయ్యాలి.
    "కాని.....మీకు పెళ్ళయి పోయింది."
    "సమాజంలో మనసులు స్వేచ్చగా విప్పుకోవటానికి ఈ పెళ్ళి అనే బంధం భయంకరమైన అడ్డంకి అని తెలుసు. కాని కొన్ని కొన్ని పరిస్థితుల్లో వీటిని చేదించుకుని పోవాలనిపిస్తోంది. రాజహంసా! నా గుండెల్లోని బాధ సూటిగా చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ  ఐ లవ్ యూ బై అల్ మీన్స్ ....ఐ....ఐ.....వాంట్ యూ..." అంటూ ధైర్యం చేసినట్టుగా ముందుకు జరిగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
    రాజహంసలో చిన్న ఉలికిపాటు , అయినా అభ్యంతరం చెప్పలేదు.
    బయటకు మాములుగా వున్నట్లు కనిపిస్తున్నా లోలోపల జాగ్రత్తగా ఆలోచిస్తుంది.
    "రాజహంసా, కొందరితో పరిచయం జీవితంలో ఓ వరం. మీతో ....నీతో ....అదే ....నిన్ను చూశాక నాలో కొత్త ఆశాకిరణం తళుక్కుమంది. నాలో అవరించుకున్న శూన్యం తొలగిపోయినట్టయింది. నీ ఊహలలో మునిగి, నీ గురించిన కలలో ముగ్ధుడియి పోతున్నాను"  మైకంలో వున్నట్లు మాట్లాడుతూ, ఆమె చేతి వ్రేళ్ళతో ఆడుకుంటూ మెల్లగా ఆ చేతిని దగ్గరకు లాక్కుని పదవుల దగ్గర పెట్టుకుని చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు.
    అప్పటికీ ఆమె మాట్లాడలేదు.
    "రాజహంసా" అన్నాడు.
    "ఊ" అంది గోముగా.
    ఒక్క క్షణం నిశ్శబ్దం.....
    "ఐ....ఐ...."అంటూ చేతినలా పట్టుకునే ముందుకు వొంగాడు.
    పెదవులు, పెదవులు కలుసుకోబోతున్నాయి.
    చివరి క్షణంలో రాజహంస మొహాన్ని ప్రక్కకి లాగేసుకుని అతని గుండె మీద చెయ్యి పెట్టి మృదువుగా వెనక్కి తోసింది.
    అతను కొంచెం చిన్నబుచ్చుకుని "ఏం? నేనంటే యిష్టం లేదా?" అనడిగాడు.
    "ఇష్టం అయిష్టం అలా వుంచండి. " ఇలా చెయ్యడంలో ,మీ ఉద్దేశ్యమేమిటి?"
    "ఎలా?"
    "నన్ను ఫిజికల్ గా హ్యాండిల్ చెయ్యాలనుకోవటంలో అనడిగేసింది డైరెక్టుగా.
    చక్రపాణి ముఖం వాడిపోయింది. జవాబు చెప్పటానికి తికమక పడ్డాడు.
    'చెప్పండి"
    కొంచెం సర్దుకున్నాడు. "చూడండి ఇంత సున్నితమైన విషయాన్ని డైరెక్టుగా విశదీకరించమంటే ఎలా? మీరంటే నాకు ప్రేమ వుంది ఆరాధన వుంది. పెళ్ళయి సంసార బంధంలో వున్నవాడ్ని కాబట్టి ఆ యోగ్యత లేదని వాదిస్తే అది వేరే శేష ప్రశ్న. యోగ్యతని మించి , బంధనాలను మించి పరుగెత్తుతూ వుంటుంది మనసు. మహామహా యోగీశ్వరులే మనసులకు కళ్ళాలు వెయ్యలేక లొంగిపోయారు. ఆ ఆకర్షణ అనేది అంతటి శక్తివంతమైనది. ప్రేమ, ఆరాధన లోలోపలే వుంచుకుని దూరంగా వుండి వాటిలోని అమృత్వాన్ని అనుభవిస్తూ వుండవచ్చు కదా అని మీరనవచ్చు కాని లవ్ లో నాకు నమ్మకం లేదు. అది కేవలం భ్రాంతి మాత్రమే ఆకర్షణ వున్నప్పుడు మనిషి దగ్గిరకు రాకుండా వుండటం అసాధ్యం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS