Previous Page Next Page 
శశిరేఖ పేజి 31

రామ - మరి యింక నువ్వు సుందరరావుతో  స్నేహముగా  పూర్వమువలె ఉండకూడదు.
శశి - ఉండను.
రామ - అతని దగ్గిర నుంచి  వోచ్చేయ్యాలి.
శశి - మరి ఇప్పుడు రానా? పద. మరిచిపోయినా.  ఆయనతో చెపుతానన్నాను. ఇవాళ చెప్పి రేపు వస్తాను.సరేనా.
రామ - సరే, మరి నువ్వు  పెళ్ళి అయిన తరువాత వదలి వెళ్ళకూడదు.
శశి- రామా, నన్ను నువ్వు అర్ధం చేసుకోవటంలేదు.  నిన్ను  వదలడం నాకు ఇష్టమనుకున్నావా నా మాటలని బట్టి? ఎప్పడూ నిన్నే సంతోష పెట్టడానికి ఈ దేహం, ఈ జీవితం ఇచ్చేస్తాను. ఒకవేళ ప్రేమ పోతుందేమో  అన్నాను కాని, నీ  మీద  నాకు పోతుందా? ఇట్లా చూడు, నాకళ్ళలో   అబద్ధం  కనబడుతోందేమో?
అని రామారావు కంఠమును పట్టిలాగి అతని ముఖమును తన ముఖము వ్తెపు  త్రిప్పకోనేను. ఇంక రామారావాగలేక పోయెను. ఆ మెరయు కండ్లు, ఆ మెత్తనితడి ఎర్రని పెదవులు, మృదు దేహము  చూచి అతడు వదలు మరచెను. ఆమెను చెంప పై ముద్దు పెట్టుకొనెను.
రామ - శశిరేఖా, ఈ నిముషము నుండి ఈ శ్వరుని ముందు నువ్వు నాదానివి.
శశిరేఖ లోపలికి వెళ్ళేను. ఆమె యందొక నూతన  యుత్సాహ మంకురించెను. లోకమంతయు సౌందర్య  పూరితముగ,  ఆనందమయముగ కన్పట్టేను.
ఆ యిల్లు,తోట, పటములు, బల్లలు అన్నియును క్రొత్త రంగును దాల్చినవి. దేహమందు రక్తము పొంగి ప్రవహించుచుండెను. నూతనోత్సాహ మామెను ఒకచోట నిలువనియుట  లేదు. ఎంతో జాగ్రత్తతో  దుస్తులు  వేసి మిగుల అందముగ  కనబడుచుండెను.ఆ రాత్రి సుందరరావా లస్యముగ వొచ్చినాడు. ఆమె ఫిడేలు  నేర్చుకొన్న  కోంచేమూ వాయించుటకు రాక బాధపడుచున్నది. సుందరావును చూచి ఫిడేలు అవతల పారవేసి "ఈ జన్మములో  నాకు రాదు. ఎందుకు ఈ బాధ? మీరు వాయించండి  వింటాను" అన్నది.  ఆమె ఇష్టము అతనికి  ఆజ్ఞ  ఇప్పుడు. వెంటనే వాయించెను.
శశి -చాలా బాగున్నాది. ఎట్లా నేర్చుకున్నారు ఇట్లా? వెన్నెల యీ వేళ వచ్చింది కొంచెము సేపు తిరుగుతాను.
సుంద - నిద్ర వస్తోంది.రావూ?
శశి - ఈవాళ  నేనిక్కడ నిద్రపోతాను. నా పక్క ఇదిగో.
సుంద - అదేమిటి?
శశి - ఏం లేదు. చెపుతాను రండి.
ఇద్దరూ వెన్నెలలోకి  వెళ్ళిరి.
శశి - రామారావుగారు తనని పెళ్ళి చేసుకోమని అడిగినారు నన్ను.
సుంద - పెళ్ళి చేసుకోమనా?
శశి -అవును.
సుంద - నువ్వేమన్నావు?
శశి - చేసుకోంటానన్నాను.
సుంద- అతని మీద నీకు ప్రేమ ఉన్నదా?
శశి - ఉన్నది.
సుంద - నా మీద  కంటేనా?
శశి -ఆ.
సుంద - ఎప్పుడు?    
శశి - రేపో, ఎల్లుండో వెడతాను.
సుంద - ఎక్కడికి?
శశి - నాకు తెలిదు. రామారావుగారు ఎక్కడికి తీసుకు వెడితే అక్కడికి.
సుంద - నిశ్చయించుకోన్నావా? నేనేమీ చెప్పినా లాభం లేదా?
శశి - లేదు.
సుందరావు  మాట్లాడక లోపలికి పోయెను.మరునాడు మధ్యాహ్నము రామారావు వచ్చెను.
రామ - సుందరరావుతో  చెప్పినావా?
శశి - చెప్పినాను.
రామ - ఎప్పడు వస్తావు?
శశి - నీ యిష్టము.
రామ - మన పెళ్ళి విషయమ్తె  ప్రకటించమని వ్రాసినను. ఇల్లు మాట్లాడినాను.నీవు ఈ పదిహేను, ఇరవయి రోజులూ ఉండడానికి.
శశి -వెరే ఇల్లెందుకు?
రామ- నువ్వు వుండడానికి.
శశి - మీ ఇంట్లోనే ఉంటాను అందాకాను.
రామ - అది మంచిదికాదు.ప్రజలు  తప్పు  అభిప్రాయ పడుతారు.
శశి - వాళ్ళు ఏ అభిప్రాయపడితేనేం? కాని అసలు తప్పేమిటి?
రామ - అసలు  తప్పలేదు.కాని అది  మంచిది కాదు.
శశి - నా కర్దము కావటంలేదు. నన్ను  ఒక్కదాన్ని  వేరే ఎందుకేం  ఉంచడం?
రామ - పోనీ, నా యిష్టమని  వప్పకొరాదూ?
శశి - నాకు ఒక్కదాన్ని  వుండడం  బాగుండదు. ఏదో భయం వేస్తుంది.నన్ను మీ యింటికే
తీసుకు వెళ్ళరాదూ?
రామ - అది ధర్మ విరుద్ధము. ఇన్నాళ్ళు ఇతని ఇంట్లో ఉండి ఇప్పుడు నా యింటికి వస్తే ఏమంటారు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS