శశి - నాకు భర్తలేడు. అది తెలిసి మధ్యాహ్నము జాలిపడి వచ్చి ఆయన భయపడి వెళ్ళిపోయినాడు. మీరేమీ అడుగకుండా తీసుకొని వచ్చినారు. తరువాత వవిచారిస్తారు.
పురు - విచారింపను. అమ్మాయీ, తలపులతో బాధపడకు. నీకు విశ్రాంతి కావాలి. పడుకో.
శశి - మరి మీకు సందేహము లేదూ?
పురు - నా కేమి లేదు.నీకు సహాయము చేయగలిగినాను.అంతే చాలు.
శశి - నాకి సహాయం చేసినందుకు మీకేం కృతజ్ఞత చూపాలో నాకు తెలియటంలేదు.
పురు- నాకు కాదు. ఈ శ్వరుడికి చూపు. ఆయన దయ లేకపోతే ఈ కొంచెము సహాయము చేసే శక్తి నాకేట్లా వచ్చేది?
గదియంతయు పరిశుభ్రముగనుండెను.ఒక బల్లపై కాగితములుండెను. రెండు మూడు కుర్చీలు, ఒక అలమారులో పది పుస్తకములు, ఒక మూల చిన్న తాంబూర, ఒక చిలుక కొయ్యపై రెండు చొక్కాలు, పంచలు, ఇంతే సామాను.
శశి - మీరెక్కడ పడుకుంటారు?
పురు- ఇక్కడే, ఆ చాప మీద.
శశి - మీ గది తీసుకొంటున్నాను కాబోలు!
పురు- లేదు,ఎప్పుడూనేనిక్కడే నిద్రపోవడం.
శశి- నాపైన నిష్కారణముగా యిట్లాంటి దయ చూపిన వారిని నేనెరుగను.
పురు- అమ్మా, యీశ్వరుడు కృపామయుడు.అతని దయను తలచుకొంటే మనము చూపే దయ సిగ్గుతో మాయమవుతుంది.
శశి-అట్లాగా?]
ఈయనను చూసినప్పటి నుండియు ఆమె హృదయమున నెన్నడేరుంగని ఆందోళన మొకటి అంకురించెను. తాను వేనినంత అమూల్యముగ నుంచికోనెనో, అట్టి తలపులన్నియును, తన అహంభావమంతయును మంచువలె కరిగిపోవుచున్నట్లు తోచుచుండెను.
శశిరేఖ పరుండెను. చాలాసేపటివరకు తనకు వాటిల్లిన యీ యాపదల గురించి ఆలోచించుకోనెను. ఇక్కడ ఎంతకాల ముండగలదు? ఎక్కడికి పోగలదు?ఈ మహాత్ముని సహాయముచే గోవిందపురము వలెననియు,నచ్చటనేమ్తెన పనిచే జివించవచ్చుననియు ననుకోనెను. చివరకు నిదుర పట్టేను. ఆమెకొక కల వచ్చెను. ఆకలిచే, దప్పిచే ఆ రోడ్డు పక్కనే పడి ఆమె మృతిచెందెను.ఆమె ఆత్మ దేవలోకమునకు పోయెను.అచట దేవతలు గానము చేయుచుండిరి. ఆహ యేమి గానము? లోకములో తానెన్నడును విని యుండలేదు. శాంతినిచ్చిఊయలయందు గుచున్నట్లుండెను.తటాలున మెలుకువ వచ్చెను. ఇంకను ఆ సంగీతము వినవచ్చుచునేయుండెను. ఆమెకు రాత్రి జరిగిన సంగతులొక్కటోక్కటే జ్ఞపకమునకు వచ్చినవి. తెల్లవారకట్ట యయియుండెను. కిటికీలోనుండి వేగుచుక్క కాన్పించుచున్నది. దేవతలుకారు. పక్కగదిలో నెవరో పాడుచుండిరి. ఆహ యేమిపాట! తంబుర మ్రోగుచుండెను. దాని శ్రుతికి కలిపి పాట డబడుచుండెను.సంగీత జ్ఞనము విస్తారముగ లేదుగాని ఏమి మాధుర్యమాస్వరములలో! తనను రక్షించిన పురుషుని కంఠమే కాబోలును! ఏమి మార్దవము, ఏమి ప్రేమ, ఏమి కృప! ఆ మాటలును వినబడుతలేదు. భాష య్తెనను తన భాషయో కాదో తెలియుటలేదు.కాని ఆ రాగము చాలును,కంఠముచాలును, హృదయము కరిగిపోయెను. జివనమంతయు తిరిగి గడచుచున్నట్లుండెను.ఏమిటి ఆవేశము?ఏమిటి మహస్ ఆందోళనము? ఎందుకో తెలియక శశిరేఖ వెక్కివెక్కి యేడ్వదోడగెను. కాన్నిళ్ళలో నుండి ఆమె జీవితము నందలి మలినత్వమంతయు, భారమంతయు, కఠినత్వమంతయు, కడగబడుచున్నట్లుండెను.
ఎంత యేడ్చినదో తెలియదు.ఆయన పాడుచున్నంత కాలమామె యేడ్చుచునే యుండెను. తిరిగి యెప్పుడో నిధ్రపట్టేను. "అమ్మా" యని ఎవరో తలుపు తట్టిరి. శశిరేఖ లేచి చూచునప్పటి కిటికీ నుండి ఎండబాగుగ వచ్చుచుండెను.ఆమె లేచి తలుపు తియునప్పటికి,అదివరకప్పడే స్నానముచేసి, పరిశుభ్రముగా నుండిన ఆయన ముఖము నవ్వుచూ కాన్పించెను. చేతిలో నున్న నొక కొత్త చీరెయు, ఇంకను కొన్ని దుస్తులను ఆమెకిచ్చి.
"ఆమ్మా అటువ్తేపు గదిలోనికి బోయి స్నానము చేయవచ్చును.నేను బయటకు బోయి వచ్చెదను.
ఆమె ఆశ్చర్యముతో ప్రత్యుత్తరము చెప్పుటకు ముందే, ఆయన వెడలిపోయెన.స్నానమామెకు చాల సత్తువనిచ్చెను.చాలాకాలము నుండి ఆమె యెరగని సంతోషము చ్చెను.భారములుకష్టములు,అన్నియునుతొలగినట్లుండెను ఇంతలో పోస్టువాడు ఉత్తరములు తీసికొని వచ్చెను.ఆమెను చూచి అతడాశ్చర్యపడెను. ఉత్తరము లిచ్చెను. వానిపై.
"నవజీవదాసు,
బ్రాహ్మమత ప్రచారకుడు"
అని వ్రాసియుండెను
16
ఒకటిన్నర సంవత్సరము గడచినది. శశిరేఖ నవజివనదాసు గారి టియందేయుండెను.మొదటనేఆమె ఆయన యింటినుండి వెళ్లేదననెను. కాని ఆమె దేహములో స్వస్ధత కలిగిన వెంటనే వెళ్ళవచ్చుననెను. ఆయనను, ఆయన జీవితమును చూచినా కొలదియును ఆమెకు గౌరవము యెక్కువగు చుండెను.ఆయన రకము వారిని ఆమె యింత వరకూ చూచి యుండలేదు.ఆయన కామె యున్నదను జ్ఞపకమైనయుండదు.ఆమె యెంత సుందరముగనున్నను ఆశ్చర్యమే యుండదు.ఆయన ముఖమున,శశిరేఖకు ఆయనను వదలి పోవుటకు ఇష్టమగుతలేదు. నవజీవనదాసుగారి జీవితమును గాంచిన చాలును,వెన్నెలతో నిండి తోల్కాడు ఆకాశమును చూచునట్లు తోచును.ఆయనకును శశిరేఖను చూచినా అనురాగము కలుగుచుండెను.ఆయన ఆమె చర్రితను గురించి ఒక్క ప్రశ్న అడుగలేదు. కాని ఒకనాటి ఉదయమున ఆయన గాన మాధుర్యమును గ్రోలి,తన జ్ఞపక భారమును,దుఃఖము నాపుకోనలేక,ఆయనకు తన యుదంతమునంతను వినిపించెను.ఆయన ముఖమున వ్యసనము కనిపించెను.కాని ఏమియు ననలేదు."ఉత్తమ జీవనమునకు నిన్ను తీసుకొని వచ్చుటకు నీకిన్ని కష్టముల నిశ్వరుడిచ్చె" ననియెను.కాని శశిరేఖకది అర్ధముకాలేదు.
