Previous Page Next Page 
శశిరేఖ పేజి 37

నాల్గు దినముల నుండి నిద్రలేదు. అశాంతి  యెక్కువయ్యెను. సుందరావామె నకారణముగ  బాధించు చుండెను.  అతని ధనమై పోజోచ్చెను. ఏదో అతనికి శరీరములో రోగము. మండుకండ్లతో, అలసిన దేహముతో, దిగులుపడిన మనసుతో నామె కూర్చుని యిండెను. సుందరరావు మంచము పై పరుండియుండె. శశి- ఎందుకు భోజనం లేందే సాయంత్రమే నిద్రపోతారు? అట్లా ఎలక్టికు దిపాలకింద తిరుగుదాము రారారూ?
సుంద - అదే పని నాకు, నిద్ర వస్తోవుంటే,
శశి- నాకేం తోచటంలేదు. ఇట్లరారూ?
సుంద - తోచకపోతే వురేసుకో, నన్ను మాట్లాడించకు.
శశి - పోనీలెండి.నేనే వెళతాను.
సుంద- ఎక్కడికి?
శశి - కొంచెం సేపు బయటతిరిగి   వస్తాను.
సుంద- చికటిపడ్డాక ఇప్పుడు బయట  తిరగడమేమిటి? వెళ్లొద్దు.
శశి - పరవాలేదు.
సుంద- పరవాలేదేంటి? వేల్లోద్దాంటూ  వుంటే.
శశి -మీరేమీ సంతోష పెట్టరు సరేకదా, నేన్తెనా కొంచెం  సంతోషిద్దామంటే ఎందుకిట్లా అడ్డు పెడతారు?
శశి -  సంతోషం! నీకన్నీ విధుల్లో తిరిగే సంతోషాలు కావల్సి వస్తున్నాయి.ఇంకా పొగరు తగ్గలేదు.పని పట్టిస్తా నుండు.
శశి - మీరెవరు నన్నడ్డ పెట్టడానికి?
సుందరరావు చివాలున లేచేను.
సుంద- నేనెవరినా? తెలిపించనా ఎవరినో ?దిక్కులేని దౌర్భాగ్యు రాలికి నీకు కూడు పడేస్తోవుంటే? నేనెవరినంటావా?ఇక్కడుందవద్దు.పో,ఎవడు పెడతాడో తిండి.
శశి - పోనీలెండి, పెట్టకపోతే భయమా? ఇంక మీ యింట్లో భోజనము చేసినప్పడనండి.
సుంద- రామారావు నీకోసం సిద్ధంగా వున్నాడని గావును నీ ద్తేర్యం. ఆనాడే రాజీనామా యిచ్చి పోయినాడు. గుండె  పగిలి.సంతోషించు.
ఆమెకు కష్టము కలిగించి ఆమె ముఖములో దుఃఖమును చూడడము అతనికెంతో యిష్టము.శశిరేఖ మాట్లాడలేదు.ఆయాసముతో  సుందరరావు ప్రక్క పైపరుండి నిధ్రపోయేను. శశిరేఖ అట్లే గూట్లో కూర్చుని యుండెను. ఆహా!చివరకు యీ స్ధితి  వచ్చినదా? ధిరుడగు రామారావు హృదయము పగిల్చి తెచ్చుకొన్న సౌఖ్యము ఇదా? ఈ వేదనను అనుభవించుచు ఎన్నాళ్ళిట్లు బ్రతకవలెను! ఈ క్రూరత్వములో, యీ అంధకారములోనేన్నాళ్ళు?తన జీవితము యవ్వనము  నింకా పాడుచేసి కొనకూడదు.పూర్వపు చరిత్ర యంతయు జ్ఞప్తికి వచ్చెను. ఇంక నిచ్చట నిల్చుట దుస్తరము. పెద్ద ఆ శాంతి  హృదయము మండుచుండెను. ఏవో  ఆ వేశములు పోడము చుండెను. సుందరరావు తనను వెళ్ళిపొమ్మన్న మాటలు చెవుల  ధ్వనించు  చుండెను.ఛి ఇంక అతని వద్ద నుండుటా! పోవలెను.కాని ఎక్కడకు? ఈ మహా పట్టణమున ఎక్కడకు పోవుట?తన నగల నతడేక్కడో బ్యాంకిలో పెట్టి యుండెను. ఏ మ్తేనను ఇక్కడింక ఒక్క నిముషము నిలువ కూడదు.ఏ బాధలు కలిగినను సరే,ఎట్టి  అవమానము తటస్దించినను సరే, అభిమానములే తనకు? అతని  కరుణ పై నాధారపడి యుండుటా? ఇతనికిని తనకు నింక యేమి  సంబంధము!
సుందరరావు కళ్ళు తెరచి-"యిట్లారా"అనెను.
"ఎందుకు?"   
"యెందుకేమిటి, రమ్మంటే"
"రాను. యెన్నిసార్లు చెప్పాలి?"
"వొస్తావా? రాప్పించాలా!"
"రాను"
సుందరరావు లేచి ఆమెను పట్టుకుని లాగెను. ఆమె పెనుగులాడినది.అతనివద్ద సారాయికంపు కొట్టుచున్నది. ఆమెను బలవంతముగ లాగుకుని వెళ్ళి,మంచమున కడ్డముగా  పడవేసి,ఆమె పెనుగుటఛే విసుగుతో కామముతో భుజముపైకరిచెను. ఆమె రోతపడి,బాధపడి,అతనిని ముఖముపై గుద్ది,కింద పడవ్తెచి, లేచి తలుపు దగ్గరకు వెళ్ళి నిలుచున్నది.
ఎదురుగనున్న షాపులో గుత్తులు గుత్తులుగ  ఎలక్టికుదీపములువెలుగుచున్నవి. రంగు రంగుల చీరెలు?పట్టుబట్టలు,  జరిలు, మెరయుచున్నవి ఆకాశపు రంగులు, నదినీరు, వెన్నెల, పువ్వులు, ప్రేమ,చల్లనిగాలి, జ్ఞప్తికి తెచ్చినవి.ఆ దీపముల క్రింది సామాన్య మానవులు దేవతలవలె కనబడుచుండిరి.వీధి యంతయును ప్రజలతో  కిటకిటలాడుచుండెను.ఇందరు ప్రజలు ఏయే పనులు మీద పోవుచుండిరో, ఏయే ఆశలో వారివి!ఏయే ఆశయములో? యింటికి  పోయిన తరువాత సౌఖ్యపడువారు కొందరు, అచ్చటను సౌఖ్యములేని వారు కొందరు....         
ఇంతలో రెండు  పెద్ద మోటార్లు చప్పుడు  చేసికొనుచు మిరుమిట్లు గొలుపు దీపములతోఆ షాపు ముందాగెను. దానిలో నుండి దిగి స్త్రి పురుషులు ఆయిదారుగురును,పిల్లలును. నవ్వుకోనుచు షాపులోనికి బోయిరి.శశిరేఖయు విధిలోనికి  పోయెను.మెల్లగబోయి మోటార్ల దగ్గరగ నిలువబడి దీపముల వంక ఆ షాపులోకి వెళ్ళిన వారి వంక చూచుచుండెను.వారి వారి  నవ్వులలో ఆ పిల్లల కేకలలో, వారి ఆనందములో అందమగు దుస్తులలో ఆమె  తన దుఃఖమును  ర్ణముగమరచెను.ఇతరుల దుఃఖమును జూచి కన్నీళ్లు  కార్చుట ప్రతి వారికిని  చేత నగును.కాని, ఇతరుల సౌఖ్యమును చూచి, దుఃఖమును మరచుట , శశిరేఖ వంటి యున్నత హృదయులకు గాకఎవరికిని సహజము కాదు. కన్నీళ్ళతో యింకను తడిగానున్నఆమె ముఖము వికసించెను.నల్లని ఆ నేత్రములు దీపపు కాంతిలోపడి తళతళ లాడుచుండెను. ఎర్రని  పెదవులు కొంచెము  తెరచి,ఎత్తిన కంఠముతో  ఆమె పసిబాలిక పొందు సంతోషము పొంది పరధ్యానముతో చీకటిలోకి వెళ్ళిపోయినది.     


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS