Previous Page Next Page 
శశిరేఖ పేజి 33

శశి - నీ స్నేహితు లెవరూ లేరూ?
రామ - ఉన్నారు కాని, ఇంత  అందమయినవాళ్ళూ,  నామీద ఇంత ప్రేమ ఉన్నవళ్ళూ  లేరు.
అని ఆమె చెయ్యి పట్టుకొనెను.
శశి - మరి ఇంగ్లండులో  స్త్రీలు స్వేచ్ఛగా  వుంటే వాళ్ళు రారూనీతో? వాళ్ళనేవళ్ళనీ  ప్రేమించలేదూనువ్వు?
రామ - ఉండేవాళ్ళు. నాతోటి ఆడ డాక్టర్లు ఎంతో  చనువుగావుండే  వాళ్ళు. కాని  హృదయంలో మండుతూ  ఉండే రూపముంటే వాళ్ళ  స్నేహమేమి  రుచిస్తుంది?
శశి - ఏం? వాళ్ళతో స్నేహంగా వుండక పోయినావూ?నేను లేనుగా  అప్పుడు? ఆ ఆనందం  మాత్రం ఎందుకు  పోగొట్టుకున్నావో తెలీడం లేదు.
రామ - నా స్వభావం  అట్లాంటిది కాదు.శశి - నన్ను తప్ప  ఎవ్వరినీ  ప్రేమించే స్వభావం  కాదుగావును!
రామ - అవును.
శశి - చాలా బాగుంది? ఆహ యీ గాలి యెంత  బాగుంది! ఆ నీళ్ళు అలలు చూడు.ఎంత ఆనందంగా వుంటాయో!
రామ - ఒకదానిపైన్  ఒకదానికి  ప్రేమలాగు. కౌగాలించుకుంటున్నట్టుంటాయి. లోకమంతా ప్రేమ మయం ! ఈ శ్వరుడి   ప్రేమ యిన్ని రూపాల్ని  పొందుతోంది.
శశి - కాని యీ శ్వర భక్తులు  ప్రేమ ననుభ వించరేం?
రామ - వాళ్ళ  కిశ్వర ప్రేమ చాలును.
శశి - ఇట్లాంటి ఆనందం అనుభవించే  ప్రేమే ప్రేమ. ఇంకేం కావాలి చెప్పు? చుట్టూ వెన్నెల,చల్లని గాలి, ముందు యీ నీళ్ళు, ప్రక్కన నీవు! ఇట్లాగే నా జన్మమంతా వుండమన్నా వుంటాను.
రామ - నిజంగానే వుంటావా? మరి యింకేం  మార్పూ కావాలని పించదుకదా?
శశిరేఖ అతని రొమ్ము పై తల పెట్టుకొనెను.
శశి- ఇక్కడ యీ మహా వక్షస్ధలముమీద తల పెట్టుకుంటే ఇంక భయం, సందేహం, వుండదుకదా?యింకనేం  కావాలి?
రామ-(ఆమె తలను  దువ్వుచు ) ఎంతకాలానికి కనుక్కున్నాను నిన్ను? ఇట్లాంటి సౌఖ్యందోరుకుతుందను కోలేదు.
శశి - ఎక్కణ్ణించి వచ్చావు నాకోసం? సముద్రాలు దాటి, దేశాలు దాటి, వెతుక్కుంటో, కధలోని రాజుకొడుకులాగ వచ్చావా? ఇదంతా కలలాగే వుంది.
రామ - ఆహ! ఎట్లాంటి నిమిషాలివి! ఇఅఇంత హాయిగా  దేవతలన్నా ఉంటారో లేదో?
శశి - ఈ రాత్రి అసలు ఇంటికి వెళ్ళొద్దు.
రామ - సరేలే.
శశి - నాకు వంటరిగా వుంటుంది.ఏదో భయం వేస్తోంది. ఇంక నేనా యింటికి వెళ్ళను.నీ యింటికి తీసుకెళ్ళవూ?
రామ - వద్దు.
శశి- నా మాట వినవూ? నా కెంత కష్టంగా ఉందోతెలిస్తే ఇట్లా అంటావా? నిజంగా చెప్పతున్నా. రానీవూ? బతిమాలుకుంటా.
రామ - అట్లా  బతిమాలకు. వొద్దు.నా సంగతి నీకు తెలిదు.
శశి- ( అతని గడ్డము  పట్టుకొని ) నా కన్నానా నీకు ప్రజలు? మొద్దులు, వాళ్ళకేం  తెలుసు? రానీవూ? రానీవూ ? ఒంటరిగా ఏం తోచదు.
రామ - ఇంక పదిరోజులేగా? నా మాట విని అక్కడే వుండు.అని లేచి దూరముగా  కూర్చుండెను.
శశి - ఎందుకు దూరంగా వెళ్లావు? కోపమా?
రామ - కాదు. అట్లా  బాగుండలేదు.
శశి - ఏం.  నే దగ్గిరుంటే  బావుండలేదూ?
రామ - ఉండవలసిన  దానికంటే బాగుంది. ఇక్కడే వుండనీ!
శశిరేఖ అతని మాటలు అర్ధం కాలేదు. తానతని దగ్గరకు వెళ్ళి చేయివేసి కూర్చుండెను.
శశి - ఇక్కడ కూడా  వంటరిగా వదుల్తావా?
రామ - పెల్లయ్యేదాకానేగా యీ వంటరితనం!
శశి-  అందాకా  యీ  రోజుల  సంతోషం  మాత్రం   ఎందుకు  వృధా  చెయ్యాలి? నాకు చలిగా వుంది దగ్గిర కూచుంటాను.
ఇట్టి సౌఖ్యము ననుభావించని వారికి శశిరేఖ యీ సమయముల   పొందు     మహదానందమర్ధముకాదు.    రామారావు ఎవరు వత్తురో,  ఎవరు   చూతురో,  అను భయములో మునిగియుండెను.కాని శశిరేఖ  మితానందమున నోలలాడుచుండెను. పూర్ణముగ విచ్చిన కలువవంటి ఆమె ముఖమును ఆ కాంతియందు మెరయు ఆమెకన్నులను,  గాలినంతయును త్రావుచున్నటుల నుండు  ఆ మెత్తని  దేహమును చూచి ఆ చూపులను, ఆ వాక్కులను, అ ప్రేమను, అతడాశ్చర్యముతో  గ్రోలుచుండెను. పూవునుండి పూవునకు బోయి  తేనేగ్రోలు తేనేటిగవలె  ఆనందమెచటనున్న ఆమె  అనుభవింపగోరును. నీతి,  దుర్నీతి అను పదముగామె  కర్ధములేని మాటలు.
                                             .... ....  .... .... .... ....
మరునాడు సాయంత్రము ఆరు  గంటలకు శశిరేఖ తన గదిలో కూర్చునియుండెను. ఇంకా  రామారావు రాలేదు. ఎందుకింత  ఆలస్యమయినది? వృధాగ సాయంకాలము గడచిపోవుచున్నది. రోజంతయు నేమియు తోచక ఆ గదిలోనే పడి యుండేనుకదా? ఇంకిప్పడైనను  రాకూడదూ?ఎందుకింత ఆలస్యము? తన  కతడేప్పుడు  వచ్చునా యని యుండెనే, తనపై అతని ప్రేమయున్న రాడా? అదిగాక తనిక్కడేందు కుంచావలెను? తన ఇంటిలోనే  వుండనియరాదా? ఇంత పిరికితనమా!ఇంక ముందు ఎవరైన  ఏమయినా  ననినచో  తన్ను వదలివేయునేమో? ఇట్టివాడు తనను  గురించి రేపటి నుండి  లోకము పలుకు   నిందావక్యములను లక్ష్యపెట్టడా?  తనకన్న  లోకాభిప్రాయుము  మిదనేనా ప్రేమ?  ఇంతకు తన పై అతనికి  ప్రేమ  వున్నదా? అతడు తనకంత దూరదూరముగా  ఎందుకుండెను?  ప్రేమ కలవాడ్తేన   ప్రేమ చూపడా?  ఉన్నదని  చెప్పను.    అన్నియు   పెండ్లి   బాసి  ఇట్లుండగాలడా? లేకపోయిన   తానిట్టి చెడు జీవితము గడుపుచున్నానని,  జాలి  తలిచి   ఈ విధముగా  తన్నుద్ధరింప   తలచేనేమో?ఒక పాపపు జివితయును పవిత్రవంతము   చేయుచున్నానని   కాబోలతని  తలపు!  ఈ  వివాహమను  మహా   స్వార్ధత్యాగమును చేయుచున్నాడు   గాబోలు  తన్నుద్ధరించుటకు! ఈ తలపుతో శశిరేఖకు  కోపము కలిగెను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS