Previous Page Next Page 
శశిరేఖ పేజి 38


                                                                15
శశిరేఖకు తానెంత దూరము యెటువ్తెపు వెళ్ళినది తెలిదు. ఆగునప్పటికి వొళ్ళు వొణుకుచుండెను. రోడ్డు ప్రక్కన చీకట్లో వొదిగి కూర్చున్నది. యింకేమి చెయ్యవలెను? తన గతి యేమి కావలెను? వాన కురియుట ప్రారంభించినది.చలి. లేవలేక ఆ తడిలోనే  పరుండినది.రెండు గంటలకి పొలిసు గావును ఆమెను అక్కడనుండి లేచిపోమ్మనెను.కాళ్ళిడ్చుకోనుచు?   నడక సాగించినది. జ్వరమూ,చలి, యెక్కువ్తెనవి. చివరికి యింక లేవలేదు.కరుణతో నిద్ర ఆమె కన్నులను మూసినది. తెల్లవారి నౌకరోకతె వొచ్చి ఆమెను లేచిపోమ్మనెను.ఆమె లేచి అరుగుకింద కూచ్చున్నది. లేచుటకు శక్తిలేదు.లేవపోయిన కాళ్ళు  వోణుకుచున్నవి.ఆకలిలేదు. కాని దాహమగు చున్నది. యెవరినడిగినను  నిళ్ళియ్యరు.ఆ యింటివారిని  అడుగుటనువిని, పాకిమనిషి కుళాయివద్దకు పోయి,నీరు తెచ్చి యిచ్చెను.కాని శశిరేఖకు ఆ నీళ్ళు తాగుటకు యిష్టము లేక, కన్నీళ్ళతో వొద్దని  చెప్పెను,
అభిమాన మత్యదికము. ద్తేర్యము పోలేదు. అటు పోవుచుండిన పురుషుడొక డామెను చూచెను.
"ఇక్కడ పడుకున్నావు నువ్వేవ్వరు?నీ యిల్లెక్కడ? నీ కెవ్వరునులేరా?"అని యడిగెను.
శశిరేఖ ప్రత్యుత్తరము చెప్పలేదు.
"నీకు పెండ్లి కాలేదా? భార్తలేడా?"
శశిరేఖ తల యూగించెను.
"భర్తలేని వారికి  కావలసినదే శాస్తి. ఇట్టి వారిని  జాలి తలవకూడా"దనుచు పోయెను.
 లంకణముతో జ్వరమడగినది. శశిరేఖ లేచి కూర్చుండెను. ఆస్తమయ సూర్యుడు దుమ్ములో  నుండి ఆమె  ముఖమున ప్రకాశించు చుండెను. మెల్లగా లేచి ఆమె నడవ నారంభించెను.ఎక్కడకో, ఎందుకో ఆమెకు తెలియదు.చీకటి పడినది. దీపములు వేల్గించిరి. ఎదురువచ్చువారు ఆ వంకనడిచి, వెనుక తిరిగి ఆమె వైపు చూచుచున్నట్లామెకు తెలియుచుండెను.లోకమంతయు నా మెనే చూచుచుంన్నట్లుండెను.ముఖము వంచుకొని  త్రోవకు ప్రక్కగా నడువ మొదలు పెట్టెను. కొంచెము జనము తగ్గినచోట, ఆమె ఆయాసము తీర్చుకొనుట కాగెను. నలుగురు నవ్వుకోనుచు పోవు పురుషులు ఆమెను చూచి ఆగిరి.
"చూడరోయ్"
"ఎవరమ్మా నువ్వు?"
"బెదురు లేదోయ్"
ఒకడామెను  దగ్గరగా రాసుకొని పోయెను. ఇంకొకడు చేయికి  చెయ్యి తగిల్చెను. సిగ్గు పికుచుండ దైర్యము  కరిగి పోవుచుండ ఆమె వడివడిగా నడిచెను.కాని  వారామె  కడ్డము వచ్చిరి.  ఒకడు వెనుకకు భుజము పైచెయ్యివైచి చేవిలోనేదో చెప్పెను. ఆమె అతని ముఖము నోక్కచరపుచరచిముందుకు  పోయెను. తక్కిన వారు నవ్వి ఆమెకు అడ్డముగా వచ్చి నిల్చిరి.ఒకడు వెనుక నుండి ఆమెను ఇంకోకనిపై త్రోసేను. కోపము కండ్లనుండి మండిపడుచుండగా, చేతులు కట్టుకొని,ఆమె  వారికెదురుగ నిల్చునెను.ఆ ఎర్రని  ముఖమును, కండ్లను, దైర్యమును, రోషామును, చూచి వారు వెనుకకు తగ్గిరి. "మా వెంటరా" అని ఒకడనెను. ఇంకొకడు చీర  చేరగును లాగెను. అలసియున్న శశిరేఖకు ద్తేర్యము చాలలేదు. బోట బోటకన్నీళ్ళు కారును. కాళ్ళు వాడకెను. నిరసముచే నిలువలేక పోయెను. ఇంతలో కొంతకాలము నుండి ఆ ప్రక్కయింటి నిదలోనుండి  చూచుచున్న ఒక పురుషుడు యీ గుంపును  సమీపించెను.అతనిని చూచి, వారెమియు నెరుంగని వారివలె దూరమున నిలువబడి యింకొకవైపు చూచుచుండిరి.అతడు పొడుగుగా బలముగా నుండెను. ఆయన గడ్డము అప్పడే నెరయు  చుండెను. కండ్లకు సులోచనములుగలవు. నలువదియేండ్లు దాటియుండును. అతడు శశిరేఖను సమీపించెను.నిదానించి ఆమెను చూచెను.  శశిరేఖయు అతని ముఖమువైపు చూచెను.అతడు  తన ముఖమును గాక, కండ్లలో నుండి ఆత్మలోనికి చూచుచున్నట్లుండెను.విశ్వాసము, శాంతి, దైర్యము,ఆయన కళ్ళనుండి ఆమెలోకి వచ్చుచున్నట్లుండెను.
"అమ్మా, నా వెంటరా"
శశిరేఖ ఏమియును  ప్రశ్నింపలేదు. ప్రశ్నింప నవసరము లేదని యెరుంగును. ఆల్పులు మహాత్ముల గుర్తింపలేరు గాని,ఉదార స్వభావులు చూచుటతోడనే తమ బంధువుల నెరుంగగలరు. ఒక అరమ్తెలు నడచి,ప్రజలెక్కువగా లేని  విధిలో, ఒక చిన్న యింటిలోనికి  తీసుకొనిపోయి దీపము వెల్గించెను.ఆమె కాకలిగా నున్నదని గ్రహించి లోపలికిపోయి ఒక రొట్టెను పళ్ళెములో నుంచి తీసుకొనివచ్చి యిచ్చెను. భోజనమ్తెన తరువాత శశిరేఖ ఆయన తన విషయమై మాట్లాడు ననుకోనేను.కాని ఆయన  చదువు కొనుచు  కూర్చుండెను. "నిధ్రవచ్చుచున్న ఆ గదిలో  నిద్రింప వచ్చు" అనెను. శశిరేఖను  కాశ్చర్యము గలిగెను.
శశి- నేనెవరో మీరడుగ లేదే?
పురు- ఎవరైతేనేమి?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS