Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 53


    "ఉన్నారు" శాంతంగా అన్నారు.


    "మరి!" నిర్లక్ష్యంగా చూసింది ఆ దంపతులవేపు.


    "నూటికీ కోటికీ వున్నా వాళ్ళు నిన్ను కృష్ణమౌళి అంతగా నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి కోరుకోవటంలేదే."


    దెబ్బతిన్నట్టు చూసింది ఇందూ.


    ఆవిడ అన్నారు.


    "ఆడపిల్లకు అహంకారం, అతిశయం వుండకూడదమ్మా ఆడపిల్ల పురుషుడి నీడలో తలదాచుకోవటంలో వుంది గౌరవం"


    "అవన్నీ పాత కబుర్లు ఇప్పటి ఆడపిల్లలు ఎవ్వరూ అలా వుండటం లేదు."


    "అలా వుండటంలేదు అన్నవాళ్ళని ఒక్కళ్ళని చూపించు" అన్నారావిడ.


    వెంటనే జవాబు ఇవ్వలేదు ఇందూ.


    ఆవిడ చిన్నగా నవ్వుతూ అన్నారు.


    "మగవాడు అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్ళగలడు. అలా స్త్రీ అర్ధరాతరి ఒంటరిగా నడవగలదా! మగవాడి అండ స్త్రీకి ఎప్పుడూ వుండాలమ్మా."


    "ఆమె ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఎంత డబ్బు సంపాదిస్తున్నా స్త్రీ ఎప్పుడు అద్దాల్లో వుండే బొమ్మేనమ్మా."


    "ఇది సత్యం స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చినా అది అన్ని వేళల్లో కాదమ్మా ఆమెకు భర్త తోడు వుండాలి అతను మంచివాడు, బుద్ధిమంతుడు అయివుంటే ఇక స్త్రీకి కావలసింది కోరుకునేది ఏముంది. ఆ స్త్రీ జీవితం నందనవనమే" అంది ఆవిడ.


    "అవునమ్మా మీ ఆంటీ చెప్పిన మాటల్లో అక్షరాలా నిజం వుంది" అన్నారు ఆయన.


    "నిజం వుండొచ్చు వుండకపోవచ్చు కాని నేను మాత్రం కృష్ణమౌళిని పెళ్ళి చేసుకోవటం కలలో మాట. చావనైనా ఛస్తాను కాని అతన్ని మాత్రం పెళ్ళి చేసుకోను" అంది ఇందు ఖచ్చితంగా చెప్పేస్తు.


    లక్ష్మీనారాయణగారు బరువుగా నిట్టూర్చారు.


    ఎంతగా నచ్చచెప్పాలని చూసినా ఇందు నిర్లక్ష్యంగా పెంకిగానే చెపుతుంది.


    వాళ్ళమాట ఒకటీ వినటంలేదు.


    "సరే మేం చెప్పవలసింది చెప్పాం. అబ్బాయి మంచివాడు నీవు చేసుకుంటే సుఖపడతావు ఇతన్ని కాలదన్నుకుంటే నీ అదృష్టాన్ని కాలదన్నుకున్నట్టే నీవు మా మాట వినకపోతే ఏం చేస్తాం వస్తా" మంటూ లేచారు ఆయన.


    "మంచిది" అంటూ ఇందు కూడా లేచి నిలబడింది.


    ఆవడకూడా వెళుతూ అంది. ఇందు చెయ్యిపట్టి "చూడమ్మాయి విధి సంగతి నీకు తెలీదు. నోటిమాటలని నుదుటివ్రాత చెరిపి పారేస్తుంది. మనిషి పుట్టినప్పుడే బ్రహ్మముడికూడా వేసేస్తాడు. ఆ ముడి ఎవ్వరూ విప్పలేరు. నీకు కృష్ణతోనే ముడిపడివుంటే నువ్వు ఇప్పుడు ఎంత అరిచినా గీ పెట్టినా ఆ టైమువస్తే ఆ పెళ్ళి జరిగిపోతుంది. ఆ మూడుముళ్ళు పడిపోగానే మన్ను తిన్న పాములా పడి వుంటావు"


    "అప్పుడు ఈ కబుర్లు వుండవు, ఈ గడుసుతనం వుండదు అర్ధమయిందా!"


    "మేము వెళతాం" అంటూ ఆవిడ ఆయనతో వెళ్ళిపోయింది.


    ఇందూకి ఒళ్ళు మండిపోయింది,


    ఏదో అనాలని అనుకుంటుండగా వాళ్లు గుమ్మందాటి వెళ్ళిపోయారు.


    ఆయ్ ముసిలి ఎంతమాట అన్నావు.


    చెప్తా, చెప్తా పళ్ళు పటపట లాడించింది. నాకు ఆ కృష్ణమౌళికి ముడిపడి ఉండే వుంటుంది అని చెపుతావా!


    ఆ కృష్ణమౌళిగారు నాతో చాల్లేక మిమ్మల్ని పంపించారా!


    అడిగి రమ్మని.


    పాపం ఆయినా! చాల్లేక ఓడిపోయి కూర్చున్నారా!


    ఇంకా ఎన్నాళ్ళు ఓడిపోయి తనని యింటికి పంపించేస్తాడు.


    కబుర్లు చెప్పినంత తేలికా కథలు నడపటం! ఇందూ మనసులో నవ్వుకుంది.


    నాతో ఈ ముసిలిమేళం చాలగలదా వచ్చిన తోవనే వెళ్ళిపోయారు అనుకుంది.

    
                                                                  61


    లక్ష్మీనారాయణగారి దంపతులు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళుతూ ఇంద్రసేన గురించి చాలా చెప్పి వెళ్ళారు. ఇంద్రసేన చాలా మొండిది.


    మాట వినే రకం కాదని-


    వాళ్ళు ఆ విషయం చెప్పకుండానే తనకి తెల్సు.


    పెద్దవాళ్ళు కదా,


    వాళ్ళు చెపితే కొంచెం అయినా వింటుందేమో అని అనుకున్నాడు.


    అంబిక సలహా ఇవ్వటంతో.


    లక్ష్మీనారాయణగారి దంపతులు వచ్చారు, వెళ్ళారు.


    ఇక తన ప్రయత్నం ఉంది.


    అప్పటికీ లొంగకపోతే!


    అంబిక చెప్పినట్టు చేస్తే!


    ఎంత తను పట్టుదలగా ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకున్నా.


    అటు ఇందూకి కూడా మనసులో ఏదో ఒక మూల ప్రేమ రవ్వంత ఉండి ఉండాలి.


    ఇందూ అలాకాదే.


    తను అంటే మండిపడిపోతుంది,


    తను ఆమెను పెళ్ళిచేసుకుంటే.


    లక్ష్మీనారాయణగారు అన్నట్టు.


    అది బలవంతపు పెళ్ళే అవుతుంది గాని ఆ పెళ్ళివలన తనకు సుఖం, శాంతి సంతోషానికి బదులు మనసు అంతా అశాంతి మయం అయిపోతే! ప్రతి మగవాడు పెళ్ళి అంటే ఒక అందమైన కలగా అందంగా ఊహించుకుంటాడు.


    తనూ పెళ్ళి చేసుకోవాలని


    తన భార్య తననే మనసారా పిచ్చిగా ప్రేమించాలి అని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS