Previous Page Next Page 
శశిరేఖ పేజి 52

శశిరేఖకు సౌందర్యమే నీతి.వేరునితిలేదు. రామారావునకు  నితియే  ప్రభానము. నీతికి తనలో లోపము కనుగోనేనా రామారావు వ్యసనపడును. అతడు తన మార్గమునకు రాకున్న అతడితోడి  జివనము తనకును దుస్సహము.
శశిరేఖకు  సౌందర్యమే నీతి. దొంగతనము, అబద్ధము. ఆమెకు అంద వికారమ్తెన పనులు, కనుక  వారిని చూచిన అసహ్యము. రామారావు నీతి వేరు. అది లోకపు అభిప్రాయములపై యీ శ్వరుని యుద్దేశ్యములపై ఆధారపడ్డది. శశిరేఖ నీతి సుందరమగు ఆమె ఆత్మనుండి స్రవించిన ఆనంద ప్రవాహము. రామారావు కది అర్ధం కాదు. అందువలననే వివాహము పై అతని కాపట్టుదల. ప్రేమలేకున్న  భార్తతోనయినను నివసించుట ఆమెకు రోత, వికారము. మాయ ప్రేమ చూపుట  ఆమె చూపులలో  పాపము.ఈ అభిప్రాయము రామారావునకు రాకున్న అతనితో  జోవనము కష్టము.
హృదయమున నిరాశ యొకటి యుయించెను. జీవితమున తన కింక యుద్దేశ్యమేమియు లేనట్లు తోచెను.ఇంక ఆనందము శాంతియు లేవు తనకు.తన స్వేచ్చను  కోల్పోవు జీవితము దుర్భరము. నియమములు లేనివారితోడి  జీవితమంతయు దుర్భరము.ప్రేమలేనివంటరి జీవితముమరణతుల్యము. సంఘము శశిరేఖ అభిప్రాయములతో  అభివృద్ది నొందలేదు. ఇంక నామె కాశ  యెక్కడ?వీరి భక్తి జీవనము తనకురాదు.స్వేచ్చా జీవనమున ప్రేమలేదు. ఇంక జివింపకయు నొక్కటే.
ఆహ! ప్రేమాప్రవాహమున  కాకున్న జివనమెందుకు? నీతి కాదా ప్రేమ నీ విధముగా చంపునది?ఎట్టి  అసహజమగు బంధము నేర్పరచు కొనెను. మానవుడు? నితియని జివనానందమును కోల్పోవువాడు,చేతులు కట్టుకొని, కదలు స్వేచ్చను  కోల్పోయిన వానివలేనేకదా? ప్రేమయే జీవన రహస్యము.                          
తన హృదయమున  నుద్బవించి పరిపూర్ణనుభావముకొరకు పెనుగులాడు  ఆరాటముల  నావేశాముల  నేవరెరుంగుదురు! ప్రేమలేక  సౌందర్యము లేక తనున్నుప్పడని యుప్పోంగి, అణగక, లొంగక  తనను పెట్టు మహా బాధ లేవ్వరికి తెలియును? ప్రేమను  సౌందర్యమును  గోరు తన మహా తృష్ణను నరనరమును ప్రతి రక్త బిందువును,లాగి, పిల్చి, నలిపివ్తెచు యా తృష్ణను, ఎవరితో చెప్పిన నెవరు కనికరింతురు? దేహ సౌందర్యమున గాని, ఆత్మ సౌందర్యమునగాని, తన ప్రేమ తృప్తి నందదనిన తన నర్ధము చేసుకోను  వారెవ్వరు?ఇతర స్త్రిలవలె తానేదో యొక్క మానవునితో,ఏదో ఒక విధమగు శాంత జివనముతో సంతుష్టి నందలేదనిన నిజమని నమ్ము వారెవరు?తనతో యీ యాదర్శములలో, వాంఛలలో, బాధలలో, సానుభూతి చూపగల  వారెవ్వరు?  దుర్నీతిక్తే అపవిత్రతక్తే దేహ సౌఖ్యము కొరక్తే  పన్నిన పన్నాగమందురు. ఈ జీవనమున నింక ఆశ లేదు. లోకాభిప్రాయములపై నాధారపడి బ్రతుకు రామారావా తన ప్రేమను సంతుష్టి  పర్క్యచునది? ఈ జీవితమున నింక ఆశలేదు.తాను మరణించిన, యీఆశలు,యీ తృష్ణ పరిపూర్తి నోందునేమో?ఈ శరీరము రాలిన ఈ బంధనము వదలిన, ఈ బాధ తప్పనేమో?మరణమ్తెన రాకూడదా?కాని చావనిన ఆమెకు మహభితి యుదయించెను.ఆ తెర తరువాత ఏ ముండునో కదా?
నిముషము నిముషము తన రంగుల మర్చుచు, వజ్రమువలె పడమటయొక నక్షత్రము మెరయు చుండెను. పరువెత్తి  రెండుచుక్కలు గితలవలె రాలి మాయమయ్యెను నల్లని మబ్బొకటి ఆ నక్షత్రమును కబళింప ప్రయత్నించుచుండెను. సన్నని  చంద్రుడు ఒక పెద్ధమెడ  శిఖరము క్రిందకి జారుచున్నట్లుండెను. దగ్గరనున్న మేడపై ఒక పురుషుడును స్త్రియు నిలుచుని యుండిరి. గదిలోనున్న దీపపుకాంతి  వారిపై బడుచుండెను, యీ మెను వారు చూడలేరు. అత్తరుల వాసన ప్రసరించుచుండెను.శశిరేఖ మెడలో వేసికోనిన మల్లెమొగ్గలు విచ్చి వాసన వేయుచుండెను.ఆ మేడమీద స్త్రి చేతులు చాచి ఆ పురుషునివ్తెపు  తిరిగి ఏవో జాలిగా, నవ్వుచూ, పాట పాడుచుండెను.ఆ కంఠము శశిరేఖ హృదయమును దూసుకొని లోనప్రవేశించేను. మహా కలవర మొకటి యామెను కదలించెను. చల్లనిగాలికుంపాట్లలోని చిన్ని మొక్కల కదల్చుచు  వీచెను.గాలితోపాటు ఆ స్త్రి కంఠ స్వరముకూడ యూగుచుండెను.గాలి  కామె పైట చెరగు కదిలెను.ఆమె సవరించుకోని, పాడుచునే ఆ పురుషునివంక చిరునవ్వుతో చూచెను. ఆమె నేత్రములపై దీపము తళుక్కుమనెను. ఆహ  యెంతప్రేమ ఆ చూపులలో!
శశిరేఖకు మనసు  తలపులతో  ఆవేశములతో పరుగెత్తుచుండెను. ప్రేమాగ్నియందు జీవనమును  దగ్ధము చేయుటయే పరమావధి. ప్రేమ శక్తినేవరు  తిరస్కరింపగలరు? మదనాస్త్రమూల తాళు కవచ మింత వరకు కనిపెట్టినవారు లేరు.రామారావు మాత్రము  నితినితియని పెద్ద్దపలుకులే కాని తన ప్రేమను వదలగలడా? తన శక్తిచే  అతనిని లోబరచకోనలేదా? ఇతడా తనను  నిగ్రహింపగాలిగినది?ఎన్ని  దినములనుండి  తనను దూరముననుంచుచున్నాడు?తన ప్రేమకన్న నీతి నియమకములా అతనికి కావలసినది?ప్రేమకోరకు నితినియామకములా, నితినియామకముల, కొరకా ప్రేమ? ఒక్కసారి అవినీతిని ధగ్ధముచేసిన,అతనిని తన పాదములవద్ద వ్రాలునట్లు చేసిన ఏమగునో?తన సౌందర్యమంత మాత్రము చేయజాలదా?సౌందర్య వికాస మామెయందు విజృంభించెను. ఆనాటి నుండి పురుషుని తన దాసునిగ చేసికొనిన స్త్రి ఆహంభావ మామె రక్తమున పొంగెను.
స్నానమును భోజనమును గావించెను. ఆ దేహమును రాణింప చేయునటుల సన్నని పట్టుచీర ధరించి ఆ దీర్ఘశిరోజములనిండ, వంటినిండ మల్లెదందలనే నింపివైచేను.ఆహ ఆ అందము? కండ్లనుండి   కారుచున్నట్లుండెను.చిన్ని నవ్వుతో ఆమె ఎర్రని  పెదవులు మాధుర్యమును పల్కుచుండెను. ఏమియు ఎరుగని అమాయకత్వము, చిన్న పిల్లల కుండునట్టి  విశ్వాసము, ఆమె ముఖమున చరించుచుండెను. ఒక ముడుతయులేని, ఆ చేంపలును, వంకర తిరిగిన ఆ గడ్డమును, మెడయు అతి సుందరముగ కన్పించుచుండెను. చిరెలో నుండి మెరయు ఆ దేహము రంగు,యౌవనమున యూగు నడకలతో ఆమె క్రిందికి దిగెను. గదిలో ననేకులు బిగ్గరగ నవ్వుచు మాట్లాడుచుండిరి.ఆమెను  చూచుటతోడనే నవ్వులును మాటలు నాగెను.స్తంభింపబడిన వారివలె అందరి చూపులు నామె వైపునకు తిరిగెను.వారి హృదయముల నామె వెనక దుమ్మన లాగుచు,ఒక చిరునవ్వు నవ్వి విదిలోనికి పోయెను.రోడ్డుమీద దీపముల కాంతికి దూరముగ నడచుచుండెను.ఆమెను చూచి వారామే  వెనుకనే చూచుచు నిలువబడిరి.అట్టి అందమయిన స్త్రి లచట ననేకు లుండిరిగాని ఆమె హృదయమున జ్వలించుచు , తమ తీక్షణత్వమునమె  ముఖమున ప్రకాశింపజేయు ఆమెయుద్రేకము లామెముఖమునకుజ్వలించుచు  యందము నిచ్చెను. ఆ నూతనసౌందర్యమును  గాంచుటతోనే  ప్రజలు విస్మితులగు చుండిరి. తానెరుంగని  కొత్త యావేశము  లామె యందు జనించి  మనసును కలవరపరచుచుండెను. ఏవో ఎప్పటినో  ఎరుగని సౌఖ్యము నందిన  నిముషములు తిరిగి జనించి నశించుచుండెను. ఏదియో తెలియరానిది. కావలయునని ఆత్మ ఆవేశామునందుచుండెను. అందరానిదాని కొరకు  జీవితముచేతులు  చాచుచున్నట్లుండెను.ఏమి  కావలయును? ఏమి కావలయును? తెలియదు. అనుభవము, అనుభవము స్వర్గతుల్యమగు ప్రేమానుభావము, లేకున్న సరముల కాల్చు నరకము. ఇంక నిద్రించు జడత్వము జీవితమున కక్కనలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS