Previous Page Next Page 
రాజ హంస పేజి 35

 

    ప్రేమ....!
    ఈ మధుర ప్రవాహంలో ఆమె కొట్టుకు పోతోంది.
    కొన్ని రోజులుగా దిలీప్ లో ఏదో మార్పు ఆమె కనిపెట్టింది. ఆ మొదటి రెండు మూడు నెలలూ మినహా యిస్తే, అతను తనతో వుండేది నెలకు పదిహేను రోజులే. మిగతా కాలమంతా బిజినెస్ టూర్ మీద తిరుగుతూ వుండేవాడు. ఒక్కోసారి పని ఎక్కువగా వుంటే నెలకు యిరవై రోజులు కూడా టూర్ మీద వుండేవాడు. అయినా ఆమెతో గడిపే మిగతా రోజులు చాలా చలాకీగా, హాయిగా అత్యంత ఆహ్లాదంగా గడిపేవాడు.
    ఇప్పుడు,
    అతన్లో ఏదో మార్పు, ఆమె పట్ల అతనికున్న ప్రేమానురాగాల్లో మార్పు లేదు. కాని...ఏదో బాధ, గుండెల్ని గుప్తంగా ఏదో ఆవేదన తొలిచెస్తున్నట్లు తరచి చుస్తే వ్యక్తం చేసే కళ్ళు.
    ఆమె అతని సొంత విషయాల్లో ఎప్పుడూ కలగజేసుకోలేదు. వేళకి యింటికోచ్చినా రాకపోయినా,టూర్ కు వెళ్ళినప్పుడు, చెప్పిన టైముకన్నా ఆలశ్యంగా వచ్చినా, ఎప్పుడూ యిదేమని అడగలేదు. కాని అతని వ్యకులపాటు చూసి తట్టుకోలేకపోతోంది.
    ఒకరోజు నిగ్రహించుకోలేక "దిలీప్! ఎందుకలా వుంటున్నావు?" అని అడిగింది.
    "ఏమి లేదు రాజా!"
    "దిలీప్, దిలీప్. నాముందు దాచకు. నేను నీదాన్ని నీ శ్రేయస్సు కోరిన దాన్ని నువ్వు ఏదో బాధ దాచిపెట్టుకుని కుమిలి పోతుంటే భరించలేకుండా వున్నాను. దిలీప్ ప్లీజ్ చెప్పవా?"
    "నిజంగా ఏమి లేదు రాజా"
    "ఉందొ లేదో ప- నీ మొహం, కళ్ళు చాటి చెబుతున్నాయి. దిలీప్ బిజినెస్ సరిగ్గా సాగటం లేదా? ఏమన్నా ఆర్ధిక ఇబ్బందులేదుర్కొంటున్నావా? అలా అయితే చెప్పు దిలీప్. ఈ యిల్లు లగ్జరీ విడిచి ఒసాధారణమైన గృహం లోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు నీతో పరిచయం కాకముందు సుఖమంటే లగ్జరీ సొసైటీ ఆడంబరం అనుకుంటూ ఒక రకమైన అహంతో కూడిన వూహల్లో మునిగివుండేదాన్ని. నీ సహచర్యం లభించాక, నీ ప్రేమ మాధుర్యం చవి చూశాక జీవితమంటే ఏమిటో తెలుసుకున్నాను. ఇప్పుడా సుఖాల మీదా, సొసైటీ మీద మోజు లేదు దిలీప్. నువ్వు కావాలి నీ ప్రేమామృతం గ్రోలుతూ తనివితీరా అనుభవించాలి."
    "నేనూ అదే కోరుకుంటున్నాను రాజా కాని...."
    "కాని ...ఏమిటో చెప్పు దిలీప్ నీ మనసులో వున్నదంతా చెప్పేసెయ్."
    "ఊహు సారీ రాజా" అంటూ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు.
    

                                                         *    *    *

    రోజు రోజుకూ అతన్లోని దిగులు ఎక్కువయి పోతోంది. మనిషి శారేరకంగా కూడా కొంతవరకు కృశించాడు. ఆమె దగ్గర కోస్తాడు. "రాజా!' అంటూ ఏదో చెప్పబోతాడు. అంతలోనే "ఏమి లేదు , ఏమిలేదు" అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.
    ఉన్నట్లుండి ఆమెకో సందేహం కలిగింది. బిజినెస్ లో ఏర్పడ్డ విపరీతమైన టెన్షన్ వల్ల అతని మానసిక రుగ్మతఏమయినా ఏర్పడిందా?
    ఈ ఆలోచన రాగానే ఆమె గుండె చిక్కబట్టేసినట్లయింది. తానే సృష్టించు కున్న ఆ ఆలోచన తాకిడికి ఆమె తట్టుకోలేక .....కాని....అతని ప్రవర్తనలో విపరీతమైన మార్పు, ముఖంలో కనిపించే భయందోళనలు, తనలో తాను గొనుక్కోవటం ఆమె అనుమానాన్ని ద్విగుణీకృతము చేస్తున్నాయి.
    ఒకరోజు ధైర్యం చేసి అడిగింది "ఏమండీ! మీరేం అనుకోనంటే ......ఓసారి డాక్టరు దగ్గర కెడదాం.
    "డాక్టరు దగ్గరకా? దేనికి?"
    "మీకు వంట్లో....."
    "నా వంట్లో బాగానే వుంది."
    "కాదు, మీకు తెలీటం లేదు.... నా మాట కాదనకండి సైక్రియాటిస్ట్ దగ్గర కేడదాం."
    "సైక్రియాటిస్టు దగ్గరగా? దేనికి?"
    "నాకేం మతిభ్రమణం కలగలేదు రాజా. డోంట్ బి సిల్లీ." అంటూ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు.


                                                           *    *    *

    ఉదయం పదకొండు దాటి వుంటుంది. దిలీప్ ఆఫీసు కెళ్ళాడు.
    రాజహంస బెడ్ మీద పడుకుని ప్రక్కనే బుల్లి టేప్ రికార్డర్ పెట్టుకుని అందులోంచి వచ్చే పాటలు వింటోంది.
    బయట కారాగిన చప్పుడయింది. తమ యింటికేనా అని ఆలోచిస్తూ వుండగా, ఓ నిమిషం తర్వాత కాలింగ్ బెల్ చప్పుడయింది.
    ఎవరా అనుకుంటూ టేప్ రికార్డర్ ఆఫ్ చేసి లేచి వెళ్ళి తలుపు తీసింది.
    అపరాచిత స్త్రీ దాదాపు తన వయసే వుంటుంది. మెళ్ళో రెండు మూడు రకాల నగలు. చెవులకు రవ్వల దిద్దులు. చేతులకు రవ్వల గాజులు, వంటి మీద మూడు నాలుగు లక్షల రూపాయల బంగారం జిగేల్ మంటోంది.
    మనిషి అందగత్తె ఏం కాదు. ముఖంలో , చూపుల్లో అహంకారం వుట్టి పడుతోంది.
    "నువ్వేనా రాజహంసవి?" అంది.
    రాజహంస ఉలికిపడింది. అసభ్యంగా వున్న ఆ సంభోధన, ఉచ్చారణ ఆమెను చేకితురాల్ని చేసింది. ఏమనాలో తోచక తల ఆడించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS