Previous Page Next Page 
శశిరేఖ పేజి 32


    శశి - మీ ధర్మాలు నాకు బోధపడడంలేదు. నా మాట విని మీ యింటిలోనే ఉందనియ్యి.నేను   వంటరిగా  బతకలేను. నిన్ను  చూస్తో ఉండేట్టు దగ్గిరే ఉంచుకో. నీవు ఎట్లా ఉండమంటే అట్లా వుంటాను.ఈ  కోర్కి చేల్లించవూ?ఇంతేనా ప్రేమ?
రామ - నాకిష్టములేదు. విరుద్దాభిప్రాయాలు బయలుదేరుతాయి.
శశి - ప్రజల అభిప్రాయాలంటే  నీకంత భయమెంటి? మళ్ళి  ఎవళ్ళ లక్ష్యమూ లేదంటావు.   బ్రహ్మసమాజము, స్వేచ్చ అంటావు.పోనీ, చెప్పినాను. నీ ఇష్టం.
రామ - మరి  యిప్పుడు వస్తావా?
శశి - అంతా సిద్ధంగా ఉంది.
రామారావు బయటకు వెళ్ళెను.  శశిరేఖ సామాను సర్దుచుండెను. ఇంతలో కాంబోట్లు  వచ్చెను.
కాం - మళ్ళి ఎక్కడికో ప్రయాణమవుతున్నారే?
శశి -మిమ్మలి యింట్లో  కెవరు రమ్మన్నారు?
కాం - మళ్ళి ఎక్కడికో వెడుతున్నారు, సుందరరావు లేనప్పుడు ఆయన  వచ్చిందాకా వెళ్ళడానికి  వీల్లేదు.
శశి - మీరెవరు చెప్పడానికి, ముందు బయటికి  నడవండి.
రామారావు  బయట నుండి యీ మాటలు వినుచునే  యుండెను.
కాం - చేసుకొన్న  పెనిమిటి  దగ్గర నుంచి  రెండోమాటసు  మళ్ళి లేచి పోతో, వోద్ధంటే నువ్వేవరంటావేం?
శశి - నువ్వు బయటికి వేడతావా లేదా?
కాం - ఈ ఆటలు నా దగ్గర  కాదు సాగేది. ఇక్కణ్ణుంచి కదులు చెపుతాను. మరి, ఇంచిపోతోంది  వ్యాపారం. మతం, కులం, పేరూ, ప్రతిష్టా  ఏమిలేవూ? నీ సంగతి చూసుకుంటే నీకు సిగ్గేయ్యటం  లేదూ?
అటు తరువాత  కాంబోట్లు మాటాడలేదు.  వెనకనుంచి  ఎవరో మెడ పట్టుకొని  గిరుక్కున  తిప్పినారు.తిరిగి  చూచునప్పటికి  రామారావు. అంత పెద్ద స్వరూపము, కండ్లెర్రబరి, ముఖము తిండ్రించి, చేతిలో గుర్రవుబండివానీ  కొరడా పట్టుకొని నిలుచున్నప్పటికి,కాంబోట్లు ప్రాణములు  నిలువునను పోయెను.       
రామ - నువ్వెవరు?
కాం - నే....ను....కాం....బో....ట్లు,
రామ- ఇక్కడేం  చేస్తున్నావు?
కాం - ఏదో....అను....మానం.....తోచి....
రామ- నీ కెందుకు?
కాం - ఏం....లేదు....సుందర....
రామ - సుందర్రావుగారు నిన్ను ఇవన్నీ  చూడమన్నారా?
కాం - లే...దు... కాని    
వీని సంగతి  రామారా  విదివరకే విని  యుండెను.
రామ - అయితే  ఎందుకొచ్చా  విక్కడికి?
కాం - సంఘం.... పాడు .... అవు ....తోందని....
పెళ్లుమని  కొరడాదెబ్బ మోగెను. పావుగంట వరకు  ఆదే దెబ్బల చప్పడు. చివరకు కాలుతో వానిని విదిలోనికి  తన్ని  "నికక్కరలేని వ్యవహారాల్లో  జోక్యం  కలుగ  చేసుకుంటే నీ సంఘానికి  నీకూ కూడా ఇంతే " అని గేంటేను. కాంబోట్లు పదిహేను దినముల  వరకును బయటకు  రాలేదు.
శశిరేఖ అద్బుతముగా  చూచెను. ఎంత కోపము! ఎంత రోషము! ఎంత బలము! అదంతయు  తనను అతడు  నిర్లక్ష్యము చేసినందుకే? శశిరేఖ వచ్చి రామారావును కౌగాలించుకోనేను.
శశి - అబ్బా!ఎంత  కోపం  ఆ మొహంలో?  నామీద  అంత  కోపంవస్తే  నేనుండలేను. ఏది ఆ చెయ్యి? ఎంతలావు  ఒక్క గుద్దుకి చచ్చిపోతాను నన్ను చంపకేం.
రామ - ఛి, వూరుకో, ఇట్లాటి మాటలంటావు!
                                    ...........................
సాయంత్రము  సుందరరావు వచ్చునప్పటికి  గృహము శూన్యమయి యుండెను.
 
                                                                           13
ప్రతి సాయంత్ర  మారుగంటలకు రామారావు  వచ్చి శశిరేఖను  నది ఒడ్డునకు షికారు  తీసుకొని వెళ్ళుచుండెను.  నారము  దినములు గడచినవి. ఒకనాటి  సాయంకాలము శశిరేఖయు  రామారావును  నది వడ్డున ఎత్తయిన  రాయి పై  కూర్చునియుండిరి.  పూర్ణచంద్రుని  కిరణముల క్రింద వరదలలో  నున్న ఆ  నది  అలలు  పొంగుచుండేను   నిళ్ళపై గాలి  శ్రుతివ్తెచుచు  వీచుచుండెను. నది పై చంద్ర కిరణములపడి  తళతళ   మెరయుచుండెను. ఆవలిగట్టు  నుండి నెమలి కూసెను.  వెన్నెలలో  నక్కలు పరువెత్తు చుండెను. శశిరేఖ  రామారావు దగ్గరగా  జరిగినది.
రామ - చలి  వేస్తోందా?
శశి - కొంచెంగా.
రామ - పొద్దుపోయింది. వెడదాము.
శశి - అప్పడే? ఇట్లాంటి రాత్రి?  వద్దు,ఎంత బావుంది?  ఆబ్బా! ఎంత బావుంది!నీకు బావుండలేదూ?
రామ - భూమిమీద  ఉన్నామో,  స్వర్గంలో ఉన్నామో సందేహంగావుంది.
శశి - ఇదివరకేప్పడూ ఇంత అందమయిన చోటికి వెళ్ళలేదూ?
రామ- ఇంతకంటే అందమైనచోట్లు చూశాను. స్కాట్లండులో కొండలమధ్య   చెరువుల వడ్డున, ఆల్ప్సు హిమవత్శిఖరం పైన,  నేపిల్సునగరమున కాలువ రోడ్లదగ్గిర, ఇంతకన్న  అందమైన  ప్రదేశాల్ని చూశాను కాని ఆ అందాన్ని  నాదిగాచేసి   అర్ధమిచ్చేవారు  ఎవరూ లేక పోయినారు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS