Previous Page Next Page 
శశిరేఖ పేజి 41

దిన దినమును నవజివనదాసుగారికి శశిరేఖను చూచిన అనురాగ మెక్కువగు చుండెను.పాపభూయిష్టమగు ఆమె జివనమునుండి ఆమె జన్మ స్వభావమును నిర్ణయించుటకు విలులేదనియును,అది మిగుల యుదార మయిన చనియును ఆయన  తెలిసికోనుచుండెను.      
నవ - నీకేమన్నా లోపమైతే చెప్పు. నీ కేమన్నా కష్టంగా వుందా,ఇక్కడ?
శశి- అది కాదు.ఏమిటో తెలిదు. ఏమి  తోచదు.
నవ- పని చేసుకో.
శశి-పనిమీద బుద్దిపోదు.ఎట్లా వుందో చెప్పలేను. వాళ్ళకి ఇట్లా వుంటేనేగాని ఇంకొకళ్ళకు  అర్ధంకాదు. ఏమిటో అశాంతిగా వుంటుంది.
నవ - అందరికి అప్పుడప్పుడట్లానే వుంటుంది. దానిని జయించాలి, ఏడిస్తే ప్రయోజన మేముంది?
శశి - ఎట్లా జయించడం? మీ కిట్లావుంటే  యేం చేస్తారు మరి?
నవ- ప్రార్ధన  చేస్తాను.మంచి గ్రంధాలు చదువుతాను.
శశి - అదేట్లాగో  నాకు తెలిదు.ఎందుకు ప్రార్ధనచేయ్యడం?
నవ- ఈ శ్వరుడి  సహాయం కోసం.
శశి - ఈ శ్వరుడు నా కేప్పడూ సహాయం చేస్తున్నాట్లే వుంటాడు.ఇంకా ప్రార్ధనేందుకో అర్ధంలేదు.నేను చాలాసార్లు చేద్దామనుకున్నా.
నవ - మనకోసమే. మన మనశ్శాంతికోసం.
శశి- నా కెప్పుడూ మనశ్శాంతి అట్లా రాలేదు.
నవ -నాకు వస్తుంది. నీకు ప్రార్ధన చెయ్యడం తెలిదు.
శశి - అదికాదు. నా స్వభావం వేరు. మీ స్వభావం వేరు.
నవ -మనష్యు స్వభావమంతా యీ విషయంలో వకటే.
శశి - అయితే  నాకు నేర్పరాదూ?
నవ -నేర్పితే వస్తుందా?
శశి - వస్తుందంటారు.అది రాదు. మీరు నేర్పెడానికి  విల్లెధంటారు.ఎట్లా మరి?
నవ -ఈ శ్వరకృప  కావాలి.
శశి - మరి ప్రార్ధన చేస్తేగాని ఈ శ్వర కృప రాదుగా.
నవ - విశ్వాసముండాలి.
శశి- ఎట్లా? తెచ్చుకుంటే వస్తుందా?
నవ - తెచ్చుకోవాలి.
శశిరేఖకు  అదేట్లాగో తెలియలేదు.కాని,ఆయనకు కోపము వచ్చు నేమోయని యూరకోనెను.
నవ - నువ్వు సమాజానికి  వస్తున్నావు కదా? అక్కడ  ప్రార్ధనలు బావుండటం లేదూ?
శశి - అర్ధమవుతాయి. కాని ఎందుకో అట్లా ప్రార్ధన చెయ్యడం తెలిదు.పాపము,  పమంటారు.మిమ్మల్ని చూస్తున్న మట్టుకు మీరు చేసే పాపమేమితో నాకు  కనబడదు. నా మట్టుకు నాకు  చిన్నప్పటి నుంచి నేను బుద్ధిపూర్వకంగా  చేసిన పాపం వక్కటి జ్ఞాపకంలేదు.
నవ - అంతరాత్మ యింకా ఈ సంగతులు తెలివు. ఊరుకో.
శశిరేఖ హృదయవేదన ఎక్కువగుచుండెను.
శశి - మరి నన్నెందుకు ఇట్లాబ్ వుంచుతారు? మీరు పొందే సౌఖ్యం నాకు తెలిదు.మీరు చెప్పరు.నాకు సౌఖ్యము లేదు. సంతోషం లేదు.ఏమిటి బతుకు?
నవ - అమ్మా!రోషంతో  తొందరపడితే లాభమేముంది? పవిత్ర జీవనము గడుపుతూ విశ్వాసముతో కాచుకోనియుండాలి. చేసిన పాపాలకి పశ్చాత్తాప పడాలి. అప్పడుగాని దేవుడి దయరాదు.   
శశి - అందుకా మీరు నన్నిక్కడుండ నిచ్చింది? నేనేదో పాపాత్ము రాలనని పశ్చాత్తాపపడాలనినా? నేనేం పాపాలు చేశానని పశ్చాత్తాపం? నాకు తెలుసులెండి. లోకంతోపాటు మీరు కూడా నాది పాపిష్టి జివనమనకుంటున్నారు.ఏదో నా జీవితాన్ని కొంత బాగు చేస్తే మీకు పుణ్యం వస్తుంది కదా అని ఆశ.
నవ - ఎందుకు అట్లాంటి  దురభిప్రాయాలు  పడతావు?
శశి - నా మీద నిజంగా ప్రేమవుంటే నన్ను మీరు ఇట్లా వంటరిగా వదిలేస్తారా?
నవ - నేనేమీ సహాయం చెయ్యగలను? అంతా యీ శ్వరుడు చెయ్యాలి. అదిగాక స్త్రీలతో  మాట్లాడడం నాకు తెలిదు.అలవాటు లేదు.
శశి - మీకు కుమార్తె వుంటే  ఇట్లా మాట్లాడకుండా వుంటారా? మీమీద అధికారం వున్నట్లు  మాట్లడుతున్నట్లున్నాను. నాకిక్కడ వుండడానికి  అధికారంలేదు. అంతా మీ దయే.కాని ఉన్నప్పుడు నాకు సంతోషం వుండాలి.
నవ - ఎందుకు ఇప్పుడు ఈ అశాంతి?
శశి - నాకు లోకంలో  ఏమి పనిలేనట్లు కనపడుతుంది. ఎందుకు బతకడం? ఎవరికోసం?
నవ - బ్రతకడమే ఉపకారం. సద్గుణాలు  నేర్చుకోడానికి. నీ శక్తుల్ని అభివృద్ది  చేసుకొని,వికసింపజేకోడానికి, యీ శ్వరుడు నిన్నిక్కడికి పంపించాడు.దాని కోసం పాటుపడాలి.
శశి- ఎట్లా?
నవ- జీవనం ఎట్లా అంటే అట్లా పోనిస్తే  లాభంలేదు. కొన్ని నియామకాలు వుండాలి.ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రలోభాలు వచ్చినా, వాటిని మానేయ్యకూడదు. అబద్దం చెప్పకుండా వుండాలనుకోవచ్చు. కాలం వృధా పుచ్చకూడదనుకోవచ్చు. తలపులను కట్టేయ్యడానికి ప్రయత్నం చెయ్య వచ్చు.నువ్వేప్పడన్నాఇట్లాంటివి  చేశావా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS