Previous Page Next Page 
రాజ హంస పేజి 34

 

    ఆరోజు....
    తాను హైదరాబాద్ లో యింటికి చేరేవరకు రాజహంస నేలమీద అచేతనంగా పడి వుంది. "ఏమిటిది?" అనుకుంటూ ఆమెను రెండు చేతుల్తో ఎత్తుకుని బెడ్ మీదకు తీసుకెళ్ళి పడుకోబెట్టాడు.
    ఆమె ఏ కారణం చేతనో ఫేయింటయిందనీ అంతకు ముంచి కంగారు పడాల్సింది లేదనీ అర్ధమైంది. అందుకనే డాక్టరుకు ఫోన్ చెయ్యకుండా తనకు తోచిన విధంగా తెలివి తెప్పించే ప్రయత్నాలు చేశాడు.
    కొంతసేపటికి ఆమెలో చిన్న కదలిక వచ్చింది. పెదవులు కూడా కదులుతున్నాయి.
    "అనీల్....అనీల్"
    "అనీల్.....నీకంత సీరియస్ గా వున్న నీ దగ్గరకు రాలేనందుకు ఈ దుర్మర్గురాలయిన తల్లిని క్షమించు"
    "నా అనీల్ బ్రతకాలి. నా అనిల్ బ్రతకాలి"
    అతనికి కొంతవరకూ అర్ధమైంది. ఆమెకు తెలివి వొచ్చాక గ్రుచ్చి గ్రుచ్చి ఏమీ ప్రశ్నించలేదు . ఆమె తను పడిపోయినందుకు కారణం ఏదో కల్పించి చెబుతుంటే విని వూరుకున్నాడు.
    మర్నాడు ఆఫీసు నుంచి ఊర్వశికి ఫోన్ చేశాడు. ఓ గంట తర్వాత వివరాలు తెలుసుకుని ఆమె తిరిగి అతనికి ఫోన్ చేసింది. వెంటనే టూర్ ప్రోగ్రాం వేసుకుని ఇక్కడికి బయల్దేరి వచ్చేశాడు.
    "దిలీప్"
    "ఊ"
    "నీకు సంబంధించని మనుషుల మీద వాళ్ళ సమస్యల మీద అంత జాలి దేనికి మీకు?"
    "వాళ్ళు నాకు సంబంధించిన మనుషులు అని అనుకోవటం లేదు నేను. అదీగాక ఒక సమస్యను రెండు వైపుల నుంచీ అవగాహన చేసుకోగలగాలి.'
    "ఊర్వశి అతని వైపు అదో రకంగా చూసింది. "నీ సమస్యనైనా రెండు వైపుల నుంచీ ఆలోచించాలిగా. మరి మన సమస్య నా సైడ్ నుంచి ఎందుకా లోచించలేదు?"
    అతను జవాబు చెప్పేదాకా ఆమె నిరీక్షించలేదు. గభాల్న తన సోఫాలోంచి లేచి, దూకుడుగా వెళ్ళి అతని ప్రక్కన కూర్చుంది. ఊర్వశి అంటూ ఏదో చెప్పబోతున్నాడు ఆమె అవకాశ మివ్వలేదు. చేతులు రెండూ అతని చుట్టూ పోనిచ్చి గట్టిగా పెనవేసుకుని పెదాలతో అతని పెదవులు అందుకోబోయింది. చప్పున ముఖం ప్రక్కకి త్రిప్పుకున్నాడు. "దిలీప్ దిలీప్" అంటూ చేతుల్తో అతని తల పట్టుకుని తన వైపు త్రిప్పుకోటానికి ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో అతని మీదకు యించుమించు వళ్ళోకి పూర్తిగా వరిగింది. ఆమె వక్షోజాలు అతని చాతికి గట్టిగా అదుముకుంటున్నాయి.
    "దిలీప్! దిలీప్! ఎందుకిలా పిచ్చిదాన్ని చేస్తున్నావు నన్ను? ఎప్పట్నుంచో నీకోసం కలవరిస్తున్నావనీ , నా సర్వస్వం నీకు అర్పించటానికి తహతహ లాడుతున్నాననీ నీకు తెలుసు. ఎవరికో దక్కావు అయినా నాకు కోపం లేదు. అసూయ లేదు. నిన్ను శాశ్వతంగా నావాడ్ని చేసుకోలేదన్న ప్రలోభం లేదు. నువ్వు కావాలి . అంతే కనీసం.....స్త్రీని నా అంతగా నేను యింతగా కోరుకుంటున్నందుకు ఈ ఒక్కరాత్రి నా వశం చెయ్యి. రా ప్రియతమా నా ప్రాణమా వివశతతో అలమటించిపోతున్న నన్ను చిత్రవధ చెయ్యకు."
    అతన్నింకా గట్టిగా పెనవేసుకుని చుట్టుకు పోతూ పెదవుల్ని అందుకోటానికారట పడుతోంది.
    అతను షాక్ నుంచి మెల్లగా కోలుకుని బలమంతా ఉపయోగించి ఆమె నుంచి విడిపించుకుని లేచి నిలబడ్డాడు.
    పయిట జారిపోయి, చిన్న వగర్పుతో కళ్ళు పెద్దవి చేసి అతని వేపు చూస్తోంది!
    "ఊర్వశీ! నిన్ని మొదట్నుంచీ ఓ స్నేహితురాలిగానే చూశాను. నేను పురుషుద్నే అయినా నాలో పుష్కలంగా కోరికలున్నా నువ్వేన్నోసార్లు నాకందుబాటులో కొచ్చినా, నిన్నెప్పుడూ రేచ్చాగోట్టలేదు ఎందుకు? అక్రమ సంబంధం అనేదానికి  మనమెన్ని అందమైన పేర్లు పెట్టుకున్నా, కారణాలు చెప్పుకున్నా తప్పు తప్పే. దాని నీడలు జీవితాంతం భయంకరంగా వెన్నాడుతూ వుంటాయి...... ఉండు. నువ్వడిగే ప్రశ్న నాకు తెలుసు. రాజహంస గురించి యీ నిబంధన, కట్టుబాటు ఏమయ్యాయి అని నీ సందేహం. ఆమెతో మొదటిసారి..... అనుభవంలోకి రాకముందు ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యాను. ఆమె పట్ల నాకు బలీయంగా కలిగిన ఆకర్షణ నుంచి తప్పించుకునెందుకు చాలారోజులు ఇక్కడకు రాకుండా తప్పించుకున్నాను. దేనికి? తప్పు చెయ్యకుండా వుండటానికి.....కాని చివరకు నాలోని బలహీనతే జయించి ఆమెతో తప్పు చేయకుండా వుండలేకపోయాను. కాని తప్పో, ఒప్పో ఆమెను నా సొంతం  చేసుకోటానికి నిర్ణయం తీసుకున్నాకే ఆ పని చెయ్యగలిగాను. అంతే ఆ నిర్ణయానికి కట్టుబడే ముందుకు సాగిపోయాను."
    "నేను రాజహంసలా జీవితంలో పాలు పంచుకోవాలనీ, నా బాధ్యత తీసుకోవాలనీ కోరటం లేదు! ఎంతమందితో దగ్గరగా వస్తే అంత మందితో బాధ్యతలు స్వీకరిస్తూ నువ్వు ముందుకు సాగలేవు. కాని జీవితంలో తాత్కాలికమైన అనుభవాలకు అమూల్యమైన విలువలున్నాయి. వాటికి పెద్ద పెద్ద పేర్లు పెట్టి నాకు నీతి పాఠాలు చెప్పొద్దు."
    "నీకు నీతి వాక్యాలు చెప్పేటంత యోగ్యత నాకు లేదు. ఊర్వశి . కాని కొన్ని నైతిక విలువలు మాత్రం నేను పాటించకుండా ఉండలేను."
    ఆమె హృదయం దెబ్బతింది. హతాశురాలై రెండు చేతుల్లో తలవంచుకుని ఏడవసాగింది.


                                                           19

    మరో రెండేళ్ళు గడిచిపోయాయి.
    రాజహంస మానసికంగా యింకా ఎదిగింది. సొసైటీ పేరుతొ , వ్యాపకం పేరుతొ ఎంతవరకు ఏది చెయ్యాలో బాగా అవగాహన చేసుకుంది. ఎవరితో స్నేహం చెయ్యాలో ఎవరితో స్నేహం చెయ్యకూడదో స్నేహం చేసినా ఎవరితో ఎంతవరకూ వుండాలో అర్ధం చేసుకుంది. చీటికీ మాటికీ పార్టీలు, విందులూ , వినోదాలూ ..... వీటి మీద కూడా ఆమెకు ఏవగింపు కలిగింది. తప్పనిసరి అయితేనే గాని అటెండవటం మానేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS