సుందరరావు వూపిరి అతి త్వరితముగా వేడిగా ఆమె వొళ్ళంతయూవేడిగా తాకుచున్నది.వడలు వొణుకుచున్నది. వేడిగానున్నది.శశిరేఖకు భయముతో యేమియును తోచుటలేదు. పెనుగులాడెను.కాని అతడు బలవంతుడు.అరిచెను.అతని చేతులు ఆమె కంఠమును బిగించెను.భయము కనబరచుటకు యిష్టములేదు. రామారావు రాకూడదా? రాడేమి? తననిట్లు ఆపదలకు,కాఠిన్యమునకు వప్పచేప్పి, తనెంత ప్రార్దించినను, కరుణ చూపని ఆ రామారావునకు తనమీద యేమి ప్రేమా? తను జీవించి మాత్రమేమి ప్రయోజనమో? తానేవరిని ప్రేమించేనో ఆ పురుషులకు స్వార్ధపరత్వ మెక్కువ.
సుంద- యీ కంఠము, యీ చిన్న కంఠము, యీ ముద్దు కంఠము.
కంఠమును వోత్తుచున్నాడు. కళ్ళు తిరుగుచున్నవి.చీకటిలో చీకటి వెళ్ళు బిగించుకొని పోవుచున్నవి. సుందరరావు ఆమె కంఠము కొంచెము వదలి "యిప్పడైనా వోప్పకోవూ?"
శశి - "ఛి! రానుపో" అని బిగ్గరగా అరిచినది.
సుందరరావు మళ్ళి ఆమె కంఠమును గట్టిగా బిగించి,తన పెదవులతో ఆమె పెదవులను మూసెను.
"శశి,శశి, వోప్పకో,నిన్ను చంపలేను,యీ హృదయం ఆగు.తుందా?శశి...........
వూపిరాడుటలేదు.బాధ, చీకటి మైకము.
..............................
శశిరేఖ కన్నులు విప్పి చూచునప్పటికి సుందరరావు చాలా దుఃఖముతో, భయముతో తనవంక చూచుచుండెను.దీపము వెలుగు చున్నది.
సుంద - నా శశీ, శశీ,బతికివున్నావా? నిన్నేమి చెయ్యలేను. ఇంత దైర్యంగా వుంటావనుకోలేదు. రోషము నా మనస్సును నాదికాకుండా చేసింది.నన్ను క్షమించగాలవా? చంపెయ్యి.ఆ చేతులతోనే చంపెయ్యి.సుంద శశి, నాదుఃఖము నికర్ధంముకావటంలేదు.ఇంటికివెళ్ళి చూసేపటప్పటికి నువ్వు లేవు. ఇంక ఎందుకు బ్రతకడం అనిపించింది. ఆ రాత్రే విషముత్రాగినాను. స్మృతి తప్పినది. నిన్నటివరకూ జబ్బుగానే వున్నాను. బ్రతుకుతాననికూడాఅనుకోలేదు.రామారావుగారే మందిచ్చారు. ఆయనే బ్రతికించారు.నాశశిని లాక్కొని నన్ను బ్రతికించడ మెందుకు? నా ప్రాణమే పోయిన తరవాత నేనెందుకుబ్రతికి? శశి!ఇవాళే యింటికి వచ్చాను. నువ్వులేనిదే బతకలేక నీకోసం వచ్చాను. నామీద జాలిలేదూ?రామారావుగారితో పోనీ నీ యిష్టము వచ్చినట్లుండు,కాని నా యింట్లో వుండు.అంతేచాలు.
శశి - ఛీ! నే నట్లాంటి పని చెయ్యనని మీకింకా తెలిలేదూ?
సుంద- నా బాధ అట్లా అనిపిస్తోంది.నన్ను వదలి పెడతావా? నన్ను చంపరాదూ అంతకంటే? బుద్దిహినున్నాయి నీ ప్రేమను, అమూల్యమైనప్రేమని చేతులారా చంపుకున్నాను. నా దురదృష్టమెవడికిలేదు.నన్ను ప్రేమించవద్దులే. నీ మొహం కనబడనిచాలు. నన్ను వదలకు,శశి, నేనుబతకలేను.
శశి - మరేమి చెయ్యమంటారు? అప్పడేందుకూరుకున్నారు? ఆయనకి వాగ్ధత్తం ఇవ్వలేదూ నేనూ?
సుంద - మరి నన్నేం చేయ్యదలచుకున్నావు? నిన్నింట్లో వంటరిగా విడిచినవాడికి ఆయనకి నీమీద ప్రేమయేమిటి?ఎందురు దొరసానుల్తేనారో!ఈ రోజుకి నువ్వు దొరికినా వాయనికి,
శశి - ఆయన్నేమీ అనవద్దు. ఆయన సంగతి నాకు తెలుసును. మొన్ననే యీ మాటలు చెప్పకపోయినారూ? ఉండేదాన్నేమో? నేను మీ కక్కర్లేదు కదా? నేను వేడితేనే మీకు సంతోషంగా వుంటుందను కున్నాను.
సుంద - నిజంగా నన్నిట్లా వదుల్తావనుకోలేదు.నిజంగా ప్రేమ వుంటే నిన్నట్లా విడిచి వుంటాడూ? నేనేదో చెడ్డవాణ్ణిని నా నుండి నిన్ను తప్పిద్దామనేఆయన వూహ. వాళ్ళనేరగవుగానిఇంకా నువ్వు.లోకమరమ్మత్తుగాళ్ళు వాళ్ళు.
శశి -మఱి ఇంక ఆయన్ని ఎట్లా చూడను?
సుంద -ఆయన్ని చూడనేవద్దు. ఈ రాత్రే చెన్నపట్నం వెళదాము. నాకు పనివొద్దు ఏమివద్దు.నీసేవచేస్తూ పడి వుంటాను. నీకు ఏ బెంగా వుండదు. కావలిస్తే నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను. నా డబ్బంతా నీకే రాసిస్తాను.
శశి - అని నాకేం అక్కర్లేదు.మీ మీద నాకు ప్రేమ లేదు.
సుంద - నన్ను నువ్వు ప్రేమించనక్కఱలేదు. అడగనే అడగను. నీయిష్టం. నా దగ్గిర వుండుచాలు.
శశి - ఆయన్ని మోసపుచ్చటం ధర్మమేనా?
సుంద - నా సంగతి విచారించావా?నిన్న వచ్చిన ఆయన్ని వదలడమే ధర్మం కాకపోతే మూడేళ్ళనించీ భార్యకంటే ఎక్కువగావుండి నా జీవితమంతా తీసుకొని నన్ను వదలడం యిప్పుడు ధర్మమేనా?
శశిరేఖ ఆలోచించుచుండెను. సుందరరావామె నడుము పై చెయ్యి వేసి దగ్గరకు తీసుకొనెను.
శశి -నేను రాను వదలండి. నన్ను ముట్టుకోకండి.మిమ్మల్ని నమ్మిందేవరు? మీతో వుండడం అసహ్యము.
సుంద - ఇంక నిన్నేమన్నా చేస్తే వెళ్ళిపో, అంతా మరిచి పోయి నావూ? ప్రాణం పోగొట్టుకుంటాను. నిన్ను తలచుకుంటో.నిన్ను ప్రేమించి నమ్దుకుబ్ ఫలితమా యిది?
అతని కండ్లనుండి ఆమె పై వేడినీళ్ళు పడెను.
సుంద- శశి! నన్ను వదులుతావా? మనము గడపిన కష్ట సుఖాలు మరిచావా? మన్ని అని, శాశ్వతంగా కట్టి వెయ్యలేదూ? ఈ దౌర్బగ్యుణ్ణి చంపుతావా? రైలు టైమయింది. వస్తేరా లేకపోతే యిక్కడే చచ్చిపోతాను. నీ యిష్టం త్వరగా చెప్పు.
