సాయంత్రము ఇంటికి వచ్చునప్పుడు త్రోవలో శశిరేఖకు నవజివనదాసుగారు కనబడిరి.ఆమెను చూసినతోడనేఆగి మెల్లగా "అమ్మా!నిన్నిశ్వరు దాశిర్వదించుగాక! నన్నదికానంములో ముంచితి" వనెను.ఆమె కర్ధముగాక ఏమిటని అడుగబోవునంతలో ఎవరో పిలువగా ఆయన త్వరగ వెళ్ళిపోయెను.
తరువాత కొంతసేపటికి శశిరేఖ రామారావును చూచి దగ్గరకు వచ్చెను.
శశి- రాత్రి వస్తావా? నిన్న రాలేదేం?
రామారావుకు మిగుల కోపమువచ్చెను. పైగా తనను పలకరించుట కూడాను?
రామ - నేనెందుకు రావడం?
శశి - ఏం అట్లా అంటున్నావు? నువ్వు రాకపోతే యింకేవారు వస్తారు? రావూ?
రామారావు కాశ్చర్యము కలిగెను. ఎంత కపటము? కోపముతో పెదవులు వణకేను.
రామ- తోచకపోవడమేం? అబద్దాలేందుకు చేపుతావు? ధర్మారావు లేడూ?
శశిరేఖ ఆశ్చర్యపడి,అతని కోపమునకు కారణము మేమాయని ఆలోచించెను.
నాలుగుదినములు గడచెను. శశిరేఖ తిరిగి రామారావును పలకరించలేదు.ఆయన ముఖమును చూచిననే భయము వేయుచుండెను.రామారావున కింకను శశిరేఖపై ప్రేమ పోలేదు. అందువలననే యింత దుఃఖమును కోపమును. సాయంత్రము తన గదిలో కూర్చుండి యీ విషయమునే ఆలోచించు కొనుచుండెను.హృదయము రాయవలె బలువయ్యేను. హఠాత్తుగా యీయన ప్రేమను కోల్పోయేనా? నవజివనదాసుగారును, ధర్మారావును,ఇక నెవరో యిద్దరు క్రోత్తవారునువచ్చి కూర్చుండిరి.
నవ - అప్పడే ప్రస్తావించడం నాకూ యిష్టంలేదు. కాని ఇందరు మళ్ళి వకచోట కలవడం కష్టం.నీకు ఇక్కన్నే వుండాలని వుందని ధర్మారావు చెప్పినాడు. నిన్ననే రాజీనామా పంపినాడు ఉద్యోగానికి త్వరలో అతనికి ఇక్కడే ఉద్యోగామవుతుంది.నేను వూరికి వెళ్ళాలి. నేనిక్కడ వుందగానే యితన్ని ధన్యుణ్ణి చేస్తివా సంతోషిస్తాను.
శశి - మీ మాటలు నాకర్ధము కావటంలేదు.
నవ- ఇంకా యేం చెప్పాలి. నీ వివాహాన్ని గురించి.
శశి - నా వివాహమేమిటి?
నవ - అమ్మా, మా ముందు సిగ్గెందుకు? ధర్మారావు...............
శశి - నే నిదివరకే చెప్పలేదా మీతో నా కట్లాంటి అభిప్రాయంలేదని?
నవజివనదాసుగారు ధర్మారావువైపు చూచిరి. అతని ముఖము వెల వెల బారెను.
నవ - ఆయనతో వివాహం చేసికుంటానని..............
శశి - నేనా? ఎప్పడూ? ఏమండి?
ధర్మారావు మాట్లాడక లేచిపోయెను.
నవ - ఇదేమిటో అర్ధం కావటములేదు. నువ్వు అతన్ని పెళ్ళి చేసుకోవడానికి వప్పకున్నావని అతను నాతో చెప్పినాడు.
శశి - నేనెన్నడూ ఆ సంగతే మాట్లాడలేదు.
నవ - నిజంగా?
శశి - నిజమే.
క్రొత్త ఆయన - అది యెట్లావున్నా-
శశిరేఖ కండ్లెత్తి ఆయన్ని చూచెను.
శశి- ఏమిటండి?
ఆమె ముఖమును చూచి మాట్లాడలేక ఆయన వెళ్ళిపోయెను. అందరును లేచి వెళ్ళిరి.
ఇదియే కాబోలు రామారావు కోపమునకు కారణము! తనంతటి కృత్రిమరాలను కోనెనా? తన విషయమ్తె యిట్టివి నమ్ముటయేనా? అంత మాత్రము విశ్వాసము లేకపోయెను గదా? తననడుగన్తెన అడగలేదుకదా?
సాయంకాలమున నవజివనదాసుగారును యింక నెవరో నలుగురు పెద్ధలును, శశిరేఖవద్దకు వచ్చిరి.
నవ - అమ్మా, యీ విషయమేమీ బాగుండలేదు. ఎవరివల్లనైతే నేమీ, అందరికి నువ్వు ధర్మారావునువివాహము చేసుకుంటావని తెలిసింది.
ఇప్పుడు మళ్ళి కాదంటే అపవాదు పడుతుంది. ఆ సంగతి ఆలోచించావా?
శశి - అపవాదుపడితే నేనేం చెయ్యను? నేనేం చేశాను?
నవ - నీకు తెలిటంలేదూ? లోకులు ఏదో భ్రమపడుతున్నారు. అపరిదిష్ట. నా మాట విని ఈ వివాహానికి వప్పకుంటే చాలా సంతోషిస్తాను.
