Previous Page Next Page 
శశిరేఖ పేజి 40

ఆమె కష్టములు విని,ఆయన కామెపై జాలి పోడమెను. తానామెను వదలిన అట్టి కష్టముల కామె తిరిగి లోనగునని ఆమెను తనతోడనేకొంత కాలమువఱకయిన నుండమనియెను. ఒక్క కుట్టుయంత్రమును  కొనియిచ్చి కుట్టుపని  నేర్పించెను.శశిరేఖ యితరులకు బట్టలుకుట్టియిచ్చి కొంత ధనమును సంపాదించుచుండెను. నవజివనదాసామెనొక  ఆదివారము  సాయంత్రము " సమాజమునకు వచ్చేదవా?"యని యడిగెను.శశిరేఖ వెళ్ళేను.కాని అచ్చట చేయు విషయములు ఆమెకు బాగుగా అర్ధము కాలేదు.అయినను ఆయనకు సంతోషము కలుగునట్లు కాన్పించుటచే, ప్రతి వారమును సమాజమునకు పోవుచుండెను.
నవజీవన దాసుగారికి ఒక శూద్ర మనిషి వంట చేయుచుండెను.మొదటి దినమున శశిరేఖ ఆమె చేసిన భోజనము తినుట కిష్టపడలేదు.నవజివనదాసుగారిది యే కులమ్తెనను ఆయన తాకిన భోజనము తినుటఆమెకు తప్పగా తోచలేదు.గాని,యీవంటమనిషి తాకిన భోజనము అయిష్టముగా తోచినది.కనుక ఆయన ఆమెకు సామానులనిచ్చి వండుకొనమనెను.కాని కొద్ది దినములలో నవజివనదాసుగారిమిద భక్తి అధికమ్తెనకొలదిని, ఆయనకు సరిపడిన భోజనము తనకు మాత్రమెందుకు సరిపడ గూడదని, కష్టముమీద, ఆ శూద్ర మనిషి వండినదే తానును తినుచుండెను.
మొదట మొదట తన పూర్వపు జీవితము శశిరేఖకు జ్ఞాపకమునకు వోచ్చినను  ఆమెకు పశ్చాత్తాపమును   అశాంతిని కలిగించలేదు. సుందరరావును ఆమె పూర్తిగ మరచెను.బ్రహ్మ సమాజపు మనుష్యుల చూచినపుడెల్ల  రామారావు  జ్ఞపకమునకు వచ్చుచుండెను.యెవర యంద్తేన  భక్తిని దిరత్వమును చూచినను అతనినే ఆమె తలంపునకు తేచ్చుకోనును. అతనియందు ప్రేమ ఆమె కేన్నడునూ పోయియుండలేదు.తన స్ధితి తలచుకోనినపుడెల్లఅతనిని వివాహమాడిన,తన దినము  లెంత కళావంతములయి  యుండేడివో యనుకోనేను.అతనిని మోసగించి నందులకయిపశ్చాత్తాప మామె హృదయమున వేధించుచుండెను. సుందరరావు అతని హృదయము పగిలెనని కూడ చేప్పియుండెను.అట్టి సత్యశిలునకు,ఉత్తమ స్వభావమునకు తానేంతటి ఉపధ్రవమును కలిగించునోకదా కదా? తానే అతనిని మోసగించిన,అతనికి మనుజులలో విశ్వాస మెంత చెదిరియుండునో కదా? నవజివనదాసుగారు, రామారావు నెరుగరు .ఆయన పేరు మాత్రము వినియుండెను.
కాని క్రమ క్రమముగ శశిరేఖకు పూర్వపు అశాంతి ఉదయింప నారంభించెను.అట్లు ఒంటరిగ పట్టణ మధ్యమున నుండుట ఆమెకు కష్టముగ తోచెను. వెన్నెలను చూచినప్పడును, పువ్వుల వాసన తగిలి నపుడును,ప్రేమగల దంపతుల కాంచినపుడును, పంజరములోని చిలుక అడవిని తలచుకొని,రెక్కలు కొట్టుకోనునట్లు,ఆమె మనసు తటతట లాడుచుండెను. జీవితమున నేదో, తక్కువ్తెనట్లు తోచును.ప్రేమలేక జీవనమును గడపుట దుర్భరముగ తోచును. ఆమె అశాంతి మొత్తిము మీద  ఆమెకే అర్ధమగుటలేదు. ఆనందము మాత్రము జీవనము కాన్పించుటలేదు.
ఆమె నవజివనదాసుగారి  జీవితము ననుసరి చుటకు ప్రయత్నించెను.ఆయన కెక్కడనుండి  వచ్చుచుండెను. ఆ ఆనందముతనకు? మాత్రమా యానందము రాకూడదా? ఈ చిన్నయిల్లు, ఆ సమాజము, పుస్తకములు, చాలునే ఆయనకు! తనకు మాత్రము అశాంతి యెందుకు? ఆయన రహస్యంమేది? తన నీ ప్రకారము ఒంటరిగ  జీవింప జేయు ఆయన, తనకా యానందమును భక్తినీకూడ  బోధింపకూడదా? తనను నిర్లక్ష్యముగ చూచి వదలుచున్నాడాయన.తన  నతనిపై ఆధారపడియుండు బిచ్చపు దానివలె చూచుచుండేనేమ? ఒకవేళ  ఆయన పుస్తకములు చదివిన ఆనందమును భక్తియు గలుగునేమో?
ఒక నాటి మధ్యాహ్నమున ఆమె కేమియు తోచలేదు.నవజివనదాసుగారి  పుస్తకము నొకదానిని తీసుకొని చదువు కొనుటక్తేకూర్చుండెను.ఆ పుస్తుక  మర్ధముకాలేదు.అట్లే ఆలోచనా నిమగ్నయైయుండెను.కండ్ల నుండి నితిబోట్లు ఆ చక్కని చెంపలనుండిఒక్కటొక్కటే  యోడియందు పడుచుండెను. గడ్డము క్రింద  నిలిచిన ఒక బొట్టున సూర్యకిరణములు ప్రకాశించుచుండెను.జుట్టు  ముఖము పై విరివిగా పడుచుండెను. ఆయన కుర్చీలో సగము చోటైనను నింపుటలేదుఆమె  సన్నని శరీరము.బయట పోయి యుండిన  నవజివనదాసుగారింతలో వచ్చిరి.ఆమెవైపు  సరిగానైన చూడలేదు.
నవ- అమ్మ ఏమిటి చదువుతున్నావు?
శశి- ఇదేదో, బ్రహ్మగితోపనిషత్తుట.
నవ-చాలా  మంచి పుస్తుకము కదూ?
శశి - ఏమో, నా కర్ధం కాలేదు.
తిరిగి దుఃఖము రోషమును వచ్చెను.
నవ -అమ్మా, ఎందుకా విచారము?
శశి- తెలిదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS