నవ - అంతరాత్మ అనేదిలేదూ? అది పాపమనడం లేదూ?
శశి - నిజంగా చెప్పతున్నా. నా అంతరాత్మ ఏది వుత్తమమన్నదో అట్లానే చేశాను. ఎన్నడూ అట్లాంటి జీవితం పాపమనలేదు నా అంతరాత్మ. ప్రేమ లేకండా ఎవరినో కట్టుకుంటే మహాపాపం చేసినట్టుగా ఏడుస్తోవుండే దాన్నిపాటికి.
నవ- నీ అంతరాత్మకి అంతకంటే జ్ఞానము లేదన్నమాట.ఒక్క పురుషుడూ స్త్రి ప్రేమించుకోవడం ఆదర్శము.
శశి - కావచ్చును. కానీ వారిలో ఒకరి ప్రేమపోతే!
నవ - ఒకసారి యీశ్వర ముఖంగా చేసుకొనిన తరవాత వదలకూడదు.
శశి - స్వభావాలు మారుతూ వుంటాయి. ప్రేమ మారుతుంది.కానీ వదలకూడదూ? ఈ శ్వరుడు వద్దన్నాడా? భార్తన్నా భార్యన్నా చచ్చి పోతే చేసుకోవచ్చునన్నాడు గావును? ప్రేమ పోయిన తరవాత వాడు చచ్చి పోయినట్లే.అది కూడదన్నాడేం? ఇవన్నీ ఆ యీశ్వరుడి నేత్తినేందుకు పారేస్తారూ?పాపం ఈ శ్వరుడికి కోపం వస్తుందని, యావజ్జివనం పడివుండాలి అని ఎన్ని జీవితాల్ని పాడుచేస్తున్నారోకదా?
నవ - ఈ సంగతులు ఇదివరకు ఆలోచించ లేదు. ఇప్పడింకమాట్లాడను.
మరునాడు తిరిగి నవజివనదాసుగారు శశిరేఖను పిలిచిరి.
నవ - ధర్మ్రారావుతో నీ కిష్టంలేదని చెప్పినాను. చాలా దిగులు పడ్డట్టు కనపడ్డాడు.పోనీ ఆమెని చూసి మాట్లాడుతోనన్న వుంటానన్నాడు. నీ కభ్యంతరముంటుందా?
శశి- ఎందుకు ఆయన నాతో మాట్లాడడం?
నవ - తెలిటంలేదూ? ఎప్పటికన్నా నీకు దయ వస్తుందేమోనని?
శశి - లాభంలేదు. నా మనసు నాకు తెలుసు, అదిగాక నేను అసలు వివాహమే చేసుకోను.
నవ - పోనిలే, అతనికేదో ఆశ. నీ కభ్యంతరమేముంది?
శశి - ఏమిలేదు.కాని అవసరం కనపట్టంలేదు.
నవ - అటువంటి వాణ్ని పెళ్ళి చేసుకుంటే నీ జీవనానికి ఎంత స్ధిరత్వం వస్తుంది?నీకు శాంతి ఇవ్వడానికి,ఒక సంసారము, అది వుంటుంది. అదిగాక బుద్ది యిష్టము వచ్చినట్లు చరింపకండా వుంటావు?నీ వంటి వాళ్ళకు కాదు యీవంటరితనం.నీ రూపమే వేరు,నీ స్వభావమే వేరు. మళ్ళిపాత జీవితంలో పడిపోవడం సులభం.తిరిగి లేవడం కష్టం.
శశి - నేను చెప్పలేదూ? గడిచిన జీవితం నాకు సంతోషాన్ని గర్వాన్ని యిస్తోందని?తిరిగి అట్లాంటి జీవితము వస్తే యింకా యేంకావాలి? ఈ నీతి, యీ నిద్ర అన్ని వదులుతాయి. అదిగాక పరాధీనం ఎంత మాత్రం నాకు ఇష్టంలేదు.
ఇదివరకు నవజివనదాసుకు ఆమెను చూచినప్రేమ అధికము,ఆమె చెడ్డ మార్గమున, త్రోవచూపువారు లేక చరించినదనియును. ఇప్పడ్తేననామెను తాను సన్మార్గమున నుంచుటకు ప్రయత్నింపవలయుననియును, నిశ్చయించుకొనెను.కాని ఆమె తనకేమాత్రమును లోంగుటలేదు.ఆమె ఏర్పరచుకున్న యూహలామెను వదులుటలేదు.కాని ఎట్లామెకు తాను సహయము చేయుట?ఆమె యందు ఎంతటి ప్రేమ, ఎంతటి యుదారము యున్నవి! ఎంత నిర్మలత్వము, ఎంత సహనము,ఎంత కొమలత్వము,ఎంతదయ!ఆమె మాత్రము మిగుల నుత్తమ స్త్రియని ఆయన యెరుగును.పాపములోనుండి, అమ్ధకారములోనుండి,మలిన పకములోనుండి, ఏమియునంటకనిర్మలముగ, పవిత్రవంతముగ, చిన్న బాలికవలె,ఆమె వచ్చెనని యాయన యేరుంగును. కాని ఆమె నెట్లుకాపాడుట? ఈ శ్వరా!నీ అపార కరుణయందు శశిరేఖను కాపాడలేవా?ఇట్టి కోమల పుష్పమును, దుమ్మున రాల్చేదవా? అని అనుకోనును. ఈ వివాహము చేసికోనేనా ఆమె సన్మార్గమునకు తిరుగునని యాసించెను. ధర్మారావు పై నాయనకు విశ్వాసము కలదు.
నవ- పోనీ నా కొరకు ఆయన నిక్కడకు రానియ్యరాదూ?
శశి- సరే,మీకు సంతోషము నిచ్చేటట్లయితే రానియ్యండి. కాని నా కట్లాంటి ఉద్దేశ్యమురాదు.
నవ - ఏమో ఈశ్వరేచ్చయెట్లా వుందో?
శశి - ఈ శ్వరుడైతే మాత్రము, నాకు యిష్టము లేనిదీ, నన్ను బలవంతము చెయ్యగలడా? నవజివనదాసు చిరునవ్వు నవ్వి యూరకుండెను. కోపముతో తల్లినే తిరస్కరించు అమాయకురాల్తెన చిన్నబాలిక ఆత్మ యీమెది!
18
నెలరోజులు గడిచినవి. ధర్మారావు ప్రతిదినమును శశిరేఖ వద్దకు వచ్చుచుండెను.ఆమెను చూచిన అతనికి మిగుల భయము. దూరముగ నుండిమాట్లాడును.ఆమె మాట కేదురాడాడు. కాని శశిరేఖ అతనిని ఎక్కువ ఆదరముతో చూచుచుండును.శశిరేఖను అతడు ఒక దేవతవలె ననుకోనును.ఆమె తాకిన దానిని బంగారముకన్న నెక్కువగ చూచుకోనును.ఆమె పలుకు లమృతమువలె వినును. ధర్మారావు ఒక విధమున మంచివాడే, అల్ప సంతోషి.అతని స్వభావమున లోటేమియునులేదు. శశిరేఖ వంటి స్త్రి అతనిని తనతో అట్లాడనిచ్చుట తోడనే అతని తల తిరిగి అందరితోడను ఆమె తనను వివాహమాద పోవుచున్నదని చెప్పకోనుచుండెను.
