శశి - ఎందుకు పెళ్ళి పెళ్ళి అంటావు?
రామ - పెళ్ళి కాకపోతే నా అంతరాత్మ వప్పకోదు.
శశి - నా అంతరాత్మ మాత్రం వప్పకుంటుందా? నా నమ్మకము మరి పెళ్ళే ప్రేమను చంపుతుందని.
రామ - నిన్ను మళ్ళి కలుసుకున్నాను కదా అని సంతోషపడ్డాను చివరికి ఇంతే శశిరేఖ మాట్లాడలేదు.
రామ - అయితే వెడతాను.
శశి - ఇంతేనా నీ ప్రేమ?ఇప్పుడు నువ్వు వదిలేస్తే నేనేమయి పోతాను? స్నేహితులు లేరు.బంధువులు లేరు. ప్రేమలేదు. సుఖం లేదు. ఎందుకు బతికి? ఎవరికోసం బతకను?
రామ - శశి, నన్నేం చెయ్యమంటావు?
శశి - నాతో నీకు యిష్టం లేనట్లుండక్కరలేదు.నీతో వుండనియ్యి. అంతే చాలు,నీవు తప్పితే ఈ లోకంలో నాకింకేమిలేదు.మగ స్నేహితుల మల్లే వుందాము.
రామ - నేను మాత్రము మనిషినేగా? నీ దగ్గిర వుండి సన్మార్గంలో వుండగలనా? ఇవన్నీ యెందుకు? నేను వెడతాను.
శశి - ఇంతేనా, పోనీ, ఆలోచించడాని కన్నా వ్యవధి యివ్వవురేపు ఒక్కసారి-
రామ- తెల్లవారకట్ట అవసరంగా వూరికి వెడుతున్నాను.
శశి - రేపు,మేము వూరికి వేడుతున్నాముగా మరి? నువ్వు ప్రయాణం మానెయ్యకూడదూ?
రామ - చాలా అవసరం.
శశి - పోనీ, ఈ రాత్రి ఒక్కమాటురా.
రామ - నేనింక ఇక్కడకు రాను. వీళ్ళను చూస్తే కోపంగావుంది.ఇక వంటరిగా మన్ని మాట్లాడనీరు.
శశి -అయితే నేనే సాయంత్రం మీ యింటికి వస్తాను. కొంచెం పొద్దుపోయి అయినా వస్తాను. మేలుకునుండు.
రామ -సరే.
20
సాయంత్రం యేడు గంటలయింది. డాబా పైని శశిరేఖ ఆలోచించుచుకూర్చుని యుండెను. గాడాంధకారము ఆమెచుట్టున ఆవరించినది.విధిలో నుండి బండ్లచప్పడును, జనముల నడక చప్పడును వినవచ్చుచున్నది. దూరమునుండి యెత్తయిన యింటి యందలి దీపములు నక్షత్రములవలె మెరయుచుండెను. ప్రక్క యింటి మేడలపై సాయంత్రము నిలుచుని నవ్వు వారి సంతోష స్వరములు వినవచ్చుచుండెను. దూరముననుండు విధుల ఎలక్త్రికు దీపములు బారులుతిర్చి కనబడుచున్నవి. ఆకసమున నక్షత్రము లిదిపములకన్న తమ శక్తిని చూపుటక్తే ప్రయత్నించుచున్నవో యనునటుల మిడిసి పడుచుండెను. వింత వింత తలపులామె మనసున పుట్టుచున్నవి.
వివాహములేక రామారావు తనతోడి జీవితమున కియ్యకోనడనుట సృష్టము ఇంక అతనిని వదలవలసినదేనా? నవజివనదాసుకు తనపై కోపము వచ్చేనుగదా? కడపటి మిత్రుడట్ల స్తమించెను.ఇంక లోకమున తనను కోరువారేవ్వారు? రామారావును చూచినతోడనే పాత ఆశలన్నీ యును మొలకలెత్తి యుండెను.తిరిగి తనను ప్రేమ జీవనము లభించునను కొనెను. ఇతనినికూడ వదలవలసిందేనా?ప్రేమ శూన్యమును, నిరర్ధకమునగు జీవితమును గడపవలసినదేనా?తన జీవిత ప్రవాహమొక యంతమునకు వచ్చింది.ఇంక స్వకియాసందము కొరకు జివింప నేరదు.తమ సౌఖ్యము కొరకే జివించుచు, నియమములు లేక జీవిత ప్రవాహమున కొట్టుకొని పోవువారిని తానింక ప్రేమింపలేదు.ఆమె స్వభావమేమారినది.
మొదటనుండియు శశిరేఖ స్వభావము సౌందర్యమును కోరుచుండెను. సుందరమగు కన్నులును, సుల్లలితమగు దేహమును, మృదు ప్రేమా హృదయమును గల కృష్ణుని ప్రేమించెను.ప్రేమా సౌందర్యము లేని వానిని తన తల్లిదండ్రులు కట్టి పెట్టుటచే ఆమె వారి ఆజ్ఞలకు తిరుగబడెను స్వేచ్చగ కకృష్ణుని ప్రేమించెను.తనకు తెలియకనే తన జీవితమును వెన్నెలలో, పక్షి బుతుములలో, నీటి శబ్ధములలో, పువ్వుల సుగంధములలో, లయామారుతముతో నాతని కర్పించెను. సౌందర్య దేవత యాలింగనమునకు నీతిని, మర్యాదను, సంఘమును, తల్లిదండ్రులను గృహమును,భర్తను బలియర్పించెను. గాడాంధకారమున మత్తు గలిగించి పూవుల సువాసనలయందు, మండునక్షత్రముల కాంతి క్రింద రక్తమును పరువేత్తించు గానమాదుర్యమున,జీవనమును ఒక్క నిమిషమున అతి క్రూరముగ దగ్ధముచేయు సుందరరావు ప్రేమాగ్నికి లోబరిచెను. జీవనము కందినది హృదయమున గాయములైనవి. బొబ్బలేక్కినవి. శాంతి,శాంతి,శాంతి.రామారావు ప్రేమయంధు ఆత్మీయ సౌందర్యమున ఆమె శాంతిని గాంచెను. కాని అతడు ప్రత్యుపకారముగ ఎవరును కోరని నిబంధనమును కోరెను.తన స్వేచ్చ నర్పింపమనెను. శశిరేఖ జివన్మరణమున గాయములు చేందియుండు శశిరేఖ, తన స్వేచ్చ నిచ్చివేయ మొదలు సంసిద్ధపడెను. కాని జీవన రహస్యమును కనుగొనిన యిప్పటి శశిరేఖ అందుల కియ్యకోనుటలేదు. ఆమె నవజివనదాసుగారినుండి జివితాదర్శమును నేర్పికొనేను. జీవనము ప్రత్యేక వ్యక్తిశక్తుల నభివృద్ధి పరచుటకు, జీవన రహస్యం అభివృద్ది స్వకీయ నీ గూడశక్తుల సార్ధకము గావించుకోనుట,శాంతికోరకు, అశాశ్వతమగు మానవ ప్రేమకోరకు స్వేచ్చ నర్పింపగలదా? సౌందార్యానుభావ విహారమునకు సంపూర్ణమగు స్వేచ్చ కావలయును.ఒక్క క్షణమున స్దిరముగాని చలనమునందుగాని సౌందర్యాను భావము వీలుకాదు. చలనము, జీవనము,స్దిరత్వము, మృతి కావలసిన శాంతిని నవజివనదాసుగారి యింతియందు, ఆత్మ సాధన యందామెపొంది యుండెను. కావలసినది శాంతికాదు. కావలసినది సౌందర్యము,సౌందర్యము. కృష్ణునినుండి ఏ శరీర సౌదర్యమును పోందెనో, సుందరరావు నుండి యే ప్రేమ సౌందర్యమును పోందెనో ఆ సౌందర్యమే యింకను కావలయును.యింకను కావలయును, నిరంతరమును జివనమున్నన్నాళ్ళును కావలయును. రామారావు వద్దనుండు ఆత్మీయ సౌందర్యమును ప్రేమించెను.కాని దానితో తృప్తినందగలదా? తన సౌందర్యాభిలాష ఎన్ని విధములుగ మారునో , ఎన్ని రూపములుదాల్చునో, ఎన్ని నూతన వాంఛల నెలకొల్పునో, గడచిన జీవితము ఆమె హృదయ వాంఛలనిరంతరము మారుచుండునని యామెకు తెల్పెను. ఇతనుగూడ నిరాశ చేందింపగలదా? ఇతడు వివాహము ప్రేమానుబంధము మాత్రమే ననుకోనుటలేదు. తక్కిన వారివలె తనకు నాతనికి సంబందమున్న చాలునను కొనుటలేదు. వివాహమున కాధ్యాత్మికముగ నర్ధమిచ్చుచుండెను. తనలో తన ప్రేమలో ఈ శ్వరుని ప్రేమ ననుభావించుచున్నా ననుకోనుచుండెను. అందువలననే వివాహమని యీ పట్టుదల. చలించు తన ప్రేమను కోల్పోయేనా,అతని హృదయము పగులగలదు. అతనిని వివాహము చేసికొనుట అతని శ్రేయస్సునకే కాదు.
