శశి- లేదు.
నవ - ఇట్లాంటి నియామకాలు లేకుండా, మనస్సు లాగినట్లల్లా బతుకుతో వుంటే,దీపంలో నూనె వలక పోసినట్లే అవుతుంది.
శశిరేఖకు ఇది క్రొత్తగా తోచెను. తన యిష్టము వచ్చినట్లు బ్రతుకుటే కాని,నియామకము లేన్నేడూ యెరుగదు.వాని అవసరము కనబడియుండలేదు.
శశి - నేను ఇట్లాంటి తప్పలు చేసి యేరుగనే?
నవ - నీ స్వభావం మంచిదే కావచ్చును. అందుచేత పాపాలు చెయ్యకపోయినా, ప్రయత్నం ఉంటేనేగాని అభివృద్ది లేదు. దినిని సాధనంటారు.
ఆనాటి నుండి శశిరేఖ తన జీవితమున సాధన నారంభించెను.దిన దినమును నవజీవన దాసుగారి వంటి భక్తునీ వద్దనుండి సహాయమును బడయుచు ఆమె తన జీవన రహస్యమును కనుగోనుచుండెను. కొంత అశాంతి తగ్గినది.
17
మూడు నెలలు గడిచినవి. ఇప్పుడు నవజివనదాసుగా రిమెతో ఎక్కవ కాలము గడుపుచుండిరి.ఆమెను, ఆమె తన యభివృద్ధిక్తే చేయు ప్రయత్నములను చూచిన ఆయన కామెపై నెంతో దయ కలుగుచుండెను. ఆయనను చూచిన ఆమెకు భయమును క్రోత్తయు తగ్గెను. ఆయన హృదయము ఆమె కనుగోనచుండెను. ఆయన జీవనమున కానందము ఈ శ్వరుని యందలి అపారమ్తెన భక్తి విశ్వాసముల వలనను, సమస్త జనులపై యుండు ప్రేమవలనను కలుగుచుండేనని తెలిపెను.కాని వానిని నేర్చుకొనుట మాత్రమామెకు దుర్ఘతముగ కనిపించుచుండెను.
ఒక దినమున నవజివనదాసుగా రామెను పిలిచి కూర్చుండమనెను.
నవ- అమ్మా! నేనొక విషయాన్ని అడగబోతున్నాను. నీయభిప్రాయము తెలిచేయ్యాలి.
శశి-ఏమిటి?
నవ- అప్పడప్పుడు ఇక్కడికి వస్తోవుంటాడు ధర్మారావుని చూశావా?
శశి- సమాజంలో పాడుతూ వుంటాడు ఆయనే కదూ?
నవ - అవును. అతనే చాలా యోగ్యుడు. భక్తిపరుడు. ఇక్కడ షాపులో నూటయాభ్తే రూపాయల జీతం. మొదటి భార్య పోయింది.
శశి- ఆయన వొట్టి పిరికివాడు. బ్రహ్మసమాజానికి వస్తాడు కాని, పూర్తిగా చేరలేదంటారే?
నవ - ఏదోలే! యింకా అతనికి భయం వదలలేదు. కాని మనిషి మంచివాడు.ఈ విధంగా బ్రహ్మసమాజంలోకి అతన్ని తీసుకుని రావచ్చు.ఏమిటంటే,నిన్ను ఇక్కడ చూసింది మొదలు నీ సంగతి తలుచుకుంటే విచారంగా వుంది అనేవాడు.నిన్న నాతో చెప్పినాడు, నిన్ను వివాహం చేసుకోవలేనని ఉందని.అట్లాంటివాడట్లా అభిప్రాయపడడం నిక౮ఉ చాలా అదృష్టం.నీ యిష్టం కనుక్కోమన్నాడు.
శశి - నా కేమాత్రం యిష్టంలేదు. నేను పెళ్ళి సంగతి అనుకోడమే లేదు.అయినా నావంటి దాన్ని ధర్మారావు గారి కెట్లాపనికి వస్తాను?
నవ - నువ్వు ఇట్లాంటిదేదో అంటావనే అనుకున్నాను,కాని నీకేం అభ్యంతరం? నువ్వు పెళ్ళేందుకు చేసుకోకూడదు?
శశి - నాకు అవసరమేమీ కనబడ్డంలేదు.ఆయన్ని చూస్తే నాకు ప్రేమలేదు. అతన్ని సరిగానన్న యెరగను.
నవ - నేను చేపుతున్నాగా అతను మంచివాడేనని. నిన్ను సౌఖ్య పెడతాడు. అంతకన్నా యేం కావాలి? నీవు అతన్ని తెలుసుకున్నామంచి వాడేనా కాదా అనేగా?
శశి - మీకు పెళ్ళి కాలేదుకదూ?
నవ- అవును.
శశి - మీకి విషయం ఏమి తేలినట్లు కనబడుతోంది. పెళ్ళి సౌఖ్యపడడానికి?
నవ - మరెందుకు?
శశి - ఆ దురభిప్రాయముతోటే బాల్య వివాహాలు చేస్తారు. మా అమ్మాయి సౌఖ్యపడాలని ఎవరినో ఒకరిని సౌఖ్యపెట్టెవాణ్ని కడతారు. సౌఖ్యపెట్టడమంటే పెద్దవాళ్ళ కళ్ళల్లో మంచివాడు కావడం, డబ్బూ ,ఆస్తి వుండడం. లేకపోతే చదువుకోవడం. ఇవి మంచిరకం బాల్యవివాహాలు. ఇహ స్వలాభం కోసం ఆశించి చిన్నపిల్లల గొంతు కోసేవి,సరే సరి. మీరు కూడా నాకట్లా సంబంధం విచారించినట్లున్నారే?
నవ- పోనీగానే, సౌఖ్యపడ్డడానికి కాకపోతే పెళ్ళెందుకో చేపుదూ?
శశి - పెళ్ళి ప్రేమించడానికి. అదికాదు ప్రేమిస్తారు. గనకే పెళ్ళి. సౌఖ్యపెడతాడా లేదా, మంచివాడు కాదా, అనేది ప్రశ్నకాదు. ప్రేమిస్తూన్నాడా లేదా అనేది కూడా అంత గొప్ప ప్రశ్నకాదు. ఆడదానికి నేను ప్రేమిస్తున్నానా లేనా అనేది వక్కటే సంగతి. ఎంత నీచుడు కాని, దుర్మార్గుడు కాని, దరిద్రుడు కానీ, స్త్రీ తాను ప్రేమించిందా, ఇంక ప్రానమన్నా యిచ్చివేస్తుంది, అదే వివాహము, తక్కినవి కావు.
