పుష్యమాసమున చలికాలము ముసలి సంకనున్న బిడ్డవలె వసంతుడు నవ్వుచుండెను. తెల్ల మబ్బులు, హాయినిచ్చు చల్లని గాలులు,పువ్వులు, నిలపుటాకాశము,పట్టణమున సహితము ఆనందమును తెచ్చుచుండెను. దూరమున చెట్లు చిగిర్చెనను వార్త వచ్చుచుండెను.సృష్టియందలి జీవనము, ప్రేమ, స్వేచ్చే, తలచుకుని యువ్విళ్ళూరుచుండెను.ఇక్కడ జీవితము దుస్సహము. పూర్వపు అశాంతి చుట్టుకోన్నది. జీవితము సౌందర్యము ననుభవింప కోరెను.తనను ప్రేమింపగాలవారు కావలయును. ధర్మారావు చూచిన అయిష్టము ఇప్పడు శశిరేఖ పూర్వమువలె తనను ఎవరు ప్రేమించిన సంతోషింపదు.ఆమె జీవనమున నియామకములు ప్రవేశించినవి. సౌఖ్యము కొరకే జివించుచు, జివనమేట్లు తిసికోనిపోయిన నా విధమున జివించువారిని చూచిన ఆమెకు గౌరవములేదు. ద్రియజయము, మానసిక విరోధములేని మనుషులు ఆమెకు కోరగారు. ప్రతి వారును నవజివనదాసులు కావలయును. అందుపలననే రామారావును ఎల్లప్పడును తలచుకొని ఆయన ప్రేమను కోల్పోయినందులకు దుఃఖించుచుండెను. తనను ప్రేమించుట కట్టివారు కావలయును. అదిగాక వివాహమనిన ఆమెకు అవిశ్వాసము పోయినది. మనుజులను జూచిన కొలదియు, తన జీవనమును చూచికొన్న కొలదియు,ఎట్టి ఘనుడ్తెనను ఒక్కనినే తానేల్లప్పడును ప్రేమించుట అసంభవమని తెలిసికొనెను. కాని ప్రేమను కోరెను. నవజివనదాసుగారి వద్దనున్న తన కట్టి స్వేచ్చేలేదు.తాను స్వతంత్రముగ జివింపవలెను.
గోవిందపురము పోవుటకు నిశ్చయించుకొని తన యుద్దేశ్యమును నవజివనదాసుగారితో చెప్పెను. ఆయన నామెను తనతోనే యుండమనేను. కాని ఆమె వప్పకోనలేదు. చివరకు ఆ నెల కలకత్తాలో బ్రాహ్మొత్సవము జరుగుననియును, తానచాటికి పోవుచుండేననియు,ఆమె కూడా ఆ యుత్సవమునకు వచ్చి,తరువాత యింక యిష్టములేకున్నగోవిందపురమునకువెళ్ళవచ్చుననియునచెప్పెను.శశిరేఖనువదలుట కాయన కేంతమాత్రమును యిష్టములేదు. ప్రతిదినము నామె చూచుట,ఆమెతో మాట్లాడుట ఆయనకు బాగుగ నలవాటయ్యెను.ఆమె లేకున్న తన గృహ మంధకారముగ కాన్పించును. శకుంతలబోయిన కణ్వునివలె నగును. ఆమె చిరునవ్వు ముఖము చూడక ఎట్లుండుట?ఆమె తనకొరకు తన సంతుష్టకొరకు పడు శ్రమ మరువగలడా? అదిగాక ఆమె తనవద్దనుండి పోయిన తిరిగి పాపపు జీవితమున పడునని ఆయనకునిశ్చయము.ఇట్టి మార్దవమనస్కులు, నిష్కపట హృదయులు లోకమున వంటరిగా బ్రతుకుటకు తగరు. పాప మొనరించిన, వారిదా తప్ప?ఆమె యింకను యేమియును తెలియని బాలిక యనకోనేను. కాని ఆమె యిష్టములేనిది తానేట్లామెనుతనతో నుంచు కొనగలడు? మండుచుండు ఆత్మకు తానేమి సహాయము చేయగలడు? సహాయమే చేయుట తన చేతిలోనుండిన భక్తి, యీశ్వరప్రేమ ఆమె స్వభావమును మర్చుననుకోనేను. కాని యింతవరకామె వానిని గ్రహింపనేలేదు.ప్రేమను, గాడమగు ప్రేమను జీవితమును దగ్ధము చేయు ప్రేమను, ఆమె కోరుచున్నదే? తానేమి యియ్యగాలడామెకు?తన ప్రాణమునన్న యిచ్చుటకు సందేహములేదు. ధర్మారావు పైనను ఆమెకు ప్రేమ కలిగినట్లు తోచదు. కట్టకడపటి ఆశతో, యీ యుత్సవములలో న్తేన ఆమెకు ఏమ్తేన శాంతి దోరుకునేమో?అక్కడికి వచ్చు భాక్తిపరులనుగాంచి, ఆ ప్రార్ధనలను, ఉత్సవములను, తోడి స్త్రీలను, వారి యుత్సాహమును చూచినా యేదోకొత్త మార్పు రాకూడదా?
ధర్మారావుకూడా వారువేంట కలకత్తా బ్రాహ్మసమాజమందలి యుత్సవములామెకు ఆనందమునకు ఆశ్చర్యమునందును ముంచెను. వారి భక్తి విశ్వాసములను యుత్సాహమును చూచి,అట్టి ప్రవాహమున తన జీవితముకూడా కలుపగలిగిన ఎంత హాయిగ నుండునాను కొనెను. ఆ సమాజపు స్త్రి లెంత అందముగ నుండిరి!ఎంత మధురముగపాడిరి! ఆమె అహంభావ మడుగంటేను. వారిముందు, తనను చూచు వార్తెన లేరు. ధర్మారావు తప్ప ఇతరులామె పాదములవద్ద బడు వారెవ్వరును లేరు. నవజివనదాసుతో నుండుటచే అచటి జనులామెను మిగులగౌరవించిరి.కాని వారి భాష్తేన యామెకు కనబడుటయ్తెన లేదు. ధర్మారావే ఆమె సౌకర్యముల విషయమ్తె చూచుచుండెను.కాని అతనిని చూచిన ఆమెకు కోపమెక్కువగుచుండెను. ఆమె తలపులను కూడబెట్టుకోనుటకు కూడ ఆమె నతడు వంటరిగా నుండనీడు,వెంట వెంట నెక్కడ చూచిన అతడే.
సాయంత్రము సమాజ మందిరమునుండి వచ్చుచుండగా దూరముగా దీపముల క్రింద హఠాత్తుగా రామారావు కనబడెను.అతడవునాయనిసందేహించి దగ్గరకు బోయెను. హృదయమున ఆనందము కలిగెను. ఇన్ని దినములనుండి అణగియున్న ప్రేమ తిరిగి వచ్చెను. అతనితో మాటలాడవలయు ననెడు ఆశ వచ్చినది గాని, ఇంతలో ఆయన ఉద్దేశ్యమెట్లున్నాదోయను సందేహము కలిగెను. అతడు నన్ను క్షమించునో లేదో? కాని తన కోర్కె నణచుకోనలేక, అతనిని సమీపించెను.రామారావు కన్నులామెపై బడెను.
రామ - శశిరేఖా?
శశి- అవును.
