Previous Page Next Page 
శశిరేఖ పేజి 29

సుంద - స్వభావ సిద్ధంగా వక పురుషుడు గాని, స్త్రి కాని, ఒక స్త్రితోను,పురుషుదితోను సంతుషి పొందరు. జీవిత మన్నివిషయములలోనూమార్పుకోరుతుంది. మార్పే జీవనానికి ప్రాణము. ఈ విషయంలో    మాత్రము మానవ స్వభావ మూరుకుంటుందా? ఈ కట్టుబాట్లు  ఏర్పరచుకుని    ఇప్పుడు   మనుష్యులు వదిలించుకోలేక తంటాలు పడుతున్నారు.
శశి - ఈ స్త్రి లందరూ వక్క  మొగుడితోనే తృప్తి చెంది వుండటం లేదూ?
సుంద - వాళ్ళు రహస్యంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎవరికేం తెలుసు? అదిగాక వాళ్ళని బయటికి పోనివ్వక, నిజ స్వభావాలన్నీ చంపేశారు, ఈ దేశంలో.
శశి - ఇప్పుడు నష్ట మేమొచ్చింది?
సుంద - కావలసినంత.ఒక్క ప్రాతివ్రత్యమనే అసహజమగు గుణముకోసం, అనేక సహజమయిన సద్గుణాల్ని చంపారు. ద్తేర్యము,స్వేచ్చ, నూనృతము,ధీరత్వము, ఉదారము,లోకజ్ఞనము, విద్య, ఆరోగ్యము, చాతుర్యము మొదలయిన  గుణాలన్నీ పోయినాయి స్త్రినుండి. ఇప్పుడు స్త్రీలు పురుషుడికి  దాస్యముచేసే బొమ్మలు గాకింకేమిటి? పావుగంటసేపు తెలివిగా మాట్లాడగల ఆడదాన్ని చూపించు.
శశి - ఇంతకూ పెళ్ళి తప్పంటారా?
సుంద - తప్పనను, ఇంతకన్న స్వేచ్చవున్న  పెళ్ళిళ్ళుండాలి. ఇష్టము వచ్చినప్పుడు వకళ్ళు  వదిలే స్వేచ్చ వుండాలి.
శశి - ఇప్పడు మాత్రం కట్టివేస్తున్నారా? ఒకళ్ళని  వోకళ్ళు వదిలేస్తే ఎవరేం చెయ్యగలరు?
సుంద - కట్టివేయ్యకపోతే  సరా? సంఘం పొడిచి చంపుతుందనే భయములేదూ?అందుకనే  పురుషుడు ఏంచేసినా యింట్లోనే  పడివుంటారు. స్త్రీలు, పేరు ప్రతిష్టలు పోతాయంటేప్రాణం పోయినట్టే వీళ్ళకి.
శశిరేఖ ఆలోచనలో పడ్డది. సుందరరావు అట్లే చాలాసేపుకూర్చున్నాడు. చిమ్మ చీకట్లు కమ్మినవి. శశిరేఖ సుందరరావును మరచిపోయినది. మెల్లగా వొక్కొక్క చుక్కే బయటకు వచ్చిఆకులలోనుండి
తోంగిచూచినది.
పైన విచ్చిన సంపెంగ పువ్వుల వాసన అలముకోనేను.సుందరరావు శశిరేఖ దగ్గరకు తీసుకొని  కౌగిలించుకొనెను.
సుంద - శశి, ఏమిటాలోచిస్తున్నావు?
శశి - ఏదో జీవనమును గురించి.
సుంద - అంత మహ ఆలోచనేముంది?
శశి - జీవనము నేవరర్ధం చేసుకోగలరు.?
సుంద - ఆ ఆలోచన్లో నే నేక్కడ్తేనా వున్నానా?
శశి - అట్లాంటి సంగతులు కాదు నేనాలోచిస్తోంది.
సుంద- నన్ను ముద్దు పెట్టుకోనేన్నాళ్ళయింది?
శశి - పెట్టుకోమన్నారా?
అని చెయ్యిని  తీసికొని ముద్దు పెట్టుకొనెను!
సుంద - అంతే?
శశిరేఖ  లేచి బుగ్గమీద ముద్దు పెట్టుకొనెను.
సుంద- ఎప్పుడూ ఇంతేనా? పూర్వంమల్లే ప్రేమ ఎప్పుడన్నావస్తుందా?
శశి - ఏమో?
సుంద - మించిపోయింది.నా దురదృష్టము.
                                                                                 12
 రామారావు మనసు చాలా చిన్నబోయెను. శశిరేఖ దుర్వర్తనమును,పూర్వచరిత్రనుఅంతను మరచి ఆమె పై ప్రేమను  మరువలేక  ఆమెను వివాహమాడదలచెను.కాని ఆమె తన నట్లు పరిహాసము చేయుటచే అతని కెంతో విచారం కలిగెను.  ఆమె మనసు కూడా ఇట్టి దురూహలకు  లోన్తెనదే?ఇక ఎక్కడి ఆశ! తాను వివాహమాడినను ఆమె న్తెజము మానునా? కాని ఆమె యందేంతటిఉదారము కలదు!ఎంతటి  నిష్కపటము, ఎంత ప్రేమ, ఎంత స్నేహం? బాల్యమునందే ఆమెను తాను వివాహమడినచో అట్టి స్త్రీతో తానేంతటి సౌఖ్యము ననుభావించేడివాడు? ఈ హిందూ సంఘమామె నట్టిస్దితికి తీసుకుని వచ్చెను కదా? ఆ  బాల్యమునందే  ఆమె వద్దను చుండగా  ఎవనికో కట్టిపెట్టకపోయిన  తన కొరకామె కాచుకొని యుండెడిదే కదా? రెండు జీవితముల  నిట్లు పాడోనరించినది  ఘాచారము. ఇంక ఆమెను  అడిగిన లాభంలేదు. పవిత్రములును,ఈశ్వరభక్తి యుతములును అగు తన తలపులేక్కడ!      ఆమె  హలెక్కడ? వివాహము చేసి  కొన్నను ఇంతేకదా బ్రతుకు? తన్ను వదలి ఎప్పుడో వెళ్ళిపోవును.   ఇంక నామెతో  నింత   రిచయము మాత్రమెందుకు ? దినదినమును ఆశయను మహఅగ్నిచే దహింపబడుటకేగా! ఇంక నామెనుచూచుట కూడా మానవలెను. మరచిపోవుటకే ప్రయత్నింపవలెను.
శశిరేఖ చూచి నెల దినములయ్యెను    నెలదినము లుండలేదా? ఇంకమాత్రమామె  స్నేహమెందుకు?      ఆమె     కూడా   తనను  నేహమయిన  గాజును ముద్దిడుకొని  కన్నీళ్ళతో తునకలుతునకలు  కొట్టి పారవేసెను. ఇంతలో ఒక ఉత్తరము వచ్చెను.
    రామా,
ఇన్నాళ్ళు వచ్చెదవని  ఎదురు చూచుచుంటిని. నీవు రాకున్న నే నుండలేను. ఎప్పుడు నిన్నే తలచుకోనుచున్నాను.బుద్ధిలేక  నీకు కోపము తెప్పించినందులకు క్షమించు. ఒక్కసారి వచ్చి చూచి పొమ్ము.
                                                                                                         నిన్నేల్లపుడును తలచుకొను   
                                                                                                                         శ  శి   రే  ఖ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS