Previous Page Next Page 
శశిరేఖ పేజి 28


    శశి - ఇప్పడుండి తరవాత పోతే?
రామ - అట్లా ప్రేమ పోకూడదు.
శశి - పోకూడదని నువ్వు చెప్పేదేమిటి? పోతే?
రామ - పోతే ఇంకేముంది? నీ యిష్టం.
శశి - నా యిష్టమేనా? లేకపోతే అందువల్లే యిష్టమున్నాలేకపోయినా పడివుండమంటారా?
రామ - అంటే మాత్రం ఉంటావా నువ్వు?
శశి - అవును. కాని ముందు అనాలి గావును "నువ్వే  నాకు భర్త యెప్పుడూ "అని.
రామ - అవును.
శశి - మరి అబద్ధంకదూ అది? ఎప్పడూ నువ్వే భర్తగా వుంటావని నమ్మకమేమిటి?
రామ - ప్రేమ వుండేటప్పుడు నమ్మకం వుండదూ?
శశి - ఏం నమ్మకం? ఇప్పటి కుందని నమ్మకం.
తరవాత సంగతేమో?
రామ - నేను వెడతాను. పోద్దుపోతుంది.నాకు మనసేమీ బావుండలేదు.
అని లేచెను.
శశి - మరి ఆఖరికి నా కిష్టమో లేదో వినకుండానే వెడుతున్నావే?
రామ - అవసరంలేదు.
శశిరేఖ పరుగెత్తుకొని వెళ్ళి చెయ్యి పట్టుకొనెను.
శశి - కోపం వచ్చిందా నా కోంటేతనానికి?
రామ - రాలేదు.నన్ను వెళ్ళనీ,
అని వెళ్ళిపోయెను. శశిరేఖ ఆలోచించుకోనెను.తానెంత మూర్ఖురాలు! అతని మనస్సును  నోప్పించెను  కాబోలు!కాని అతడు పెళ్ళి  చేసుకోనమని అడిగిన రితి ఆశ్చర్యముగా నుండెను.తనను ప్రేమించి  యుండెనని తెలియునుగాని,ఆ దినముననే మరచెను. అతని ప్రవర్తన సహొదరుని  దానివలె నుండుటచే ఆమెమనస్సున  కాతలపే  రాలేదు.ప్రేమ వచ్చుట తోడనే తనకు తెలిపి, తనను పొగడి, చూపులచే? మాటలచే,తన  అనురాగమును బడయుటకు ప్రయత్నించువారినేగాని, ప్రేమనంతను అణచుకొని, నీతిక్తే లేనటుల  వర్తించువారి  నామె  యెరుగదు.  ఈ దినమున న్తేననుఅతడు  తన పై ప్రేమ యేమియును చూపలేదు.అతని పై తనకు ప్రేమకలదా? ఏమో?కాని ఆ  విశాలవక్షమున ఎంత శాంతికలదు?క్రూరత్వము, స్వార్ధపరత్వములేని ఎట్టి   నిర్మలమగు ముఖమది! అతనిని నమ్మి తన జీవితము స్వప్నమువలె గడువగలదు. తన ఇల్లు, తన ధనము,తన  బిడ్డలు, తన సంసారము, ఆహ! ఎంత శాంతి! వివాహము విని  నన్నింటిని ఇచ్చును గాబోలు తనకు?
ఆమె స్వభావమమెకు తెలియకనే  మారినది. తీవ్రమగు ప్రేమను బాధనుగోరు  ఆమె యిప్పుడు శాంతిని, సంసారమును గోరుచున్నది. గాడమగు సుందరరావు  అగ్నివంటి  ప్రేమ నామెను కాల్సివ్తేచెను. అతనివల్ల పడిన బాధలచే ప్రాణము తత్తరిల్లునట్టు చేసెను.
ఎన్ని దినములు సుందరరావు వద్ద నున్న తనకు శాంతి రాదని  ఆమె యెరుగును. వయసు ఎదిగిన  కొలదిని ఆమె స్వభావమునూ మారుచుండెను. ఇప్పడింత ప్రేమగా వున్నాడే కాని సుందరరావు,అతనిని నమ్మిన వారెవరు?  రేపు తిరిగి ఏ విధమున నగునో? కాని రామారావును నమ్మిన  ఇంక దుఃఖము, సందేహము, భయము లేవుకదా?పోనీ ఇతనిని  వివాహము చేసికోనకూడదా? కాని వివాహము  చేసికోన్నవారు నిర్జివముగ కనబడుచున్నారే! వివాహము చేసికొనుట మంచిదా?
"శశి"
సుందరరావు వచ్చి కూర్చుండెను.
సుంద - ఏమి టలోచిస్తున్నావు ఇక్కడ పడుకొని? రామారావు గారింకా రాలేదా యీవాళ?
శశి - వచ్చి వెళ్ళినా ర్పపడే. సరే కాని మీ అభిప్రాయం యేమిటి? పెళ్ళి చేసుకోవడం మంచిదా,పెళ్ళి  చేసుకోకపోవడమా?
సుంద - అది మనుష్యుల్ని  పట్టి వుంటుంది. అందంలేని వాళ్ళు విల్తేనంత  తొందరగా ఎవన్నోవకడ్ని కట్టుకోవడం మంచిది. నీవంటి అందమయిన వాళ్ళు చేసుకోవడం సుతరామూ కూడదు.
శశి - వేళాకోళం కాదు. నిజం చెప్పండి. పెళ్ళి అనేది సంఘంలో  మంచిదవునా,కాదా?
సుందరరావు బుద్దిమిద శశిరేఖకు మిగుల నమ్మకము, జీవనము గురించీ అతనికి స్దిరమయిన అభిప్రాయము లున్నవనియును, అతడు జదివి స్వతంత్రముగా ఆలోచించు వాడనియు ఆమె యెరుగును.
సుంద - అయితే అసలున్న సంగతి చెపుతాను.విను. మొదట పురుషుడు స్త్రీని బలహినురాలిని  చేసి స్వాధీనం చేసుకున్నాడు. సృష్టియందు పురుషుడికి స్త్రికంటే ఎక్కువ శరీరబలం వుండడంచేత స్త్రీని తనసోత్తు చేసుకొన్నాడు. తననుంచి  వెళ్ళిపోతే  యీర్ష్యకనుక  శాశ్వతంగా తనదాన్ని చేసుకోడానికి పెళ్ళి అనే దాన్ని కనిపెట్టినారు. పురుషుడు తన వాడవుతాడు  కదాయని స్త్రి కూడా సంతోషపడ్డది. వివాహానికి అధికారం ఇచ్చేందుకు ఈ శ్వరున్ని కూడా తీసుకువచ్చి పెట్టినారు. అన్ని బానిసత్వాలూ కూడా పోవలసిందేగని, ఎట్లాగో పోకుండా, మహాబంధమ్తె  చుట్టుకుంది.
శశి - ఏమీ?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS