Previous Page Next Page 
శశిరేఖ పేజి 43

నవ - పోనీ, నీవు ఇతన్ని ఎందుకు ప్రేమించకూడదు?
శశి -ప్రేమకు కారణం లేదు. ప్రేమరాన్దే?
నవ-  పెళ్ళిని గురించి నీవు తప్పుడు  అభిప్రాయలు పడుతున్నావు. లోకవ్యాపారం జరగడం  ముఖ్యమయిన వుద్దేశ్యం. ప్రేమవున్న వాళ్ళకే మంచి సంయనం పుడుతుంది.కనుక ప్రేమ కావాలన్నారు. అదిగాక మనుష్య స్వభావం  దుర్భాలం. పెళ్ళిఅయితే పాపంలో  పడకుండా వుంటారు.
శశి - మీకి సంగతి  యెంతమాత్రం  తెలిదు. పాపానికి లోబడకుండావుండడానికాపెళ్ళి? ఇష్టంలేనివాణ్ని పెళ్ళి  చేసుకోవడమంత పాపం యీ లోకంలో ఇంకేమిలేదు. అంత అసహ్యమూ లేదు.
నవ - మనసూ మనసూ  కలిపి యీశ్వరున్ని ధాన్యం చేసుకుంటూ సంసారం గడపడం కంటే
ప్రేమ యింకేమిటి?
శశి - ఇదా ప్రేమ మీ కర్ధమయింది? బొమ్మాల్ని పూచ్చేసి, యీ శ్వరుడి ప్రేమను  తెలుసుకోమడం కంటే యిది యెక్కువ మూర్ఖంగా వుంది. మీకు చెపితే లాభంలేదు. ప్రేమననుభావించాలి,   తెలియాలి.
నవ - ప్రేమే జీవనానికి  అవధి అనుకుంటున్నావు.ఈ ప్రేమ క్షణభంగురము, ఈ శ్వరునియాందు ప్రేమ శాశ్వతము.
శశి - ఆ ప్రేమకు జివనములేదు. అందుకనే  శాశ్వతము.జీవించే ప్రేమ ఎప్పుడూ పెరుగుతుంది, మారుతుంది. అందుకనే అశాశ్వతము, చంచలము.
నవ - అలానా? పోనీ? నీ జీవనము చూసుకో. నీ చంచలమ్తెన ప్రేమ ఎన్ని పాపాల్ని చేయించిందో?ఎన్ని కష్టాల్లోకి నిన్నిడ్చిందో? చివరకు మిగిలిందేమిటి? అశాంతి. ఎందుకి బతుకనే నిరాశ? యింతేనా?కానీ ఎవరినో సత్పురుషున్నిపెళ్ళి  చేసికోన్నట్టయితే యెంత సుఖమైన జీవితం గడుపుతూ వుండేదానవు?
శశి - అంతే అనుకున్నారా?నేను అనుభవించిన కష్టాలు ఒక కష్టాలా? అనుభవించిన సుఖమో? ఆ సుఖంలో నూరోవంతు అనుభవించ డానికి నేనుపడ్డ బాధ తిరిగి పదిసార్లు పడతాను.మీరు చెప్పే శాశ్వతమ్తెన శాంతి,ప్రేమనసలు అనుభవించని వాళ్ళకి. అట్లాంటి ప్రేమ ననుభావించా గనకనే యిప్పడి అశాంతి.
నవ - అది ప్రేమ అనుకుంటున్నావు.అది  వట్టి శరీర వాంఛ నిర్మలమైన ప్రేమ  ఎన్నడూ  పాపమార్గాంలోకి  దింపదు.
శశి - మిమ్మల్నింత  ఆనందంలో ముంచేది యీ శ్వరభక్తి. ఈ శ్వరభక్తికాదు,మీ  మనో ఉద్రేకమంటే  మికేట్లా వుంటుంది? నే ననుభావించింది  యేమిటోతెలికండా, శారిరవాంఛ అంటేసరిపోతుందా,మీకు అట్లా అనడం న్యాయమేనా?వాంఛ ఒక్క నిమిషంలో చల్లారే చిన్నవేడి.ప్రేమ జీవితాన్నంతా వెలిగించే విద్యుచ్చక్తి. నాదేహం కాదు, ప్రేమను కోరింది, నా ఆత్మ, నేను అచేది అంతా కోరింది. ఆ జీవనాన్ని. నా ఆశలు, నాకోర్కేలూ, నా ఆశయములు, నా ప్రాణము, నా శక్తులు, ఆన్నీకలిసి  లినమైపోయినాయి,ఆ మహా ప్రేమలో. ఇంకో ఆశలేదు,కోర్కేలేదు, అంత కాలమూన్ను.
నవ - అయివుండవచ్చు. అయితే ఆ ప్రేమ అంతా నీ స్వార్ధము కోసం కాదూ? అందుకనే అంత పాప భూయిష్టం చేసుకున్నావు. దాన్నుంచి ఏమి శాశ్వతానందము వచ్చిందా?
శశి - అయ్యో, నా ప్రేమా స్వార్ధమయినది? ప్రేమించడం స్వార్ధమా? అయితే జీవించడం స్వార్ధము కాదూ?ఈ శ్వర  భక్తిస్వార్ధము కాదూ? ఈ శ్వరున్ని ఆయన కోసరమేనా ప్రేమించడం? మనకోసమేగా?ఎవరి జీవితమును వారు సార్ధకము చేసుకోవడం స్వార్ధమా?
నవ - కానీ నా భక్తి ఎవరికీ కష్టం కలిగించడంలేదే?
శశి - కష్టం కలిగిస్తే నా తప్పా? నేను ప్రేమించలేని మనుష్యుడు నన్ను కావాలంటే నేనేం చెయ్యను?అతని దగ్గర ఉండిమాత్రం  సంతోషం యివ్వగలనూ? మీరు యిట్లా వుండడం ఎవరికీ కష్టంగా వుందో? కానీ ప్రేమ లేకపోయినా సుందరరావుగారనే ఆయనతో  వుండలేదూ ఆయన కోసం?అది స్వార్ధంగానే తోస్తోందా మీకు? కానీ అదే నేను చేసిన మహా పాపంగా నాకు తోస్తోంది ఇప్పుడు.
నవ - కానీ అ జివనముకన్న పాపమూ,నిచమూ ఏముంటుంది?
శశి - మీరు తెలియకండా మాటలంతున్నారు. ఎందుకు పాపము? ప్రజల మూర్ఖం.మేము వదిలేశామంటారేమళ్లి ఇదేనా? ఈ విషయంలో ప్రజలనేటట్టే అంటారేం?
నవ - అది నిజం గనక. సమస్తమయిన  ప్రజలూ, సర్వకాలములలో వ్యభిచారం తప్పంటోనే వున్నారు.
శశి - మొదటి సంగతి యిది వ్యభిచారం కాదు.యుగ యుగాల నుంచి యీ దేశంలో వర్ణభేధముంది.మరి మీరు దాన్ని వదిలేశారేం?
నవ - మంచిది  కాదు కనక?
శశి - మంచిది కాదని  యెట్లా తెలిసింది?
నవ - స్వబుద్దివల్ల.
శశి - మరి మీ బుద్ది వుపయోగించారా? మరి యీ సంగతుల్లో మీ బుద్దేమయింది? లోకమంటోంది కదా అని మీరూ అనడమెనా, లేక పోతే, మీ అంతట మీరాలోచించుకున్నారా? ఒక్కసారి యింతవరకు యీ విషయంలో నేను పాపం చెయ్యలేదు. నా శరీర వాంఛలను చూసుకోలేదు.నా సౌఖ్యాన్ని చూసుకోలేదు. భద్రంగా ఆలోచించి నా స్వభావము దేన్నికోర్తోందో దాన్ని పట్టిపోయినాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS