అతను ఈసారి ఇంకా ఇంకా గట్టిగా నవ్వేశాడు.
"అందాలబొమ్మ కళ్ళముందు ఉంటే ఏ మగవాడు బంగారానికి ఆశిస్తాడు. అతనికి కావలసింది స్త్రీ నాకు ఈ బంగారం వద్దు నువ్వంటే నీ ఒళ్లంతా బంగారం చేసేస్తాను రా.... రా...వచ్చి నా కోరిక తీర్చు."
"ఆ" భయంతో ఒణికిపోయింది.
"రా వచ్చి గుండెలమీద వాలిపో" అన్నాడు అదోలా నవ్వుతూ.
ఇంద్రసేన చాల గడగడలాడిపోయింది.
శీలం పోగొట్టుకోవటం కంటే ప్రాణం పోగొట్టుకోవటం నయం.
ఆడిపిల్లను అంతకంటే అవమానం ఏం ఉంటుంది.
ఇంద్రసేన దూరంగా వెళ్ళిపోబోయింది.
అతను వదల్లేదు.
"రమ్మని పిలుస్తుంటే దూరంగా వెళ్ళిపోతావేం. ముద్దుగా పిలుస్తున్నాను ముద్దుగా నా దగ్గరకు రాకపోయావో" అంటూ ఉరిమి చూశాడు.
"నీకు పుణ్యం ఉంటుంది నన్ను వదిలిపెట్టు ప్లీజ్" అంది బ్రతిమాలుకుంటూ.
"అతను నవ్వాడు. ఆ అలాగా అందాలబొమ్మను ఎవరైనా ఒదులుకుంటారా" అన్నాడు.
"ప్లీజ్ దగ్గరకు రాకు ప్లీజ్" అంది చేతులు జోడుస్తూ.
చేతిలో రివాల్వర్ మంచంమీదకు విసిరికొట్టి ఆమె నందుకుని రెండు చేతులతో బంధించేశాడు.
"వదులు....వదులు..." అంటూ విడిపించుకోవడానికి చూసింది, అతను ఒదల్లేదు.
ఆమె ఒళ్ళంతా ముద్దులతో ముంచేశాడు.
ఇంద్రసేన అతన్ని తోసేయడానికి ప్రయత్నించింది. చెయ్యిపట్టి కరవడానికి చూసింది.
అతని చెంపమీద ఛెళ్ళుమనిపించాలని చూసింది.
అందుకతను అవకాశం ఇవ్వలేదు.
మండిపోయింది.
అతను నవ్వి ఆమెను రెండు చేతులతో పైకెత్తి పట్టుకున్నాడు.
ఇంద్రసేన భయంతో అతన్ని పట్టుకుంది.
అతను నవ్వుతూ మంచంవద్దకు వెళ్ళి ఆమెను మంచంమీద పడుకోబెట్టాడు.
"అందాల సుందరి ఈ క్షణం నాదవుతుంది. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది" అంటూ ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు.
శక్తినంతా కూడదీసుకుని పెనుగులాడసాగింది. అతను చాలా బలవంతుడు గావటంవలన అతని పట్టు విడిపించుకోలేకపోయింది.
శక్తి చాలటం లేదు.
ఓపిక తగ్గిపోతున్నట్టుగా శరీరమంతా నీరసంగా తేలిపోతున్నట్టుగా ఉంది.
"ముద్దులబొమ్మ అలసి పోయావా?" అంటూ నవ్వాడు.
ఆమెకు ఒళ్ళుమండి అతని చెంప ఛెళ్ళుమనిపించడానికి చెయ్యి ఎత్తింది.
అతను ముఖం పక్కకు తిప్పుకున్నాడు.
చెంప ఛెళ్ళుమనలేదు కాని అతని తలమీద హేట్ ఎగిరి దూరంగా వెళ్ళిపడింది.
అప్పుడు చూసింది అతన్ని పరీక్షగా.
అతనలా వుండిపోయాడు.
అతనివేపు చూసిన ఇందు మండిపోయింది.
కృష్ణమౌళి గర్వంగా హుందాగా నవ్వాడు.
మీరా! ఏమిటి ఈ విశేషం"
"వేషం కాదు మోసం" అన్నాడు.
"అది తెలుస్తూనే వుంది మోసగాళ్ళ వేషాలు వేస్తారు. మీ వేషాలు నా దగ్గర సాగవు" అంది రోషంగా.
"మోసగాళ్ళు ఎవరు! అసలు మీ నాన్న, మీ నాన్న మోసం చేయబట్టే పాఠం నేర్పడానికి వచ్చాను" అన్నాడు నిర్లక్ష్యంగా చూస్తూ.
"పాఠాలు నేర్పితే మా వాళ్ళు ప్రాణాలు తీస్తారు. ఆ సంగతి మీకు తెలీదులా వుంది"
"నా సంగతి వాళ్ళకి తెలీదు. నన్ను చూస్తే వాళ్ళకి హడల్" అన్నాడు.
"అందుకే తమరు ఇలా వేషం మార్చుకుని మా అన్నయ్య వెళ్లాక వచ్చారు" అంది హేళనగా.
"ఇందూ" అన్నాడు.
అతని కంఠస్వరం శాంత గంభీరంగా వుంది.
"మాటలతో కాలాన్ని నెట్టేయటం నా పద్ధతి కాదు. నా మాట నిలుపుకోవడానికి నేను వచ్చాను" అన్నాడు.
"ఏమిటా మాట!" నిర్లక్ష్యంగా చూసింది.
"నీ మెడలో తాళి కట్టటం" తాపీగా చెప్పాడు.
"అది మీ తరం కాదని పదిసార్లు, లక్షసార్లు చెప్పాను" అంది కోపంగా.
"అది నా వలన అవుతుంది, అవుతుంది. అని ఒకే ఒకమాట కోటి మాటలుగా చెప్పాను గుర్తులేదా?" అన్నాడతని స్వరం కంగ్ మంది.
"గుర్తు ఉంది మంత్రాలకు చింతకాయలు రాలతాయా! వేషాలు మార్చి డాబులుచేస్తే పనులు అవుతాయా!" అంది అదోలా నవ్వుతూ.
