ఓ అలాగే నీ యిష్టం.
"అయితే ఎప్పుడు వెళ్ళమంటారు?" ఉత్సాహంగా అడిగింది.
"రేపు తెల్లవారుజామునే కారు ఏర్పాటుచేస్తాను వెళ్ళి వెంటనే తిరిగి వచ్చెయి" అన్నాడు.
"ఓ" అంది ఉత్సాహంగా.
ఆ రాత్రి అంతా ఆమెకు నిద్రపట్టలేదు.
కృష్ణమౌళిని పల్టీ కొట్టించేశాను అనుకుని సంబరపడిపోయింది.
తెల్లవారుఝామున లేచి స్నానంచేసి ఉషారుగా తయారయింది.
కృష్ణమౌళి చెప్పినట్టుగానే కారు పోర్టికోలో సిద్ధంగా ఉంది.
ఇంద్రసేన మనసు భగ భగ మండిపోసాగింది. ఎత్తుకు పై ఎత్తు వేసింది.
ఇక్కడినుండి గుడికి అని ఒంకపెట్టి వెళ్ళిపోతుంది.
యింటికి వెళ్ళాక చెప్తాను అంటూ కారువైపుగా వెళ్ళసాగింది.
59
ఇంద్రసేన ఆ యింట్లోనుండి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తూ కారువైపుగా వెళుతున్నదల్లా ఒక్క క్షణం అలా నిలబడిపోయింది.
ఒళ్ళు ఒక్కసారి తూలినట్లయింది.
తల తిరుగుతున్నట్టుగా అనిపించసాగింది. కణతల దగ్గర వ్రేళ్ళతో నొక్కిపట్టి కళ్ళు మూసుకుంది ఒక్కక్షణం అంతే!
ఆమెకు వెంటనే స్పృహ తప్పిపోయి పడిపోయింది.
కళ్ళు తెరిచి చూసేసరికి కిటికీ వద్ద కృష్ణమౌళి అటు తిరిగి నిలబడి ఉన్నాడు.
ఆమె ఒక్కసారి తలతిప్పి అటూ ఇటూ చూసింది. తను ఇప్పుడు ఎక్కడ ఉంది.
కృష్ణమౌళి ఇక్కడ ఉండటం ఏమిటి?
తను యింటికి వెళ్ళిపోలేదా!
అతను పంపించేశాడు కదా!
ఆమె అయోమయంగా అతనివైపు చూసింది.
కృష్ణమౌళి నెమ్మదిగా ఇటు తిరిగాడు.
ఇందూ అతనివైపే చూడసాగింది.
ఇద్దరి చూపులు ఆ క్షణంసేపు కలిశాయి.
నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను.
అతను నవ్వాడు.
"ఇక్కడే" అన్నాడు.
"ఇక్కడే అంటే!" కంగారుగా చూసింది.
"నా దగ్గర మన యింట్లో" చెప్పాడు.
"ఆ నేను... నేను... గుడికి వెళ్ళలేదా?" అడిగింది అయోమయంగా చూస్తు.
అతను నవ్వుతూ దగ్గరకు వచ్చాడు.
"ఇప్పుడు ఎలా ఉంది!"
కృష్ణమౌళి నవ్వుతూనే చెప్పాడు.
"ఏమీ కాలేదు మత్తుమందు ప్రభావం వలన స్పృహతప్పింది అంతే"
"ఆ మత్తుమందా!" మంచంమీద నుండి లేస్తూ అడిగింది.
అతనికి ఆమెతో ఎక్కువగా మాట్లాడాలనిపించటం లేదు.
ఆమె ఏం మాట్లాడినా మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది అనిపించటం లేదు.
మనసులో ఒకటి దాచుకుని,
పైకి ఒకలా మాట్లాడుతుంది.
ఎత్తులు పై ఎత్తులు వెయ్యడానికి చూస్తుంది. తనని మస్కాలో పడేయడానికి ఉపాయాలు గుప్పించుకుంది.
అలాటి వాళ్ళు అంటే తనకి అసహ్యం.
అబద్ధాలు ఆడేవాళ్ళు అంటే మరీ అసహ్యం.
తల్లికి ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు.
ఇష్టం లేకపోయినా ఇష్టము పెంచుకున్నాడు,
ఆవిడ కోరిక తీర్చటం కోసం.
ఇన్నీ చేస్తున్నాడు.
లేకుంటే ఈ పాటికి
ఎంతో అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుని హాయిగా ఉండేవాడు.
ఆ తండ్రీ పిల్లలు అందరూ ఒకటే.
అందరిదీ మూర్ఖత్వం.
ఇందూకి తను అంటే చిన్నచూపే కాదు,
అసహ్యం కూడా.
అలాంటి అమ్మాయిని కోరి కావాలని బలవంతంగా పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు.
యిక తప్పదు.
తల్లి ఆత్మ శాంతించటం కోసం.
ఆవిడ పడిన అవమానాలకి ఫలితంగా వాళ్ళ అమ్మాయే తన కోడలు కావాలని కోరి ప్రాణం వదిలింది.
తనకోసం ఎంతో కష్టపడిన అమ్మకోసం తప్పదు ఇదంతా.
అన్నీ భరించాలి.
"ఎవరు మత్తుమందు ఇచ్చింది" కోపంగా అడిగింది.
"నేనే" తాపీగా చెప్పాడు.
"మీరా!" నమ్మలేనట్టు చూసింది.
"నేనే కావాలని చేశాను."
