Previous Page Next Page 
శశిరేఖ పేజి 30

రామ - మరి యింక నువ్వు సుందరరావుతో  స్నేహముగా  పూర్వమువలె ఉండకూడదు.
శశి - ఉండను.
రామ - అతని దగ్గిర నుంచి  వోచ్చేయ్యాలి.
శశి - మరి ఇప్పుడు రానా? పద. మరిచిపోయినా.  ఆయనతో చెపుతానన్నాను. ఇవాళ చెప్పి రేపు వస్తాను.సరేనా.
రామ - సరే, మరి నువ్వు  పెళ్ళి అయిన తరువాత వదలి వెళ్ళకూడదు.
శశి- రామా, నన్ను నువ్వు అర్ధం చేసుకోవటంలేదు.  నిన్ను  వదలడం నాకు ఇష్టమనుకున్నావా నా మాటలని బట్టి? ఎప్పడూ నిన్నే సంతోష పెట్టడానికి ఈ దేహం, ఈ జీవితం ఇచ్చేస్తాను. ఒకవేళ ప్రేమ పోతుందేమో  అన్నాను కాని, నీ  మీద  నాకు పోతుందా? ఇట్లా చూడు, నాకళ్ళలో   అబద్ధం  కనబడుతోందేమో?
అని రామారావు కంఠమును పట్టిలాగి అతని ముఖమును తన ముఖము వ్తెపు  త్రిప్పకోనేను. ఇంక రామారావాగలేక పోయెను. ఆ మెరయు కండ్లు, ఆ మెత్తనితడి ఎర్రని పెదవులు, మృదు దేహము  చూచి అతడు వదలు మరచెను. ఆమెను చెంప పై ముద్దు పెట్టుకొనెను.
రామ - శశిరేఖా, ఈ నిముషము నుండి ఈ శ్వరుని ముందు నువ్వు నాదానివి.
శశిరేఖ లోపలికి వెళ్ళేను. ఆమె యందొక నూతన  యుత్సాహ మంకురించెను. లోకమంతయు సౌందర్య  పూరితముగ,  ఆనందమయముగ కన్పట్టేను.
ఆ యిల్లు,తోట, పటములు, బల్లలు అన్నియును క్రొత్త రంగును దాల్చినవి. దేహమందు రక్తము పొంగి ప్రవహించుచుండెను. నూతనోత్సాహ మామెను ఒకచోట నిలువనియుట  లేదు. ఎంతో జాగ్రత్తతో  దుస్తులు  వేసి మిగుల అందముగ  కనబడుచుండెను.ఆ రాత్రి సుందరరావా లస్యముగ వొచ్చినాడు. ఆమె ఫిడేలు  నేర్చుకొన్న  కోంచేమూ వాయించుటకు రాక బాధపడుచున్నది. సుందరావును చూచి ఫిడేలు అవతల పారవేసి "ఈ జన్మములో  నాకు రాదు. ఎందుకు ఈ బాధ? మీరు వాయించండి  వింటాను" అన్నది.  ఆమె ఇష్టము అతనికి  ఆజ్ఞ  ఇప్పుడు. వెంటనే వాయించెను.
శశి -చాలా బాగున్నాది. ఎట్లా నేర్చుకున్నారు ఇట్లా? వెన్నెల యీ వేళ వచ్చింది కొంచెము సేపు తిరుగుతాను.
సుంద - నిద్ర వస్తోంది.రావూ?
శశి - ఈవాళ  నేనిక్కడ నిద్రపోతాను. నా పక్క ఇదిగో.
సుంద - అదేమిటి?
శశి - ఏం లేదు. చెపుతాను రండి.
ఇద్దరూ వెన్నెలలోకి  వెళ్ళిరి.
శశి - రామారావుగారు తనని పెళ్ళి చేసుకోమని అడిగినారు నన్ను.
సుంద - పెళ్ళి చేసుకోమనా?
శశి -అవును.
సుంద - నువ్వేమన్నావు?
శశి - చేసుకోంటానన్నాను.
సుంద- అతని మీద నీకు ప్రేమ ఉన్నదా?
శశి - ఉన్నది.
సుంద - నా మీద  కంటేనా?
శశి -ఆ.
సుంద - ఎప్పుడు?    
శశి - రేపో, ఎల్లుండో వెడతాను.
సుంద - ఎక్కడికి?
శశి - నాకు తెలిదు. రామారావుగారు ఎక్కడికి తీసుకు వెడితే అక్కడికి.
సుంద - నిశ్చయించుకోన్నావా? నేనేమీ చెప్పినా లాభం లేదా?
శశి - లేదు.
సుందరావు  మాట్లాడక లోపలికి పోయెను.మరునాడు మధ్యాహ్నము రామారావు వచ్చెను.
రామ - సుందరరావుతో  చెప్పినావా?
శశి - చెప్పినాను.
రామ - ఎప్పడు వస్తావు?
శశి - నీ యిష్టము.
రామ - మన పెళ్ళి విషయమ్తె  ప్రకటించమని వ్రాసినను. ఇల్లు మాట్లాడినాను.నీవు ఈ పదిహేను, ఇరవయి రోజులూ ఉండడానికి.
శశి -వెరే ఇల్లెందుకు?
రామ- నువ్వు వుండడానికి.
శశి - మీ ఇంట్లోనే ఉంటాను అందాకాను.
రామ - అది మంచిదికాదు.ప్రజలు  తప్పు  అభిప్రాయ పడుతారు.
శశి - వాళ్ళు ఏ అభిప్రాయపడితేనేం? కాని అసలు తప్పేమిటి?
రామ - అసలు  తప్పలేదు.కాని అది  మంచిది కాదు.
శశి - నా కర్దము కావటంలేదు. నన్ను  ఒక్కదాన్ని  వేరే ఎందుకేం  ఉంచడం?
రామ - పోనీ, నా యిష్టమని  వప్పకొరాదూ?
శశి - నాకు ఒక్కదాన్ని  వుండడం  బాగుండదు. ఏదో భయం వేస్తుంది.నన్ను మీ యింటికే
తీసుకు వెళ్ళరాదూ?
రామ - అది ధర్మ విరుద్ధము. ఇన్నాళ్ళు ఇతని ఇంట్లో ఉండి ఇప్పుడు నా యింటికి వస్తే ఏమంటారు?
మధ్యాహ్నము  ఎప్పటివేళకు  రామారావు వెళ్ళెను.
శశి- ఏది  ముఖం చూపించు. నెల్లాళ్ళ వరకు  చూడనంత కోపమేనా నామీద?
రామ - సరేలే, ఎందుకు  అమ్మన్నావు?
శశి - రావడానికే ఏం? తోచడంలేదు, రమ్మన్నాను. తప్పా?
రామ - నేనింక రాకూడధనుకున్నాను.
శశి - నేనేం  చేశాను?
రామ - ఏం చెయ్యలేదు, కాని నాకు కష్టంగా ఉంటుంది రావడం?
శశి - నాకు తెలీడంలేదు. నాకు చెప్పవూ నీ మనసులో ఉన్నది.
రామ - చేపితినికాదూ, ఇంకెందుకు మళ్ళిని?
శశి - క్షమించు. నిజంగా నాకర్ధము  కాలేదు.నీకు కష్టమయితే రానక్కరలేదు.కాని ఎందుకు రావో చెప్పు.
రామ - శశి నీకు తెలిదూ నీమీద ప్రేమ నాకు  పోలేదని? పోదుకూడాను.  నీకు నామీద ప్రేమ  లేకపోయెను.ఇంక వచ్చి నిన్ననుదినం చూస్తూ వుంటే నాకు మనసు బాగుండదు.
శశి - నీమీద నాకు ప్రేమ  లేదన్నానా నేను? నా జవాబు వినకుండా వెళ్ళిపోలేదూ?
రామ - ఉంటేనేం లేకపోతేనేం? అట్లాంటి ఉద్దేశ్యమున్న తరువాత.
శశి - ఎట్లాంటి ఉద్దేశ్యం?
రామ - ప్రేమ శాశ్వతంగా  ఉండదని.
శశి -    అవును,ఎప్పుడూ    వుంటుందని  ఎవరన్నా  చెప్పగలరా?   అట్లా  చెప్పేవాళ్ళు వాళ్ళ మనస్సు వాళ్ళేరక్కుండా  అబద్ధాలు చెప్పుతున్నారు.పోనీ నువ్వు చెప్పగలవా? నామీద ప్రేమ ఎన్నడూ పోదని?
రామ - ఇన్నేళ్ళు అట్లాగే వున్నది. ఇంక వుండదా?
శశి - ఏమో నేనేమీ  చేసినా నామీద ప్రేమపోదా? నామీద కోపము రాదా? పోదని నువ్వు ఇప్పుడు అన్నా పోకూడదా? పోనీ, నీవంటి వాళ్ళకి ఎవరికో అట్లా ఉంటుంది కాని, అందరికి ఒక్కరి మీదనే అట్లా నిలుస్తుందా? మనుష్య స్వభావము చంచలము.
రామ - అవునులే, అందుకనే  పెళ్ళి అనేది పెట్టినారు.
శశి - కాని మనస్సు సరిగ్గా లేకపోతే  పెళ్ళేమి చేస్తుంది?
రామ - పెళ్ళి  చంచాలత్వాన్ని కొంతఫరకు  కుదుట  పరుస్తుంది. ముందు ఎట్లావున్నా శాశ్వతంగా ప్రేమ ఉండాలనే ఉద్దేశ్యంతో వాగ్ధానాలుచేసుకుంటేనేగాని స్త్రి పురుషులకు కలిసి ఉండడానికి అర్హతలేదు.
శశి - పోనీ, దానికేంగాని, ఇంతకూ నన్ను  నువ్వు పెళ్ళి చేసుకోమంటావా?
రామ - అనడంలేదు.
శశి -మొన్న అడిగినది  నేననుకోన్నట్లు వేళాకోళమే అయితే  నేను నవ్వితే ఇంక  కోపమేందుకూ?
రామ - వేళాకోళ  మేందుకనుకున్నావూ?
శశి -  అంత హఠాత్తుగా,ఏమి తెలీకుండా అడిగితే  ఏమనుకోను?నీకు నామీద ప్రేమ  ఉందనే అనుకోలేదు నేను.
రామ - ఉందని చెప్పలేదా?
శశి - చెప్పినావు కాని, ఎందుకో ఉందనిపించలేదు నాకు?
రామ- నీవు పరాయివాడి  దానవయితే నీమీద నేనెట్లా ప్రేమ చూపను?
శశి - నేను పరాయివాళ్ళ దానినా?
రామ - కాక ఇంకేమిటి?
శశి- సుందరరావుగారిమీద  ప్రేమ నాకు లేదని చెప్పలేదూ?
రామ - అయితే?
శశి - నే నతని దాన్ని ఎట్లా అవుతాను?
రామ - అతని ఇంట్లో  లేవూ?
శశి - ఇంకేం పనిలేక  ఉన్నాను. వచ్చి వెయ్యమంటావా?
రామ - నేనేమీ అనటంలేదు.
శశి - మరి ఏం చేస్తే,నాతో  స్నేహంగా ఉంటావు? మీ బ్రహ్మ సమాజం నాకేమి అర్ధం కావడము లేదు.
రామ- ఇంతకూ నామీద  నీకు ప్రేమ ఉన్నదా? లేదా? ఒకటే మాట.
శశి - నిజంగా ఉంది. మొదటి  తెలీలేదు.కాని నీవు  చెప్పిన తరువాత.
అని రామారావు దగ్గిరగా కూర్చొని చేయి  పట్టుకొనెను.
రామ - నన్ను ముట్టుకోవద్దు.
శశి- ఎందుకు?
రామ - ఇంకోరి దానవు.
శశి -  నా  మాటల  మీద  నీకు నమ్మకంలేదు.  నాకు సుందరరావు గారి మీద ఏమి ప్రేమలేదు. నువ్వు నామీద  ప్రేమ  ఉన్నదని చెప్పిన తరువాత నిజంగా నీమీద  ప్రేమ వచ్చింది. ఇన్నాళ్ళూ   నిన్నే  తలచుకుంతున్నాను.  అతని    చేతిని   తీసుకొని    గట్టిగా ముద్దు పెట్టుకొన్నది. అతడు చెయ్యి లాగుకోనేను.
రామ - అది నిజమే. కాని నన్ను పెళ్ళి చేసుకునే వరకు నాదాని వెట్లా అవుతావు?
శశి - నీమీదనేగా  నా ప్రేమ? పెళ్ళి ని యిష్టం ఇప్పుడు చేసుకో నేను నిదాన్ని కాదూ?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS