Previous Page Next Page 
శశిరేఖ పేజి 34

తనపై జాలి ఎందుకు? జాలివలననా ఈ పెండ్లి?  దానికి తాను  లోబడుటా?అతడు వచ్చుట  తోడనే అడగవలెను.నిజము  చెప్పించవలెను.
ఆరున్నర కొట్టినది. దీపము  వేలుగించలేదు. చికట్లలముకోను చుండెను.ఇంకను రాలేదు. ఇదేనా ప్రేమా? అదుగో అడుగుల చప్పుడు. వెంటనే కోపమంతయు  మరచెను.అతను తలుపు తెరచి లోపలకు వచ్చి తలుపు గడియ వేసెను.శశిరేఖ అతన్ని కౌగిలించుకొని "చివరకు వచ్చినావా" అనెను.
"నా కోసం  ఎదురు చూస్తున్నావా,శశి"
ఎవరది? సుందరరావు! శశిరేఖ వళ్ళు  జల్లుమనెను. అతనిని తోసివేసి దూరముగ  పోయెను.
సుంద - ఎందుకట్టా దూరంగా  వెడతావు? నీతో మాట్లాడాలని వచ్చాను.
శశి - ఏం మాట్లాడ్డానికి?
సుంద - చేపుతానురా ఇట్లా కూచో.
శశి - దీపం వెలిగిస్తాను.
సుంద - అక్కర్లేదు. దగ్గిరగా రా. మాట్లాడుతాను. మొహం ఏది చూపించు.ఎందుకంత  భయపడతావు? నేనేగా? రెండు రోజుల్లో యింత కొత్తా!
శశి - నన్ను ముట్టుకోవద్దు.దూరంగా వుండండి.
సుంద - ఉహూ! ఇంతలో పాతివ్రత్యం వచ్చింది కాబోలు? నన్ను పిచ్చివాణ్ణిచేసి  దామనుకున్నావా? అంత సులభంగా వదిలేవాణ్ణికానునేను. ఇంటికి రా.
శశి - ఇదేమిటి?నేను రాను.మీరెవరు నన్ను రమ్మనడానికి ?
సుంద - నె నెవరినా? మూడేళ్ళు నా దగ్గరుండి, నన్ను నా వాళ్ళు మరపించి, ఎవరో ఒక రివాళ నిన్ను పెళ్ళి చేసుకుంటామన్నారని,ఇట్లా వేడాతావా?  వల్లకాదు, నేను వప్పకోను.
శశి - వప్పకొక ఏం  చేస్తారు?
సుంద - ఏం చేస్తానా?
శశి - అవును. మీ పెత్తనం ఏమిటి?
సుంద - ఆఖరిసారి అడుగుతున్నాను. వస్తావా రావా?
శశి - రాను.
శశిరేఖ భయము వేయుచుండెను.ఇంకను రామారావు రాడేమి?సుందరరావు మిక్కిలి కోపముతో మాట్లాడుచుండెను.  చీకటిలో   అతని  ముఖము  కనబడుటలేదు  గాని  అతని  వడలు వనకుచున్నట్లుండెను. ఊపిరివడిగా  వచ్చుచుండెను. మాటలలో రోషము కాన్పించుచుండెను.
సుంద - ఇంకొకడు నిన్ను ముట్టుకుంటాడనే సంగతి తలుచుకొని నేను బతగ్గలనా?ఈ వాళ
నా మనస్సుగాలేదు. నామాట విను. ఏం చేసినా చేస్తాను. వస్తావా రావా?
శశి - నేను బెదురుతా ననుకున్నారా? ఏం చేస్తారో చెయ్యండి. నేను రాను.
శశిరేఖ లేచి నిలుచుండెను.సుందరరావు లేచి తటాలున చీకటిలో ఆమెను గట్టిగా కౌగిలించుకొనెను.శశిరేఖ పెనుగులాడుచుండెను.
సుంద - రావూ? నా ప్రేమ మరచిపోయినావూ?రావూ?
శశి - రానంటే?
సుంద - రావూ? రాకపోతే చంపేస్తా నిన్ను. ఇక్కడ మాత్రం వదలి పెట్టాను.
శశి - భయమా? చంపండి.కాని  వస్తానన్నమాట   అబద్ధం.నేను భయపడేదాన్ని కాదని ఇంకా తెలిలేదూ?
సుంద - ఏది ఆ మొహం చూన్నిఒక్కసారి. ఆఖరుసారి ముద్దు పెట్టుకో.ఆహ యీ కంఠము! ఎన్నిసార్లు ముద్దుపెట్టుకున్నాను దిన్ని! ఎంత అందంగా వుంది! యెంత నలిపినా యింకా  అందం యెక్కువ అయ్యేది.ఏది?ఆ   వక్షమును  ఒకసారి  కళ్ళతో  చూడని,  చేతులు  తియ్యి,    ఆఖరుసారి....యింకోకళ్ళ కళ్ళబడనిస్తానా? ఆ   కృష్ణుడు తాకినందుకే  వాడు    బతకకూడధనుకున్నాను.  యేది....యెంత బావుందో, కదలకు....ఒక్కసారి అదుముకొని.... ఆఖరుసారి,శశి,నా శశి నా ముద్దుల శశి, ఐశ్వర్యం! నా ప్రాణము, నా మృత్యువు, నా దరిద్ర్యం. దా శశి, చూడనీ తీసెయ్యి ఆఖరుసారి. ఇంక మనుష్యుడి కళ్ళపడవు. చేతులే తాకవు యిక్కడ యింక అగ్నికే ప్రాప్తి, ఆఖరుసారి  పడుకోబెట్టి ముద్దులు పెట్టుకొని, నా చేతులతోనే నిప్పు  వెలిగిస్తాను... తరువాత  నేనేమ్తెపోతే నేం?.... ఏది............


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS