Previous Page Next Page 
శశిరేఖ పేజి 36

శశిరేఖ కండ్ల వెంబడి నీరు  కారుచుండెను. అతడు ఆమె పాదములకు  పట్టుకొని ముద్దు పెట్టుకొని  తన  కన్నీళ్ళతో తాడిపెను.
సుంద - రా!రా! నీకు కష్టము కలిగిస్తే వెళ్ళిపో, వస్తావుకదూ? బండి సిద్ధంగా వుంది.
శశిరేఖ అతని మెడపై  చెయ్యి వేసెను.              
                                          .....................................
ఆ సాయంత్రమే రామారావు ఇంటివద్ద ఆలోచించుకోనుచు కూర్చుని యుండెను. ఇదేమిటి? తనకే అంత  బలహినమా? పెండ్లిగాక  ముందే తనకిట్టి కాంక్షలా? పరస్త్రీనా అంత ప్రేమతో రాత్రి తాకుట? వివాహము కానిది ఆమె తన సోదరి.  ఛి!ఛి! ఎట్టి దుర్మార్గము! శశిరేఖను చూచిన తోడనే తన మనసు ప్రలోభమునకు లోనగు చుండెను. ఆమెనంత తరుచుగా చూడగూడదు.అని  మూడురోజులవర  కామె యింటికి  పోలేదు. రెండవనాటికి సుందరరావు రాజీనామా వచ్చెను.పాపమాతడు  విచారముచే  పనిమానుకోనేను గాబోలు! అతనికి తానెంత బాధ కల్గించేనోకదా! మూడవవాడు శశిరేఖ నుండవుత్తరమువచ్చెను క్షమించు. సుందరావును వదలలేను.నీకు వ్రాయుటకు సిగ్గగు చున్నది నన్ను మరచిపో.                                                                                                                                                         శ  శి రే ఖ

                                                                           14
చెన్నపట్టమున శశిరేఖయు  సుందరరావును ఆరునెలలు  గడిపిరి. సుందరరావు శశిరేఖను ప్రతి సౌఖ్యమును  కలిగించుచు ఆమె ఆనందమునే తన ఆనందముగా  చేసికొని  మిక్కిలి  ప్రేమతో  ప్రవర్తించెను. శశిరేఖ కితని పై ప్రేమలేదు.కాని,చేతన్తే  నంతవరకు భరించి యూరకుండెను.ఒక పెద్ధయింట నివాసమును,గుర్రపు బండిలో  షికార్లును,నాటకములు దినమంతయు నాక్రమించు  కొనచుండెను.ఆనందము నెచటన్తేన పొందగల శశిరేఖకు ఇదంతయు నొక కలవలె జరిగిపోయెను.
కాని కొద్ది దినములలో  సుందరరావు పూర్వపు క్రూరత్వ  మారంభించెను. అంతకన్న నెక్కవగ  ఆమెను బాధ పెట్టుచుండెను. ఈ కష్టములలో  ఈ బాధలో  శశిరేఖకు ఏ మాత్రము  నతనితో నుండుట కిష్టము లేదు.రామారావును వదలి ఇతనిని నమ్మి ఎందుకు వచ్చితినా  యను మహా విచార   మామెను  చుట్టుకోనెను.
పురుషునికి,ప్రేమ "ఆట " గాని స్త్రీకి ప్రేమయే జీవనము.ప్రేమించెనా స్త్రి ప్రేమించువానికిని తనకును శాశ్వతమగు బంధనము కలదని తలచును. తనకిష్టములేని పురుషుని స్త్రి తిరస్కరింప వచ్చును. కాని,తనను ప్రేమించినందులక్తే అతని యెడ ప్రేమచూపక మానదు. పురుషుని స్వభావ మట్టిదికాదు.తన యిష్టము తిరగగనే  పూర్వమునంతను  మరచిపోవును.స్త్రి యొకని ప్రేమించుచు యింకోకనితో కాలము గడపగలదు.కానిపురుషుడట్లు సులభముగ చేయజాలడు.లోక మీ విధముగ సమర్పబడక పోయినచో  సృష్టికే యాటంకమురాగలదు. సుందరావెంత  క్రూరుడ్తెనను తానింకోకని ప్రేమించుచున్నను, శశిరేఖ అతనిపై తనకు భాధ్యత గలదని నమ్మి అతనిని వదలలేకపోయెను.పురుషుడు దాతయగుటచే యనేకుల కిచ్చి మరచును. స్త్రి గ్రహించుటచే తనకు ప్రేమదాన మొనరించినవారి నెన్నడును మరువదు.అందువలననే సుందరరావు  పిలచినప్పుడు ఆమె రాననలేక పోయెను.
రామారావును తిరిగితనను  తిసికొమ్మని ప్రార్ధించుట కామె మనసు పోయెను,గాని సిగ్గయ్యేను.ఏమని తిరిగి యడుగగలదు? ఈ సుందరరావు వదధనుండి తప్పకపోవలయు ననుకోనెను.కాని ఒక్కకాస్తెనలేక ఆ మహా పట్టణమున ఎచటకు పోగలదు?సుందరరావు ననేకసార్లు తన నెచటకైనా పంపివేయమని బ్రతిమాలుకోనేను. అతడు ప్రత్యుత్తరమ్తెన నియ్యలేదు.అతని కోపమును భారించుట కెవర దోరుకుదురుఆమెకాక?
సుందరరావు మోహము పరమ నీచముగ  మారుచుండెను. పశుత్వమును కామెను బానిసగా జేసికోనజూచెను. అంతకన్న ఆమెను అ గౌరవించు మార్గమింకేమియును లేదు. తన అభిమానముననే నిర్మలత్వముచే కోల్పోయితిననుకొని యెంత క్రూరత్వము చూపినను లేనిదీ,యిప్పడతనిపై తిరుగపడెను. అసలు ముందు అతనితో శరీర సంపర్కమునకే ఆమె వప్పకోనలేదు. సుందరరావు కది సరిపడలేదు. ఆమె తనను తిరస్కరించుటతోడనేఅతడు  కోపమును భరింపలేదు.ఆమెకు తిరిగి ఇప్పుడు దిక్కులేదని అతనికి దైర్యమేర్పడినది.
వీధి దగ్గరగా నున్న గదిలో చిన్నదీపము వెల్గుచుండెను.ఆ గది కిటికీలో శశిరేఖ కూర్చుని యుండెను.తిరిగి పూర్వపు జీవనము మొదలయ్యెను. రాత్రులంతయు ప్రేమలేక. ఒక్కమాట మాట్లాడువారు లేక, తన అందమును చూచి సంతసించువారు  లేక, పూర్వపు సౌఖ్యముల తలచుకొని  యేడ్చుటయును, సుందరరావు హృదయ   కములగుమాటలను విని ,లోలోపల కుళ్లుటయు, దినదినమును జరుగుచుండెను.ఆనందములేదు. ప్రేమలేదు, జీవితమున కంతమున యుద్దేశ్యమును లేదు.ఆమెను మహా అశాంతి  ఆవరించెను.ఇట్లు బ్రతుకుటకన్న, ఎట్లు    టయ్తేననుయుత్తమమే.ఒక్కగంట వడలు తెలియని ప్రేమకోరకు ఏ మ్తెనను ఇయ్యవచ్చునుగదా! తన  సౌందర్యమును  గాంచి వివశుడగుపురుషుడేమి కోరినను యివ్వదా!  రోడ్డుమీద వచ్చుచు పోవుచుండు వారిని,మోటారు    డ్లనుచూచియు, సంతోషించుచు  నవ్వుచుండు వారి యానందమున తన దుఃఖమును మరిచియు, ఆమె దినమెల్లను గడపు  ను.         


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS